14.05.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సమర్పణ యొక్క గుహ్య అర్థము

ఈరోజు వతనము నుండి ఒక బహుమతి తెచ్చాము. ఏ బహుమానము తెచ్చామో తెలుసా? అవ్యక్త రూపములో బహుమానము కూడా అవ్యక్తముగానే ఉంటుంది కదా, ఈరోజు వతనము నుండి దర్పణము(అద్దము) తెచ్చాము. దర్పణమును ఎందువలన తెచ్చాము? మీరందరు ఏ కార్యక్రమము కొరకు వచ్చారు? సమర్పణ చేయుటకు వచ్చారా? లేక సంపూర్ణంగా తయారగుటకు వచ్చారా? వతనము నుండి దర్పణము తెచ్చాము అందరి యొక్క సమర్పణ ముఖమును చూచుటకు మరియు చూపించుటకు. సమర్పణ అయ్యారా? లేక సర్వస్వము సమర్పణ అయిపోయారా? మేము సమర్పణ అయిపోయామని ఈ సభలో ఎవరు భావిస్తున్నారు? సమర్పణ అయినారని ఎవరిని అంటారు? దేహాభిమానమునకు సమర్పణ అయినారా లేక దేహాభిమానమును సంపూర్ణంగా సమర్పణ చేసారా? అయినారా లేదా చెప్పండి. స్వభావాలను సమర్పణ చేసారా? సమర్పణ చేయుటకు పురుషార్థము చేయుచున్నారు. స్వభావాలను సమర్పణా సమారోహము ఎప్పుడు చేస్తారు? మీరు సమర్పణా సమారోహము చేయుటకు వచ్చారు. కానీ బాప్ దాదా ఆ సమర్పణ సమారోహణము చేయాలని కోరుకుంటున్నారు. అది ఎప్పుడు చేస్తారు? అందువలననే దర్పణము తీసుకుని వచ్చాను. దీనిలో మూడు విషయాలను చూచుచున్నారు. ఒకటి స్వభావాల సమర్పణ, రెండవది దేహాభిమానమును సమర్పణ చేయుట, మూడవది సంబంధములను సమర్పణ చేయుట. దేహము అనగా కర్మేద్రియముల ఆకర్షణను సమర్పణ చేయుట. స్వభావాల యొక్క సమర్పణ సమారోహణమును ఆచరించినప్పుడు సంపూర్ణ మూర్తి యొక్క సాక్షాత్కారము అవుతుంది. వరకట్నము ఏమి లభించినది? మీ యొక్క సౌభాగ్యమును స్థిరంగా ఉంచుకున్నచో అదృష్టము కూడా స్థిరముగా ఉంటుంది. ఎవరు ఎంత సౌభాగ్యముగా ఉంటారో వారు అంత శ్రేష్ఠ అదృష్టవంతులుగా తయారవుతారు. సౌభాగ్యవతికి చిహ్నము బిందువు, సౌభాగ్యవంతులుగా ఉండువారికి బిందు రూప స్మృతి సదా స్థిరంగా ఉంటుంది. ఈ బిందు రూపము సదా జతలో ఉన్నవారే సదా కుంకుమవతులుగా ఉంటారు. సదా మీ యొక్క సౌభాగ్యమును స్థిరంగా, అవినాశిగా ఉంచుకొనుటకు నాలుగు విషయాలను స్మృతిలో ఉంచుకోవాలి. అవి ఏమిటి? నాలుగు విషయాలలో ఏదో ఒకటి చెప్పండి. స్థూల వరకట్నమును తయారు చేసుకుని వచ్చారు కదా! ఇక్కడ ఎలాంటి పురుషార్థము యొక్క వరకట్నము కావాలి? నాలుగు విషయాలు ఏమిటి? ఒకటి సదా జీవన ఉద్దేశ్యము అనగా జీవనము యొక్క ఉద్దేశ్యమును ఎదురుగా ఉంచుకుని తీవ్ర పురుషార్థము చేయాలి. బాప్ దాదా యొక్క ఆదేశమును స్మృతిలో ఉంచుకుని పురుషార్థము చేయుట ద్వారా సఫలత లభిస్తుంది. అందరికి సందేశమునివ్వాలి. దీనినే సర్వీసు అంటారు. ఇప్పుడు ఏది స్మృతిలో ఉంచుకోవాలి? స్వదేశమనగా ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్లే సమయము. సమయము సమీపంగా వచ్చినది. ఈ నాలుగు విషయాలలో ఏ ఒక్క విషయం తక్కువగా ఉన్నా వారిని బలహీన పురుషార్థులు అని అంటారు. లోపాలను సరి చేసుకొనుటకు ఈ నాలుగు విషయాలను స్మృతిలో ముందు ఉంచుకోవాలి. బాప్ దాదా ఈరోజు పిల్లలకు కొత్త టైటిల్స్ ఇస్తున్నారు. చట్టమును తయారు చేయువారు అని, లోకములో శాంతి స్థాపన చేయువారని టైటిల్స్ ఇస్తుంటారు. కానీ బాప్ దాదా ఈరోజు పిల్లలకు చట్టమును తయారు చేయువారు అని టైటిల్ ఇస్తున్నారు, సత్యయుగములో ఉండే నియమాలను తయారు చేయువారము అని స్మృతిలో ఉంచుకున్న యెడల ప్రతి అడుగు అలోచించి , తెలుసుకుని వేయుదురు. మీరు వేసే ప్రతి అడుగు నియమము తయారవవుతుంది. న్యాయవాది లేదా ప్రధాన న్యాయమూర్తి ఏ నిర్ణయమును నిర్ణయిస్తారో అదే నియమంగా తయారవుతుంది. ఇక్కడ కూడా అందరు న్యాయవాదులే కూర్చుని ఉన్నారు. మీరు సంకల్పాలు ఎలా చేస్తారో, ఎలా అడుగు వేస్తారో మిమ్మల్ని చూసి విశ్వమంతా అనుసరిస్తుంది. మీ ప్రజలు మిమ్మల్ని అనుసరిస్తారు కదా! కావున స్వయాన్ని నియమాలు తయారు చేయు ఆత్మను అని తెలుసుకుని ప్రతి కర్మ చేయండి. దీనిలో కూడా నంబరు తయారవుతుంది. అందరు నియమాలు, చట్టాలు తయారుచేసేవారే. ఈరోజు బాప్ దాదా ఈ సభను చూసి హర్షితమవుతున్నారు. ఎంతోమంది చట్టములను తయారు చేయువారు కలిసి ఉన్నారు. ఇలా స్వయాన్ని చట్టాన్ని తయారు చేయువారమని భావిస్తున్నారా? ఇంత గొప్ప బాధ్యతను తెలుసుకుని ప్రవర్తించుట వలన చిన్న విషయాలు స్వతహాగానే సమాప్తమవుతాయి. స్లోగన్ కూడా ఉన్నది,నేను ఎలాంటి కర్మలు చేస్తానో నన్ను చూసి అందరు చేస్తారు. ఈ స్లోగన్ సదా స్మృతిలో ఉంచుకున్నచో ప్రతి కార్యమును సఫలం చేయగలరు. స్వయాన్ని ఒంటరిగా భావించరాదు. మీ ప్రతి ఒక్కరి వెనక మీ రాజధాని ఉన్నది. వారు కూడా మిమ్మల్ని చూస్తున్నారు. ఇలా చేసిన యెడల అందరి యొక్క స్వభావాలు మరియు సంస్కారాల సమారోహాణము త్వరగా అవుతుంది. ఇప్పుడు ఈ సమారోహాణమును స్టేజీపై తీసుకుని వచ్చుటకు త్వరత్వరగా చేయాలి. మంచిది. ఇద్దరు కుమారీల సమర్పణ సమారోహాణము -- ఈరోజు ఏ కార్యమును వినిపించారు? సత్యయుగములో తల్లిదండ్రులు రాజ్య సింహాసనంపై కూర్చోబెడతారు. సంగమ యుగములో ఎలాంటి రాజ్య తిలకము లభిస్తుంది? తెలుసా? సంగమయుగ తిలకము అలంకరించుకున్నారా? లేదా ఇంకా తిలకమును అలంకరింప చేసుకొనవలెనా? సంగమ యుగములో సర్వీసు యొక్క బాధ్యతా కిరీటము ఉన్నది. సంగమ యుగములో ఎలాంటి సింహాసనం ఉన్నది? సంగమ యుగములో సింహాసనాధికారులుగా అయిన తర్వాత సత్యయుగ సింహాసనాధికారులుగా తయారవుతారు. ఇప్పుడు సర్వ ఆభరణములను అలంకరణ చేసుకున్నారా? లేక అది కూడా అలంకరణ చేసుకొనుచున్నారా? సంగమ యుగము నుండే ఈ ఆచారము ప్రారంభమైనది. ఎందుకంటే సంగమ యుగము సర్వ విషయములకు బీజము వేయు సమయము. బీజరూపము ద్వారా అన్ని విషయాలకు బీజము పడుతుంది. ఆ బీజముతో పాటు మీరందరు బీజము వేయడానికి సహయోగము చేయాలి. ఈరోజు ఉత్సవము సాధారణమైనది కాదు వినిపించాను కదా! మీరందరు చట్టములను తయారుచేయువారు అయినారు. ఈ దినము ఆచారములకు బీజము వేయు దినము. ఎంతో గొప్ప కార్యము చేయుటకు నిమిత్తమైనారు. విశ్వ పరివర్తన ఎంత సమయములో పరివర్తన చేయుదురు? ఎంత సమయములో పరివర్తన చేయుదురు? ఎవర్ రెడీగా ఉన్నారా? ఈరోజు అందరు స్వయాన్ని ఏ రూపములో అనుభవం చేయుచున్నారు? ఏ రూపములో కూర్చుని ఉన్నారు? దినమును అనుసరించి రూపం ఉంటుంది కదా? ఈ సంగమయుగీ సభ సత్యయుగీ రాజ్యసభ కంటే ఉన్నతమైనది. ఈరోజు అందరు తమ సర్వ అలంకరణలు చేసుకుని ఉన్నారా? లేక కేవలం ఈ ఇద్దరు కుమారీలనే చూస్తున్నారా? మీ యొక్క ఒక్కొక్కరి సంగమయుగీ అలంకరణ సత్యయుగీ అలంకరణ కంటే శ్రేష్ఠమైనది. బాప్ దాదా అలంకరింపబడి ఉన్న మూర్తులను అందరిని చూస్తున్నారు. సత్యయుగీ కిరీటము ఈ సంగమయుగీ కిరీటము ముందు విలువ లేనిదే. సంగమయుగీ కిరీటమును ధరించి ఉన్నారు కదా! సంగమయుగీ కిరీటమును మరియు సింహాసనమును సదా స్థిరంగా ఉంచుకొనుటకు ఏ ప్రయత్నము చేయాలి? దీని కొరకు మూడు విషయాలు స్మృతిలో ఉంచుకోవాలి. స్వయంవరము లేదా పట్టాభిషేకము జరిగే సమయంలో ఆచారాలన్నియు ఏదో ఒక రూపములో ఈ సంగమ యుగములో ఉంటాయి. ఈనాటి ప్రపంచంలో ఏ ఆచారం ఉన్నదో తెలుసా? ఎన్ని రకాల ఆచారాలు ఉన్నాయి? ఒకటి బ్రాహ్మణుల ద్వారా, రెండవది కోర్టు ద్వారా మూడవది మందిరము మరియు గురువుల ద్వారా. ఏదో రూపములో ఆచారాలకు లేదా నియమాలకు బీజము పడుతుంది. ఈ మధువనము కూడా మందిరము లేదా చైతన్య మందిరము. ఈ మందిరము మధ్యలో ఆత్మ మరియు పరమాత్మ మిలనం జరుగుతుంది. కోర్టు యొక్క నియమాలు కూడా ఇక్కడి నుండే ప్రారంభమవుతున్నాయి. మీరు నియమాలు లేక చట్టాలు తయారు చేయువారు అయినారు. వారి ముందు ప్రతిజ్ఞలు చేయుచున్నారు అంటే ఇది కోర్టు కూడా అయినది. మూడు రకాలైన నియమాలు సంగమ యుగములో అలౌకిక రూపంలో జరుగుతాయి. దీని స్మృతి చిహ్నముగా స్థూల రూపములో జరుగుతున్నాయి. మంచిది స్మృతిలో ఉంచుకోవాల్సిన మూడు విషయాలు ఏమిటి? ఒకటి స్వయాన్ని ఉపకారి అని తెలుసుకుని నడుచుకోవాలి. రెండవది నిరహంకారి మరియు మూడవది అధికారి. అధికారమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి. మరియు నిరహంకార గుణమును కూడా ముందుంచుకొవాలి. ఉపకారము చేయు కర్తవ్యమును కూడా ఎదురుగా ఉంచుకోవాలి. ఈ మూడు విషయములను సదా స్మృతిలో ఉంచుకోవాలి. ఎవరు ఎంత అపకారులైనను మీ దృష్టి మరియు వృత్తి ఉపకారముగా ఉండాలి. అధికారులము అని తెలుసుకుని నడుచుకొనుటతో పాటు నిరహంకారులుగా కూడా ఉండాలి. అప్పుడే కిరీటము మరియు సింహాసనము స్థిరంగా ఉంటాయి. తెలిసిందా! మంచిది