26.06.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


కామధేనువు యొక్క అర్ధం.

 మిమ్మల్ని మీరు సాక్షాత్కార మూర్తిగా భావిస్తున్నారా? మూర్తి దగ్గరికి ఎందువలన వెళ్తారు? తమ మనోకామనలు పూర్తి చేసుకునేటందుకు వెళ్తారు. ఏ ఆత్మకి ఏ రకమైన కోరిక ఉంటే ఆ కోరికను పూర్తి చేసే సాక్షాత్కారమూర్తిగా అయ్యారా? అల్పకాలిక కోరికలు కాదు, సదాకాలిక కోరికలను పూర్తి చేయగలరా?

కామధేనువు అని మాతలను అంటారు కదా! కామధేనువు అంటే సర్వుల కోరికలను పూర్తి చేసేవారు అని అర్థం. ఎవరికైతే తమ సర్వ కోరికలు పూర్తి అవుతాయో వారే ఇతరుల కోరికలను పూర్తి చేయగలరు. సదా ఇదే లక్ష్యంపెట్టుకోండి - సర్వుల కోరికలను తీర్చే మూర్తి అవ్వాలని, సర్వుల కోరికలను తీర్చేవారు స్వయం కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా ఉంటారు. ఇలాంటి అభ్యాసం చేయాలి. స్వరూపంగా అవ్వటం ద్వారా ఇతరులకి ప్రాప్తినివ్వగలరు. సదా మిమ్మల్ని మీరు దాతగా లేదా మహాదానిగా భావించాలి. మహాజ్ఞాని తర్వాత మహాదాని యొక్క కర్తవ్యం నడుస్తుంది. మహాజ్ఞాని యొక్క పరిశీలన మహాదాని అవ్వటం ద్వారా తెలుస్తుంది. షైర్ చేయటం (విహరించటం) మంచిగా అనిపిస్తుంది. ఎవరికైతే షైర్ చేసే అలవాటు ఉంటుందో వారు సదా షైర్ చేస్తారు. ఇది కూడా అంతే. ఎంత స్వయం విహరిస్తారో అంత ఇతరులని కూడా బుద్దియోగం ద్వారా విహరింప చేయగలరు. మీ ద్వారా సాక్షాత్కారం అవ్వాలి. ఎలా అయితే సాకార బాబా ఎదురుగా రావటంతోనే ప్రతి ఒక్కరికీ భావన ప్రకారం సాక్షాత్కారం లేక అనుభవం అయ్యేది. అలాగే మీ ద్వారా కూడా సెకను, సెకను అనేక అనుభవాలు లేక సాక్షాత్కారాలు అవుతాయి. అవ్యక్త ఆకృతి రూపాన్ని తయారు చేసుకున్నప్పుడే ఇలా దర్శనీయమూర్తి లేక సాక్షాత్కారమూర్తిగా అవుతారు. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ వారికి శరీరం కనిపించకూడదు, సూక్ష్మవతనంలోని ప్రకాశమయ రూపం కనిపించాలి. కేవలం మస్తకమే ప్రకాశంగా కాదు, కానీ మొత్తం శరీరం కూడా ప్రకాశంగా సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే ప్రకాశమే ప్రకాశం చూస్తారో అప్పుడు స్వయం కూడా ప్రకాశరూపం అయిపోతారు. మంచిది.