16.06.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఉన్నతోన్నతమైన బలిదానం మరియు శ్రేష్టసేవ

అందరు ఏ స్వరూపంలో కూర్చున్నారు? స్నేహరూపంలో కూర్చున్నారా లేక శక్తి రూపంలో కూర్చున్నారా? ఈ సమయంలో ఏ రూపం ఉంది? స్నేహంలో శక్తి రెండూ కలిసి ఉన్నాయా? రెండు రూపాలూ ఉన్నాయి అని ఎందుకు చెప్పటం లేదు? 1. బాప్ దాదాతో స్నేహం ఎందుకు? శివబాబా యొక్క ముఖ్య టైటిల్ ఏదైతే ఉందో దానిలో మీరు కూడా సమానంగా అవ్వాలి. ఆ ముఖ్య టైటిల్ ఏమిటి? (సర్వశక్తివంతుడు) కేవలం స్నేహం మాత్రమే ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు తెగిపోవచ్చు. కానీ స్నేహం మరియు శక్తి రెండు కలిసి ఉంటే ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయిక కూడా అవినాశిగా, అమరంగా ఉంటుంది. కనుక మీ ఈ కలయికని అవినాశిగా చేసుకోవడానికి ఏ సాధన చేయాలి? స్నేహం మరియు శక్తి రెండింటి కలయిక మీలో ఉన్నప్పుడే ఆత్మ మరియు పరమాత్మ యొక్క కలయిక ఉంది అంటారు. మేళాలో అయితే కూర్చున్నారు. కానీ కొంతమంది మేళాలో కూర్చున్నప్పటికీ కూడా రెండింటి కలయికని మర్చిపోతున్నారు, మంచిది. ఈ రోజు విశేషంగా కుమారీల కోసమే వచ్చాను. ఈరోజు కుమారీల యొక్క ఏ రోజు -(కలయిక రోజు) మీ అందరి ఫలితం వచ్చిందా? మీ ఫలితాన్ని స్వయం మీరు తెలుసుకుంటున్నారా? త్రికాలదర్శి అయ్యారా? ఈ గ్రూప్ నుండి నెంబర్‌వన్ కుమారీగా ఎవరు వచ్చారు. (చంద్రిక) మొదటి నెంబర్ యొక్క ముఖ్య కర్తవ్యం తన సమానంగా ఇతరులను కూడా మొదటి నెంబరుగా తయారుచేయటం. కుమారీలకు ఇప్పుడు ఇంకొక పేపర్ ఇవ్వాలి. అది ప్రత్యక్షపేపర్, వ్రాసే పేపర్ కాదు. ఇప్పుడు అయితే ఒక నెల ట్రైనింగ్ ఫలితంలో మొదటి నెంబరు వచ్చింది కానీ అంతిమ ఫలితంలో కూడా మొదటి నెంబరు రావాలి. కానీ దీని కొరకు ముఖ్యంగా ఏ విషయం బుద్ధిలో ఉంచుకోవాలి? త్యాగం మరియు సేవ అయితే ఉంది. మరొక ముఖ్య విషయం ఉంది. అన్నింటికంటే ఉన్నతమైన బలిదానం ఏమిటి? మరియు 2. అన్నింటికంటే ఉన్నతమైన త్యాగం ఏమిటి? ఇతరుల అవగుణాలను త్యాగం చేయటం ఇది గొప్ప త్యాగం...అన్నింటికంటే గొప్ప సేవ ఏది? ఎవరైతే శ్రేష్ట సేవాధారిగా ఉంటారో వారు ముఖ్యంగా ఏ సేవ చేస్తారు? ఎవరైతే తీవ్ర పురుషార్ధిగా ఉంటారో వారు తీవ్ర పురుషార్ధం యొక్క ప్రత్యక్షతను ఎలా చూపిస్తారు? ఎవరు ఎదురుగా వచ్చినా కానీ ఒక్క సెకనులో వారిని మరజీవగా చేయాలి. ఒక దెబ్బతో మరజీవ అవ్వాలి అంటారు కదా! దీనినే ఒక దెబ్బకి బలిహారం అవ్వటం అంటారు. సగం వదలకూడదు. వారిని ఒక దెబ్బకి బలిహారం అయ్యేలా చేయడమే శ్రేష్ఠ సేవ.

ఇప్పుడు మీరు బాణం వేస్తున్నారు మరలా బయటకి వెళ్ళి జీవిస్తున్నారు. కానీ ఒక సెకనులో దృష్టి ద్వారా అద్భుతం చేసే సమయం రావాలి. అప్పుడే సర్వీస్ యొక్క సఫలత మరియు ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయం వస్తుంది. ఇప్పుడు మరజీవగా చేస్తున్నారు. కానీ ఒక దెబ్బకు బలి అయ్యేవారిలా చేయటం లేదు. రెండు విషయాల యొక్క లోపం ఉంది. ఆ విషయాలు వచ్చేస్తే మీ రంగు ఇతరులకి కూడా అంటించగలరు. మీరు ఒక దెబ్బకి బలి అయ్యారా? (పురుషార్థులం).

అక్కడక్కడ పొరపాటు జరుగుతూ ఉంటే వారిని పురుషార్ధి అంటారా? ఇదే ప్రతిజ్ఞ చేయాలి - ఈరోజు నుండి మేము ఒక దెబ్బకు బలి అయిపోయాము, మరలా పాత ప్రపంచంలో జీవించము అని. ధైర్యవంతులకి సహాయం కూడా లభిస్తుంది. మీలో ధైర్యం ఉన్న కారణంగానే బాప్ దాదాకి కూడా స్నేహం ఉంటుంది. కనుక రెండు విషయాల యొక్క లోపం చెప్తున్నారు. ఒక ముఖ్య లోపం ఏకాంతవాసీగా తక్కువగా ఉంటున్నారు. మరియు మరొక లోపం ఏకతలో తక్కువ ఉంటున్నారు. ఏకత మరియు ఏకాంతంలో చాలా కొద్దిగా తేడా ఉంది. ఏకాంతంలో స్థూలంగా, సూక్ష్మంగా కూడా ఉంటుంది. దీనిలో రెండింటి యొక్క అవసరం ఉంది. ఏకాంతంలోని ఆనందం యొక్క అనుభవీ అయితే మరలా బాహర్ముఖత ఇష్టమనిపించదు. ఇప్పుడు బాహర్ముఖతలో అందరి ధ్యాస ఎక్కువ వెళ్తుంది. ఈ రెండు విషయాలలో ఎక్కువ లోపం ఉంది.. అవ్యక్తస్థితిని పెంచుకోవడానికి ఇవి చాలా అవసరం. దీని కొరకు ఎక్కువగా ఏకాంతం యొక్క రుచి ఉంచుకోవాలి. కుమారీలు ఇప్పుడు ప్రత్యక్ష కోర్సు ఇవ్వాలి. ఇప్పుడు కుమారీలకు మూడు బహుమతులు ఇవ్వాలి. బహుమతి స్నేహానికి గుర్తు, 3.మూడు సంబంధాల ద్వారా మూడు బహుమతులు ఇస్తున్నారు. అవి ఎప్పుడు మర్చిపోకూడదు. బాప్ దాదా యొక్క బహుమతిని సదా మీ వెంట ఉంచుకోవాలి. బహుతిని దాచుకుంటారు కదా! తండ్రి రూపంలో ఒక శిక్షణ యొక్క బహుమతిని స్మృతిలో ఉంచుకోవాలి. సదా బాప్ దాదా మరియు ఎవరైతే నిమిత్తమైన అక్కయ్యలు లేదా దైవీ పరివారం ఉన్నారో వారందరితో ఆజ్ఞాకారి, నమ్మకదారి అయ్యి నడవాలి. ఇది తండ్రి రూపంలో శిక్షణ యొక్క బహుమతి మరియు మరలా టీచర్ రూపంలో ఏ శిక్షణ యొక్క బహుమతి ఇస్తున్నారు? శిక్షణని గ్రహించాలి కదా! ఎక్కడికైనా వెళ్ళండి, టీచర్ రూపంలో జ్ఞాన గ్రాహకులు, గుణ గ్రాహకులుగా అవ్వాలి. ఈ శిక్షణ సదా స్మృతి ఉంచుకోవాలి... మరియు గురువు రూపం ద్వారా సదా ఒకే మతంలో ఉండాలి. ఏకరసంగా మరియు ఒకరి స్మృతిలో ఉండాలి. విష్ణువుకి ఏవైతే అలంకారాలు చూపించారో వాటిని ఇప్పుడు శక్తిరూపంలో ధారణ చేయాలి. ఈ అలంకారాలను సదా ఎదురుగా ఉంచుకోండి. ఇవే కుమారీల కొరకు తండ్రి, టీచర్ మరియు గురువు మూడు సంబంధాల ద్వారా శిక్షణ యొక్క బహుమతి. ఇప్పుడు ఎవరెవరు ఈ కానుకని వెంట ఉంచుకుంటారో చూస్తాను! వారు కూడా ఇప్పుడు పరిశుద్ధమైన బాంబ్స్ తయారు చేస్తున్నారు. కనుక మీరు కూడా ఇప్పుడు పరిశుద్ధమైన బాంబ్స్ వేయాలి. చీమ మార్గం యొక్క సేవ చాలా చేసారు. బాంబ్ వేయటం ద్వారా వెంటనే స్వచ్ఛం అయిపోతుంది. కనుక విశేషంగా ధ్వని వ్యాపించే సేవ వేయాలి. దీనినే బాంబ్ వేయటం అంటారు. ఎవరు ఎంత పరిశుద్ధంగా అవుతారో అంత ఇతరులపై పరిశుద్ధమైన బాంబ్ వేయగలరు. ఇప్పుడు అల్ రౌండర్ అవ్వాలి. ఎంతెంత ఆల్ రౌండర్ అవుతారో అంతంత సత్యయుగ పరివారానికి సమీపంగా వస్తారు. ఆల్ రౌండ్ చక్రం తిరిగి మీ ప్రత్యక్షత చూపించాలి. అప్పుడే ట్రైనింగ్ ఫలితం వస్తుంది. ప్రత్యక్ష కోర్స్ తర్వాత మరలా ఫలితం చూస్తాను. ఇప్పుడు మరలా ఒక నెల తర్వాత మధువనానికి వస్తే ఒంటరిగా రాకూడదు. ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి కాలేదు. ఇప్పుడు ప్రత్యక్షత చూపించాలి. ఒంటరిగా ఎవరూ రాకూడదు. ఎవరికో ఒకరికి పండా (మార్గదర్శి) అయ్యి యాత్రికులని తీసుకురావాలి. బాప్ దాదాకి కుమారీలపై చాలా ఆశ ఉంది. అశారత్నాలను బాప్ దాదా తన నయనాలలో ఇముడ్చుకుంటున్నారు.