07.06.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


దివ్యమూర్తి అయ్యేటందుకు విధి.

నయనాల ద్వారా ఏమి చూస్తున్నారు? మీరందరూ కూడా నయనాల ద్వారా చూస్తున్నారు, మరియు బాప్ దాదా కూడా నయనాలను ఆధారంగా తీసుకుని చూస్తున్నారు. బాప్ దాదా ఏమి చూస్తున్నారు? మీరందరూ ఏమి చూస్తున్నారు? చూస్తున్నారా లేక చూస్తూ కూడా చూడటం లేదా? ఏ స్థితి ఉంది? బాప్ దాదా ఏదైతే చూస్తున్నారో అదే మీరూ చూస్తున్నారా? సంకల్పాలని గ్రహించే అభ్యాసం ఉంటే సహజంగా సంకల్ప రహితంగా కూడా కాగలరు. ఎవరి సంకల్పాలనైనా పరిశీలించలేనప్పుడే ఎక్కువ సంకల్పాలు నడుస్తాయి. ప్రతి ఒక్కరి సంకల్పాలని గ్రహించే అభ్యాసం ఉంటే ఎక్కువ వ్యర్ధ సంకల్పాలు నడవవు. మరియు సహజంగానే ఒకే సంకల్పంలో, ఏకరస స్థితిలో ఒక్క సెకనులో స్థితులైపోతారు. కనుక సంకల్పాలని గ్రహించటం కూడా సంపూర్ణతకి ఒక గుర్తు.

ఎంతెంత అవ్యక్త భావంలో స్థితులవుతారో అంత ప్రతి ఒక్కరి బావాన్ని సహజంగా తెలుసుకోగలరు. ఒకరి భావాలను ఒకరు తెలుసుకోలేక పోవడానికి కారణం అవ్యక్తభావం యొక్క లోపం. అవ్యక్త స్థితి ఒక దర్పణం, ఎప్పుడైతే మీరు అవ్యక్త స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఏ వ్యక్తి యొక్క భావమైనా అవ్యక్త స్థితి అనే దర్పణంలో పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రమించవలసిన అవసరం ఉండదు. ఏ భావాన్నైనా తెలుసుకోవటంలో దర్పణానికి శ్రమ ఉండదు. ఎంతెంత అవ్యక్త స్థితి ఉంటుందో అంత దర్పణం స్వచ్చంగా మరియు శక్తిశాలిగా ఉంటుంది. అంత సహజంగానే ప్రతి ఒక్కరి భావాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలరు.

అవ్యక్త స్థితి రూపి దర్పణాన్ని స్వచ్చంగా మరియు స్పష్టంగా చేసుకునేటందుకు మూడు విషయాలు అవసరం. ఆ మూడు విషయాలలో ఏదొక విషయం అయినా చెప్పండి. (ప్రతి ఒక్కరు చెప్పారు) ఈ రోజు ప్రతి ఒక్కరి సరళత, శ్రేష్టత మరియు సహనశీలత మూడు విషయాలను ఒకొక్కరిలో చూస్తున్నారు. ఈ మూడు విషయాలలో ఏ ఒకటి మంచిగా ధారణ చేసినా దర్పణం స్పష్టంగా ఉంటుంది. ఒకవేళ ఒక విషయం లోపంగా ఉన్నా దర్పణంపై కూడా లోపం యొక్క మచ్చ కనిపిస్తుంది. అందువలన ఏ కార్యం చేస్తున్నా ప్రతి కార్యంలో మూడు విషయాలను పరిశీలించుకోండి. అన్ని రకాలుగా సరళత కూడా ఉండాలి, సహనశీలత కూడా ఉండాలి మరియు శ్రేష్టత కూడా ఉండాలి. సాధారణత ఉండకూడదు. ఇప్పుడు అక్కడక్కడ శ్రేష్టతకి బదులు సాధారణత కనిపిస్తుంది. సాధారణతని శ్రేష్టతలోకి మార్చుకోండి. మరియు ప్రతి కార్యంలో సహనశీలతను ఎదురుగా ఉంచుకోండి. మీ ముఖంలో, మాటలో సరళతను ధారణ చేయండి. అప్పుడు సేవా కర్తవ్యంలో సఫలత ఎంత శ్రేష్టంగా వస్తుందో చూడండి. ఇప్పటివరకు కర్తవ్యం యొక్క ఫలితం ఎలా కనిపిస్తుంది? పద్దతి మరియు ప్రత్యక్షంలో ఎంత తేడా ఉంది? ఈ తేడాకి గల కారణం ఏమిటి? మూడు రూపాలలో ఇప్పుడు పూర్తి స్వచ్చంగా తయారవలేదు. స్మృతిలో కూడా స్వచ్చత మరియు మాటలో కూడా స్వచ్ఛత ఉండాలి మరియు కర్మలో కూడా స్వచ్చత అనగా శ్రేష్టత ఉండాలి. ఏ పాత సంస్కారాల మచ్చ ఎక్కడ ఉండకూడదు. ఇలా స్వచ్ఛంగా అయిపోతే పద్ధతి (ప్లాన్) మరియు ప్రత్యక్షత (ప్రాక్టికల్) సమానంగా ఉంటాయి. తర్వాత సఫలత విమానంలా ఎగురుతూ వస్తుంది. అందువలన ప్రతీ విషయంలో మనసా, వాచా, కర్మణా మరియు చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి, మనసా, వాచా, కర్మణాలతో పాటు వెనువెంట ఈ అలౌకిక సంబంధంలో కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడు సేవా సఫలత మీ అందరి మస్తకంలో సితారగా మెరుస్తుంది. అప్పుడు ప్రతి ఒక్కరు మిమ్మల్ని సఫలతా సితారగా చూస్తారు. స్లోగన్ ఏమిటో చెప్పాను కదా! సఫలత మా జన్మ సిద్ద అధికారం. అప్పుడు ఎవరు మిమ్మల్ని చూసినా కానీ దూరం నుండే దివ్యమూర్తి వలె కనిపిస్తారు. సాధారణ మూర్తిగా కాదు, కానీ దివ్యమూర్తిగా కనిపిస్తారు. ఈ రోజులలో సేవలో చాలా బిజీగా ఉన్నారు. ఏదైతే చేసారో అది చాలా మంచిగా చేసారు. ముందు కొరకు సఫలతని సమీపంగా తీసుకురండి. ఎంతెంత ఒకరికొకరు సమీపంగా వస్తారో అంతంత సఫలత సమీపంగా వస్తుంది. ఒకరికొకరు సమీపంలో అంటే సంస్కారాల సమీపత. అప్పుడు ఏ సమ్మేళనం అయినా సఫలం అవుతుంది. ఎలా అయితే సమయం సమీపంగా వస్తుందో అలాగే అందరు సమీపంగా వస్తున్నారు. కాని ఆ సమీపతలో ఇప్పుడు ఏమి నింపాలి? ఎంత సమీపతయో అంత ఒకరికొకరు గౌరవం ఇవ్వాలి.

ఎంత ఒకరికొకరు గౌరవం ఇస్తారో అంతగానే విశ్వమంతా మిమ్మల్ని గౌరవిస్తుంది. గౌరవం ఇవ్వటం ద్వారా గౌరవం లభిస్తుంది. ఇవ్వటం ద్వారా లభిస్తుంది, కానీ తీసుకోవటం ద్వారా కాదు. కొన్ని తీసుకోవటం ద్వారా లభిస్తాయి, కొన్ని ఇవ్వటం ద్వారా లభిస్తాయి. ఎవరికైనా గౌరవం ఇవ్వటం అంటే సర్వుల నుండి గౌరవం పొందటం. భాషలో కూడా పరివర్తన రావాలి. ఈరోజు అందరు సేవాధారులు కూర్చున్నారు కదా! అందువలన భవిష్యత్తు కొరకు సైగ చేస్తున్నాను. ఎప్పుడైనా ఎవరి ఆలోచన అయినా స్పష్టంగా లేకపోయినా కానీ కాదు అని అనకూడదు, సదా అలాగే! అనే మాట రావాలి. ఎప్పుడైతే ఇక్కడ మీరు అలాగే అని అంటూంటారో అప్పుడే సత్యయుగంలో కూడా మీ ప్రజలు కూడా అలాగే అంటారు. ఒకవేళ ఇక్కడే కాదు, కాదు అంటే అక్కడ కూడా మీ ప్రజలు కూడా దూరం నుండే నమస్కారం చేస్తారు. కనుక కాదు అనే మాటని తీసేయాలి. ఏ విషయమైనా మొదట అలాగే అనాలి. అలాగే, అలాగే అనటమే ఇతరుల సంస్కారాలను సరళంగా చేసుకునే సాధనం. అర్థమైందా! విన్నారు కదా! ఈ సమయంలో ఏదైతే కర్మ చేస్తున్నారో అది భవిష్యత్తులో నియమంగా అవుతుంది అని. మీ అందరి కర్మ భవిష్య నియమం. లా మేకర్స్ అయిన వారు ఆలోచించి, అర్ధం చేసుకుని మాట్లాడతారు. ఎందుకంటే వారి యొక్క ఒకొక్క మాట భవిష్యత్తుకి నియమంగా తయారవుతుంది. అందరి యొక్క ప్రతి సంకల్పం భవిష్యత్తుకి నియమంగా అవుతుంది. అయితే ఎంత ధ్యాస పెట్టాలి? ఇప్పటి వరకు ఒక విషయం పట్టుకుంటే, రెండవ విషయం వదిలేస్తున్నారు. కానీ రెండు విషయాలు స్మృతి ఉండాలి. అప్పుడప్పుడు విధిని పట్టుకుంటే విధానాన్ని వదిలేస్తున్నారు, విధానాన్ని పట్టుకుంటే విధిని వదిలేస్తున్నారు. కానీ విధి మరియు విధానం రెండింటి స్మృతి ద్వారానే విధాత యొక్క స్మృతి వస్తుంది. విధాత యొక్క స్మృతి ఉంటే విధి మరియు విధానం రెండు స్పృతి ఉంటాయి. కానీ విధాతను మర్చిపోతున్నారు. అందువలన ఒకటి మర్చిపోతున్నారు. విధాత యొక్క స్మృతిలో ఉండటం ద్వారా విధి మరియు విధానం రెండు వెనువెంట ఉంటాయి. విధాతను . మర్చిపోవటం ద్వారా అప్పుడప్పుడు విధానాన్ని మర్చిపోతున్నారు, అప్పుడప్పుడు విధిని మర్చిపోతున్నారు. రెండూ వెనువెంట ఉంటే సఫలత మీ యొక్క కంఠహారంగా అవుతుంది. మంచిది. ఈ రోజు చాలా శిక్షణ ఇచ్చాను. ఇది కూడా స్నేహం. ఎందుకంటే బాప్ దాదా తన సమానంగా చేయాలనుకుంటున్నారు. సమానంగా అయ్యే సాధనం చెప్పటం కూడా స్నేహమే కదా! కుమారీలకు ఇప్పుడు పరీక్ష పెట్టాలి. ధైర్యాన్ని ప్రత్యక్షరూపంలో తీసుకురావడానికి ధైర్యంలో చాలా చాలా శక్తిని నింపుకోవాలి. ఇప్పుడు ఎంత శక్తిని నింపుకున్నారో పరిక్షిస్తాను.