11.06.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశ్వపతిగా అయ్యేదాని కొరకు సామాగ్రి

ఈరోజు సద్గురువారము ఎందువలన విశేషముగా పిలిపించారు? ఈరోజు కుమారీలకు ఏ దినము - సమాప్తి సమారోహణము. ఈరోజు బాప్ దాదా విశ్వపతిగా తయారుచేయుటకు ఏ సామాగ్రిని తీసుకువచ్చారు, ఏదైనా సమారోహణము జరుగు సమయములో దానిలో సామాగ్రి కూడా ఉంటుంది, అందువలన ఈరోజు విశ్వపతిగా తయారుచేయు సమారోహణములో విశేషముగా ఏ సామాగ్రిని తీసుకునివచ్చారు? కిరీటము, సింహాసనము మరియు తిలకము, ఈ మూడు ధారణ చేయు దైర్యమున్నదా? కిరీటము ధారణ చేయుటకు, సింహాసనముపై ఆసీనులగుటకు మరియు తిలకమును ధరించుటకు ఏమి చేయవలసి ఉంటుంది? వీటిని ధరించుటకు దైర్యమున్నది, కాని దీనికొరకు ఏమి చేయవలసి ఉంటుంది? ఒకటి త్యాగము, రెండవది తపస్సు మరియు సేవ , తిలకమును ధారణ చేయుటకు తపస్సు మరియు కిరీటము ధారణ చేయుటకు త్యాగము, సింహాసనముపై ఆసీనులగుటకు సేవ చేయాలి, ఇప్పుడు సేవ చేయుట వలన హృదయ సింహాసనాధికారులుగా తయారవుతారు,ఈ మూడు విషయముల ద్వారానే మూడు ధారణ చేయగలరు, దీనిలో ఒక్క ధారణ తక్కువున్నను విశ్వపతిగా తయారుకాలేరు, తెలిసినదా? ఈ 3 గుణములు మీలో సంపూర్ణముగా ధారణ చేసారా? మూడింటిలో ఒకటి వదిలినను వీరులని పిలువబడరు, త్యాగము ఏమి చేసారు, నాది అనునది త్యాగము చేయాలి, నేను చేశాను,నాకు తెలుసు, ఈ నాది అనే అహంకారమును త్యాగము చేయాలి, నేను బదులుగా బాబా అను శబ్దమును ఉపయోగించాలి, జ్ఞానము యొక్క విషయమును వర్ణన చేయండి, నాకు తెలుసు అని కాకుండా, బాప్ దాదా ద్వారా తెలుసుకున్నాను అను భావన ఉండాలి, జ్ఞానములో వచ్చిన తరువాత స్వయములో ఉండు అహంకారమును కూడా త్యాగము చేయాలి, ఇప్పుడు త్యాగము ఉండాలి, సదా బాబా స్మృతి ఉండాలి, మరియు నోటి ద్వారా జ్ఞానపు మాటలే రావాలి, అప్పుడే విశ్వపతిగా తయారు కాగలరు, మీ ధారణ అవినాశిగా తయారు చేసుకొనుటకు, సదా స్థిరముగా ఉంచుకొనుటకు రెండు విషయములను స్మృతి ఉంచుకోవాలి, అవి ఏమిటి? ఒకటి అన్ని విషయములలో సాధారణముగా ఉండుట మరియు స్వయాన్ని ఉదాహరణగా భావించుట, లేదా ఉదాహరణగా తెలుసుకొనుట, మీరు ఉదాహరణమూర్తులై చూపించినచో అనేక ఆత్మలు కుడా ఉదాహరణమూర్తులుగా అగుటకు యోగ్యులవుతారు, అందువలన స్వయాన్ని శ్రేష్ఠమైన ఉదాహరణ మూర్తిగా తయారుచేసుకున్నారా? మంచి శాంపిల్ విడుదలైనప్పుడు దానికి ముద్ర వేయబడుతుంది, మీరు ఏ ముద్ర వేసుకుని వెళతారు? అది ఎప్పుడు తొలగిపోకూడదు, " శివ శక్తులు మరియు బ్రహ్మకుమారీలు" సాకారములో నిమిత్తముగా తయారైనవారు ఈ ముద్రను వేయుచున్నారు, సంస్కారములో కాని, సర్వీసులో కానీ, సంబంధములో కానీ అన్ని విషయములో స్వయం మరణించినను తొలగిపోరాదని స్మృతిలో ఉంచుకోవాలి. తొలగిపోవుట బలహీనతకు చిహ్నము. ఈ సమూహము అభివృద్ధి చెందగలదని బాప్ దాదాకు విశ్వాసమున్నది. ఏ విధమైన కర్మ బంధనములున్నను వాటిని త్వరగా సమాప్తి చేసుకొని, తరువాత సంపూర్ణ సమారోహణము ఆచరించుట కొరకు మధువనమునకు రావాలి. బాప్ దాదాతో స్నేహముగా ఉన్నవారు, బాప్ దాదాకు సహజముగానే సహాయకులుగా తయారవుతారు. ఏదైనా శక్తి తక్కువగా ఉన్న యెడల దానిని మీతో నింపుకోవాలి, ఈరోజు లెక్కాచారమును పూర్తి చేసుకొనుటకు వెళ్లుచున్నారు. సర్వశక్తులను మీలో నింపుకొని వెళ్ళినచో లెక్కాచారమును సమాప్తి చేసుకొనగలరు.
పార్టీలతో బాప్ దాదా మిలనము:- అవ్యక్తస్థితి అనుభవమవుతున్నదా? ఒక సెకండు అవ్యక్తస్థితి అనుభవము అయినచో దాని ప్రభావము చాలా సమయము వరకు ఉంటుంది, అవ్యక్త స్థితి యొక్క అనుభవము చాలా శక్తిశాలిగా ఉంటుంది, సాధ్యమైనంత వరకు మీ సమయమును వ్యక్తస్థితినుండి తొలగించి అవ్యక్తస్థితిలో ఉండాలి, అవ్యక్తస్థితి ద్వారా సర్వ సంకల్పములు సిద్దిమయమవుతాయి, దీనిలో శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి పురుషార్థములో సమస్యలు మరియు నిరాశలు వస్తాయి, అందువలన అవ్యక్తస్థితి ద్వారా సర్వప్రాప్తులు అనుభవము అవుతాయి, అవ్యక్త మూర్తులను ఎదురుగా ఉంచుకొని వారి సమానముగా తయారయ్యే ప్రయత్నము చేయాలి. తండ్రి వలె పిల్లలు ఉండాలను ఈ విషయమును సదా స్మృతిలో ఉంచుకోవాలి. వ్యత్యాసమున్నచో అంతర్ముఖీలై దానిని సమాప్తము చేసుకోవాలి, బాబాకు ఎప్పుడైనా క్రోధము కలుగుతుందా? పరిస్థితులకు భయపడతారా? పిల్లలు ఎందువలన భయపడుచున్నారు? ఎక్కువ పరిస్థితులను ఎదుర్కొన్న బ్రహ్మాబాబాను ఉదాహరణముగా చూసారు. ఎప్పుడైనా వారి రూపములో భయము చూసారా? సదా స్మృతిలో ఉండాలి. స్నేహములో సంపూర్ణముగా తయారుకావాలి. స్నేహమును బాబా సమానముగా తీసుకొని రావాలి. స్నేహము గుప్తముగా ఉండాలి. సఫలత ప్రత్యక్షము కావాలి. కల్పము ముందరి మీ యొక్క సఫలతా స్వరూపము స్మృతి వస్తున్నది కదా! మీ యొక్క కల్పము ముందు నింపుకొనియున్న సంస్కారములను ప్రత్యక్షము చేయాలి. నిండియున్న సంస్కారములను ఇప్పుడు కేవలం ప్రత్యక్షము చేయాలి. సదా మీ యొక్క సంపూర్ణతా స్వరూపము మరియు భవిష్య 21 జన్మల రూపమును ఎదురుగా ఉంచుకోవాలి. చాలా మంది తమ ఇంటిని అలంకరణ చేసుకొనుటకు రక రకముల రూపాలను స్మృతిచిహ్నములు ఉంచుకుంటారు. మీరు మీ మనోమందిరములో మీ సంపూర్ణ స్వరూపము యొక్క మూర్తిని మరియు భవిష్య అనేక జన్మల స్వరూపములను స్పష్టమైన రూపములో ఎదురుగా ఉంచుకోండి, తరువాత ఏవైపు మీయొక్క సంకల్పము వెళ్ళదు, సమీప రత్నముల లక్షణములేమి? ఎంత సమీపముగా ఉంటారో అంతే సంస్కారములలో కూడా సమానముగా ఉంటారు. బాప్ దాదా యొక్క సమీపము అనగా లక్షణములు సమీపముగా రావాలి. ఎంత త్వరగా పరిశీలన చేసుకుంటారో అంత త్వరగా పరివర్తనవుతారు. ఆది స్వరూపమును స్మృతిలో ఉంచుకోండి. సత్యయుగము యొక్క ఆది జీవనము మరియు మరజీవ జీవనము యొక్క స్వరూపమును స్మృతిలో ఉంచుకోవాలి. స్నేహీలుగా, సహాయోగులుగా తయారైనారా? స్నేహమున్నచో దానికి బదులు ఏమి ఇవ్వబడుతుంది, స్నేహమునకు బదులు సహాయము లభిస్తుంది, బాబా ఏవిధముగా సర్వ సమర్దులుగా ఉన్నారో పిల్లలు కూడా మాస్టర్ సమర్దులుగా తయారుకావాలి. వినాశనమునకు ముందే ఒకవేళ స్నేహముతో పాటు సహాయోగీలుగా తయారైన యెడల ఆస్తికి అధికారులుగా తయారవుతారు. వినాశన సమయములో సర్వ ఆత్మలు తెలుసుకుంటారు కానీ ఆస్తిని పొందలేరు. ఎందుకంటే బాబాకు సహాయకులుగా తయారుకాలేదు. 2.కర్మ బంధనములు శక్తిశాలిగా ఉన్నాయా? లేక ఈశ్వరీయ బంధనలో ఉన్నారా? ఈశ్వరీయ బంధనములను తీవ్రముగా చేసుకొన్నచో కర్మ బంధనములు స్వతహాగానే సమాప్తమవుతాయి. ఈశ్వరీయ బంధనముల ద్వారానే కర్మ బంధనములు తొలగిపోతాయి. అందువలన ఈశ్వరీయ బంధనలుదృఢముగా ఉండాలి. 3. బిందు స్వరూపులుగా ఎక్కువ సమయముండాలి. బిందు స్వరూపములో ఎక్కువ సమయము ఉండలేక పోయిన యెడల దాని కొరకు సమయమును వ్యర్థము చేసుకొనరాదు. బిందు స్వరూపములో ఉండుటకు ముందు శుద్ధ సంకల్పములు చేయు అభ్యాసముండాలి. అప్పుడే బిందు రూపములో స్థిరముగా ఉండగలరు. అశుద్ద సంకల్పములను శుద్ధ సంకల్పములతో సమాప్తముచేయాలి. ఏదైనా ప్రమాదము / యక్సిడెంట్ జరుగు సమయములో బ్రేక్ వేయలేకపోయినచో ప్రమాదమును తప్పించుకు త్రిప్పవలసి వస్తుంది. బిందు రూపమైనది బ్రేక్. ఒకవేళ బ్రేక్ పడని యెడల, వ్యర్థసంకల్పముల నుండి బుద్దిని తిప్పి, స్వచ్ఛమైన సంకల్పములో ఉంచండి. అప్పుడప్పుడు ఆవిధముగా జరుగుతుందికదా? ప్రమాదములో రక్షణ కొరకు బ్రేక్ పడని యెడల త్రిప్పవలసి వస్తుంది. పూర్తి దినమంతయు శుద్ధసంకల్పములు తప్ప వ్యర్థసంకల్పములు రాకుండా ప్రయత్నముచేయాలి. ఎప్పుడైతే ఈ సబ్జెక్టులో పాస్ అవుతారో అప్పుడు బిందు రూపములో స్థిరమగుట సహజముగా ఉంటుంది . మంచిది-ఓంశాంతి.