21.05.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


భిన్నతని తొలగించే యుక్తి.

ఈరోజు ప్రతి పిల్లవానిలో రెండు విషయాలను చూస్తున్నారు. ఆ రెండు విషయాలు ఏమిటి? బాప్ దాదా చూస్తున్నది కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి స్థితి రానున్నది - ఎలా అయితే మాట ద్వారా విషయాన్ని సహజంగా తెలుసుకుంటారో అలాగే ఇతరుల సంకల్పాన్ని కూడా తెలుసుకోగలరు. మాస్టర్ సర్వజ్ఞులు అనే డిగ్రీ కూడా యోగ్యత అనుసరించి తప్పకుండా లభిస్తుంది. అయితే ఈరోజు ఏమి చూస్తున్నారు? ప్రతి ఒక్కరి పురుషార్థానికి ఎంత అవకాశం ఉంది అని చూస్తున్నారు. మరియు ప్రతి ఒక్కరి శక్తిని చూస్తున్నారు. ఎంత అవకాశం ఉంది మరియు ఎంత శక్తి ఉంది అనేది చూస్తున్నారు. ఈ రెండింటికి పరస్పరం సంబంధం ఉంది. ఎంత శక్తి ఉంటే అంత అవకాశం ఉంటుంది. కనుక శక్తి మరియు అవకాశం రెండింటిని ప్రతి పురుషార్థీలో చూస్తున్నారు. కొంతమంది చాలా సమీపానికి చేరుకున్నారు. కొంతమంది గమ్యానికి చాలా దూరంగా కనిపిస్తున్నారు. కనుక రకరకాల పురుషార్థీల రకరకాల స్థితులను చూసి ఏమి ఆలోచించి ఉంటారు? భిన్నతని చూసి ఏమి ఆలోచించారు? బాప్ దాదా ఙ్ఞానసాగరులుగా చేసే చదువు చదివిస్తున్నారు. ప్రత్యక్షంలో భగవంతునికి సాకార సంబంధంలో ఎంత సమీపంగా వస్తారో అంత పురుషార్థంలో కూడా సమీపంగా వస్తారు. మీ పురుషార్ధం మరియు ఇతరుల పురుషార్థం చూసి ఏమి ఆలోచిస్తున్నారు? బీజం అయితే అవినాశి. అవినాశి బీజానికి సాంగత్యం అనే నీరు పోయాలి. అప్పుడు ఫలం వస్తుంది. కనుక ఇప్పుడు ఫల స్వరూపం చూపించాలి. వృక్షం యొక్క ఫలం కోసమే శ్రమిస్తారు కదా! జ్ఞానం యొక్క పాలన ఏదైతే పొందాలో దానికి ఫలితంగా ఫలస్వరూపంగా అవ్యాలి. ఈ భిన్నత ఏదైతే ఉందో అది ఎలా తొలగిపోతుంది? భిన్నతని తొలగించుకొనే సహజ ఉపాయం ఏమిటి? ఇప్పుడు ఉన్న భిన్నత అంతిమం వరకు ఉంటుందా లేక తేడా వస్తుందా? సంపూర్ణ స్థితి యొక్క ప్రాప్తి తర్వాత ఇప్పుడు పురుషార్థం యొక్క జీవితం భిన్నంగా ఉంటుంది. ఈ రోజులలో ఏదైతే భిన్నత ఉందో దానిని ఏకతలోకి తీసుకురావాలి. ఏకత కొరకు వర్తమానం యొక్క భిన్నతని తొలగించాల్సిందే. బాప్ దాదా ఈ భిన్నతని చూస్తూ కూడా ఏకతనే చూస్తున్నారు. ఏకత కొరకు రెండు విషయాలు అవసరం. 1. ఒకే పేరుని ప్రత్యక్షం చేయాలి (ఏకనామి). సదా ప్రతి విషయంలో ఒకని పేరునే ప్రసిద్ధి చేయాలి మరియు 2. (ఎకానమి) పొదుపు చేసేవారిగా అవ్వాలి. పొదుపు అంటే ఏమిటి? సంకల్పాల పొదుపు కూడా ఉండాలి. సమయం మరియు జ్ఞాన ఖజానాని కూడా పొదుపు చేసుకోవాలి. అన్ని రకాల పొదుపు నేర్చుకున్న వారు ఎలా అవుతారు? నేను అనే భావం యొక్క భిన్నత అంతా ఒకే బాబాలో ఇమిడిపోతుంది. ఒకరిలో ఇమిడే శక్తి ఉండాలి. అర్థమైందా! ఈ పురుషార్థం ఒకవేళ తక్కువగా ఉంటే ఎక్కువ చేయాలి. ఏ కార్యం జరుగుతున్నా దానిలో నేను అనే భావం ఉండకూడదు. ఒకే పేరు ఉండాలి. అప్పుడు ఏమౌతుంది? బాబా, బాబా అనటం ద్వారా మాయ పారిపోతుంది. నేను, నేను అనటం ద్వారా మాయ దెబ్బ తీస్తుంది. అందువలనే ప్రతి విషయంలో భాషను మార్చుకోండి అని ఇంతకు ముందే చెప్పాను. బాబా, బాబా అనే ఢాలు సదా మీ వెంట ఉంచుకోండి. ఈ ఢాలు ద్వారా ఏ విఘ్నం అయినా సమాప్తి అయిపోతుంది. వెనువెంట పొదుపు చేయటం ద్వారా వ్యర్థ సంకల్పాలు నడవవు మరియు వ్యర్థ సంకల్పాల గొడవ ఉండదు. ఇదే స్పష్టీకరణ. వెళ్ళిపోయే వారు అందరూ ఏమి చేసి వెళ్లారు? ఎవరైనా ఎక్కడ నుంచి అయినా వెళ్తున్నప్పుడు అక్కడ వారికి తమ స్మృతి చిహ్నంగా ఏదోకటి ఇచ్చి వెళ్తారు కదా! కనుక వెళ్ళే వారందరు తమ స్మృతి చిహ్నాలను ఇచ్చి వెళ్ళాలి. స్మృతి సరళంగా ఎవరికి ఉంటుందో తెలుసా? ఎవరు ఎంత సరళంగా ఉంటారో అంత వారికి సరళ స్మృతి ఉంటుంది. మీలో సరళత తక్కువగా ఉన్న కారణంగా స్మృతి కూడా సరళంగా ఉండటం లేదు. సరళచిత్తగా ఎవరు ఉండగలరు? ఎంత ప్రతి విషయంలో ఎవరైతే స్పష్టంగా ఉంటారో అంటే స్వచ్ఛంగా ఉంటారో వారు అంత సరళంగా ఉంటారు. ఎంత సరళంగా ఉంటారో స్మృతి కూడా అంత సరళంగానే ఉంటుంది. మరియు ఇతరులని కూడా సరళ పురుషార్ధిగా చేయగలరు. ఎవరు ఎలా ఉంటారో వారి రచనలో కూడా అవే సంస్కారాలు ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు విశేష స్మృతిచిహ్నం ఇచ్చి వెళ్ళాలి.