19.06.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


త్రిమూర్తి లైట్స్ యొక్క సాక్షాత్కా రం.

బ్రాహ్మణులని త్రిమూర్తి శివవంశీ అంటారు కదా! త్రిమూర్తి బాబా పిల్లలు స్వయం కూడా త్రిమూర్తియే, బాబా కూడా త్రిమూర్తియే. బాబా ఎలా అయితే త్రిమూర్తియో అలాగే మీరు కూడా త్రిమూర్తియేనా? మూడు రకాల లైట్స్ సాక్షాత్కారం అవుతున్నాయా? బ్రాహ్మణుల ఏ మూడు రకాల లైట్స్ సాక్షాత్కారం అవుతాయో తెలుసా? మీ ద్వారా లైట్ యొక్క సాక్షాత్కారం అవుతుంది తెలుసా? త్రిమూర్తి వంశీ త్రిమూర్తి పిల్లల మూడు రకాల లైట్స్ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఆ లైట్స్ ఏమిటి? 1. నయనాల ద్వారా లైట్ సాక్షాత్కారం అవుతుంది. నయనజ్యోతి అంటారు కదా! నయనాలలో రెండు పెద్ద బల్బ్ లు వెలుగుతున్నట్లు కనిపిస్తాయి. 2. మస్తకం యొక్క లైట్ 3. తలపై లైట్ (ప్రకాశ) కిరీటం. ఇప్పుడు ఈ మూడు లైట్స్ సాక్షాత్కారం చేయించే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ఎదురుగా రాగానే వారికి మీ నయనాలు బల్బ్ వలె కనిపించాలి. జ్యోతియే జ్యోతి కనిపించాలి. చీకటిలో సత్యమైన వజ్రం మెరుస్తుంది కదా! సర్చ్ లైట్ చాలా శక్తివంతంగా, బాగా ప్రకాశాన్ని వ్యాపిస్తుంది కదా! అలాగే మస్తకంలోని లైట్ సాక్షాత్కారం అవ్వాలి. తలపై ప్రకాశ కిరీటం అయితే తెలుసు. ఇలా ఒకొక్కరి ద్వారా త్రిమూర్తి లైట్స్ యొక్క సాక్షాత్కారం అవ్వాలి. అప్పుడే వీరు ఫరిస్తా వలె ఉన్నారు అని అంటారు. సాకారంలో నయనాలు, మస్తకం మరియు తలపై కిరీటం యొక్క సాక్షాత్కారం స్పష్టంగా అవుతుంది. నయనాల వైపు చూస్తూ చూస్తూ ప్రకాశం చూస్తారు. మీ లైట్ చూస్తూ ఇతరులు కూడా లైట్ (తేలిక) అయిపోతారు. మనస్సులో అయినా లేదా స్థితిలో అయినా బరువు ఉంటే రావటంతోనే అది తేలిక అయిపోతుంది. ఇలాంటి స్థితికి ఇప్పుడు చేరుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసి ఇతరులు కూడా తమ స్థితిని అలా తయారు చేసుకుంటారు. ఇప్పటి నుండే మీ మహిమ వింటారు. ద్వాపరయుగం యొక్క మహిమ గొప్ప విషయం కాదు, కానీ ఇలా సాక్షాత్కార మూర్తి మురియు సాక్షాత్తు మూర్తి అవ్వటం ద్వారా ఇప్పటి మహిమ కూడా వింటారు. మీ ఎదురుగా రావటంతోనే వారికి ప్రకాశమే ప్రకాశం కనిపిస్తుంది. ఇలా జరగనున్నది, మధువనమే ప్రకాశ భవనం అయిపోతుంది. స్థూల దీపాలను చూస్తూ కూడా చూడరు, వతనంలో ప్రకాశమే ప్రకాశం ఎలాగైతే కనిపిస్తుందో అలాగే మధువనం స్టూల లోకంలో లైట్‌హౌస్ అవుతుంది. ఎప్పుడైతే మీరు చైతన్య లైట్ హౌస్ అవుతారో అప్పుడు ఈ మధువనం కూడా లైట్‌హౌస్ అవుతుంది. ఇదే అంతిమ చదువు యొక్క అంతిమ సబ్జక్ట్. దీనినే ప్రత్యక్షంలోకి తీసుకురావాలి ఇప్పుడు. ఈ అంతిమ సబ్జక్టులో చాలా వేగంగా పురుషార్ధం చేయాలి. ఈ స్థితికే మహిమ ఉంది.

బాప్ దాదాతో ఎప్పుడు వీడ్కోలు ఉండదు. మాయతో వీడ్కోలు ఉంటుంది. బాప్ దాదాతో కలయిక జరుగుతుంది. ఈ కొద్ది సమయం యొక్క కలయిక సదాకాలిక కలయికకి నిమిత్తమవుతుంది. బాబా యొక్క గుణాలు మరియు కర్తవ్యంలో కలవడమే కలయిక. ఈ ప్రయత్నం సదా చేస్తూ ఉండాలి. సంకల్పాలకి బ్రేక్ వేసే ముఖ్య సాధనం ఏమిటి? తెలుసా? ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు కార్యం చేసే ముందు ఆలోచించి తర్వాత కార్యం ప్రారంభించండి. ఏ కార్యం చేయడానికి వెళ్తున్నానో అది బాప్ దాదా కార్యం, నేను నిమిత్తుడిని అని భావించాలి. యజ్ఞం రచించినప్పుడు సమాప్తి సమయంలో ఆహుతి చేస్తారు కదా! అలాగే ఏదైతే కర్తవ్యం చేసారో మరియు ఏదైతే ఫలితం వచ్చిందో దానిని బాబాకి సమర్పణ స్వాహా చేసేస్తే ఇక ఏ సంకల్పం రాదు. నిమిత్తంగా అయ్యి కార్యం చేసారు మరియు కార్యం సమాప్తి అయిన వెంటనే స్వాహా చేసేశారు. అప్పుడు ఇక సంకల్పాలు ఎలా నడుస్తాయి? ఎలా అయితే అగ్నిలో వస్తువు వేస్తే దానికి గుర్తులు కూడా ఉండవో అలాగే సమాప్తిలో ప్రతి విషయాన్ని సంపూర్ణ స్వాహా చేయాలి. అప్పుడిక మీ బాధ్యత ఉండదు. ఎవరికి సమర్పణ చేసారో వారి బాధ్యత అయిపోతుంది. అప్పుడు సంకల్పాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఏదైనా పని చేస్తే అది పెద్దవారికి చెప్పేసి తేలిక అయిపోతారు కదా! అలాగే కార్యం చేసారు, సమాచారం బాబాకి ఇచ్చేశారు. అంతే, అవ్యక్తరూపాన్ని ఎదురుగా ఉంచుకుని ఇది చేసి చూడండి. ఎవరు ఎంత సహయోగి అవుతారో వారికి ఎక్కువ సహయోగం ఇవ్వవలసి ఉంటుంది. ఎలా అయితే మీ ఆత్మ ఉన్నతి కోసం ఆలోచిస్తున్నారో అలాగే శుద్దభావన, శుభచింతక మరియు శుభచింతన రూపంలో ఏ ఆత్మకి అయినా విశేష సహయోగం ఇవ్వగలరు మరియు ఇవ్వాలి కూడా. దీని ద్వారా చాలా సహాయం లభిస్తుంది. ఎవరైనా బీదవానికి అకస్మాత్తుగా శ్రమ లేకుండా ప్రాప్తి లభిస్తే ఎలా ఉంటుందో అలాగే ఏ ఆత్మకైనా ఎక్కువ సహయోగం ఇస్తే ఆ ఆత్మ కూడా మాకు విశేష సహయోగం లభించింది అని అనుభవం చేసుకుంటుంది. సాకార రూపంలో కూడా ఎవరొక ఆత్మకి ఎక్కువ సహయోగం ఇవ్వటం అనే దానికి ఉదాహరణగా అయి చూపించారు కదా! ఆ ఆత్మకి కూడా అనుభవం అయ్యేది. ఈ సేవ చేసి చూపించాలి. ఎంతెంత మీరు సూక్ష్మము అవుతూ ఉంటారో అంతంత ఈ సూక్ష్మ సేవ కూడా పెరుగుతుంది. స్థూలంతో పాటు సూక్ష్మానికి ఎక్కువ ప్రభావం పడుతుంది మరియు త్వరగా పడుతుంది మరియు సదాకాలికంగా ఉంటుంది. బాప్ దాదా కూడా విశేష సహయోగం ఇస్తున్నారు. ఎక్కువ సహాయం యొక్క అనుభవం అవుతుంది. శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువగా అనుభవం అవుతుంది.

బాప్ దాదా తన పిల్లలపై ఎంత అవినాశి స్నేహం పెట్టుకుంటున్నారో, పిల్లలు కూడా అంత అవినాశి స్నేహం పెట్టుకుంటున్నారా? ఈ అవినాశి స్నేహం అనేది ఒక దారం, ఇది 21 జన్మల బంధాన్ని జోడిస్తుంది. తెగిపోని స్నేహం ఉండాలి. ఎంత గట్టి దారమో అంత ఎక్కువ సమయం నడుస్తారు. ఈ సంగమయుగ సమయం 21 జన్మల బంధాన్ని జోడిస్తుంది. ఈ సంగమయుగం యొక్క ఒకొక్క సంకల్పం, ఒకొక్క కర్మ 21జన్మలకు బ్యాంక్ లో జమ అవుతాయి. ఇంత ధ్యాస పెట్టుకుని సంకల్పం చేయాలి. ఏది చేస్తే అది జమ అవుతుంది. కనుక ఎంత జమ అవుతుంది. ఒక సంకల్పం కూడా వ్యర్ధంగా పోకూడదు. ఒక సంకల్పం వ్యర్ధం అయినా జమలో కట్ అయిపోతుంది. జమ చేసుకోవాలంటే ఒక్కటి కూడా వ్యర్ధం చేసుకోకూడదు. అంటే ఎంత పురుషార్థం చేయాలి? సంకల్పం కూడా వ్యర్ధంగా పోకూడదు. సమయం వదిలేయండి. ఇప్పుడు పురుషార్థం ఈ పరిధికి చేరుకుంది. ఎలా అయితే లౌకిక చదువు రోజురోజుకి ఉన్నతంగా అవుతుందో ఇక్కడ కూడా అంతే, పెద్ద క్లాస్లో చదువుకుంటున్నారు కదా!