02.02.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అవ్యక్త కలయిక యొక్క అనుభవం చేసుకునే విధి.

 ప్రేమ స్వరూప పిల్లలూ! జ్ఞాన సహితంగా ఏదైతే ప్రేమ ఉంటుందో అదియే యదార్థమైన ప్రేమ. మీ అందరి ప్రేమరసం బాప్ దాదాని కూడా ఆకర్షించి తీసుకువస్తుంది. పిల్లలందరి మనస్సులో ఒక ఆశ కనిపిస్తుంది. అది ఏమిటి? కొంతమంది పిల్లలు సందేశం పంపించారు. మాకు కూడా అవ్యక్త వతనం యొక్క అనుభవం చేయించండి అని. పిల్లలందరి యొక్క ఆశలు ఇప్పుడు పూర్తి అయ్యే సమయం వచ్చింది. అంటే అందరూ సందేశీ అయిపోతారా అని మీరంటారు, కానీ కాదు. అవ్యక్త వతనం యొక్క అనుభవం కూడా పిల్లలు చేసుకుంటారు అని అర్థం. కానీ దివ్యబుద్ది ఆధారంగా ఏదైతే ఇప్పుడు అలౌకిక అనుభవం చేసుకుంటున్నారో ఆ అనుభవం దివ్యబుద్ది ద్వారా చేసుకునే అనుభవం కంటే కూడా చాలా లాభదాయకం. ఈ అనుభవం అలౌకికమైనది మరియు అమూల్యమైనది. అందువలన ఎవరు కావాలనుకుంటే వారు అవ్యక్త బాబాతో సంభాషణ చేయగలరు. అయితే ఎలా చేయగలరు? దానికి పద్ధతి ఏమిటంటే అమృతవేళ స్మృతిలో కూర్చోండి మరియు ఇప్పుడు మేము అవ్యక్త బాప్ దాదాతో సంభాషణ చేయాలి అనే సంకల్పం పెట్టుకోండి. సాకారంగా కలుసుకునే సమయంలో తెలుస్తూ ఉండేది, అందువలన నిద్ర వచ్చేది కాదు. సమయం కంటే ముందే బుద్ధి ద్వారా ఈ అనుభూతిలో ఉండేవారు. అలాగే ఇప్పుడు కూడా అవ్యక్త కలయిక యొక్క అనుభవం పొందాలంటే దానికి చాలా సహజ పద్ధతి ఇది - అవ్యక్త స్థితిలో స్థితులై ఆత్మిక సంభాషణ చేయండి. అప్పుడు నిజంగా బాబాతో మాట్లాడుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. మరియు ఎలా అయితే సందేశీలకు కొన్ని దృశ్యాలు కనిపిస్తాయో అలాగే ఈ ఆత్మిక సంభాషణలో చాలా గుహ్యమైన, గోపనీయ రహస్యాలు బుద్ధియోగం ద్వారా అనుభవం చేసుకుంటారు. కానీ ఈ అనుభవం చేసుకోవడానికి ఒక విషయం అవసరం. అది ఏమిటి? తెలుసా? ఎవరైతే మొత్తం రోజంతా అవ్యక్త స్థితిలో మరియు అంతర్ముఖి స్థితిలో స్థితులవుతారో వారే అమృతవేళ అవ్యక్త స్థితిలో స్థితులవ్వగలరు. వారే అమృతవేళ ఈ అనుభవం చేసుకోగలరు. అందువలన ఒకవేళ స్నేహం ఉంది మరియు కలయిక యొక్క ఆశ ఉంది అంటే ఈ పద్ధతి చాలా సహజమైనది. చేయాలనుకునేవారు చేయవచ్చు మరియు సంభాషణ యొక్క అమూల్య ప్రాప్తిని కూడా పొందగలరు.

వతనంలో కూర్చుని ఉండగా కొంతమంది పిల్లల మనస్సు యొక్క సంకల్పాలు చేరుకుంటున్నాయి. శివబాబా చాలా కఠినమైనవారు అని మీరు అనుకుంటూ ఉండవచ్చు కానీ ఏదైతే జరుగుతుందో దానిలో రహస్యం మరియు కళ్యాణం ఉంటుంది. అందువలన ఏ మాటలు చేరుకుంటున్నాయో అవి విని హర్షితంగా ఉంటున్నారు. బాప్ దాదా నిర్మోహియా? పిల్లలైన మీరందరూ నిర్మోహులేనా? నిర్మోహి అయిపోయారా?

బాప్ దాదా నిర్మోహి మరియు పిల్లలలో శుద్దమోహం ఉంటే ఎలా కలయిక జరుగుతుంది? బాప్ దాదాలో శుద్ధమోహం ఉందా? (సాకార బాబాకి పిల్లలపై శుద్ద ప్రేమ ఉండేది) శివబాబాకి లేదా? బాప్ దాదాకి ఉందా? (మావంటి మోహం లేదు) పిల్లల కంటే ఎక్కువ శుద్ధమోహం ఉంది. కానీ బాప్ దాదా మరియు పిల్లలలో ఒక తేడా ఉంది. బాబా శుద్ధమోహంలోకి వస్తూ కూడా నిర్మోహిగా ఉంటారు మరి పిల్లలు శుద్ధమోహంలోకి వస్తే కొంచెం స్వరూపంగా అయిపోతారు. అయితే ప్రియంగా అవుతారు లేకపోతే అతీతంగా అవుతారు. కానీ బాప్ దాదా అతీతంగా మరియు ప్రియంగా వెనువెంటనే అవుతారు. ఈ తేడా ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే తొలగించుకుంటారో అప్పుడు ఎలా అవుతారు? అంతర్ముఖిగా, అవ్యక్తంగా, అలౌకికంగా అవుతారు. ఇప్పుడు కొంచెం లౌకిక స్థితి కూడా కలిసిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ తేడా సమాప్తి చేసేస్తారో అప్పుడు పూర్తిగా అలౌకికంగా మరియు అంతర్ముఖి అవ్యక్త ఫరిస్తాగా కనిపిస్తారు. ఈ సాకారవతనంలో ఉంటూ కూడా ఫరిస్తాగా అవ్వవచ్చు. అప్పుడు మీరు అంటారు - అయితే మీరు వతనం వెళ్ళి ఎందుకు ఫరిస్తా అయ్యారు, ఇక్కడే అవ్వవచ్చు కదా అని కానీ అలా కాదు. ఏదైతే పిల్లల పని ఉందో అది పిల్లలే చేయాలి. తండ్రి పని ఏదైతే ఉందో అది తండ్రియే చేస్తారు. ఇప్పుడు పిల్లలు చదువు యొక్క ప్రత్యక్షత చూపించాలి. టీచర్ కి చదువు యొక్క ప్రత్యక్షత చూపించరా? టీచర్ చదువు చదివిస్తారు. విద్యార్థి చదువు యొక్క ప్రత్యక్షత చూపించాలి. షోకేస్లో శక్తులు, పాండవులు రావాలి, బాప్ దాదా అయితే గుప్తంగానే ఉంటారు. ఇప్పుడు అందరి మనస్సులో ఇదే సంకల్పం ఉంది. ఇప్పుడు త్వరత్వరగా డ్రామా యొక్క దృశ్యాలన్నీ సమాప్తి అయిపోవాలి అని. కానీ అంత త్వరగా అయిపోతాయా? అవ్వగలవా? అవుతుందా, అవ్వగలదా? జరగవలసినది ఏదైతే ఉందో అది నిర్ణయం అయిపోయింది మరియు నిర్ణయం అయ్యే ఉంటుంది. కానీ తయారైపోయిన డ్రామాలో ఒకవేళ కల్పపూర్వం మాదిరిగానే మీకు సంకల్పం వస్తుంది అంటే అప్పుడు కూడా మీరు తీవ్ర పురుషార్ధం చేసే ఉంటారు. డ్రామా దృశ్యాలన్నీ త్వరగా పూర్తి అయిపోయి అవ్యక్తవతన వాసిగా అయిపోవాలనే సంకల్పం కూడా వస్తుందా? కానీ అవ్యక్త వతానాన్ని కూడా వ్యక్తంలోకి తీసుకురాగల శక్తి మీలో ఉంది. అవ్యక్త వతనం యొక్క పటాన్ని వ్యక్త వతనంలో తయారు చేయగలరు. ప్రతి ఒక్కరికీ ఆశలు అయితే చాలా ఉన్నాయి. సాకారలోకంలో టెలిఫోన్ లేదా టెలిగ్రామ్ ఆఫీస్ ద్వారా సందేశాలు ఎలా అందుతాయో అలా శుద్ధ సంకల్పాలనే తీగల ద్వారా ఈ ఆశలన్నీ వతనానికి చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఏమి చేయాలి? కొంతమంది పిల్లలకి లోక సంగ్రహణార్ధం కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి, అవి కూడా చేరుకుంటున్నాయి. సాకార బాబా ద్వారా సూక్ష్మవతనం లేనే లేదని చెప్పారు, మరి బాబా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ కలుసుకోవాలి? ఎక్కడ నుంచి ఈ సందేశం పంపిస్తున్నారు? ఎందుకు భోగ్ (నైవేధ్యం) చేస్తున్నారు? అని కొంతమంది పిల్లలు అయోమయం కూడా అవుతున్నారు. దీనికి కూడా రహస్యం ఉంది. ఎందుకు అలా చెప్పారు?

దీనికి ముఖ్య కారణం ఇదే - ఎలా అయితే చిన్న పిల్లలు ఏదో ఒక వస్తువు వెనుకపడతారు. ఈ వస్తువు మంచిదే కానీ హద్దు దాటి ఆ మంచి వస్తువు వెంట వెళ్తుంటే అప్పుడు ఏం చేస్తారు? ఆ వస్తువుని వారి కళ్ళకు కనపడకుండా చేసి, అది లేనే లేదు అని చెప్తారు కదా! అలా ఎందుకు చెప్తారు? వారికి ఏదైతే ఆ వస్తువు పట్ల అతి సంలగ్నత ఉందో అది తొలగి మంచిగా అవ్వాలని చెప్తారు. అదేవిధంగా వర్తమాన సమయంలో కొంతమంది పిల్లలు ఈ విషయాలలో లీనం అయిపోయారు. వారిని విడిపించడానికి సాకారంలో బాబా సూక్ష్మవతనం లేనే లేదు అని చెప్పేవారు. ఆ పిల్లల నుండి ఆ వస్తువు దాచినంత మాత్రాన ఆ వస్తువు లేనట్లు కాదు కదా! ఇది ఒక యుక్తి, ఒకవేళ సూక్ష్మవతనం లేకపోతే భోగ్ (నైవేధ్యం) ఎక్కడ పెడతారు? ఈ విధి-విధానం స్థిరంగా ఎందుకు పెట్టారు? ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే మీరు కూడా సందేశాన్ని ఎక్కడికి పంపిస్తున్నారు? సూక్ష్మవతనం లేదు అని కాదు, సూక్ష్మవతనం ఉంది కానీ ఇప్పుడు సూక్ష్మవతనం వెళ్ళటం మరియు రావడానికి బదులు సూక్ష్మవతనవాసి అవ్వాలి. ఇదే బాప్ దాదాకి పిల్లలపై ఆశ. రావటం, వెళ్ళటం ఎక్కువగా ఉండకూడదు. ఇది యదార్థం. సూక్ష్మవతనం వెళ్ళటంలో మరియు రావడానికి బదులు స్వయం సూక్ష్మవతనవాసి అయిపోండి. సంపాదన దేనిలో ఉంది? బాబా పిల్లల సంపాదన చూస్తున్నారు మరియు సంపాదనకి యోగ్యంగా చేస్తున్నారు. అందువలన ఈ రహస్యాలన్నీ చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైందా! ఎందుకు చెప్పానో మరియు ఇప్పుడు ఏమిటో అర్థమైందా! సూక్ష్మవతనం యొక్క అవ్యక్త అనుభవాన్ని అనుభవం చేసుకోండి. సూక్ష్మ స్థితిని అనుభవం చేసుకోండి. వెళ్ళటం, రావటం యొక్క కోరిక అల్పకాలికమైనది. అల్పకాలికానికి బదులు సదా మిమ్మల్ని మీరు సూక్ష్మ వతనవాసీగా ఎందుకు చేసుకోవటం లేదు? మరియు సూక్ష్మవతనవాసి అవ్వటం ద్వారానే చాలా అద్భుతంగా అనుభవం చేసుకోగలరు. సందేశీల అనుభవం మరియు ఈ అనుభవంలో ఎంత తేడా ఉందో అప్పుడు మీరే వర్ణన చేస్తారు. అది సంపాదన కాదు. ఇది అయితే సంపాదన మరియు అనుభవం కూడా. కనుక ఒకే సమయంలో ఆ రెండు ప్రాప్తులు చేసుకోవటం మంచిదా లేక ఒకటే కావాలా? కొంతమంది పిల్లలలో ఈ ప్రశ్న కూడా వస్తుంది - బాప్ దాదా అందరినీ వెంట తీసుకువెళ్తాను అని అనేవారు, కానీ ఇప్పుడు అతను వెళ్ళిపోయారు అని. కానీ ఆయన వెళ్ళిపోయారా? పిల్లలైన మీ పెళ్ళిగుంపు లేకుండా ఆ ముక్తిధామానికి వెళ్ళలేరు. పెళ్ళికొడుకు వెంట వెళ్ళే జన సమూహం లేకుండా ఒంటరిగా వెళ్ళగలరా! జన సమూహం తయారుగా ఉందా? మీరు అలంకరించుకుంటుంటే ఒంటరిగా ఎలా వెళ్తారు? ఇప్పుడు సూక్ష్మవతనంలోనే అవ్యక్తరూపం ద్వారా స్థాపన కార్యం నడుస్తుంది. ఎప్పటివరకు స్థాపన కార్యం సమాప్తి అవ్వదో అప్పటివరకు అనగా కార్యం సఫలం కాకుండా ఇంటికి వెళ్ళరు, వెంటే వెళ్తారు మరియు వెళ్ళిన తర్వాత ఏమి చేస్తారు? ఏమి చేస్తారో తెలుసా? వెంట నడుస్తారు మరియు వెంట ఉంటారు. మరియు వెనువెంటనే సృష్టి పైకి వస్తారు. ఎప్పుడు నీ తోడు మరియు చేయి వదలను అని పిల్లల పాట ఉంది. ఇది పిల్లల ప్రతిజ్ఞ అయితే బాబా ప్రతిజ్ఞ కూడా ఇదే. బాబా తన ప్రతిజ్ఞ నుండి తొలగరు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? సమయప్రకారం అన్ని స్పష్టమౌతాయి. బాబాకి మరలా జన్మ ఉంటుందా లేక ఏమౌతుంది? మమ్మా వలె జన్మ ఉంటుందా? అని కూడా కొందరి మనస్సులో ఉంది. పిల్లలైన మీ వివేకం ఏమి చెప్తుంది? డ్రామా యొక్క నిర్ణయాన్ని చూడగలరా? కొద్ది కొద్దిగా చూడగలరా? మేము ఈ త్రికాలదర్శి బాబా పిల్లలం అని మీరు అందరికీ చెప్తున్నారు కదా! మరి రాబోయే భవిష్యకాలాన్ని తెలుసుకోలేరా? మీ మనస్సు యొక్క వివేకం అనుసరించి ఏమి కానున్నది? అవ్యక్తస్థితిలో స్థితులై అవునా లేక కాదా చెప్పండి? అప్పుడు జవాబు వచ్చేస్తుంది. (ఈవిధంగా బాప్ దాదా ఇద్దరు, నలుగురిని అడిగారు) చాలా మందికి జన్మ ఉండదు అనే ఆలోచన ఉంది. ఈరోజే సమాధానం కావాలా లేక తర్వాత చెప్పనా! అలజడిలో ఉన్నారు. ఇది కూడా ఒక ఆట రచిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు చెరువులో రాళ్లు వేసి వాటి అలలలో ఆడతారు. ఇది కూడా ఒక ఆట. బాబా మీ అందరి ఆలోచనల సాగరంలో ప్రశ్నల రాళ్ళు వేసి మీ బుద్ధి రూపి సాగరంలో అలలు ఉత్పత్తి చేస్తున్నారు. ఆ అలల ఆట బాప్ దాదా చూస్తున్నారు. ఇప్పుడు మీ అందరితో పాటే అవ్యక్త రూపం ద్వారా స్థాపన కార్యంలో నిమగ్నం అవుతారు. ఎప్పటివరకు స్థాపన యొక్క పాత్ర ఉంటుందో అప్పటివరకు అవ్యక్త రూపం ద్వారా మీ అందరి వెంట తప్పక ఉంటారు. అర్థమైందా? వతనంలో మమ్మాని కూడా తీసుకువచ్చారు. ఏ విషయం గురించి మాట్లాడుకున్నారో తెలుసా? ఎలా అయితే సాకారరూపంలో, సాకార వతనంలో మమ్మా - బాబా మీరు కూర్చుని ఉండండి, ఆ పనులన్నీ మేము చేస్తాము అని చెప్పేవారో అలాగే వతనంలో కూడా ఇదే చెప్పారు. మేమందరం ఏదైతే స్థాపన కార్యం చేయాలో అది చేస్తాము అని. మీరు పిల్లలతో పాటూ ఉంటూ పిల్లలను సంతోష పెడుతూ ఉండండి. సాకారంలో కూడా ఇలాగే చెప్పేవారు, ఇప్పుడు వతనంలో కూడా అదే ఆత్మిక సంభాషణ నడిచింది. మీ అందరి మనస్సులో ఉంది, మా మమ్మా ఎక్కడికి వెళ్ళారు అని. ఇప్పుడు ఈ రహస్యం ఈ సమయంలో స్పష్టం చేసేది కాదు. కొంచెం సమయం తర్వాత చెప్తాను, ఎక్కడ మరియు ఏమి చేస్తుంది అని. స్థాపన కార్యంలో కూడా సహాయకారియే కానీ వేరే నామ, రూపాలతో మంచిది, ఇప్పుడు సమయం అయిపోయింది.

ఈరోజు వతనంలో దూరం నుండే ఉదయం నుండి సువాసన వస్తుంది. స్నేహంతో పదార్థాలు ఎలా తయారుచేస్తున్నారో చూస్తున్నారు. బండారీలో చక్రం తిరిగాను, మీరు చూసారా? ఆ పదార్థాల సువాసన కాదు, స్నేహం యొక్క సువాసన వస్తుంది. ఈ స్నేహమే అవినాశిగా ఉంటుంది. అవినాశి స్నేహం ఉంది కదా? ప్రతి ఒక్కరి స్మృతి చేరుతుంది. కానీ దానికి జవాబు తీసుకోవడానికి స్థితి కావాలి. వెంటనే జవాబు లభిస్తుంది. ఎలా అయితే సాకారంలో పిల్లలు బాబా అనగానే జవాబు లభించేది అలాగే ఇప్పుడు కూడా వెంటనే లభిస్తుంది కానీ మధ్యలో వ్యక్త భావాన్ని వదలాలి అప్పుడే ఆ జవాబు వినగలరు. ఇప్పుడైతే ఇంకా నలువైపుల సేవ చేసే అనుభవం చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబా అవ్యక్తం అయిన కారణంగా ఇంకొక లక్షణం పెరిగింది, ఏమిటి? తెలుసా? ఏమిటంటే మొదట బాహర్యామిగా ఉండేవారు. ఇప్పుడు అంతర్యామి అయ్యారు. అవ్యకస్థితిలో తెలుసుకోవలసిన అవసరం ఉండదు. స్వతహాగానే ఒక సెకనులో అందరి చిత్రాలు కనిపిస్తాయి. అందువలనే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరో గుణం పెరిగింది అని చెప్పాను. అవ్యక్త స్థితిలో అయితే సువాసన ద్వారానే పొట్ట నిండిపోతుంది. మీకు తెలుసా?

ఒక ముఖ్య శిక్షణ పిల్లలకి ఇస్తున్నారు. ఇప్పుడు సర్వీస్ అయితే చేయాల్సిందే, ఈ లక్ష్యం పిల్లలందరి బుద్ధిలో ఉంది మరియు లక్ష్యాన్ని పూర్తి చేస్తారు కూడా. కానీ ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి మధ్యలో ఒక విఘ్నం వస్తుంది. అది ఏమిటో తెలుసా? సేవని ఆటంకపరిచే విధంగా ఏ ముఖ్య విఘ్నం వస్తుంది? అందరి ముందు కాదు, కానీ ఎక్కువ మంది ముందు వస్తుంది. ఆ విఘ్నం ఏమిటి? ముందే చెప్తున్నాను. సర్వీస్ చేస్తూ చేస్తూ ధ్యాస పెట్టుకోవాలి, నేను ఇది చేసాను, నేనే చేయగలను....... ఇలా నేను అనే భావం రావటం అంటే దీనినే జ్ఞాన అభిమానం, బుద్ధి అభిమానం, సేవ యొక్క అభిమానం అంటారు. ఈ రూపాలలో మున్ముందు ఈ విఘ్నాలు వస్తాయి. కానీ ముందు నుండే ఈ విఘ్నం రానివ్వకూడదు. దీని కొరకు సదా నేను నిమిత్తుడిని అనే మాట స్మృతిలో ఉంచుకోవాలి. నిమిత్తంగా అవ్వటం ద్వారానే నిరాకారి, నిరహంకారి మరియు నమ్రచిత్త, నిస్సంకల్ప స్థితిలో ఉండగలరు. ఒకవేళ నేను చేశాను అనే భావన వస్తే ఏమౌతుందో తెలుసా? ఎలా అయితే నిమిత్తంగా భావించటం ద్వారా నిరాకారి, నిరహంకారి, నిస్సంకల్ప స్థితులు వస్తాయో అలాగే నేను, నేను అనే భావన రావటం ద్వారా అహంకారం, వాడిపోవటం, నిరాశ వస్తాయి. వాటి ఫలితం ఎలా ఉంటుంది? అంతిమంగా ఫలితం ఏమిటంటే నడుస్తూ, నడుస్తూ జీవిస్తూ చనిపోతారు. అందువలన నేను నిమిత్తం అనే ముఖ్య శిక్షణను వెంట ఉంచుకోవాలి. నిమిత్తంగా అవ్వటం ద్వారా ఏ అహంకారం ఉత్పన్నం అవ్వదు. ఒకవేళ నేను అనే భావన వస్తే మతభేదం యొక్క చక్రంలోకి వచ్చేస్తారు. అందువలన అనేక రకాల వ్యర్థ చక్రాల నుండి రక్షించుకోవడానికి స్వదర్శనచక్రాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. ఎందుకంటే మహారధీ అవుతూ ఉంటే మాయ కూడా మహారధి రూపంలో వస్తుంది. సాకార రూపంలో అంతిమం వరకు కర్మ చేసి చూపించారు. జ్ఞాపకం ఉందా? ఏమి శిక్షణ ఇచ్చారు? నిరహంకారి మరియు నిర్మాణచిత్త్ అయ్యి పరస్పరం ప్రేమతో నడవండి. మాతల సంఘటన తయారు చేయాలి. ఎలా అయితే కుమారీల ట్రైనింగ్ క్లాస్ చేసారో అలాగే సహాయకారి మాతలుగా అయ్యే వారికి మధువనంలో మాతల సంఘటన ఉండాలి. సంఘటన సమయంలో రావాలి. స్నేహాన్ని చూస్తే డ్రామా స్మృతి వస్తుంది. మధ్యలో డ్రామా వస్తే శాంతి అయిపోతారు. స్నేహంలోకి వచ్చేస్తే ఎలాంటి స్థితి తయారవుతుంది? నది వలె (కన్నీళ్ళు) అయిపోతారు, కానీ డ్రామా. మనం ఏ కర్మ చేస్తామో అందరు అదే కర్మ చేస్తారు. అందువలన శాంతిగా ఉండండి. ఒకవేళ అందరు వెంట ఉంటే అంతిమ కర్మాతీత స్థితి అనుభవం ఏదైతే అయ్యిందో అది డ్రామానుసారం మరోలా ఉండేది. కానీ జరిగిందే అలా, అందువలన కొద్దిమందే వెంట ఉన్నారు. వారు కూడా ఎదురుగా ఉన్నా కానీ లేనట్లే. స్నేహం అయితే వతనంలో కూడా ఉంటుంది ఎందుకంటే అవినాశి కదా! కానీ స్నేహాన్ని డ్రామా శాంతిలోకి తీసుకువస్తుంది. ఈ శాంతియే శక్తిని తీసుకువస్తుంది. మరలా అక్కడ (సత్యయుగంలో) సాకార రూపంలో కలయిక జరుగుతుంది. ఇప్పుడు అవ్యక్త రూపంలో కలుసుకుంటున్నారు, మరలా సాకార రూపంలో సత్యయుగంలో కలుసుకుంటారు. ఆ దృశ్యం స్మృతి వస్తుంది కదా! ఆడుకుంటారు. పాఠశాలలో కలిసి చదువుకుంటారు, కలిసి ఉంటారు. కంటిరత్నాలైన మీరు సత్యయుగీ దృశ్యాలు వతనంలో చూస్తూ ఉంటారు. బాబా ఏదైతే చూస్తారో అది పిల్లలు కూడా చూస్తారు. ఇప్పుడు జ్వాలారూపంగా తయారవ్వాలి. మీ జ్వాలారూపానికే స్మృతిచిహ్నం ఉంది. జ్వాలాదేవిగా అవ్వాలి. ఆమె ఎవరు? అన్ని శక్తుల జ్వాలారూపదేవి అవ్వాలి. జ్వాలని ప్రజ్వలితం చేయాలి. ఆ జ్వాలలో కలియుగం భస్మం అయిపోవాలి. వీడ్కోలు సమయంలో..... అన్ని సెంటర్స్ లో అవ్యక్త స్థితిలో స్థితులయ్యే కంటిరత్నాలకి బాబా మరియు దాదా యొక్క అవ్యక్త ప్రియస్మృతులు స్వీకరించండి. వెనువెంట ఏదైతే సూచన ఇచ్చానో దానిని త్వరత్వరగా జీవితంలోకి తీసుకువచ్చే తీవ్ర పురుషార్ధం చేయాలి. మంచిది. శుభరాత్రి, శివశక్తులకి మరియు పాండవులకి బాబా యొక్క నమస్తే.