02.02.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆత్మిక శక్తి యొక్క పరిశీలన

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రొజెక్టర్ షో చూస్తున్నారు. మీరందరు కూడా ప్రొజెక్టర్ షో ప్రదర్శిస్తున్నారా? ప్రతి ఒక్కరి నయనాలే ప్రొజెక్టర్లు అయినాయి. ఈ ప్రొజెక్టర్ల ద్వారా ప్రపంచానికి ఏ చిత్రాన్ని చూపించగలుగుతున్నారు? అది సైన్స్ శక్తి యొక్క ప్రొజెక్టర్ మరియు ఇది ఈశ్వరీయ ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ శక్తిశాలిగా ఉన్నపుడే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలాగే మీ అందరి యొక్క దివ్య నేత్రాలు ఎంతెంత స్పష్టంగా ఉంటాయో అంటే ఆత్మీయతతో సంపూర్ణంగా ఉంటాయో అంతే మీ నయనాల ద్వారా చాలా చిత్రాలు చూడగలరు. చాలా స్పష్టంగా కూడా కనిపిస్తాయి. ఈ నయనాల ద్వారా బాప్ దాదా యొక్క, పూర్తి రచనల యొక్క స్థూల,సూక్ష్మ మరియు మూల లోకము, ఈ మూడు లోకముల చిత్రాలను చూపించగలరు. ఎవరైనను మీ ఎదురుగా వచ్చిన యెడల సర్వ సాక్షాత్కారములను మీ నయనాల ద్వారా చేయించగలరు. లైట్ శక్తిశాలీగా ఉన్నప్పుడు చిత్రము కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మీ లైటును చూసుకున్నారా ఎంత శక్తిశాలీగా ఉన్నదో? మీ ఆత్మ శక్తిశాలీగా ఉన్నదని ఏ ఆధారముతో పరిశీలన చేసుకోగలరు? చార్టు ద్వారా. దానిలో కూడా ఏ విషయము ద్వారా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోగలరు? ప్రకాశములో విశేషత ఏమి ఉంటుంది? ప్రకాశములో ఏ వస్తువు ఉన్నను స్పష్టంగా కనిపిస్తుంది, చీకటిలో వస్తువు కనిపించదు. లైట్ యొక్క విశేష గుణము అస్పష్టతను స్పష్టం చేయుట. ఈ విధముగా మీ లైట్ ఎంత శక్తిశాలీగా ఉన్నదో చెక్ చేసుకోవాలి. ఒకటి మీ పురుషార్థము యొక్క మార్గము స్పష్టముగా ఉంటుంది. అనగా లైన్ స్పష్టంగా కనిపిస్తుంది, రెండవ విషయము భవిష్యత్తు కూడా స్పష్టంగా కనిపిస్తుంది, మూడవది మీ ప్రకాశము శక్తిశాలీగా ఉన్న యెడల మీరు ఎవరికి సర్వీస్ చేసినను వారికి కూడా సులభంగా, స్పష్టముగా మార్గమును చూపించగలరు. అప్పుడు వారికి కూడా తమ లక్ష్యము స్పష్టంగా కనిపిస్తుంది. మరియు వారు పురుషార్థములో సహజముగా ముందుకు పోగలరు. లైట్ శక్తిశాలిగా లేనివారు స్వయం పురుషార్థములో స్పష్టంగా, సహజంగా చేయలేరు. ఇతరులకు కూడా తమ లక్ష్యమును చేరుటలో సహజమైన, స్పష్టమైన మార్గాన్ని చూపించలేరు. మార్గము స్పష్టముగా లేకుంటే వారి లైట్ యొక్క ప్రకాశం తక్కువగా ఉన్నదని అర్థము. చాలామంది అప్పుడపుడు మోసపోతూ ఉంటారు, వారి రచనలు కూడా అలాగే ఉంటారు. మీరు ఒక్కొక్కరు మాస్టర్ రచయితలు అయినారు, మాస్టర్ రచయితలు తమ రచనల కంటే కూడా తమ శక్తిని పరిశీలన చేసుకోగలరు. బీజముననుసరించే ఫలము కూడా ఉంటుంది. బీజములు శక్తిశాలిగా లేకున్న యెడల అక్కడక్కడా పుష్పాలు వస్తాయి, ఫలాలు కూడా వస్తాయి. కానీ అవి స్వీకరించుటకు యోగ్యముగా ఉండవు. సుందరమైన సుగంధము కలిగిన పుష్పాలను మరియు మంచి ఫలాలనే కొంటారు. బీజము శక్తిశాలిగా లేకున్నచో ఫలించిన రచన కూడా స్వీకరించుటకు యోగ్యముగా ఉండదు. అందువలన మీ లైట్ యొక్క ప్రకాశమును వృద్ధి చేసుకోవాలి. ప్రొజెక్టర్ ఏ విధంగా సర్వీస్ చేస్తుందో అదే విధంగా మీ నయనములు, మీ మస్తకము కూడా ప్రొజెక్టర్ వలే సర్వీస్ చేయు విధంగా ఉండాలి. ఎవరైనా మీ ఎదురుగా వచ్చినపుడు మీ నయనాల ద్వారానే వారు చిత్రములని చూడగలరు. మీ నయనములు చూసినంతనే వారి బుద్ధి యోగము ద్వారా అనేక సాక్షాత్కారములు అవుతాయి. ఇలా మీరు స్వయం సాక్షాత్కార మూర్తులు కావాలి. అయితే సదా సాక్షి స్థితిలో ఉండేవారే సాక్షాత్కార మూర్తులుగా కాగలరు. వారి నయనాలు ప్రొజెక్టర్ల వలే కార్యము చేస్తాయి, వారి మస్తకము ద్వారా ప్రకాశము కనిపిస్తుంది. హోలీ సమయములో పాటలు తయారు చేస్తారు, దేవతలను అలంకరించి మస్తకములో లైటును వెలిగిస్తారు. ఈ పాటను ఎందువలన తయారు చేసారు? ఇది ఏ సమయము యొక్క ప్రాక్టికల్ రూపము? ఈ సమయములోనిదే. తర్వాత మీ యొక్క స్మ్రుతి చిహ్నాలు తయారవుతూ వస్తాయి. ప్రతి ఒక్కరి మస్తకములో లైట్ కనిపిస్తుంది. వినాశ సమయంలో కూడా ఈ లైట్ రూపము మీకు చాలా సహాయము చేస్తుంది. ఎవరైనా,ఎలాంటి స్వభావము కలవారైనా మీ ఎదురుగా వచ్చినపుడు వారు ఈ దేహమును చూడక ప్రకాశిస్తున్న మీ లైటును చూస్తారు. చాలా ప్రకాశము ఉన్నప్పుడు చూసేవారికి ఇతర వస్తువులన్నియు స్పష్టముగా కనిపిస్తాయి. ప్రకాశము ఎక్కువ అయ్యే కొలది వారు చూస్తున్నను వారికి మీ దేహము కనిపించదు. దేహమునే చూచుట లేదంటే తమోగుణి దృష్టి మరియు స్వభావము సమాప్తమవుతాయి. అన్ని రకాలైన పరిస్థితులను దాటిపోవాలి. ఈ సంఘటనకు బాప్ దాదా ఒక తమాషా అయిన పేరును పెట్టారు, ఈరోజు వతనంలో ఈ విషయము గురించే సంభాషణ జరుగుచున్నది. తర్వాత బాప్ దాదా పెద్దవారికి హెడ్స్ అని మరియు చిన్నవారికి హ్యాండిల్స్ అని పేరు పెట్టారు. మోటారు హ్యాండిల్ లేకుండా జరగదు కదా! హ్యాండిల్ ద్వారానే మోటరుని తిప్పగలరు. హెడ్స్ కూడా హ్యాండిల్ లేకుండా సేవ చేయలేరు. ఇది హ్యాండిల్స్ యొక్క సంఘటన అయినది. మీరు హ్యాండిల్స్ లేకుండా ఏమి చేయలేరు. మీ పైన ఇంత బాధ్యత కలదు. హ్యాండిల్స్ సరిగా లేకుంటే నిర్వహణ కూడా సరిగా ఉండదు. అయితే హ్యాండిల్స్ ఎప్పుడు స్వయం హ్యాండిల్ చేయకూడదు. హెడ్స్ కు సహాయకులుగా ఉండాలి.

మీరు బాప్ దాదాకు కుడిచేయి అయినారు కదా! కుడి చేతులకి పూర్తి శక్తి ఉంటుంది. బాప్ దాదాకు కుడి భుజములుగా తయారగుటకే మీరు ఇక్కడికి వచ్చారు. ఈ సంఘటనలోని వారు మహత్వమును చూపించగలరు. సర్వీసును సఫలతా రూపంలోనికి తీసుకుని రాగలరు. సర్వీసులో సఫలతను తీసుకుని వచ్చుటకు రెండు విషయములపై గమనముంచాలి. అన్ని విషయాలలో సహాయోగులైనారు. కానీ సర్వీసులో సఫలతను తీసుకుని వచ్చుటకు విశేషముగా ఈ గ్రూప్ వారు నిమిత్తమైనారు. దీనికోరకు రెండు విషయాల పైన గమనముంచాలి. ఒకటి పూర్తి లక్ష్యము ఉండాలి, రెండవది నషా పూర్తిగా ఉండాలి. ఈ రెండు విషయాలు ఈ సమూహములో విశేషముగా ఉండాలి. లక్ష్యము గురి బాగా కలిగి ఉన్నవారు ఒక తుపాకీ గుండు ద్వారా గురి చేయగలరు. ఇలా లేనివారు మూడు నాలుగు సార్లు తుపాకి గుండ్లు ఉపయోగించవలసి వస్తుంది. మీ స్థితి బాగా ఉండి మరియు ఇతరులకి సేవ చేసే లక్ష్యము సరిగా ఉన్న యెడల నషా సదా ఏకరసంగా ఉన్నచో సర్వీసులో సఫలతను ఎక్కువగా పొందగలరు. నషా బాగా ఉన్నవారే బాగా గురి కలిగి ఉండగలరు. ప్రతి సెకండ్ మరియు ప్రతి సంకల్పము సర్వీసులోనే వినియోగించేవారే సేవాధారులు అని పిలవబడతారు. స్వయం సేవ లేక ఇతరుల సేవ అయినా కానీ సేవాధారులు ప్రతి సమయములో, ప్రతి సంకల్పంలో కూడా సేవ లేకుండా ఉండలేరు. ఆజ్ఞాకారులు అనగా ఆజ్ఞల పైననే నడిచేవారు. ముఖ్యమైన ఆజ్ఞ నిరంతరమూ స్మృతిలో ఉండండి. ఈ ఆజ్ఞపై నడవని యెడల వారిని ఏమంటారు? ఈ ఆజ్ఞను ఆచరణలోకి తీసుకుని వచ్చు కొలది ప్రత్యక్ష ఫలితము లభిస్తుంది. పురుషార్థంలో అప్పుడప్పుడు ఏ విఘ్నము కనిపిస్తుంది? సంపూర్ణంగా తయారగుటలో విఘ్నములు వస్తుంటాయి. ముఖ్యముగా వ్యర్థ సంకల్పములు విఘ్నముగా వస్తుంటాయి. వీటి నుండి తప్పించుకొనుటకు ఏమి చేయాలి? దీనికి రెండు విషయములని ధారణ చేయాలి. ఒకటి (రెస్ట్) విశ్రాంతికి అధీనులు కారాదు, రెండవది (గెస్ట్) అతిధి అని తెలుసుకోవాలి. విశ్రాంతికి దూరంగా ఉండుట వలన (వేస్ట్) వ్యర్థము కాదు. సంకల్పములను, సమయమును వ్యర్థం చేయకుండుటకు స్వయాన్ని అతిధి అని తెలుసుకోవాలి. విశ్రాంతికి అధీనులు కారాదు. సమాప్త సమయములో మీ మస్తకములో శక్తిశాలీ ప్రకాశము కలిగి ఉండాలి. శక్తిశాలీ ప్రకాశము కలిగి ఉండువారి ముందుకు మాయ రావడానికి సాహసించదు. ఇలాంటి శక్తిశాలి స్థితి కలిగి ఉండాలి. సేవాధారులుగా ఉన్నారు కానీ ఇప్పుడు శక్తిశాలిగా తయారుకావాలి. చురుగ్గా ఉండాలి. మనసా,వాచా,కర్మణా మూడింటిలో కూడా కరెక్టుగా ఉండాలి.