05.04.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వ పాయింట్ల యొక్క సారము పాయింట్(బిందువు)గా అవ్వండి

అందరూ వినాలని కోరుకుంటున్నారా లేదా సంపూర్ణంగా తయారుకావాలని కోరుకుంటున్నారా? ముందు వినుట తర్వాత సంపూర్ణంగా తయారగుట. ఇన్ని పాయింట్లు విన్నారు. ఈ అన్ని పాయింట్ల యొక్క స్వరూపులుగా కావాలి. ఈ పాయింట్ల అన్నింటి యొక్క స్వరూపం ఏమిటి? ఎలా తయారు కావాలనుకుంటున్నారు? పాయింట్ల అన్నింటి యొక్క సారము లేక స్వరూపము పాయింట్(బిందువు)గానే తయారుకావాలి. సారము కూడా పాయింట్(బిందువు)లోనే వస్తుంది. ఇప్పుడు పాయింట్ స్వరూపులుగా తయారుకావాలి. పాయింట్(బిందువు) చాలా చిన్నదిగా ఉంటుంది. దీనిలోనే అన్ని ఇమిడి ఉంటాయి. ఈ సమయములో ముఖ్యమైన పురుషార్థము ఏమి జరుగుచున్నది? ఇప్పుడు విస్తారమును సారములో తీసుకువచ్చు పురుషార్థము జరుగుచున్నది. విస్తారమును సమాప్తము చేసుకుని సార రూపంలో తీసుకుని వచ్చేవారు బాబా సమానముగా తయారవుతారు. మొదటనే చెప్పాను కదా ఇముడ్చుకొనవలెను మరియు సమీకరణ(సర్దుకొనుట) చేసుకొనవలెను. సమీకరణ చేసుకునేవారికి ఇముడ్చుకొనుట కూడా వస్తుంది. బీజములో ఏ శక్తి ఉన్నది? వృక్షము యొక్క విస్తారమును తనలో ఇముడ్చుకొను శక్తి బీజముకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలాంటి పురుషార్థము చేయాలి? బీజరూప స్థితిలో స్థితులగుట అంటే విస్తారమును సార రూపంలో తీసుకునివచ్చుట కూడా సులభమేనా? ఇప్పుడు సైన్సువారు కూడా విస్తారమును సార రూపంలో తీసుకునివచ్చుటకు శ్రమ పడుచున్నారు. సైన్సుశక్తి కలవారు కూడా మీ యొక్క సైలెన్స్ శక్తిని చూసి చేయుచున్నారు. ఇప్పుడు చేయవలసిన ముఖ్య పురుషార్థము మీరు అన్ని విషయాలలో బాబాకు సమీపంగా రావాలి. శబ్దంలో రావడం ఎంత సహజమో శబ్దమునకు అతీతంగా పోవడం కూడా అంటే సహజంగా ఉన్నదా? ఈవిధంగా ఉండుటయే సంపూర్ణ స్థితి యొక్క సమీపత అంటారు. ఈ సమూహంలో ఉండు ప్రతి ఒక్కరికి వారి వారి విశేషత ఉన్నది. విశేషతలు ఉండు కారణంగా విశేషాత్మలుగా తయారైనారు. అయితే ఇప్పుడు ఏవిధంగా తయారుకావాలి. ఇప్పుడు శ్రేష్టంగా తయారుకావాలి. శ్రేష్టంగా తయారగుటకు బట్టీలో ఏమి చేయుదురు? ఈ సమూహంలో ఒక విశేషత ఉన్నది. ఆ విశేషత ఏమిటి? మీ విశేషతను తెలుసుకున్నారా? ఈ సమూహంలోని వారు పరస్పరంలో సమీపంగా ఉన్నారు. ప్రతి ఒక్కరి మనసులో ఏదైనా చేసి చూపించాలని ఉమంగం ఉన్నది. అందువలనే బాప్ దాదా ఈ సమూహానికి విశేషమైన సమూహం అని పేరు పెట్టారు. ఈ సమూహమే సృష్టి ముందు తమ అసలైన రూపమును ప్రత్యక్షము చేసి చూపించగలదు. ఇది మైదానంలో నిలబడి ఉన్నటువంటి సేవ అయినది. మీరు బాప్ దాదా యొక్క కర్తవ్యమును చేయునట్టి భుజములు. భుజాలలో ఏ ఏ అలంకారం ఉంటుందో తెలుసా? బాప్ దాదాకు భుజములు అలంకారం. భుజములైన మేము ఏ అలంకారమును ధారణ చేసుకుంటున్నాము? ఏ ఏ అలకంకారాలని ధరించి మైదానంలో హాజరుగా ఉన్నామని మిమ్మల్ని మీరు ప్రశ్నిచుకోండి? సర్వ అలంకారములు గురించి తెలుసుకున్నారు కదా? అయితే అలంకధారులైన భుజములుగా తయారైనారు కదా? అలంకధారులైన భుజములే బాప్ దాదాకు శృంగారము. శక్తుల యొక్క భుజాలు ఎప్పుడు ఖాళీగా చూపించరు. అయితే బాప్ దాదా ఈరోజు ఏమి చూస్తున్నారు? ఒక్కొక్క భుజానికి అలంకారం యొక్క పద్దతిని చూస్తున్నారు. శక్తుల యొక్క ముఖ్యమైన గుణం ఏమిటి? ఈ సమూహంలో శక్తుల యొక్క మొదటి గుణము నిర్భయత. రెండవది విస్తారమును ఒక్క సెకండ్ సమాప్తం చేయు శక్తి. విస్తారమును ఒక్క సెకండ్లో ఇముడ్చుకును యుక్తి ఉండాలి. ఏకత(ఐక్యత) మరియు ఏకరసము. అనేక సంస్కారాలను ఒక శ్రేష్ఠ సంస్కారంగా ఎలా తయారుచేసుకోవాలి? ఇది కూడా ఈ భట్టిలో నేర్చుకోవాలి. తక్కువగా మాట్లాడాలి. మరియు తక్కువ సమయంలో ఎక్కువ ఫలితమును సాధించాలి. ఈ పద్దతిని ఇప్పుడు నేర్చుకోవాలి. వినడము మరియు వెంటనే దాని యొక్క స్వరూపముగా తయారు కావడం తక్కువగా ఉండరాదు. వింటూ వెంటనే దాని స్వరూపులుగా తయారవుతూ వెళ్ళాలి. ఇప్పుడు సాక్షాత్కార మూర్తులుగా తయారుకావాలి. వాచా మూర్తులుగా తయారు కారాదు. మీరు అందరికి ఆకారి మరియు అలంకారీలుగా కనిపించాలి. జ్ఞానము చాలా ఉన్నది. కానీ ఇప్పుడు జ్ఞానము యొక్క సారాంశంలో ఉండాలి. అప్పుడే బాప్ దాదా యొక్క ఆశలను ప్రత్యక్షం చేయగలరు. సారమును తెలుసుకున్నారు కదా! జ్ఞానము యొక్క ప్రధాన విషయాలే సారాంశము. ఈ విషయాలను ధారణ చేసినచో అన్ని అవసరములు పూర్తవుతాయి. ఇప్పుడు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ విషయాలను పూర్తి చేసుకొనుటకు రెండు విషయములు అవసరము. ఆకారి మరియు అలంకారిగా తయారగుట. దీని కొరకు రెండు విషయాలను ధారణ చేయాలి. ఒక శబ్దంలోనే ఆకారి మరియు అలంకారి రెండూ వస్తాయి. లైట్ అంటే ప్రకాశము మరియు తేలిక అని రెండు అర్థాలు వస్తాయి. జ్యోతి స్వరూపము మరియు జ్వాలా స్వరూపము రెండు కర్తవ్యాలు వస్తాయి. మనలో దృఢత లేకున్నా యోగం కష్టంగా అనిపిస్తుంది. ఏ బాటసారి అయినా తమ గమ్యము చేరుటకు ధృఢసంకల్పము ఉన్న యెడల వారిని ఎవ్వరు ఆపలేరు. ఇది యదార్థము. ఒకవేళ యోగి ఏదైనా లక్ష్యము ఉంచుకున్నచో నిరంతరము యోగములో ఉండుటలో వారిని ఏ విఘ్నములు ఆపలేవు. అందువలననే తీవ్రపురుషార్థులు ప్రతి దినము యొక్క యోగ లక్ష్యమును నిర్ధారణ చేసుకోవాలి.

యోగము చేయుట సహజంగా ఉండుటకు ప్రతి దినము కొంత సమయము ఏకాంతముగా శుద్ధమైన వాతావరణములో మననము చేయాలి. దీనివలన స్వ ఉన్నతి, విశ్వ సేవలో ఉత్సాహము ఇచ్చునట్టి ఆలోచనలు మీ మనసును తప్పకుండా ప్రభావితము చేస్తాయి. ప్రశాంత వాతావరణములో ఏకాంతముగా ఉంటూ శివబాబాతో ఆత్మిక సంభాషణ చేయుట వలన లభించిన ఆనందము లేక ఈశ్వరీయ సుఖము యోగము చేయూతను సహజముగా చేయును. అంతిమంలో మన జీవనము సంతుష్టంగా ఉండుటకు ఇప్పటినుండి కఠిన పురుషార్థము చేయాలి. యోగము ద్వారా తరగని ఖజానాలను ప్రాప్తి చేసుకొనుటకు జీవనంలో అలసట, సోమరితనమును త్యాగము చేయాలి. పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే మనకు శివబాబాతో మిలనము జరుగుతుంది. ఇప్పుడు కూడా సదా బాబాతో ఉండు అనుభవము చేయని యెడల సంపూర్ణ సుఖము యొక్క అనుభూతిని ఎప్పుడు చేస్తారు? సమయమును ఎప్పుడు కూడా వ్యర్థము చేయరాదు. దీని వలన పురుషార్థములో తీవ్రత ఉండదు. మన లక్ష్యము మరియు లక్షణాలలో వ్యత్యాసము ఏర్పడుతుంది. దీని వలన యోగము చేయుటలో కష్టము అనిపిస్తుంది.