04.03.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


హోలీ శుభ సందర్భముగా అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యాలు.

ఈ రోజు మీ విశేష హోలీ ఏమిటి? హోలీ ఎలా జరుపుకుంటారు? హోలీ జరుపుకోవటం వస్తుందా? సంగమయుగం యొక్క హోలీ ఏమిటి? వర్తమాన పాత్ర ప్రకారం హోలీ ఎలా జరుపుకుంటారు? వర్తమాన సమయంలో ఏ హోలీ జరుపుకునే అవసరం ఉంది? హోలీ రోజున చేసే విషయాలు చాలా ఉంటాయి. రంగులు జల్లుకుంటారు, కాలుస్తారు మరియు వెనువెంట అలంకరణ కూడా చేసుకుంటారు మరియు కొన్నింటిని తొలగించవలసి కూడా ఉంటుంది. ఏవైతే విషయాలు హోలీలో చేయాలో అవన్నీ ఈ సమయంలో నడుస్తున్నాయి. కాల్చడం ఏమిటి, తొలగించడం ఏమిటి, రంగు ఏమిటి మరియు అలంకరణ ఏమిటి? ఇవన్నీ చేయడాన్నే జరుపుకోవడం అంటారు. ఒకవేళ ఈ నాలుగు విషయాలలో కొన్ని లోపంగా ఉంటే దానిని జరుపుకోవటం అనరు. హోలీ రోజున చాలా సుందరంగా అలంకరిస్తారు. ఎలా అలంకరిస్తారు? దేవతల సమానంగా మీరందరూ అలంకరించబడి ఉన్నారా? అలంకరణలో ఏ లోపం లేదు కదా! అలంకరణలో ముఖ్యంగా హోలీ యొక్క అలంకరణ ఏమిటి? సంపూర్ణ అలంకరణలో మొట్టమొదట మస్తకంలో బల్బ్ పెడతారు. ఇది కూడా ఈ సమయం యొక్క కాపీ జరిగింది. మీ అందరి సంగమయుగం యొక్క ముఖ్య అలంకారం - మస్తకంలో ఆత్మ దీపానికి గుర్తుగా బల్బ్ పెడతారు. ఈ అన్ని విషయాలు ఉండడానికి హోలీ యొక్క అర్థాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. "హోలీ" అంటే ఏదైతే జరిగిపోయిందో అది అయిపోయింది. ఏ దృశ్యం అయితే జరిగిపోయిందో అది హోలీ అంటే గడిచిపోయింది. వర్తమాన సమయంలో ఏదైతే పాయింట్ ధ్యాసలో పెట్టుకోవాలో అది హోలీ అంటే డ్రామా యొక్క ఢాలు. ఎప్పుడైతే ఇలా గట్టిగా అవుతారో అప్పుడు ఆ రంగు కూడా గట్టిగా అంటుకుంటుంది. ఒకవేళ హోలీ యొక్క అర్థాన్ని జీవితంలో తీసుకురాకపోతే రంగు సరిగా అంటుకోదు. పక్కా రంగు అంటించుకోవడానికి ప్రతి సమయం ఆలోచించండి హోలీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇలా హోలీ జరుపుకుంటున్నారా? లేక అప్పుడప్పుడు డ్రామా యొక్క దృశ్యాలను చూసి కొద్దిగా మననం నడుస్తుంది. జ్ఞానం యొక్క మననం వేరే విషయం! కానీ డ్రామాలోని దృశ్యాల కోసం ఎందుకు, ఏమిటి, ఎలా అని మననం చేస్తున్నారు. మజ్జిగను మధనం చేస్తే వెన్న వస్తుంది. నీటిని మధనం చేస్తే ఏమి వస్తుంది? ఏమీ రాదు. ఫలితంలో అలసట వస్తుంది. సమయం వ్యర్ధం అవుతుంది. కనుక ఇది నీటి యొక్క మధనం. అలా మధనం చేయడానికి బదులు జ్ఞాన మననం చేయండి. సాకారరూపంలో చివరి రోజులలో సేవ యొక్క ముఖ్య యుక్తి ఏమి చెప్పేవారు? చుట్టుముట్టండి అనగా ఆక్రమణ చేసుకోవడం రెండు రకాలుగా ఆక్రమణ చేయాలి. 1. వాణీ ద్వారా సేవ. 2. అవ్యక్త ఆకర్షణ ద్వారా సేవ. ఆవిధంగా ఆక్రమణ చేయాలి. ఇప్పుడు ఎలాంటి ఆక్రమణ చేయాలంటే దాని నుండి ఎవరూ తొలగకూడదు. ముఖ్య అక్రమణ - అవ్యక్త ఆకర్షణ యొక్క ఆక్రమణ. ఆ ఆక్రమణ నుండి స్వయం మరియు, ఇతరులు తొలగకూడదు. ఆక్రమణలో చేసే పద్ధతిని ఇప్పటివరకు ప్రత్యక్ష రూపంలో చూపించలేదు. మ్యూజియం తయారు చేయటం సహజమే. మ్యూజియం తయారుచేయటం అంటే ఆక్రమణ చేసుకోవటం కాదు. కానీ మీ అవ్యక్త ఆకర్షణలే వారిని బలిహారం అయ్యేలా చేయాలి అదే ఆక్రమణ చేయటం, ఇది ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు సేవ చేసే సమయం కూడా ఎక్కువ లభించదు. సమస్యలు సేవలో కూడా విఘ్నాలు కలిగించే విధంగా వస్తాయి. అందువలన ఏదైతే సమయం లభించిందో దానిలో ఎవరు ఎంత సేవ చేయాలంటే అంత ఎక్కువగా చేయండి. లేకపోతే సర్వీస్ సమయం కూడా హోలీ అయిపోతుంది, అంటే గడిచిపోతుంది. అందువలన ఇప్పుడు మిమ్మల్ని మీరు ఎక్కువలో ఎక్కువ సేవాబంధనలో బంధించుకోండి. ఈ ఒక్క బంధన ద్వారానే అనేక బంధనాలు తొలగిపోతాయి. మిమ్మల్ని మీరు ఈశ్వరీయ సేవలో నిమగ్నం చేసుకోవాలి. ఇతరులు చెప్పటం వలన కాదు, ఇతరులు చెప్పటం ద్వారా ఏమౌతుంది? సగం ఫలం లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే చెప్పారో లేక ప్రేరణ ఇచ్చారో వారికి భాగం లభిస్తుంది. దుకాణంలో ఒకవేళ ఇద్దరు భాగస్వాములు ఉంటే లాభం ఇద్దరూ పంచుకుంటారు కదా! ఒకరే అయితే యజమానిగా ఉంటారు. అందువలన ఒకవేళ ఎవరైనా చెప్పటం ద్వారా చేస్తే ఆ కార్యంలో వారు భాగస్వామి అవుతారు మరియు స్వయమే యజమాని అయ్యి చేస్తే మొత్తం సంపాదనకు యజమాని అవుతారు. అందువలన ప్రతి ఒక్కరు యజమాని అయ్యి చేయాలి కానీ యజమానితో పాటు వెనువెంట బాలక్ స్థితి కూడా పూర్తిగా ఉండాలి. అక్కడక్కడ యజమాని అయ్యి నిల్చుని ఉండిపోతున్నారు, అక్కడక్కడ మరలా బాలక్ అయ్యి వదిలేస్తున్నారు. వదిలేయకూడదు మరియు పట్టుకోకూడదు. పట్టుకోవటం అంటే మొండిగా పట్టుకోకూడదు. ఏదైనా వస్తువుని ఒకవేళ గట్టిగా పట్టుకుంటే వస్తువు రూపం మారిపోతుంది కదా! పువ్వులని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది? పట్టుకోవాలి కానీ ఎంతవరకు, ఎలా పట్టుకోవాలి అనేది కూడా అర్థం చేసుకోవాలి. లేక పట్టుకుంటూ తగుల్కునిపోతున్నారు, వదిలేస్తే వదిలిపోతారు. రెండూ సమానంగా ఉండాలి. ఈ పురుషార్థం చేయాలి. ఎవరైతే యజమాని మరియు పిల్లలు రెండు విధాలుగా నడుస్తారో వారి ముఖ్య పరిశీలన - వారిలో నిర్మాణత ఉంటుంది. దానితో పాటు నిరంహంకారి, నిర్మానం మరియు వెనువెంట ప్రేమ స్వరూపులుగా ఉంటారు. ఈ నాలుగు విషయాలు వారి ప్రతి నడవడికలో కనిపిస్తాయి. ఒకవేళ నాల్గింటిలో ఏ విషయం లోపంగా ఉన్నా స్థితి కూడా లోపంగానే ఉంటుంది.

వతనంలో ఈరోజు హోలీ ఎలా ఆడుకున్నారో తెలుసా? కేవలం పిల్లలతోనే. మీరు కూడా హోలీ జరుపుకుంటున్నారు కదా! అక్కడికి సందేశీ వచ్చింది. ఒక ఆట జరిగింది. ఏమి ఆట ఆడి ఉంటారు? (నీవు తీసుకు వెళ్తే చూసేవారము) బుద్ధి యొక్క విమానం ఉంది కదా! బుద్ధి అనే విమానం దివ్యదృష్టి కంటే కూడా మంచిది. ఆ వస్తువులు ఇక్కడ ఉండనే ఉండవు. సందేశీయులు వతనంలోకి వచ్చినప్పుడు సాకారాన్ని(బ్రహ్మాబాబాని) దాచేశారు. చాలా సుందరమైన పూల పర్వతం ఒకటి తయారుచేశారు. దానిలో సాకారాన్ని దాచి ఉంచారు. దూరం నుండి చూస్తుంటే పర్వతమే కనిపిస్తుంది. సందేశీ వచ్చింది సాకార బాబాని చూడలేదు. బాగా వెతికారు, కానీ కనిపించనే లేదు. దాక్కునే ఆట ఆడుకుంటారు కదా! అలాంటి ఆట చూసారు. తర్వాతఅకస్మాత్తుగా పువ్వుల మధ్యలో సాకార బ్రహ్మాబాబా కూర్చుని కనిపించారు. ఆ దృశ్యం చాలా మంచిగా ఉంది. మంచిది.

తర్వాత అవ్యక్త బాప్ దాదా ప్రతి ఒక్కరికీ అమృతం త్రాగించి భోగ్ (ప్రసాదం) ఇస్తున్నారు. మరియు ఒకొక్కరితో ఆత్మిక సంభాషణ కూడా చేస్తున్నారు. విశేషంగా మ్యూజియం వారికి సలహా ఇస్తున్నారు - అవ్యక్త ఆకర్షణతో మ్యూజియం ఎలా తయారుచేయాలంటే ఎవరు లోపలికి వచ్చి చూసినా వెంటనే ఆకర్షితం అయిపోవాలి. మంచిది.