27-02-2021 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


"మధురమైన పిల్లలూ - మిమ్మల్ని రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేసి సద్గతినిచ్చేందుకు మరియు నరకవాసులను స్వర్గవాసులుగా చేసేందుకు తండ్రి వచ్చారు”

ప్రశ్న:-

తండ్రి భారతవాసీ పిల్లలైన మీకు ఏ స్మృతినిప్పించారు?

జవాబు:-

ఓ భారతవాసీ పిల్లలూ! మీరు స్వర్గవాసులుగా ఉండేవారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారతదేశము స్వర్గంగా ఉండేది, బంగారం మరియు వజ్రాల మహళ్ళుండేవి. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భూమి, ఆకాశము అన్నీ మీవిగా ఉండేవి. భారతదేశము శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయంగా ఉండేది. అక్కడ పవిత్రత ఉండేది. ఇప్పుడు మళ్ళీ అటువంటి భారతదేశము తయారవ్వనున్నది.

గీతము:-

నయన హీనులకు దారి చూపించండి ప్రభూ!..... (నయన్ హీన్ కో రాహ్ దిఖావో ప్రభూ!.....)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలు (ఆత్మలు) ఈ పాటను విన్నారు. ఇలా ఎవరన్నారు? ఆత్మల యొక్క ఆత్మిక తండ్రి అన్నారు. ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రిని ఓ బాబా అని అన్నారు, వారిని ఈశ్వర అని కూడా అంటారు, తండ్రి అని కూడా అంటారు. ఏ పిత? పరమపిత ఎందుకంటే ఇద్దరు తండ్రులున్నారు - ఒకరు లౌకిక తండ్రి, రెండవవారు పారలౌకిక తండ్రి. లౌకిక తండ్రి పిల్లలు పారలౌకిక తండ్రిని ఓ బాబా అని పిలుస్తారు. అచ్ఛా, మరి బాబా పేరు ఏమిటి? శివ. వారు నిరాకారునిగా పూజింపబడతారు, వారిని సుప్రీమ్ ఫాదర్ అని అంటారు, లౌకిక తండ్రిని సుప్రీమ్ అని అనరు. ఉన్నతాతి ఉన్నతమైనవారు, ఆత్మలందరికీ తండ్రి, ఒక్కరే. జీవాత్మలందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. నా తండ్రి ఎవరు అన్నది ఆత్మలు మర్చిపోయాయి. ఓ గాడ్ ఫాదర్, నయనహీనులైన మాకు నయనాలు ఇవ్వండి, అప్పుడు మేము మా తండ్రిని గుర్తించగలము, భక్తి మార్గపు దెబ్బల నుండి విడిపించండి అని పిలుస్తారు. సద్గతి కోసము, మూడవ నేత్రాన్ని పొందేందుకు, తండ్రిని కలుసుకునేందుకు పిలుస్తారు ఎందుకంటే తండ్రియే కల్ప-కల్పము భారతదేశములో వచ్చి, భారతదేశాన్ని స్వర్గంగా తయారుచేస్తారు. ఇప్పుడిది కలియుగం, కలియుగం తర్వాత సత్యయుగం రావాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. అనంతమైన తండ్రి వచ్చి పతితంగా, భ్రష్టాచారులుగా అయినవారిని పురుషోత్తములుగా తయారుచేస్తారు. భారతదేశములో వీరు (లక్ష్మీనారాయణులు) పురుషోత్తములుగా ఉండేవారు, లక్ష్మీనారాయణుల వంశస్థుల రాజ్యముండేది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సత్యయుగంలో శ్రీ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, ఇది తండ్రి పిల్లలకు స్మృతినిప్పిస్తున్నారు. భారతవాసులైన మీరు 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గవాసులుగా ఉండేవారు. ఇప్పుడైతే అందరూ నరకవాసులుగా ఉన్నారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం భారతదేశము స్వర్గంగా ఉండేది. భారతదేశానికి చాలా మహిమ ఉండేది. బంగారం మరియు వజ్రాల మహళ్ళుండేవి, ఇప్పుడు అవేవీ లేవు. ఆ సమయంలో ఇంకే ధర్మమూ ఉండేది కాదు, కేవలం సూర్యవంశీయులే ఉండేవారు, చంద్రవంశీయులు కూడా తర్వాత వస్తారు. మీరు సూర్యవంశీ రాజ్యానికి చెందినవారిగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పటికీ కూడా ఈ లక్ష్మీనారాయణుల మందిరాలను నిర్మిస్తూ ఉన్నారు. కానీ లక్ష్మీనారాయణుల రాజ్యం ఎప్పుడుండేది, వారు దాన్ని ఎలా పొందారు అనేది ఎవ్వరికీ తెలియదు. పూజిస్తారు కానీ వారి గురించి తెలియదు, అంటే ఇది అంధ విశ్వాసము కదా. శివుని పూజను మరియు లక్ష్మీనారాయణుల పూజను చేస్తారు, కానీ వారి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. ఇప్పుడు భారతవాసులు స్వయంగా అంటారు - మేము పతితంగా ఉండేవారము, పతితులైన మమ్మల్ని పావనంగా తయారుచేసేటువంటి తండ్రి, మీరు రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి, రావణ రాజ్యం నుండి ముక్తులుగా చేయండి. తండ్రియే వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తారు. సత్యయుగంలో తప్పకుండా ఒకే రాజ్యముండేదని పిల్లలకు తెలుసు. బాపూజీ కూడా - మాకు రామ రాజ్యం మళ్ళీ కావాలని, పతితమైపోయిన గృహస్థ ధర్మము పావనమైనదిగా అవ్వాలి అని అనేవారు. మనము స్వర్గవాసులుగా అవ్వాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నరకవాసుల పరిస్థితి ఏమిటి అన్నది చూస్తున్నారు కదా, దీనిని హెల్ (నరకము), డెవిల్ వరల్డ్ (ఆసురీ ప్రపంచము) అని అంటారు. ఇదే భారతదేశము దైవీ ప్రపంచముగా ఉండేది. మీరు 84 జన్మలు తీసుకున్నారు, 84 లక్షల జన్మలు కాదు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు - నిజానికి మీరు శాంతిధామములో నివసించేవారు, మీరు ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చారు, 84 జన్మల పాత్రను అభినయించారు. పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది కదా. 84 పునర్జన్మలుంటాయి.

ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన వారసత్వమునిచ్చేందుకు అనంతమైన తండ్రి వచ్చారు. తండ్రి పిల్లలైన (ఆత్మలు) మీతో మాట్లాడుతున్నారు. ఇతర సత్సంగాల్లో మనుష్యులు, మనుష్యులకు భక్తి మార్గపు విషయాలను వినిపిస్తారు. అర్ధకల్పము భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు పతితులు ఒక్కరు కూడా ఉండేవారు కాదు, ఈ సమయములో పావనమైనవారు ఒక్కరు కూడా లేరు. ఇది పతిత ప్రపంచము. గీతలో కృష్ణ భగవానువాచ అని రాసేసారు, వారైతే గీతను వినిపించలేదు. మనుష్యులకు తమ ధర్మశాస్త్రము గురించి కూడా తెలియదు, తమ ధర్మాన్నే మర్చిపోయారు. హిందూ అనేది ధర్మమేమీ కాదు. ముఖ్యమైన ధర్మాలు నాలుగు. మొదటిది ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము. సూర్యవంశము మరియు చంద్రవంశము, రెండింటినీ కలిపి దేవీ దేవతా ధర్మము అని అంటారు. అక్కడ దుఃఖం యొక్క పేరు ఉండేది కాదు. 21 జన్మలు మీరు సుఖధామములో ఉండేవారు, తర్వాత రావణ రాజ్యం, భక్తి మార్గము ప్రారంభమవుతుంది. భక్తి మార్గము అనేది కిందకు తీసుకొచ్చేది. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. ఇప్పుడిది ఘోర అంధకారమయమైన రాత్రి. శివజయంతి మరియు శివరాత్రి అనే రెండు పదాలుంటాయి. శివబాబా ఎప్పుడు వస్తారు, రాత్రి అయినప్పుడు వస్తారు. భారతవాసులు ఘోర అంధకారములోకి వచ్చినప్పుడు తండ్రి వస్తారు. బొమ్మల పూజను చేస్తూ ఉంటారు, కానీ ఒక్కరి జీవితచరిత్ర గురించి కూడా తెలియదు. ఈ భక్తి మార్గపు శాస్త్రాలు కూడా తయారవ్వాల్సిందే. ఈ డ్రామాను, ఈ సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో ఈ జ్ఞానము లేదు, అది భక్తి యొక్క జ్ఞానము, ఫిలాసఫీ. అది సద్గతి మార్గాన్ని తెలిపే జ్ఞానమేమి కాదు. తండ్రి అంటారు - నేను వచ్చి మీకు బ్రహ్మా ద్వారా యథార్థ జ్ఞానాన్ని వినిపిస్తాను. మాకు సుఖధామము, శాంతిధామము యొక్క మార్గాన్ని తెలియజేయండి అని పిలుస్తారు కూడా. తండ్రి అంటారు - నేటికి 5 వేల సంవత్సరాల క్రితం సుఖధామముండేది, అప్పుడు మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేసేవారు, సూర్యవంశీ రాజ్యముండేది, మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామములో ఉండేవి. అక్కడ 9 లక్షల జనాభా అని అంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం పిల్లలైన మిమ్మల్ని చాలా షావుకార్లుగా చేశాను, ఎంతో ధనాన్ని ఇచ్చాను, దానిని మీరు ఎక్కడ పోగొట్టుకున్నారు. మీరు ఎంత షావుకార్లుగా ఉండేవారు. భారతదేశము ఎమని పిలవబడేది. భారతదేశమే అన్నింటికన్నా ఉన్నతాతి ఉన్నతమైన ఖండము. వాస్తవానికి ఇదే అందరి తీర్థస్థానము, ఎందుకంటే ఇది పతితపావనుడైన తండ్రి జన్మ స్థానము. అన్ని ధర్మాల వారికి తండ్రి వచ్చి సద్గతినిస్తారు. ఇప్పుడు సృష్టి అంతటిపైనా రావణ రాజ్యముంది, కేవలం ఒక్క లంకలోనే కాదు. అందరిలోనూ 5 వికారాలు ప్రవేశించి ఉన్నాయి. సూర్యవంశీ రాజ్యమున్నప్పుడు ఈ వికారాలే ఉండేవి కావు. భారతదేశము నిర్వికారీగా ఉండేది, ఇప్పుడు వికారీగా ఉంది. సత్యయుగంలో దైవీ సంప్రదాయముండేది, వారే తర్వాత 84 జన్మలను అనుభవించి ఇప్పుడు ఆసురీ సంప్రదాయము వారిగా అయ్యారు, మళ్ళీ దైవీ సంప్రదాయము వారిగా అవుతారు. భారతదేశము చాలా షావుకారుగా ఉండేది, ఇప్పుడు పేదదిగా అయ్యింది, అందుకే భిక్షము అడుగుతుంది.

తండ్రి అంటారు - మీరు ఎంత షావుకార్లుగా ఉండేవారు, మీకు లభించినంత సుఖం ఇంకెవ్వరికీ లభించదు, మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు, భూమి, ఆకాశము అన్నీ మీవిగానే ఉండేవి. భారతదేశము శివబాబా ద్వారా స్థాపించబడిన శివాలయంగా ఉండేదని తండ్రి స్మృతినిప్పిస్తున్నారు. అక్కడ పవిత్రత ఉండేది, ఆ కొత్త ప్రపంచములో దేవీదేవతలు రాజ్యం చేసేవారు. రాధా-కృష్ణులకు పరస్పరములో ఏ సంబంధముంది అనేది కూడా భారతవాసులకు తెలియదు. ఇరువురూ వేర్వేరు రాజధానులకు చెందినవారిగా ఉండేవారు, స్వయంవరము తర్వాత లక్ష్మీనారాయణులుగా అయ్యారు. ఈ జ్ఞానము మనుష్యులు ఎవ్వరిలోనూ లేదు. పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు, వారే మీకు ఈ ఆత్మిక జ్ఞానాన్నిస్తారు, ఈ ఆత్మిక జ్ఞానము కేవలం ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు తండ్రి అంటారు - ఆత్మాభిమానులుగా అవ్వండి, పరమపిత పరమాత్మ శివుడినైన నన్ను స్మృతి చేయండి. స్మృతితోనే సతోప్రధానముగా అవుతారు. మనుష్యుల నుండి దేవతలుగా లేక పతితుల నుండి పావనులుగా అయ్యేందుకే మీరిక్కడకు వస్తారు. ఇప్పుడిది రావణ రాజ్యం. భక్తి మార్గములో రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణుడు ఒక్క సీతను మాత్రమే అపహరించలేదు, భక్తి చేసే మీరందరూ రావణుని పంజాలో ఉన్నారు. మొత్తం సృష్టి అంతా 5 వికారాల రూపీ రావణుని జైలులో ఉంది. అందరూ శోకవాటికలో దుఃఖమయంగా ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ ముక్తులుగా చేస్తారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ స్వర్గాన్ని తయారుచేస్తున్నారు. అంతేకానీ, ఇప్పుడు ఎవరికైతే చాలా ధనము ఉందో, వారు స్వర్గంలో ఉన్నారని కాదు. అలా కాదు, ఇప్పుడిది నరకము. అందరూ పతితంగా ఉన్నారు, అందుకే గంగలోకి వెళ్ళి స్నానము చేస్తారు, గంగ పతితపావని అని భావిస్తారు. కానీ ఎవ్వరూ పావనంగా అవ్వరు. పతితపావనుడని తండ్రిని మాత్రమే అంటారు, నదులను కాదు. ఇదంతా భక్తి మార్గము. తండ్రి వచ్చి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఒకరు లౌకిక తండ్రి, రెండవవారు ప్రజాపిత బ్రహ్మా, అలౌకిక తండ్రి మరియు వారు పారలౌకిక తండ్రి - ముగ్గురు తండ్రులున్నారని ఇప్పుడు మీకు తెలుసు. శివబాబా, ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తారు. బ్రాహ్మణులను దేవతలుగా తయారుచేసేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఆత్మలకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఆత్మలు పునర్జన్మలు తీసుకుంటాయి. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మయే అంటుంది. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అవుతారు, ఏ దేహధారినీ స్మృతి చేయకండి. ఇప్పుడిది మృత్యులోకము యొక్క అంతిమము. అమరలోకము స్థాపనవుతుంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. సత్యయుగంలో ఒక్క దేవతా ధర్మముండేది, తర్వాత త్రేతాయుగంలో చంద్రవంశీ సీతా-రాములుండేవారు. పిల్లలైన మీకు మొత్తం చక్రమంతటినీ స్మృతినిప్పిస్తారు. శాంతిధామము, సుఖధామాలను తండ్రియే స్థాపన చేస్తారు. మనుష్యులు, మనుష్యులకు సద్గతినివ్వలేరు, వారందరూ భక్తి మార్గపు గురువులు. భక్తి మార్గములో మనుష్యులు అనేక రకాల చిత్రాలను తయారుచేసి, పూజించి, నీటిలో వేసి మునిగిపో, మునిగిపో అని అంటారు. చాలా పూజలు చేస్తారు, తినిపిస్తారు, తాగిస్తారు, కానీ అక్కడ తినేవారు బ్రాహ్మణులే. దీనిని బొమ్మల పూజ అని అంటారు, ఎంతటి అంధ శ్రద్ధ. ఇప్పుడు వారికి ఎవరు అర్థం చేయించాలి.

తండ్రి అంటారు - ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, మీరిప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ రాజధాని స్థాపనవుతుంది. ప్రజలైతే చాలామంది తయారవ్వనున్నారు. కోట్లలో ఏ కొందరో రాజులుగా అవుతారు. సత్యయుగాన్ని పుష్పాల తోట అని అంటారు, ఇప్పుడిది ముళ్ళ అడవి. ఇప్పుడు రావణ రాజ్యం మారిపోతుంది. ఈ వినాశనము జరగాల్సిందే. ఈ జ్ఞానము ఇప్పుడు కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే లభిస్తుంది, లక్ష్మీనారాయణులకు కూడా ఈ జ్ఞానముండదు, ఈ జ్ఞానము ప్రాయః లోపమైపోతుంది. భక్తి మార్గములో ఎవ్వరికీ తండ్రి గురించే తెలియదు. తండ్రియే రచయిత. బ్రహ్మా-విష్ణు-శంకరులు కూడా వారి రచనయే. పరమాత్మను సర్వవ్యాపి అని అనడంతో అందరూ తండ్రులైపోతారు, వారసత్వపు హక్కు ఉండదు. తండ్రి వచ్చి పిల్లలందరికీ వారసత్వమునిస్తారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే. ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలోకి వస్తారో, వారే 84 జన్మలు తీసుకుంటారని కూడా బాబా అర్థం చేయించారు. క్రిస్టియన్లలకు ఎన్ని జన్మలుంటాయి? 40 జన్మలుండవచ్చు, ఈ లెక్క తీయడం జరుగుతుంది. ఒక్క భగవంతుడిని వెతికేందుకు ఎన్ని ఎదురుదెబ్బలు తింటారు, ఇప్పుడు మీరు ఎదురుదెబ్బలు తినరు. మీరు కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేయాలి, ఇది స్మృతియాత్ర. ఇది పతితపావనుడైన గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ. మీ ఆత్మ చదువుకుంటుంది. సాధు సత్పురుషులు, ఆత్మ నిర్లేపి అని అంటారు. అరే, ఆత్మయే కర్మలనుసారముగా మరొక జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మయే మంచి లేక చెడు పనులు చేస్తుంది. ఈ సమయములో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి, సత్యయుగంలో కర్మలు అకర్మలుగా అవుతాయి, అక్కడ వికర్మలు జరగవు. అది పుణ్యాత్ముల ప్రపంచము. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేయించవలసిన విషయాలు. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ముళ్ళ నుండి పుష్పాలుగా అయి పుష్పాలతోట (సత్యయుగము) ను స్థాపన చేసే సేవ చేయాలి. ఎటువంటి చెడు కర్మలూ చేయకూడదు.

2. తండ్రి నుండి విన్న ఆత్మిక జ్ఞానాన్నే అందరికీ వినిపించాలి. ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి, ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు.

వరదానము:-

సదా తమ రాయల్ కులము యొక్క స్మృతి ద్వారా ఉన్నతమైన స్థితిలో ఉండే గుణమూర్త భవ

రాయల్ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారెప్పుడూ భూమిపై, మట్టిపై పాదాన్ని మోపరు. ఇక్కడ దేహాభిమానము మట్టి, ఇందులోకి దిగకండి, ఈ మట్టి నుండి సదా దూరముగా ఉండండి. ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క రాయల్ ఫ్యామిలీకి చెందిన, ఉన్నత స్థితిలో ఉండే పిల్లలము అన్న స్మృతి సదా ఉన్నట్లయితే మీ దృష్టి కిందకు వెళ్ళదు. సదా స్వయాన్ని గుణమూర్తిగా చూసుకుంటూ ఉన్నతమైన స్టేజ్ లో స్థితులై ఉండండి. లోపాన్ని చూసుకుంటూ సమాప్తము చేసుకుంటూ వెళ్ళండి, దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఆ లోపము అలాగే ఉండిపోతుంది.

స్లోగన్:-

ఎవరైతే తమ హర్షిత ముఖము ద్వారా పవిత్రత యొక్క రాయల్టీని అనుభవం చేయిస్తారో, వారు రాయల్ ఆత్మలు.