26.03.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహారథిల గుణాలు మరియు కర్తవ్యాలు

ఈరోజు మాట్లాడవలెనా లేక మాటల నుండి అతీతముగా వెళ్లవలెనా? మాటల నుండి అతీతముగా ఉండు స్థితి బాగుంటుందా? లేదా మాట్లాడడము బాగుంటుందా? రెండిటిలో ఏది ఎక్కువగా మంచిదనిపిస్తుంది? మాట్లాడుతూ కూడా శబ్ధాతీత స్థితి ఉంటుందా? రెండు ఒకేసారి ఉండగలవా? లేక మాట్లాడకుండా ఉన్నప్పుడు శబ్ధాతీత స్థితిలో ఉండగలుగుచున్నారా? ఎప్పుడు ఉంటుంది? ఈ స్థితిలో స్ల స్థితులగుటకు ఎంత సమయము పడుతుంది, ఇప్పుడు ఉండగలరా? కొన్ని మాసములు లేక కొన్ని సంవత్సరములు పడుతుందా? అభ్యాసము ఇప్పుడే మొదలు పెట్టగలరా? లేక కార్య వ్యవహరాలుండుటవలన చేయలేరా? మహరథులని పిలువపబడు వారికి అభ్యాసము మరియు ఆచరణ రెండు ఒకటిగానే ఉండాలి, మహారథులకు మరియు అశ్వపు స్వారీలకు ఇద్దరికీ వ్యత్యసముంటుంది, మహారధుల గుర్తు అయినది అభ్యాసము మరియు ఆచరణ ఒకేసారి ఉండుట, అశ్వక సవారీలు అభ్యాసము చేసిన తరువాత ఆచరణ చేయుదురు, కాలినడక వారు ప్రణాళికల యొక్క ఆలోచనలోనే ఉంటారు, గమనమున్నది, అభ్యాసము చేస్తామను మాట పిల్లల నోటి నుండి రాకూడదు, ఇప్పుడు ఆ స్థితి దాటిపోయినది, ఎలాంటి సంకల్పములు చేయుదుమో అలాంటి కర్మలుచేయాలి, సంకల్పంలో మరియు కర్మలలో వ్యత్యాసముండరాదు, ఇవన్నీ బాల్యచేష్టలు, సంకల్పములు చేయుట, ప్రణాళికలు తయారుచేసి తరువాత వాటిపైన నడిచే రోజులు కాదివి, ఇప్పుడు చదువు ఎంత వరకు వచ్చినది? ఇప్పుడు అంతిమ స్థితిలో ఉన్నారు, మహారధుల గుణములేమిటి, వాటి కర్తవ్యములేమిటి అని వాటిపైన గమనముంచాలి, ఈరోజు వాటిని వినిపించుటకు మరియు అంతిమ స్థితి యొక్క స్వరూపము యొక్క సాక్షాత్కారము చేయించుటకు వచ్చాము, సేవాధారీలు ఏమి చేయగలరు? ఏమైనా చేయగలరు, చెప్పగలరు ఇప్పటి నుండి ధారణ చేయుటవలనే అంతిమమూర్తులుగా తయారుకాగలరు, సాకార బాబాను చూసారుకదా, అభ్యాసము మరియు ఆచరణ సమానముగా ఉండేవా? లేక వేర్వేరుగా ఉండేవా? ఏమి ఆలోచన చేయుదురో అదే కర్త్యవ్యము చేయుచుండెడి వారు. ఇప్పుడు ఫాలో చేయుట పిల్లల కర్తవ్యమైనది, అడుగులో అడుగు వేయాలి ఆ స్థితి ఎప్పుడు వస్తుంది, మహరథుల నోటి నుండి ఎప్పుడు అను మాట రాదు, ఎప్పుడో చేయుదురా లేక ఇప్పుడే చేయుదురా? ఎప్పుడో అను శబ్ధము శోభించదు ఈ శబ్దము బలహీనమునకు చిహ్నము, ఒక రకము వారు చేసి చూపిస్తారు, రెండవ రకము వారు చేస్తాము అంటారు, చేయాలనీ ధైర్యముంటుంది కానీ విశ్వాసముండదు, విశ్వాసము గలవారి మాటలు ఈ విధముగా ఉండవు, విశ్వాసము అంటే నిశ్చయబుద్ది మనసా వాచా కర్మ ప్రతి విషయములో నిశ్చయ బుద్ధి ఉండాలి, కేవలము జ్ఞానము మరియు బాబా యొక్క పరిచయమును తెలుసుకొనుట ఇది నిశ్చయము కాదు, కానీ వారి సంకల్పములు కూడా నిశ్చయ బుద్దిగా ఉండాలి, వాచాలో నిశ్చయమనగా ఎప్పుడు ఏ మాటలో అదైర్యముండరాదు,వారినే మహారధిలు అంటారు, పరస్పరములో ప్లాన్స్ తయారు చేసారా? క్రోత ప్రపంచము యొక్క ప్రణాళికలు మరియు ఆచరణలోకి తెచ్చు ప్రణాళికలను తయారుచేసారా? క్రొత్త ప్రపంచము యొక్క ప్రణాళికలు ఆచరణలోకి వచ్చుట అనగా పాత ప్రపంచము యొక్క ప్రణాళికలు తిరిగి ఆచరణలోకి రాకూడదు, అందరు చెపుతారు కొందరు మనస్సు ద్వారా, కొందరు నోటి ద్వారా చెపుతారు, చాలా ప్రణాళికలు తయారుచేసారు ఇప్పుడు ఆచరణలోనికి తీసుకురావాలి, చేస్తాము అను సంకల్పములను సదా కాలము కొరకు సమాప్తము చేయుట మహారధుల కార్యము, అందరి దృష్టి ఇప్పుడు శ్రేష్ఠరత్నముల పైన ఉన్నది, ఇప్పుడు ఆ పాత దృష్టి, పాత భావనలు కాదు ఇప్పుడు అంతిమ నగారా మ్రోగాలి, ఈ సంఘటన సాధారణమైనది కాదు, ఈ సంఘటన మహత్వము కలది, ప్రత్యక్షముగా బాప్దాదా యొక్క మాటలే, అందరికి అనుభవము కావాలి, బాప్ దాదాయొక్క సంస్కారములు మీ అందరి సంస్కారములలో కనిపించాలి, మీ సంస్కారములన్ని సమాప్తముచేసుకొని బాప్ దాదా యొక్క సంస్కారములను నింపుకోవాలి, ఇప్పుడు ఈ సంఘటన ఈవిధముగా తయారై వెళ్లాలి, వీరు సాక్షాత్తు బాప్ దాదావలె తయారై వచ్చారు అని అందరికి సాక్షాత్కారము కావాలి, ఎలాంటి పాత సంకల్పములు, పాత సంస్కారములు రాకూడదు, ఇవి బాప్ దాదా సంస్కారములేనా అని ముందు పోల్చి చూడండి, ఒకవేళ బాప్ దాదా సంస్కారములు కానట్లు అయితే వాటిని కనీసము స్పర్శించరాదు, బుద్ధిలో సంకల్ప రూపములో కూడా స్పర్శించరాదు, పలానా కార్యము చేయరాదని నియమము ఉంచుకొన్నప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినను మీరు చేయరుకదా, పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు, కానీ లక్ష్యము మాత్రమూ చేయరాదని ఉంటుంది, మీ సంస్కారములు బాప్ దాదాయొక్క సంస్కారములు సమానముగా లేని యెడల వాటిని స్పర్శించరాదు, ఇప్పుడు దేహము మరియు దేహముయొక్క మెట్లు అధిరోహించారు, కానీ బుద్దిలో కూడా ఇప్పుడు ఈ సంస్కారములుండరాదు, సంస్కారములు ఎలా ఉంటాయో స్వరూపముకూడా అలానే ఉంటుంది, సంస్కారములు సరళముగా మధురముగా ఉన్నట్లు అయితే ఆ సంస్కారములు స్వరూపముగా వస్తాయి, బాప్ దాదా సమానముగా తయారైనచో బాప్ దాదాయొక్క స్వరూపము అందరికి కనిపిస్తుంది, బాప్ దాదా వలె అవే గుణములు, అవే కర్తవ్యములు, అవే మాటలు, అవే సంస్కారములు ఉండాలి, సుఖము వేరుగా ఉంటుంది కానీ లక్షణములు అవే ఉంటాయి, కానీ ముఖములో లక్షణములు రావాలి, అందరు స్నేహీలు, సఫలతా నక్షత్రములు, పురుషార్థి నక్షత్త్రములు అని పిల్లలందరిపైనా బాబాకి ఆశ ఉన్నది, సేవాధారి పిల్లల పురుషార్థము సఫలతాయుక్తముగా ఉంటుంది, నిమిత్తముగా పురుషార్థము చేయుదురు కానీ సఫలత ఉంటుంది, తెలిసినదా ఏమి చేయవలెనో? ఏమి ఆలోచన చేయుదురో ఏమి చెప్పుదురో అదే చేయాలి, ఆలోచన చేస్తాము, చూస్తాము అను మాటలు వింటే నవ్వు వస్తుంది. ఎందుకంటే ఇవి చిన్నపిల్లల ఆటల లాంటివి, పెద్దవారైన తరువాత కూడా చిన్నపిల్లల వలే బొమ్మలాట ఆడితే ఎలా ఉంటుంది, బాప్ దాదా నవ్వుతున్నారు పెద్దవారైనా కూడా ఎప్పుడా ఎప్పుడు అని చిన్నపిల్లల వలే ఆటలాడుటలో మునిగియున్నారు, బొమ్మలాటలు ఎలా ఉంటాయో తెలుసా? లౌకికములోని వారు పూర్తి జీవనమంతా పిల్లల కొరకు వినియోగిస్తారు, వారిని పెద్దవారిగా చేస్తారు, తరువాత స్వయంవరం చేస్తారు, ఇలాగే పిల్లలు కూడా అనేక విషయముల యొక్క సంకల్పములను రచిస్తారు, వాటిని పాలన చేయుదురు, తరువాత వాటిని పెద్దవిగా చేస్తారు మళ్లీ వాటి వలన అలసిపోతారు, అందువలన ఇది అంతయు బొమ్మలాట అయినది కదా, వారు చేసిన కార్యములను చూసి వారే ఆశ్చర్యపడతారు, ఇప్పుడు అలాంటి రచనలు రచింపరాదు, బాప్ దాదా వ్యర్థమైన రచనలుచేయరు, పిల్లలు వ్యర్థమైన రచనలు రచించి వాటి నుంచి తప్పించుకొనుటకు మరియు వాటిని సమాప్తము చేయుటకు పురుషార్థము చేయుదురు, అందువలన అలాంటి రచనలను రచించరాదు, వ్యర్థ రచనలను రచిస్తారు, ఒక సెకండులో ఎన్నో రచనలు రచిస్తారు మళ్లీ వాటిని సమాప్తము చేయుటకు ప్రయత్నము చేసి సమయమును వ్యర్థము చేసుకుంటారు, ఇలా చేయవలసిన అవసరమేమున్నది, ఇప్పుడు ఇలాంటి రచనలను నిలిపివేయాలి, వారు కూడా జన సంఖ్యను తగ్గించుటకు ప్రయత్నము చేయుచున్నారు కదా, అదే విధముగా ఇప్పుడు మీ సంకల్పములయొక్క రచనలు చాలా పెరిగి పోయినవి వాటిని కంట్రోల్ చేయాలి, పురుషార్థములో బలహీనముగా ఉండుట వలన వ్యర్థ సంకల్పములను రచిస్తున్నారు, ఇప్పుడు వీటిని పూర్తిగా సమాప్తము చేయాలి, పాత విషయములు పాత సంస్కారములు తెలియనట్టే అనుభవము కావాలి, భాష కూడా పరివర్తన కావాలి, ఈ భట్టీ ద్వారా మీ యొక్క లక్షణములలో సంపూర్ణత యొక్క ప్రకాశము కనిపించాలి. మీరు సంపూర్ణతను సమీపముగా తీసుకొని రావాలి, అప్పుడు అందరు నెంబరు వారిగా సమీపముగా తీసుకొని వస్తారు, మీరే అంతిమ సమయములో తీసుకుని వచ్చినచో ఇతరులు ఏమి చేయుదురు? సాకార బాబా సంపూర్ణత్వమును సాకారములోకి తీసుకొని వచ్చారు, సంపూర్ణత సాకార రూపములో సంపన్నముగా కనిపించేది, ఏ గుణము ద్వారా సంపూర్ణత సమీపముగా కనిపించేది? ఆ గుణముద్వారా సాకారములో ఉన్నప్పటికీ కూడా అవ్యక్తము అనుభవమవుతుండేది, ఆ గుణమేమిటి? అందరూ వినిపించారు, అన్ని విషయముల రహస్యము ఒక్కటే, దీనినే అన్నింటికీ అతీతముగా ఉండు స్థితి అంటారు, మీ దేహము నుండి కూడా అతీతముగా ఉండుట మరియు నిమిత్తముగా ఉండుట. నిమిత్తముగా ఉండేవారే ఉదాహరణమూర్తులుగా తయారుఅవుతారు. ఈ ఉదాహరణను సదా ఎదురుగా ఉంచుకోవాలి. ఒకటి బుద్ది నుండి తేలికగా, రెండవది సంస్కారముల నుండి కూడా తేలికగా ఉండాలి. నా సంస్కారములు, ఈ నాది అనుదాని నుండి కూడా దూరముగా ఉండాలి, నేను ఇలా భావిస్తున్నాను అని కాదు, బాప్ దాదా యొక్క శ్రీమతము ఇది అని తెలుసుకోవాలి, ఒకటి నేను తెలియజేస్తాను, నేను జ్ఞానీ ఆత్మను, నేను తెలివైనవాడిని, అను నేను నాది అను వాటిని సమాప్తముచేయాలి, నేను అను శబ్దము వచ్చిన చోట బాబా స్మృతి రావాలి, నాది అను శబ్దము వచ్చిన చోట శ్రీమతము స్మృతి రావాలి, నేను-నాది , నువ్వు-నీది అను ఈ నాలుగు మాటలని సమాప్తము చేయాలి, ఈ నాలుగు మాటలే సంపూర్ణత నుండి దూరము చేస్తాయి. సాకారా బాబా యొక్క ప్రతి మాటలో ఏమి విన్నారు? బాబా-బాబా అని విన్నారు, సర్వీసులో సఫలత కొరకు ఏ విషయమును మార్చుకోవాలి, ప్రతి విషయములోను బాబాను స్మృతి ఉంచుకొని చెప్పుట వలన ఎవరికైనా జ్ఞాన బాణము తగులుతుంది, బాబా-బాబా అని స్మృతి వస్తే నేను-నాది, నువ్వు-నీది అను మాటలు సమాప్తమవుతాయి, తరువాత ఏ స్థితి వస్తుంది? అన్ని విషయములు ఆచరణలోకి వస్తాయి, ప్రణాళికలన్నియు స్మృతి ఉంటాయి. ఇప్పుడు బిందురూప స్థితిని పొందుటలో శ్రమ అవుతున్నది కదా? ఎందువలన? పూర్తి దినమంతటి స్థితి ప్లాన్ అనుసారము లేకపోవుటవలన. ప్లాన్ స్మృతి లేకపోవుట వలన, అక్కడక్కడ నేను-నాది నువ్వు-నీది స్మృతి వస్తున్నది, ముందే చెప్పాను బంగారు సంకెళ్లు కూడా తక్కువైనవి కాదు, ఏ లోహముతో చేసినను సంకెళ్లు, సంకెళ్లే కదా, ఈ సంకెళ్లు కూడా తన వైపు ఆకర్షిస్తాయి, ప్రతి విషయములో స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి, బుద్ది పూర్తిగా తేలికగా, స్వచ్ఛముగా ఉండాలి, మార్గములో అవరోధములు లేకుండా స్పష్టముగా ఉన్నచో చేరుటకు ఎంత సమయము పడుతుంది? అదే మార్గములో అవరోధాలున్నయెడల చాలా సమయము పడుతుంది, ఇప్పుడు వీటిని సమాప్తము చేయాలి, ఇప్పుడు మీరు చేస్తారు, మిమ్ము చూసి అందరు చేస్తారు,నంబరువారీగా స్టేజీ పైకి చేరాలి, మీరు స్టేజి పైకి వచ్చినచో అందరు వస్తారు, మీ పైన ఇంత బాధ్యత ఉన్నది, సంకల్పములో,వాచాలో,కర్మలో సంబంధములో సర్వీసులో ఒకవేళ ఏదైనా హద్దు ఉన్నచో ఆ హద్దు బంధముగా తయారవుతుంది హద్దు లేని స్థితిలో ఉండుట వలన హద్దులేని స్వరూపములో స్థిరమవుతారు, ఇప్పుడు మలినమును సమాప్తము చేయాలి, మలినమును సమాప్తము చేయుటకే ఈ భట్టీ ఉన్నది, సంఘటన ఉన్నది అంటే ప్రత్యక్షముగా బాప్ దాదాయొక్క సంఘటన వలె ఉండాలి, ఇది మహారథుల కర్తవ్యము, ఇప్పుడు ఏమి చేయాలి? స్కాలర్షిప్ ఎవరు తీసుకుంటారు? స్కాలర్షిప్ తీసుకొనువారికి సాక్షాత్కారము ఇప్పుడు ప్రత్యక్షముగా జరుగుతుంది, బాప్ దాదా గుప్తముగా ఉన్నారు, పిల్లలే ప్రత్యక్షము కావాలి, సర్వీసు యొక్క స్టేజి పైన ఎవరు ప్రత్యక్షమవుతారు? సంపూర్ణత యొక్క ప్రత్యక్షము కూడా స్టేజీ పైకి తీసుకొని రావాలి, అంతిమము వరకు గుప్తముగా ఉంటాము అని భావించరాదు, బాప్ దాదాది గుప్తమైన పాత్ర, పిల్లలది గుప్తమైన పాత్రకాదు, ఎలాంటి సర్వీసు చేయాలో ఇప్పుడు తెలిసినదా ? సమ్మేళనములను చేసారు ఇదే చాలా? ఇంకా శ్రేష్టమైన సర్వీసు ఏది చేయాలి? ఇప్పుడు ముఖ్యమైన సర్వీసు మీ యొక్క భావనలను మరియు, దృష్టిని పరివర్తన చేసుకోవాలి. గాయనము కూడా ఉన్నది కదా, దృష్టితోనే పరివర్తన అని, దృష్టి మరియు భావనల యొక్క సర్వీసును ఇప్పుడు ఆచరణలోకి తీసుకొని రావాలి, వాచా యెక్క సాధనమేమో ఉన్నది కానీ ఎవరినైనా సంపూర్ణ స్నేహము మరియు సంబంధములోనికి తీసుకోని వచ్చుటకు మీ భావనలు మరియు దృష్టి ద్వారా సర్వీసు చేయాలి, ఈ సర్వీసు ద్వారా ఒక ప్రదేశములో కూర్చొని ఒక సెకండులోనే అనేకమందికి సేవ చేయొచ్చును, ఈ విధమైన రుజువు త్వరలో చూస్తారు, మీయొక్క భావనలు మరియు సంకల్పముల ద్వారా ఎలాంటి తమోగుణీ ఆత్మలనైనను పరివర్తనచేసి అనుభవము చేయగలరు, ప్రారంభంలో బాప్ దాదా యొక్క సాక్షాత్కారము ఇంటిలో కూర్చొని ఉండగానే అవుతుండేది కదా, ఇలాగే దూరముగా కూర్చొన్ననూ మీయొక్క పవిత్ర సంకల్పములు ఎంతో గొప్ప కార్యములను చేయగలరు, ఎలాంటి నాస్తికులు, తమోగుణిలైనను పరివర్తనవుతారు , ఈ సేవ ఇప్పుడు చేయాలి, మీ యొక్క సంకల్పములు మరియు మాటలలో స్వచ్ఛత ఉన్నపుడే ఇలాంటి సేవలో సఫలత ఉంటుంది, ప్రతి ఒక్కరు తమ బాధ్యతలలో ఉన్నప్పటికీ యజ్ఞము యొక్క బాధ్యత కూడా తమ బాధ్యతగా భావించాలి, స్వయమే రావాలి,మాటలలో,సంకల్పములలో, మరియు దృష్టిలో శక్తి ఉండాలి, ఈ శక్తి ద్వారా సంస్కారములను కుడా చాలా తక్కువ సమయములోనే పరివర్తన చేయగలరు, మాటలు, సంకల్పములు మరియు దృష్టి సమానముగా లేకున్న సఫలత ఉండదు, చాలా ముఖ్యమైన సేవ ఇది, ఇప్పుడు హద్దులేని సేవద్వారా హద్దులేని ఆత్మలను ఆకర్షించాలి, ఇప్పుడు మీరు హద్దులేని సుఖమునివ్వాలి అప్పుడే విశ్వములోని వారంతా మిమ్ము సుఖదాతగా స్వీకరిస్తారు, విశ్వమహారాజును విశ్వదాత అని కూడా చెప్పుదురు, మీరు అందరికీ సుఖమిచ్చినప్పుడే మిమ్ము సుఖదాత అని స్వీకరిస్తారు, అనేకమందికి ఒక నిమిషములోనే సేవ చేయవచ్చును, ఏ విషయములోననైనను చింతించుట వలనే ఫెయిల్ కావడానికి గుర్తు, ఎవరి సంస్కారముల వలన కాని,సంపర్కముల వలన కాని, ఏదైనా సేవలో కాని చింతించారు అంటే ఫెయిల్ అయినట్టే. పదే-పదే ఫెయిల్ అయితే అంతిమములో ఫెయిల్ అయినవారి లిస్టులో వస్తారు, అందువలన పూర్తిగా కల్మషము లేని వారుగా తయారుకావాలి, అప్పుడే ఫుల్ పాస్ అని భావించవచ్చును, ఏదైనా కల్మషమున్నచో ఫుల్ పాస్ కాలేరు . అచ్చా ఓంశాంతి.