16.07.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మధువన నివాసి గోపకులతో అవ్యక్త బాప్ దాదా యొక్క అవ్యక్త ఆత్మిక సంభాషణ

ఈరోజు ఎందువలన ఆహ్వానించారు? కలయికకే పిలిచారా లేక ఇంకేదైనా లక్ష్యం ఉందా? మీరందరు ఈ సంఘటనలోకి దేని కొరకు వచ్చారు? మధువననివాసీ గోపకులు ఏ లక్ష్యంతో ఇక్కడ కలిసారు? బాప్ దాదా అయితే మీ అందరి పరివర్తన సమారోహం కోసం వచ్చారు. కనుక పరివర్తనా సమారోహానికి వచ్చారు. భట్టీలో ఎందువలన కూర్చున్నారు? పరివర్తన కోసం, ఇప్పుడు ఆశ చాలా మంచిగా ఉంది. అందరి మస్తకంలో ఆత్మ సితార కనిపిస్తుంది. కనుక ఈరోజు పరివర్తనా సమారోహంలో కలుసుకుంటున్నారు. పరివర్తన యొక్క కోరిక అందరిలో చాలా మంచిగా ఉంది, ధైర్యం కూడా ఉంది. ఈ రోజు భట్టీ చార్ట్ లో ఇది కనిపిస్తుంది? ఈ గోపకుల పరివర్తనా ఉత్సాహం ద్వారా మీకు ఏమి కనిపిస్తుంది? కుమార్ కా దాదీని (ప్రకాశమణి దాది) అడుగుతున్నారు. మేఘాలను చూసి వర్షం వస్తుంది అని తెలుస్తుంది కదా! అలాగే ఈ పరివర్తనా ఉత్సాహం చూసి మీరు ఏమని భావిస్తున్నారు? ఈ పరివర్తనా ఉత్సాహం ఏమి గ్రహింపునిస్తుంది? ఇప్పుడు ప్రత్యక్షత యొక్క సమయం సమీపంగా ఉంది అని ఈ పరివర్తన యొక్క ఉత్సాహం గ్రహింపు ఇస్తుంది. మొదట ప్రత్యక్షత జరుగుతుంది, తర్వాత ఈ సృష్టిపై స్వర్గం వస్తుంది కనుక ప్రత్యక్షత యొక్క గ్రహింపునివ్వండి. వర్తమాన సమయంలో ప్రతి ఒక్కరు తమ తమ ప్రత్యక్షతలని ప్రత్యక్ష రూపంలోకి తీసుకువస్తున్నారు. మొదట గుప్తంగా ఉండేవారు. సూర్యుని వెలుగులో సితారలు దాగి ఉంటాయి. సూర్యుడు మరో దిశకు వెళ్ళినప్పుడు సితారల వెలుగు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు జ్ఞానసూర్యుడు వ్యక్త శరీరం వదిలి అవ్యక్త వతనంలో నిల్చున్నారు. కనుక వ్యక్తదేశంలో సితారల యొక్క మీ మెరుపు కనిపిస్తుంది. మొదటి కంటే ఇప్పుడు ఎక్కువగా ఒకరినొకరు గ్రహిస్తున్నారు కదా! ఒక్కొక్క నక్షత్రంలో ప్రపంచం ఉంది అంటారు కదా! కానీ ఒక్కొక్క నక్షత్రంలో ఏ ప్రపంచం ఉందో తెలియదు. ఈ ఆకాశ సితారలలో ప్రపంచమేమి లేదు. కానీ ఈ భూమి యొక్క చైతన్య సితారలలో ఒకొక్క సితారలో ఒక్కొక్క ప్రపంచం ఉంది. మీ ప్రపంచం యొక్క సాక్షాత్కారం అవుతుందా? కొద్ది సమయంలో మీ అందరి సంగమయుగం యొక్క సంపూర్ణరూపం చూస్తారు. సంగమయుగం యొక్క సంపూర్ణరూపం ఏమిటో తెలుసా? శక్తులు మరియు పాండవుల రూపం. ఈ సంగమయుగం యొక్క సంపూర్ణ స్వరూపం ఇప్పుడు ప్రత్యక్షరూపంలో అందరికి అనుభవమవుతుంది. మీ ప్రజలు, భక్తులు ఎవరో తెలుస్తుంది. ప్రజలు సమీపంగా వస్తారు మరియు భక్తులు అంతిమంలో మీ పాదాలపై పడతారు. ప్రతి ఒక సితారలో ఏదైతే రాజధాని లేక ప్రపంచం ఉందో అది ఇప్పుడు ప్రత్యక్షం అవుతుంది. ఎప్పుడైతే అది ప్రత్యక్షం అవుతుందో అప్పుడు అందరు ప్రభు! అని మహిమ చేస్తారు. ఇప్పుడు ఆ సమయం సమీపంగా రానున్నది. అందువలన ఇప్పుడు త్వరగా పరివర్తన తీసుకురావాలి. మీరు రచయిత కదా, రచయిత ఎలా ఉంటే రచన అలా ఉంటుంది. రచయితకి తన రచనపై ధ్యాస ఉండాలి. ఈ సమయంలో బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో స్నేహం మరియు ధైర్యం ఉంది. కేవలం బీజం కాదు. కానీ బీజం యొక్క ప్రత్యక్ష ఫలం కనిపిస్తుంది. ఆ ప్రత్యక్ష ఫలం చూసి సంతోషిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఫలం వస్తుందో దానిని చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. మీరు కూడా ఈ ఫలాన్ని సంభాళించుకోవాలి. ఎందుకంటే ఈ ఫలాన్ని బాప్ దాదాకి స్వీకరింపచేయాలి. కానీ మాయ అనే పక్షి కొట్టేయకుండా జాగ్రత్త పడాలి. ఫలం ముగ్గుతున్నప్పుడు పక్షి దానిని తినేయడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా మాయ, ఫలం తినడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు ఎవరి కోసం ఫలం ముగ్గిస్తున్నారు? కనుక చాలా జాగ్రత్తగా సంభాళించుకోవాలి. ఇప్పుడు ఫలం వచ్చింది. కానీ పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు స్వీకరిస్తారు. అంతవరకు సంభాళించాలి. ఫలం సంభాళించడానికి ఏమి చేస్తారు? దాని కోసం మీ దగ్గర ఏమి సాధనం ఉంది? ఫలం కొంచెమైనా ఎంగిలి అయిపోతే అది స్వీకరించబడుతుందా?

ఇప్పుడు ఆశ చాలా మంచిగా ఉంది. అందరి మస్తకంలో ఆత్మిక సితార కనిపిస్తుంది. కానీ దానితో పాటు వెనువెంట మీ మస్తకంలో ఏమి కనిపిస్తుంది? ఆశా సితార మెరుస్తూ బాప్ దాదాకి కనిపిస్తుంది. కానీ ఈ సితార ముందుకి మేఘాలని రానీయకూడదు. లేకపోతే సితార దాగిపోతుంది. ఈ ఆశాసితార మెరుస్తూ కనిపిస్తుంది. దీనిని పాలన చేయాలి. ఎప్పుడైనా కానీ ఏ కార్యంలో అయినా స్థూలంగా అయినా, సూక్ష్మంగా అయినా ధైర్యాన్ని ఎప్పుడు వదలకూడదు. పరస్పర స్నేహం స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడు పాండవులకి జయజయకారాలు వస్తాయి. ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం, అప్పుడప్పుడు కొంచెం వస్తున్నాయి. జయజయకారాలు వచ్చినపుడు నాటకం సమాప్తి అయిపోతుంది. అప్పుడు మీ అందరి అవ్యక్తస్థితి యొక్క జెండా దూరం నుండే కనిపిస్తుంది. మీ అందరి అవ్యక్త స్థితి, ఏకరస స్థితి యొక్క జెండా మొత్తం ప్రపంచానికి ఎగురుతూ కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే ఈ పరివర్తన యొక్క ప్రతిజ్ఞ కంకణం కట్టుకున్నారో దానిని అవినాశిగా ఉంచుకోవాలి. కంకణం తీయకూడదు. ఏదైనా కంకణం కట్టుకుంటే ఆ కార్యం సఫలం అయ్యేంతవరకు అది తీయకూడదు. అలాగే ఈ కంకణం కూడా ఎప్పుడు తీయకూడదు. మున్ముందు చాలా మంచి దృశ్యాలు చూస్తారు కానీ ఆ దృశ్యాలు మీ పరివర్తనని సమీపంగా తీసుకువస్తాయి. మీ విలువ కూడా మీకు తెలుస్తుంది. మీ విలువ తెలిసినప్పుడే నషా వస్తుంది. ఇప్పుడు ఒకొక్కసారి ఒకొక్క విలువ ఉంచుకుంటున్నారు. ఇప్పుడు భావం తారుమారు అవుతుంది. ఏదైనా వస్తువు కొత్తగా వచ్చినపుడు మొదటి భావం కొద్దిగా పైకి కిందకి అవుతుంది. తర్వాత నిర్ణయం అయిపోతుంది. అలాగే మీ విలువ ఇప్పుడు ఇంకా తెలియలేదు. అప్పుడప్పుడు చాలా విలువైనవారిగా, అప్పుడప్పుడు తక్కువగా భావిస్తున్నారు. కాని యదార్ధంగా ప్రతి ఒక్కరి విలువ ఏమిటి అనేది ఇప్పుడు త్వరలో తెలుస్తుంది. .
ఇక్కడ మధువనంలో కూర్చున్నారు. సృష్టి మొత్తంలో మధువనం ఎలాంటిది? అంతటిలో మధువనం అనేది బాగా చాలా ప్రేమతో తయారుచేసిన షోకేస్. షోకేస్లో చాలా మంచి మంచి వస్తువులు పెడతారు. అన్నింటికంటే ఉన్నతమైన వస్తువులు పెడతారు. కనుక మధువనం మొత్తం ప్రపంచానికి షోకేస్. ఆ షోకేస్లో అమూల్యరత్నాలైన మిమ్మల్నిపెట్టారు. మేము మధువన షోకేస్లో అమూల్యరత్నాలం అని మీకు తెలుసా! షోకేస్లో వస్తువులపై చాలా ధ్యాస ఉంటుంది. మీరు అందరు కూడా షోకేసులోని ముఖ్య రత్నాలు.

ఒక విషయం స్మృతి ఉంచుకుంటే షోకేసును అలంకరించగలరు. ఏ కర్మ మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు. ప్రతి ఒక్కరు నేను ఒంటరిగా లేను అని భావించాలి. నా ముందు, వెనుక మొత్తం రాజధాని ఉంది. నా ప్రజలు, నా భక్తులు నన్ను చూస్తున్నారు, నేను ఒంటరిగా లేను అని భావించాలి. ఒంటరిగా చేసే పనికి అంత ఆలోచన చేయరు. ఇప్పుడు మిమ్మల్ని మీరు మీ ప్రజలు, భక్తుల మధ్యలో ఉన్నట్లు భావించాలి. అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు. సెకను సెకను ఏదైతే అడుగు వేస్తున్నారో ఆ సంస్కారాలు మీ ప్రజలలో, భక్తులలో నిండుతూ ఉంటాయి. ఎలా అయితే తల్లికి గర్భం వస్తే ఎంత సంభాళించుకుంటారు? ఎందుకంటే తల్లి ఏమి చేస్తే, ఏది తింటే అది పిల్లలలో నిండుతుంది. మీరందరూ కూడా ఇంత ధ్యాస పెట్టుకోవాలి. ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి నా ప్రజలు మరియు ద్వాపరయుగం నుండి కలియుగం వరకు భక్తులు అలా తయారవుతారు. మందిరం కూడా అలా తయారవుతుంది. విగ్రహం కూడా అలా తయారవుతుంది. మందిరం యొక్క స్థానం కూడా అలా లభిస్తుంది.అందువలన సదా మేము ఒంటరిగా లేము అనే లక్ష్యం పెట్టుకోండి. మాస్టర్ రచయితతో పాటు రచన కూడా ఉంది. తల్లి తండ్రి ఒంటరిగా ఉండి ఏమి చేసినా కానీ తమ రచన (పిల్లలు) చేస్తారో అదే రచన అయిన వారు చేస్తారు. మీపై బాధ్యత ఉంది అని భావిస్తే బాధ్యత ద్వారా సోమరితనం మరియు బద్దకం సమాప్తి అయిపోతుంది. ఏమి బాధ్యత? ఏ కర్మ మనం చేస్తామో అదే ఇతరులు చేస్తారు. ప్రతి ఒక్క సితార తమ ప్రపంచాన్ని పరిశీలించుకోవాలి. కొందరికి చిన్న ప్రపంచం, కొందరికి పెద్ద ప్రపంచం ఉంది. సమారోహం జీవితం అంతా స్మృతి చిహ్నంగా అవ్వడానికి చేస్తారు. సమారోహంలో గుర్తుగా ఏదొకటి ఇస్తారు కదా, బాప్ దాదా ఏమి ఇస్తున్నారు? గుర్తుగా బాప్ దాదా విశేషంగా రెండు విషయాల బహుమతి ఇస్తున్నారు. శిక్షణ లభించింది కదా! ధైర్యం మరియు స్నేహం వదలకూడదు. బహుమతి ఏమి ఇస్తున్నారు?1.ఒకే సంలగ్నతలో ప్రతి సమయం ఉండాలి. మాకు ఒకరు తప్ప రెండవవారు లేరు. 2.పొదుపులో ఉండాలి. ఒకని స్మృతి మరియు పొదుపు. ఈ రెండు బహుమతులు ఈరోజు సమారోహానికి ఇస్తున్నారు. ఎవరు ఎంత మిమ్మల్ని ఆకర్షింపచేసినా ఒకరు తప్ప రెండవవారు ఎవరూ లేరు. ఇది మనస్సు యొక్క విషయం మరియు పొదుపు అనేది కర్మకి సంబంధించిన విషయం కనుక మనసా మరియు కర్మణా రెండూ మంచిగా ఉంటే వాణీ మంచిగా ఉంటుంది. ఈ రెండు విషయాలు విశేషంగా ధ్యాసలో ఉంచుకోవాలి. సాకార బాబాలో ఒకే సంలగ్నత మరియు పొదుపు ఉండేది. అందువలన ఏ మంత్రం వినిపించారో తెలుసా? తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం. పొదుపుతో పాటు ఈ మంత్రం కూడా మర్చిపోకూడదు. పొదుపు ఉండాలి వెనువెంట ఎంత పొదుపుయో అంతగానే విశాలహృదయులుగా ఉండాలి. విశాల హృదయంలో పొదుపు ఇమిడి ఉండాలి. దీనినే తక్కువ ఖర్చు ఎక్కువ ఫలితం అంటారు. మీరు అందరికంటే ఎక్కువ భాగ్యశాలి ఆత్మలు ఎందువలన? ఎవరి ఇంటికి ఎక్కువ అతిథులు వస్తారో వారు చాలా భాగ్యశాలి అంటారు. కదా! కనుక మీరు కూడా ఎక్కువ భాగ్యశాలి ఆత్మలు! ఎందుకంటే ఎక్కువ అతిధులు ఇక్కడకు వస్తారు.. కానీ అతిథ్యం మంచిగా చేయాలి. మీ ఇల్లు మొత్తం అతిథులతో నిండిపోయేలా ఆతిధ్యం చేయాలి. మీ ఆతిధ్యం వారిని సదాకాలిక అతిథులుగా చేయాలి. బాప్ దాదా సాకారంలో చేసి చూపించారు. ఒకరోజు ఆతిథ్యం ద్వారా పూర్తి జీవితం యొక్క అతిథి అవ్వాలి. ఇలా ఆతిధ్యం చేయాలి. వీరినే తండ్రి ప్రత్యక్షం చేసే పిల్లలు అంటారు.

ఈ క్లాసులో అందరికంటే ఎక్కువ పురుషార్థి ఎవరు? మొదటి నెంబర్ ఎవరు? ఒకరికంటే ఒకరు మంచిగా ఉన్నారు. ఇది అద్భుతం. ఈ గ్రూప్లో అందరు మొదటి నెంబర్ తీసుకున్నారు. ఎందుకంటే కొందరు ఒక విషయంలో విశేష పురుషార్ధం చేసారు. కొందరు మరోవిషయంలో చేసారు. అందువలన అందరు మొదటి నెంబరే. ఈ గ్రూప్ వారు మొదటి నెంబర్ అనే ముద్ర వేసుకున్నారు

ఈ మొదటి నెంబర్ ముద్రను మరచిపోకూడదు. ముఖ్యంగా నాలుగు విషయాలు మర్చిపోకూడదు. 1. శిక్షణ 2. సావధానం 3. ముద్ర మరియు 4. ఒకరినొకరు ముందు పెట్టుకుని ఉన్నతి పొందటం. ఈ నాలుగు విషయాలు ఎప్పుడూ మర్చిపోకూడదు.