28.11.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకునే యుక్తులు

ఈరోజు భట్టీ యొక్క ఏ రోజు? ఈరోజు సంపూర్ణ సమర్పణ అయ్యే రోజు. అందుకనే బాప్ దాదాని పిలిచారు. సంపూర్ణ సమర్పణ అయ్యేటందుకు అందరు తయారుగా ఉన్నారా లేక సంపూర్ణం అయిపోయారా? ఎవరైతే సంపూర్ణ సమర్పణ అయిపోయారో వారి సమారోహమే ఈ రోజు జరుగుతుంది. ఇక్కడ ఉన్న వారందరూ సంపూర్ణ సమర్పణ అయ్యారు. సంపూర్ణ సమర్పణ అయిన వారి దృష్టి ఎలా ఉంటుంది? (శుద్ధ దృష్టి, శుద్ద వృత్తి ఉంటుంది) కానీ ఏ యుక్తితో వారి దృష్టి మరియు వృత్తి శుద్దం అవుతాయి? ఒకే మాటలో చెప్పాలంటే వారి దృష్టి మరియు వృత్తిలో ఆత్మీయత ఉంటుంది. అంటే దృష్టి, వృత్తి ఆత్మీయంగా అయిపోతాయి. శరీరాన్ని చూడకపోతే దృష్టి శుద్ధంగా, పవిత్రంగా ఉంటుంది. జడవస్తువుని కళ్ళతో చూడకపోతే దాని వైపు వృత్తి వెళ్ళదు. దృష్టి వెళ్ళకపోతే వృత్తి కూడా వెళ్ళదు. దృష్టి చూసినప్పుడే వృత్తి కూడా వెళ్తుంది. ఆత్మిక దృష్టి అంటే మిమ్మల్ని మరియు ఇతరులను ఆత్మగా చూడాలి. శరీరం వైపు చూస్తూ కూడా చూడకూడదు ఈ అభ్యాసం అవ్వాలి. ఎలా అయితే ఎవరైనా గాఢ ఆలోచనలో ఉంటే ఏమి చేస్తున్నా, తింటున్నా, త్రాగుతున్నా కానీ వారికి ఎక్కడ వరకు చేరుకున్నారు, ఏమి తిన్నారో ఏమి తెలియవు. అదేవిధంగా శరీరాన్ని చూస్తూ కూడా చూడకుండా, ఆత్మని చూడటంలోనే నిమగ్నం అయిపోతే ఎవరైనా మిమ్మల్ని ఇది ఎలా ఉంది అని అడిగితే మాకు తెలియదు అనే ఈ స్థితి వచ్చేస్తుంది. ఏ శారీరక వస్తువుని చూస్తున్నా ఆ శారీరక, లౌకిక వస్తువుని అలౌకిక రూపంలో పరివర్తన చేసుకున్నప్పుడే ఆ స్థితి వస్తుంది. మీలో పరివర్తన రావాలంటే ఏవైతే లౌకిక వస్తువులు చూస్తున్నారో లేక లౌకిక సంబంధీకులని చూస్తున్నారో అవన్నీ పరివర్తన చేసుకోవాలి. లౌకికంలో అలౌకికత యొక్క స్మృతి ఉంచుకోవాలి. లౌకిక సంబంధీకులను చూస్తున్నా కానీ వీరు కూడా బ్రహ్మబాబా యొక్క పిల్లలు, వెనుక వచ్చే సోదరులు అని భావించండి. బ్రహ్మ వంశీయులే కదా! ఎందుకంటే బ్రహ్మ రచయిత. భక్తులైనా, జ్ఞానులైనా, అజ్ఞానులైనా కానీ వారు కూడా సోదరులే కదా! లౌకిక సంబంధీకులు కూడా బ్రహ్మవంశీయులే కానీ మనం సమీప సంబంధంలో ఉన్నాము, వారు దూరంగా ఉన్నారు. ఈ విధంగా ఏ లౌకిక వస్తువుని చూస్తున్నా, ఆఫీసులో పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, భోజనం తింటున్నా, చూస్తున్నా, మాట్లాడుతున్నా కానీ ఒక్కొక్క లౌకిక విషయంలో అలౌకికత ఉండాలి. శారీరక కార్యం కోసం నడుస్తున్నారు కాని ఈ శారీరక పాదం ద్వారా లౌకిక కార్యం వైపు వెళ్తున్నాను కానీ బుద్ధి ద్వారా మా అలౌకిక దేశానికి కళ్యాణ కార్యం కోసం వెళ్తున్నాను అని భావించండి. పాదాల ద్వారా ఇక్కడ నడుస్తున్నాము కాని బుద్ధి స్మృతియాత్రలో ఉండాలి. శరీరానికి భోజనం పెడుతూ ఆత్మకి స్మృతి అనే భోజనం పెట్టండి. స్మృతి కూడా ఆత్మకి భోజనం. శరీరానికి భోజనం పెట్టే సమయంలో శరీరంతో పాటు ఆత్మకి కూడా శక్తి, స్మృతి యొక్క బలం ఇవ్వాలి. మీలో పరివర్తనను తీసుకురావడానికి ఏమి చేయాలి? ప్రతి విషయాన్ని లౌకికం నుంచి అలౌకికంలోకి పరివర్తన చేయాలి. దీని ద్వారా ప్రజలకి వీరు విశేష, అలౌకిక ఆత్మలు అని తెలుస్తుంది. లౌకికంలో ఉంటూ కూడా మాతో వీరు అతీతమైనవారు. మిమ్మల్ని ఆత్మిక రూపంలో అతీతంగా భావించాలి. కర్తవ్యం నుండి లేదా కార్యం నుండి అతీతం అవ్వటం సహజమే, కానీ దీని ద్వారా ప్రపంచానికి ప్రియంగా అవ్వరు. శరీరంతో అతీతం అయ్యి ఆత్మరూపంగా కార్యం చేసినప్పుడే ప్రపంచానికి ప్రియంగా అవుతారు. కేవలం ప్రాపంచిక విషయాలతో అతీతం అవ్వటం కాదు, మొదట మీ శరీరంతో అతీతం అవ్వాలి. శరీరంతో అతీతంగా అయినప్పుడే ప్రియంగా అవుతారు. మీ మనస్సుకి ప్రియంగా, ప్రభు ప్రియంగా మరియు ప్రపంచానికి కూడా ప్రియంగా అవుతారు. ఇప్పుడు ప్రపంచం వారికి ఎందుకు ప్రియంగా అవ్వటం లేదు? ఎందుకంటే మీ శరీరంతో అతీతం కాలేదు. కేవలం దేహ సంబంధీకులకి అతీతం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన వారు నిందిస్తున్నారు. స్వయాన్ని ఏమి పరివర్తన చేసుకున్నారు? మొదట దేహాభిమానానికి అతీతం కాలేదు. అందువలనే నింద వస్తుంది. మొదట దేహంతో అతీతం అయితే నింద రాదు. ఇంకా ప్రపంచానికి ప్రియంగా అవుతారు. కొందరు మిమ్మల్ని చూసి బయటి విషయాలు చూస్తున్నారు మరియు బయటి విషయాలను మొదట పరివర్తన చేస్తున్నారు. తమని తాము తర్వాత పరివర్తన చేసుకుంటారు. అందువలన ప్రభావం పడటం లేదు. ప్రభావం వేయడానికి ముందు మీలో పరివర్తన తీసుకురండి. మీ వృత్తి, దృష్టి, స్మృతి, సంపత్తి, సమయాన్ని పరివర్తనలోకి తీసుకురండి. అప్పుడే ప్రపంచానికి ప్రియంగా అవుతారు. ఎందుకంటే ఎప్పుడైతే సంపూర్ణం అవుతారో దాని తర్వాత ఏమి చేయాలి? వారి మాట, నడవడిక ఎలా ఉంటుందో చెప్తున్నాను. మీ స్మృతి చిహ్న శాస్త్రాలలో చెప్తారు - సంపూర్ణ సమర్పణ ఎవరు అయ్యారు మరియు ఎవరికి అయ్యారు, ఎంత సమయంలో చేశారు? - అనే స్మృతిచిహ్నం జ్ఞాపకం వస్తుందా? (జనక మహారాజు యొక్క ఉదాహరణ) ఆయనను పిల్లలు చేయించారు కానీ తండ్రి చేయించినట్లుగా కూడా స్మృతి చిహ్నం ఉంది. చెప్తారు కదా - వామనుడు అంటే చిన్న రూపం. అన్నింటికంటే చిన్న రూపం ఎవరిది? ఆత్మ మరియు పరమాత్మ యొక్క రూపం. బాబా వచ్చి మాయాబలి నుండి మూడు అడుగులలో అన్నీ తీసుకున్నారు. అనగా సంపూర్ణ సమర్పణ చేసుకున్నారు. మీరు కూడా సంపూర్ణ సమర్పణ చేయాలి అంటే మాయ యొక్క బలం ఏదైతే ఉందో దానిని త్యాగం చేయాలి. మాయకి బలి కాకూడదు, ఈశ్వరీయ శక్తితో బలవంతులు అవ్వాలి. వారు మూడు అడుగులు అని చూపిస్తారు కదా! ఇక్కడ ఏ మూడు విషయాల ద్వారా సంపూర్ణ సమర్పణ అవుతారు. మనసా, వాచా, కర్మణా కొరకు ఏ శిక్షణ లభించింది? ఆ మూడు విషయాలు స్మృతి ఉంచుకుంటే సంపూర్ణ సమర్పణ అయిపోతారు. 1.దేహ సహితంగా అన్ని సంబంధాలను త్యాగం చేసి నన్కొక్కరిని స్మృతి చేయండి. ఇది మనసు కొరకు ఆజ్ఞ. 2.వాచా కొరకు ఏమి శిక్షణ లభించింది? ప్రతి సమయం నోటి నుండి రత్నాలు రావాలి. పరస్పరం రాళ్ళను ఇవ్వటం కాదు కానీ జ్ఞానరత్నాల దానం ఇవ్వాలి. మరియు 3.కర్మణా కొరకు ఇదే స్మృతి ఉంచుకోండి - ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు. మరో విషయం - ఏది చేస్తారో అది పొందుతారు. ఈ రెండు విషయాలను స్మృతిలో ఉంచుకోవటం ద్వారా కర్మణాలో బలం లభిస్తుంది. అంటే సర్వుల సంపర్కంలో బలం లభిస్తుంది. అర్ధమయిందా? మనసా, వాచా, కర్మణా కొరకు ఈ ముఖ్య విషయాలను స్మృతిలో ఉంచుకుంటే సంపూర్ణ సమర్పణను అవినాశిగా చేసుకోగలరు. ఇక్కడ సంపూర్ణ సమర్పణ యొక్క నషా ఎక్కింది. తర్వాత తక్కువ అయిపోకూడదు. మేము సంపూర్ణ సమర్పణ అయిపోయాము అని బాగా స్మృతి ఉంటే అవినాశి స్మృతి మిమ్మల్ని అవినాశిగా ఉంచుతుంది. ఒకవేళ మీరు అలజడి అయితే సమస్య కూడా మిమ్మల్ని అలజడి చేస్తుంది. మీ అలజడి మరియు సమస్యలని ప్రజలు కూడా తమషాగా చూస్తారు. బాప్ దాదా అయితే చూస్తూనే ఉంటారు. ఎవరి వెంట ఉంటారు? తోడు అయిన వారు వ్రేలు వదిలిస్తే ఏమి చేస్తారు? అందరు మీ తోడు నిలుపుకోవాలి. బాప్ దాదా అయితే ఏదోక రూపంలో తోడు నిలుపుకోవడానికి అంటే వ్రేలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. శ్వాస ఆగిపోయేంత వరకు తోడు ఉంటారు. శ్వాస పోతున్నా కానీ ప్రాణం నిలుపుతారు. కానీ ఆక్సిజన్ పెట్టించుకోకుండా, ఆక్సిజన్ గొట్టాన్నే తీసేస్తుంటే ఇంకేం చేస్తారు? ఒకవేళ బాప్ దాదా యొక్క సహయోగం మీకు కావాలంటే వాస్తవానికి సహయోగం అంటే అడిగేతే లభించేది కాదు. సహయోగం స్నేహీ ఆత్మలకి స్వతహాగానే లభిస్తుంది. అడగవలసిన అవసరం లేదు. అర్దకల్పం భక్తుల రూపంలో అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు పిల్లలుగా అయ్యి కూడా అడుగుతూనే ఉంటే పిల్లలు మరియు భక్తులలో తేడా ఏముంది? కానీ కారణం ఏమిటంటే అజ్ఞానీ అయ్యి సహయోగం అడుగుతున్నారు. అధికారి అయితే అడగవలసిన అవసరం ఉండదు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏదైతే అనుభవం అవుతుందో దానిని కూడా ఇప్పుడు పరివర్తనలోకి తీసుకురండి. జరిగిపోయిన దాని చింతన చేయకుండా జరిగిపోయిన విషయం నుండి శిక్షణ తీసుకుని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలి. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అది కూడా ఒక సమస్య అవుతుంది. సమస్యలు చాలా వస్తాయి, ఇది కూడా ఒక క్రొత్త సమస్యగా అవుతుంది. జరిగిపోయిన దానిని పరివర్తన చేసుకోవడానికి, బలం నింపుకోవడానికి ఈ రూపంలో ఆలోచించండి. ఇది ఎందుకు జరిగింది, ఎలా అయ్యింది, జంప్ చేయగలనా, లేదా.... ఇలా ఆలోచించకండి. ప్రశ్నలు వేయకండి, ప్రశ్నార్ధకానికి బదులు ఫుల్ స్టాప్ (బిందువు) పెట్టండి. బిందువు పెట్టడం సహజం. ప్రశ్నార్థకం కొంతమంది వ్రాయగలరు, కొంతమంది వ్రాయలేరు. కానీ ఇక్కడ ప్రశ్నార్ధకం పెట్టడం అందరికీ వస్తుంది. బిందువు పెడుతూ ఉంటే బిందు రూపంలో స్థితులవ్వగలరు. మ్యూజియం లేదా ప్రదర్శనిలో మీరు పరిచయం చెప్పేసిన తర్వాత ఏమి చేస్తారు? తర్వాత ఏమి చేయాలో కరపత్రం ఇస్తారు కదా! అలాగే బాప్ దాదా కూడా అడుగుతున్నారు - భట్టీ తర్వాత ఏమి చేస్తారు? యజ్ఞ కార్యాన్ని ఎలా ముందుకి తీసుకు వెళ్తారు? మీ ఉన్నతి కొరకు ఏమి చేస్తారు? దైవీ గుణాలు ధారణ చేయటం, స్నేహి అవ్వటం అనేవి సరే కానీ ప్రత్యక్ష రూపంలో ఏమి ఇస్తారు? మీరందరూ చెప్పారు కదా - స్వయానికి, బాప్ దాదాకి మరియు పరివారానికి స్నేహిగా, సహయోగిగా అవ్వాలి. కానీ ఏయే విషయాలలో అవ్వాలి? మనసా, వాచా, కర్మణాతో పాటు వెనువెంట తనువు, మనస్సు, ధనం మూడు రూపాలతో మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. సహాయకారి మరియు నమ్మకధారి అవ్వాలి. ఈ రెండు విషయాలను ధారణ చేసినప్పుడే బాప్ దాదాకి మరియు పరివారానికి స్నేహి మరియు సహయోగి అవుతారు. సహయోగి అయిన వారి గుర్తు ఏమిటి? వారు పరివారం మరియు బాప్ దాదా ఆలోచనలలో మరియు ఏదైతే కర్మ చేస్తారో దానిలో ఒకరికొకరు సమీపంగా ఉంటారు. ఒకరి మతానికి ఒకరు సమీపంగా వస్తే మత బేధం సమాప్తి అయిపోతుంది. సహాయకారి మరియు నమ్మకధారి ఈ పద్దతి కూడా చెప్పాను. ఎవరైతే సంపూర్ణ సమర్పణ అవుతారో వారు తమ తనువు, మనస్సు, ధనం మరియు సమయం ఈ నాల్గింటినీ ఎలా ఉపయోగించాలి? ప్రవృత్తి మార్గం వైపు ధ్యాస ఉంచడం అనేది అవసరమే కానీ ఈ నాలుగు విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము యదార్ధంగా ప్రయోగిస్తున్నాం అని మీ మనస్సు సరిగ్గా నిర్ణయించాలి.

సంపూర్ణ సమర్పణ అయిన ఆత్మ తనువు, మనస్సు, ధనం మరియు సమయాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తున్నారా? తనువు, మనస్సు, ధనం, సమయం ఎలా ఉపయోగిస్తున్నాం అని లెక్క చూసుకోవాలి. మీ ఇంటి లెక్కల ఖాతా చూసుకుంటారు. అలాగే సంపూర్ణ సమర్పణ యొక్క లెక్కల ఖాతా తీయాలి. తనువు కూడా ఎలా మరియు ఎక్కడ ఉపయోగించాలి? ఇది తక్కువగా మరియు స్పష్టంగా వ్రాయాలి. విస్తారంగా వ్రాసినా స్పష్టంగా ఉండదు. అందువలన క్లుప్తంగా మరియు స్పష్టంగా కూడా ఉండాలి. ఎంతెంత తక్కువగా మరియు స్పష్టంగా వ్రాస్తారో అంత లోపల స్థితి కూడా స్పష్టంగా ఉంటుంది. తక్కువ సంకల్పాలు చేస్తే సమాచారం కూడా తక్కువగా ఉంటుంది. మరియు పురుషార్ధం యొక్క లైన్ కూడా స్పష్టంగా ఉంటుంది. సమాచారం కూడా స్పష్టంగా ఉంటుంది. దీనిలో మొత్తం లెక్కల ఖాతా వచ్చేస్తుంది. మూడవ విషయం ఏమిటంటే మనసా, వాచా, కర్మణాలో ఇప్పటివరకు పురుషార్థంలో లోపం కారణంగా ఏదైతే జరిగిందో దానిని బుద్ధి ద్వారా పూర్తిగా మర్చిపోండి. ఇప్పుడు క్రొత్త జన్మ తీసుకున్నట్లు మర్చిపోండి. పురుషార్ధంలో ఉన్న బలహీనతలను ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. పాత సంస్కారం కారణంగా ఇలా జరిగిపోయింది అని ఉత్తరం వ్రాయకూడదు. సంపూర్ణ సమర్పణ అయిపోయారు అంటే ఒకవేళ ఎవరికైనా దానం ఇచ్చిన వస్తువును మరలా స్వీకరిస్తే దాని పరిణామం ఎలా ఉంటుంది? ఇది స్మృతి ఉంచుకోవటం ద్వారా నాలుగు విషయాలు పరివర్తన అయిపోతాయి. నోటి నుండి ఎప్పుడు ఇలాంటి మాటలు రాకూడదు. సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే జ్ఞానం యొక్క విషయాలని వ్యతిరేక రూపంలో లోపల ధారణ చేస్తున్నారు.

ఏదైనా పొరపాటు జరిగితే ఇంకా సంపూర్ణంగా కాలేదు కదా అంటున్నారు. ఇప్పుడైతే సమయం ఉంది, పురుషార్ధులం అంటున్నారు. పురుషార్థులకి పొరపాట్లు చేసే అవకాశం లేదు. ఈరోజులలో పురుషార్ధి అంటే పొరపాట్లని క్షమిస్తారు అని భావిస్తున్నారు. వీరు ఇలా చేస్తున్నారు. కనుక మేం కూడా చేయవలసి వస్తుంది అంటున్నారు. జ్ఞానికి బదులు అజ్ఞాని అయిపోయారు. ఎవరు చేస్తే వారు పొందుతారు అనేది స్మృతి ఉంచుకోవాలి. నేను ఏది చేస్తే నన్ను చూసి అందరు చేస్తారు. వారిని చూసి మనం చేయకూడదు. సరైన మిమ్మల్ని చూసి వారు కూడా అలా చేసేవిధంగా ఉండాలి. ఇలా చిన్న చిన్న విషయాలను వ్యతిరేక రూపంలో ధారణ చేసారు. ఈ జ్ఞానం యొక్క లాభాన్ని పొందడానికి బదులు వ్యతిరేక రూపంలో ప్రయోగిస్తున్న కారణంగా పురుషార్ధంలో బలహీనత వస్తుంది. ఇవి పురుషార్థ హీన విషయాలు. కానీ ఇదే పురుషార్థి జీవితం అని భావిస్తున్నారు. అందువలన ఈ జ్ఞాన విషయాలను తమ పురుషార్ధంలోని లోపాలను దాచుకోవడానికి సాధనంగా చేసుకుంటున్నారు. ఆ సాధనాలను తొలగించండి. అప్పుడు అన్ని సమస్యలు స్వతహాగానే సమాప్తి అయిపోతాయి. నాలుగు శకులని ధారణ చేయాలి. 1. మలుచుకునే శక్తి, క్లుప్తం చేసే శక్తి 2. ఇముడ్చుకునే శక్తి 3. సహన శక్తి 4. ఎదుర్కొనే శక్తి, దేనిని ఎదుర్కోవాలి? బాప్ దాదా లేదా దైవీపరివారాన్ని కాదు. మాయాశక్తిని ఎదుర్కోవాలి.

ఈ నాలుగు శక్తులను ధారణ చేస్తే సంపూర్ణ సమర్పణని అవినాశిగా, సిరంగా ఉంచుకోగలరు అంటారు కదా! క్లుప్తం చేయండి మరియు అవసరం లేనివి కత్తిరించండి. ఇది చేయాలి, ఇది ఆలోచించాలి. ఇది తయారవ్వాలి అనటం కాదు. క్లుప్తం చేయండి. ఎంత వీలైతే అంత క్లుప్తం చేయండి; పది మాటలు మాట్లాడాలంటే వాటిని క్లుప్తంగా రెండు మాటల్లో రహస్యం చెప్పండి . ఇలా తక్కువ చేస్తూ ఉంటే సారయుక్తంగా అయిపోతారు. ఈ భట్టీ తర్వాత ఇలాంటి పురుషార్ధం చేయాలి. మరో విషయం కూడా స్మృతి ఉంచుకోవాలి - ఎలా అయితే బాప్ దాదా మిమ్మలందరినీ ఈ సృష్టి ఎదురుగా ప్రత్యక్షం చేశారో అలాగే ఇప్పుడు మీరు ప్రతి కర్తవ్యం ద్వారా, ప్రతి విషయం ద్వారా బాప్ దాదాని అనేకుల ముందు ప్రత్యక్షం చేయాలి. ఇది పిల్లలైన మీ కర్తవ్యం. ఇప్పటి వరకు మేము బాబా సందేశాన్ని అయితే ఇచ్చాము. కానీ ఆ సందేశం ద్వారా ఆత్మలలో బాప్ దాదా యొక్క స్నేహాన్ని మరియు సంబంధాన్ని ప్రత్యక్షం చేశామా? లేదా అనే చార్ట్ కూడా చూసుకోండి. లేకపోతే అది సేవ ఎలా అయ్యింది? సగం సేవ చేయకండి. ఇప్పుడు సంపూర్ణ సమర్పణ అయ్యారు. కనుక సేవ కూడా సంపూర్ణంగా చేయాలి. అందువలన ప్రతి ఒక్కరు దీనిని కూడా పరిశీలించుకోండి - ఈరోజు నేను మనసా, వాచా, కర్మణా ద్వారా ఎంతమంది ఆత్మలకు మరియు ఎంత వరకు బాప్ దాదా స్నేహాన్ని మరియు సంబంధాన్ని ఆత్మలలో ప్రత్యక్షం చేశాను అని. కేవలం సందేశం ఇవ్వటమే సేవ కాదు. సందేశం ఇవ్వటం అంటే వారిని మన సంబంధీగా చేసుకోవటం. మన సంబంధంలోకి అంటే శివవంశీ బ్రహ్మకుమారీ, కుమారులుగా తయారుచేయాలి. మీ సంబంధీగా చేసుకోవటం అంటే ఇదే. స్నేహము ఇవ్వటం ద్వారా సంబంధీగా అయిపోతారు. కేవలం సందేశం ఇవ్వటం అనేది చీమ మార్గం యొక్క సేవ. ఇది విహంగ మార్గం యొక్క సేవ. బాప్ దాదా గుప్త వేషంలో ఎలా తన కర్తవ్యం చేస్తున్నారో ప్రపంచంలో వ్యాపింపచేయండి. వారిని ఈ స్నేహం మరియు సంబంధంలోకి తీసుకురండి. అందరు సంబంధీకులే కదా! సంబంధీకులకి తమ సంబంధం యొక్క స్మృతి ఇప్పించండి. తప్పిపోయిన ఆత్మలను స్నేహిగా చేయండి. ఇప్పుడు సేవ యొక్క గుప్త రూపం నడుస్తుంది. ప్రత్యక్షంగా నడవటం లేదు. మ్యూజియంకి రావటం, బయటి ప్రత్యక్ష రూపం ఇది వేరే విషయం. కానీ ఇప్పుడు సర్వీస్ గుప్తంగా ఉంది. సర్వీస్ రూపం ప్రత్యక్షం అయినప్పుడే బాబా ప్రత్యక్షత జరుగుతుంది. సేవ ఎలా వృద్ధి అవుతుంది, ధ్వని ఎలా వ్యాపింపచేయాలి అని దీని కొరకు క్రొత్త క్రొత్త పద్ధతులు ఆలోచించండి. నిర్భయంగా అయ్యి సూచన ఇవ్వటానికి, సందేశం ఇవ్వటానికి వెళ్ళాలి. ప్రదర్శనీలు పెట్టండి కానీ తర్వాత వారికి ఏది చెప్తున్నారో అది మీరు కూడా చేయండి. పరస్పరం కలిసి ఆలోచించండి. ఇప్పటి సమయం ఎలాంటిది మరియు బాబా కర్తవ్యం ఎలా జరుగుతుంది అనేది ప్రపంచానికి ఎలా తెలుస్తుంది అని ఆలోచించాలి. వార్తా పతిక్రల ద్వారా ఏ సేవ జరగాలో అది జరగలేదు. ఒక సంఘటన రూపంలో, ఒకరినొకరు అర్థం చేసుకుని, సహయోగియై బేహద్ సేవలో బేహద్ రూపం తీసుకురావాలి. ఈ గ్రూపులో అందరికీ లోపల ఇదే ఉత్సాహ ఉల్లాసం ఉంది - బాప్ దాదా ఏది కోరుకుంటున్నారో అది 100 శాతం చేసి చూపించాలి అని. ఇలా మనస్సులో ఉంది కనుక పూర్తి అవుతుంది. అందరి మనస్సులో మొత్తం లౌకిక కార్యం వదిలి సమర్పణ అవ్వాలి అని ఉంది. ఆ రోజు కూడా సమీపంగా రానున్నది కానీ మనస్సులో సమర్పణ అయినప్పుడే అలా కాగలరు. మనస్సుతో సమర్పణ అయిపోతే లౌకిక కార్యం నుండి సమర్పణ అవ్వటంలో ఆలస్యమవ్వదు.

ఈసారి మనస్సుతో సమర్పణ అవ్వండి. ఎవరి ఫలితం మంచిగా చూస్తే దాని ద్వారానే నెంబర్ లభిస్తుంది. భట్టీ ప్రోగ్రామ్ లేకపోయినా కానీ మధువనం అంటేనే భట్టీ, మధువనం వస్తూ ఉంటారు మరియు అమరంగా అయ్యే ప్రత్యక్షత ఇస్తూ ఉంటారు. మొదట సంకల్పాలలో సమర్పణ అవ్వాలి. ఏ వ్యర్దసంకల్పాలు రాకూడదు. ఈ సంకల్పాల కారణంగానే సమయం, శక్తి వ్యర్ధం అవుతున్నాయి. కనుక సంకల్పాలతో కూడా సంపూర్ణ సమర్పణ అవ్వాలి. మనస్సులోని ఉల్లాసాన్ని ఇప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురావాలి.