BRAHMA KUMARIS WORLD SPIRITUAL UNIVERSITY


Home

Amritvela

Contact Us


2015 జనవరి 4

సర్వ సంభందాలను నెరవేర్చే పరమాత్మతో మాయజీత్ ఆత్మ యొక్క ఆత్మిక సంభాషణ 

స్మృతికి రావలసిన మొదటి విషయము

నేను నా కళ్ళు తెరిచిన మొదటి క్షణం, నేను ఒక ఆత్మ అని భావిస్తాను: నేను మధురమైన ఇంటి నుంచి, ప్రపంచానికి ప్రకాశం యొక్క వెలుగులు ఇవ్వడానికి వచ్చాను.

నేను ఎవరు?

నేను మాయాజీత్ ఆత్మను. నేను నా నేత్రాలతో ఒక్క బాబాను మాత్రమే చూస్తన్నట్లయితే, మాయ మీద విజయం సాధించగలననే విషయం నాకు తెలుసు. చెవులను కేవలం బాబా ద్వారా వినడానికి మాత్రమే ఉపయోగిస్తాను. నా పాదాలు కేవలం బాబాను మాత్రమే అనుసరిస్తాయి. ప్రతి అడుగులో నేను బాబాను ఫాలో అవుతాను.          

నేను ఎవరికి చెందుతాను?

బాబా తో ఆత్మ యొక్క సంభాషణ:

మధురమైన బాబా.. గుడ్ మోర్నింగ్..

నేను ఎల్లప్పుడూ మిమ్మల్ని మాత్రమే చూస్తాను. మీ ద్వారానే వింటాను. మీతోటే నిద్రిస్తాను మరియు మీతో ఆహరం భుజిస్తాను. బాబా ! ఎప్పుడైతే నేను సేవ చేస్తానో, ఇతర ఆత్మలకు మీ పరిచయం ఇచ్చి మీతో మిళనం కలిగించే ప్రేరణ ఇస్తాను. అవ్యభిచారి సమర్పణ, నన్ను మయజీత్ గా తాయారు చేస్తుంది.   

అత్మతో బాబా యొక్క సంభాషణ:

మధురమైన పిల్లవాడా..లేచి నాతో కుర్చో...

ఒక్కోసారి నేను తండ్రిగా అవుతాను, ఒక్కోసారి శిక్షకుడిగా  అయ్యి నిన్ను చదివిస్తాను, ఒక్కోసారి నేను మిత్రుడిగా కూడా అవుతాను. బాబా నీకు సర్వ సంభందాల అనుభవమును కలిగిస్తారు. కేవలం సంగమ యుగంలో, బాబా మాత్రమే ఇలాంటి పాత్ర పోషించగలరు. నీవు బాబాతో సంభంధంలో కాలవలనుకుంటే, సంభందంలో కలవవచ్చు మరియు  ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకోవచ్చు.        

ప్రేరణ పొందుట:

నా మనస్సులో భౌతిక అలోచలను తీసివేసి.. మనస్సును శాంతి సాగరుడైన.. బాబా మీద ఏకాగ్రం చేస్తాను... బాబా నుంచి సేవ కొరకు పవిత్రమైన, ప్రేరణ కలిగించే సంకల్పాలను పొందుతున్నాను.

బాబా నుంచి వరదానములను పొందుట:

సూక్ష్మ వతనంలో నా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేస్తున్నాను.. బాబా యొక్క ప్రియమైన, పవిత్రమైన మరియు శక్తివంతమైన దృష్టి ద్వారా  బాబా నాకు వరదానాలు ఇస్తున్నారు.

పాత ప్రపంచాన్ని త్యాగం చేయడం ద్వారా, నీ  చేతులు ఈశ్వరీయ ఖజానలతో నిండుతున్నాయి. నీ సంపర్కంలోకి వచ్చే ప్రతి ఆత్మను, ఖజానలతో  నింపుతున్నావు.

దీని ద్వారా నీ విశ్వ మహారాజా దాతా సంస్కారాలు ఇమర్జ్ అవుతున్నాయి.     

బేహద్ సూక్ష సేవ (చివరి 15 నిమిషాలు..)

నేను పై వరదానాన్ని దాతగా అయ్యి ప్రపంచానికి ఇస్తున్నాను. నేను వరదానాన్ని బాబా నుంచి తీసుకుని మొత్తం ప్రపంచానికి నా శుభ సంకల్పాలతో బహుమతి రూపములో ఇస్తున్నాను...  నా ఫరిస్తా స్వరూపంలో భూప్రపంచాన్ని చుట్టి వస్తూ అత్మలందరికి వరదానాన్ని ఇస్తున్నాను.

నిద్రకు ఉపక్రమించే ముందు:  

నేను శబ్ధానికి అతీతమైన స్తితిలో స్తితమౌతున్నాను. నేను మానసికంగా కాని, భౌతింగా కాని ఎవరికీ ఆకర్షితం కాలేదు కదా అని పరిశీలించు కుంటున్నాను. నేను ఎవరితోనైన అగౌరవంగా ప్రవర్తించానా? అని చెక్ చేసుకుంటున్నాను. ఒక వేళ అలా చేసి వుంటే బాబాకి చెబుతున్నాను. ఏవైనా భౌతిక ఆకర్షణలకు లేదా స్వార్ధ ప్రయోజనాలకు లోను కాలేదు కదా? నేను చేసిన కర్మలను చార్ట్  లో రాసి  30 నిమిషాల  యోగం ద్వారా ఆ కర్మల యొక్క ప్రభావాన్ని తొలగిస్తున్నాను. నేను శుధ్ధమైన మరియు నిర్మలమైన హృదయంతో నిద్రిస్తాను.