28.05.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


 హైజంప్ చేసేదాని కొరకు తేలికగా అవ్వండి

ఇది ఏ సమర్పణ అయినది , సమర్పణ సమారోహణము కాదు కదా, ఈ సమారోహణము యొక్క పేరేమిటి? ఇది వీరి జీవనమును నిర్ణయించుకోవలసిన సమారోహణము, నిర్ణయము చేసుకున్నారా? లేదా? నిర్ణయించుకున్న తరువాతనే సంపూర్ణమయ్యే సమారోహణము జరుగుతుంది, అంగీకారము చేసుకొనుటకు అందరూ వచ్చారు కదా! జీవనమును నిర్ణయించుకొనుటకు వచ్చారు కదా! బాప్ దాదా కూడా ప్రతి ఒక్కరి సాహసమును చూస్తున్నారు, సాహసము చేయువారు చాలా విషయములను ఎదుర్కోవలసి ఉంటుంది, సాహసము చేయుట మొదలు పెట్టినప్పటి నుండి మాయను ఎదుర్కొనుట ప్రారంభమవుతుంది , అందువలన ఎదుర్కొనుటకు ముందు నుండే మీలో దైర్యముండాలి. మీరందరూ ఎదుర్కొనుటకు తయారుగా ఉన్నారా? ఎలాంటి పరీక్షలు కానీ, పరిస్థితులు కానీ వచ్చినప్పుడు వాటిని దాటుటకు హైజంప్ చేయు అభ్యాసమున్నచో ఏ పరిస్థితినైనా దాటి వెళ్ళగలరు , మీరందరూ సాహసము చేయుటలో నంబర్ వన్ లో ఉన్నారు, హైజంప్ అని దేనిని అంటారు? వారి ముఖ్య లక్షణము ఏమిటి ? వారికి మనస్సు లోపల, బయట తేలికదనము అనుభవము అవుతుంది, వెలుపల అందరి సంబంధములోనికి రావలసి ఉంటుంది, పరస్పరములో సంబంధములోనికి వచ్చిన సమయములో లోపల మరియు వెలుపల కూడా తేలికగా ఉండాలి, తేలికగా ఉన్నచో హైజంప్ చేయగలరు, ఈ సమూహము తేలికగా తయారుకావాలి, ఎక్కడికి వెళ్ళినను కలసి మెలసి ఉండాలి, ఇంతమంది కుమారీలు సమర్పణ అయినచో ఏమవుతుంది? ఈ భట్టి నుండి ఎలా తయారై వెళ్ళాలి? ఎవరు ఎలా ఉన్నను, ఎక్కడికి వెళ్ళినను, ఎలాంటి పరిస్థితినైనను ఎదుర్కోవాలి, ఎందుకంటే సమస్యలను తొలగించువారుగా తయారై వెళ్ళాలి, స్వయం సమస్యగా తయారుకారాదు, సమస్యలను సమాప్తి చేయువారుగా తయారుకావాలి, బాప్ దాదా ఈ సమూహమునకు ఏమి పేరు పెట్టలేదు. కర్మ చేయుటకు ముందు పేరు పెడతారు, పేరును అనుసరించి కర్మలు చేసి చూపించాలి, ఇంత విశ్వాసమున్నది కదా, ఈ సమూహము చాలా ప్రియమైనది, విశ్వాసపాత్రమైనది, సాహసమును చూపించాలి, పిరికివారుగా, బలహీనులుగా తయారుకారాదు, కాళీ యొక్క పుజ చూసారా? కాళిదేవి వలే ఈ సమూహము తయారుకావాలి, ఒక్కొక్కరు కాళీ రూపముగా తయారైనచో సమస్యలను ఎదుర్కోగలరు, కూమారీలు కాళీ రూపముగా తయారు కావాలి, మాయ యొక్క విఘ్నములు మీ ముందుకు వచ్చుటకు సాహసము కూడా చేయరాదు, సర్వీసులో సఫలత ఉంటుంది, మీరు సదా ఏకరసముగా కలిగి విఘ్నములను సమాప్తము చేయాలి, ఒక కంటిలో ముక్తి , రెండవ కంటిలో జీవన్ముక్తి కనిపించాలి, రెండువైపులా మీ రాజ్యము యొక్క దృశ్యములను ఎదురుగా ఉంచుకోవాలి, ఎలాంటి సమస్యలనైనా సహజముగా దాటి వెళ్ళాలి, సదా పరస్పరములో స్నేహీలుగా, మరియు సహాయోగీలుగా తయారైనచో సఫలతా నక్షత్రము మీ అందరి మస్తకముపై ప్రకాశిస్తూ కనిపిస్తుంది ఎక్కడైనా స్నేహము మరియు సహయోగము ఇచ్చుటలో లోపం ఉండరాదు. స్నేహము మరియు సహయోగము పరస్పరం కలిసి ఉన్నచో శక్తి ప్రాప్తియవుతుంది, శక్తి ద్వారా సఫలత లభిస్తుంది, అందువలన ఈ రెండు విషయములపై గమనముంచాలి, ఎలాంటి అసురీ సంస్కారములైనను సమాప్తి చేయు సంహారమూర్తులుగా తయారుకావాలి, సంహారము చేయుచోట సంహారము చేయు విధముగా ఉండరాదు, మాస్టర్ బ్రహ్మగా తయారుకావాలి, కానీ మాస్టర్ శంకరునిగా తయారు కారాదు, రచనకు బదులు సంహారము, సంహారమునకు బదులు రచన చేయరాదు, సంహారమునకు బదులుగా రచన చేసినచో వ్యర్థసంకల్పములు ఉత్పన్నమవుతాయి, ఇలాంటి రచనల యెడల చాలా జాగ్రత్తగా ఉండాలి, సమయానుసారముగా కర్మలుచేయాలి, సమయము అయిపోయిన తరువాత సంపూర్ణులుగా తయారుకాలేరు, సర్వీసులో సఫలత పూర్తి అయిన తరువాత, సంపూర్ణ సంపన్నులుగా తయారవుతారు, స్వయం బాబాకు సమర్పణ అయినారు, సంకల్పములో కూడా ఇతరులేవ్వరికీ సమర్పణ కారాదు, సంకల్పములు కూడా చాలా మోసం చేస్తాయి, ఎవరి దృష్టి పడకుండా చిన్నపిల్లలకు నల్లని తిలకమును దిద్దుతారు, అందువలన ఈ సమూహమునకు నల్లటి తిలకమును దిద్దాలి, తిలకముయొక్క అర్థమును తెలుసుకున్నారు కదా, ఎలాంటి పరిస్థితులు వచ్చినను స్థిరముగా ఉండాలి, ఈ సమూహము ఒక స్లోగన్ స్మృతి ఉంచుకోవాలి, “ సఫలత మా జన్మసిద్ధ అధికారము “ సఫలత యొక్క శృంగారమును చేసుకోవాలి, నాయనములద్వారా, మస్తకము ద్వారా, నోటిద్వారా కూడా సఫలతయొక్క అలంకరణ కనిపించాలి, సఫలతయొక్క అలంకరణ కనిపించాలి సంకల్పములో కూడా సఫలత ఉండాలి, ఈ భట్టీలో సర్వము పరివర్తన కావాలి, బాబాకు సమర్పణ అయిన తరువాత ఎలాంటి పరిస్థితిలోనూ, ఎలాంటి సమస్యలు వచ్చినను ఇతరులేవ్వరికీ సమర్పణ కారాదు, అని ప్రతిజ్ఞ చేయాలి, విత్తనము వేసిన తరువాత దానికి నీరు వేసినచో అది వృక్షమై ఫలిస్తుంది, మీరు ప్రతిజ్ఞను పూర్తి చేసుకొనుటకు సాంగత్యము యొక్క సహాయము ఉండాలి మరియు మీలో దైర్యము ఉండాలి, సాంగత్యము మరియు దైర్యము రెండిటి యొక్క ఆధారముతో ఎలాంటి సమస్యలనైన దాటి వెళ్ళగలరు; పరంధామము ద్వారా వైకుంఠమునకు తప్ప మరి ఎక్కడకు వెళ్ళమని దృఢమైన ముద్ర వేసుకోవాలి. మంచిది –
ఓంశాంతి -