11.07.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
సంగమయుగి డిగ్రీ మరియు భవిష్య ప్రాలబ్దము.
ఈరోజు
బాప్ దాదా విద్యార్థులందరు చదువు తర్వాత ఏ డిగ్రీ పొందారని చూస్తున్నారు. ఈ
చదువుకి లభించే డిగ్రీ ఏమిటి? డిగ్రీ లభించాలా లేక లభించిందా? చదువు తర్వాత
డిగ్రీ లభిస్తుంది కదా! ఈ సంగమయుగంలో మీకు ఏమి లభిస్తుంది? సంపూర్ణ ఫరిస్తా
లేదా అవ్యక్త ఫరిస్తా - ఇది సంగమయుగం యొక్క డిగ్రీ. దైవీ పదవి అనేది భవిష్య
ప్రాలబ్దము. ఇప్పటికి డిగ్రీ - సంపూర్ణ అవ్యక్త ఫరిస్తా. ఈ డిగ్రీ యొక్క ముఖ్య
లక్షణాలు ఏమిటి మరియు ఎంతవరకు ప్రతి విద్యార్థి దీనిలో యోగ్యంగా తయారయ్యారని
చూస్తున్నారు. స్వయం ఎంత యోగ్యంగా తయారవుతారో ఇతరులను అంత యోగ్యంగా
తయారుచేయగలరు. యోగ్యమైనవారు లక్షణాలు గలవారిని తయారుచేస్తారు. మరియు ఎవరైతే ఇలా
అవ్వరో వారు సంఖ్యని తయారు చేస్తారు. కనుక ఈరోజు అందరి యొక్క లక్షణాలను
చూస్తున్నారు. ఏయే లక్షణాలలో యోగ్యంగా అయ్యారు? అని చూస్తారు కదా! అదేవిధంగా
ఇక్కడ కూడా ముఖ్య లక్షణాలలో ఎంతవరకు జ్ఞానస్వరూపులుగా అయ్యారు అని
చూస్తున్నారు. జ్ఞానసాగరులతో పాటు నమ్మకదారులుగా, విజయీలుగా, శక్తివంతులుగా
మరియు సేవాధారిగా ఎంత వరకు అయ్యారని చూస్తున్నారు. ఈ లక్షణాలన్నీ అందరిలో వస్తే
డిగ్రీ లభిస్తుంది. ఈ లక్షణాలలో ఏయే లక్షణాలు ధారణ అయ్యాయి? జ్ఞాన స్వరూపులు
అంటే బుద్ధిలో మొత్తం జ్ఞానం యొక్క ధారణ ఉండాలి. ఎంత జ్ఞానస్వరూపంగా ఉంటారో అంత
విజయీలుగా అవుతారు. ఒకవేళ విజయం తక్కువగా ఉందంటే జ్ఞానం లోపంగా ఉన్నట్లు
భావించండి. విజయీలుగా కాకపోవడానికి కారణం ఏమిటి? నమ్మకం తక్కువ ఉంది. నమ్మకం
అంటే నిశ్చయబుద్ధి. స్వయంపై విశ్వాసం, బాప్ దాదాపై మరియు పరివారంలో సర్వ
ఆత్మలపై విశ్వాసపాత్రులు అవ్వాలి. ఎంత విశ్వాసపాత్రులు అయ్యి అనగా నిశ్చయబుద్ధి
అయ్యి కర్తవ్యం చేస్తే నిశ్చయబుద్ధి విజయంతి, అంటే విశ్వాసపాత్రులు అవ్వటం
ద్వారా విజయీలు అయిపోతారు. వారి ప్రతి కర్తవ్యం, ప్రతి సంకల్పం, ప్రతి మాట
శక్తిశాలిగా ఉంటుంది. ఇటువంటి యోగ్యులకే ఈ డిగ్రీ లభిస్తుంది. ఒకవేళ డిగ్రీ
పొందకపోతే ఏమౌతుందో తెలుసా? కోర్టు ద్వారా ఏమి వస్తుంది? నోటీసు. లభిస్తే
డిగ్రీ లభిస్తుంది. లేకపోతే నోటీసు వస్తుంది. అంటే ధర్మరాజుపురిలో బందీ అయ్యే
నోటిసు వస్తుంది. అందువలన పురుషార్ధం చేసి డిగ్రీ తీసుకోవాలి. నోటీసు రాకూడదు.
నోటీసు వచ్చినవారు సిగ్గుపడతారు కదా! అందువలన ఎంత వరకు యోగ్యంగా అయ్యాను అని
సదా పరిశీలించుకోండి. ఇవైతే ముఖ్య లక్షణాలు చెప్పాను. కానీ లిస్ట్ చాలా
పెద్దది. ప్రతి లక్షణం వెనుక సంపూర్ణం అనే మాట ఉంటుంది, అంటే ఫెయిత్ ఫుల్, పవర్
ఫుల్ .... ఇలా సర్వ గుణాలలో సంపూర్ణం (ఫుల్) అయినప్పుడే డిగ్రీ లభిస్తుంది.
అందరు విజయీలు అవుతారు. కానీ సంపూర్ణ విజయీలా, సంపూర్ణ శక్తివంతులా అనేది
చూస్తారు. ఎవరైతే అన్ని గుణాలలో సంపూర్ణం అవుతారో వారికే "సంపూర్ణ అవ్యక్త
పరిస్తా” అనే డిగ్రీ లభిస్తుంది. అందరు ఇదే లక్ష్యం పెట్టుకున్నారు కదా!
ఇప్పుడు వర్తమాన సమయం ఎటువంటిది? ఇప్పుడు చాలా నాజూకు సమయం. ఇప్పుడు అల్లరిగా
నడిచే సమయం కాదు. ఈ నాజూకు సమయంలో కూడా అల్లరిగా నడిస్తే ఫలితంలో నష్టమే
ఉంటుంది. అందువలన ఇప్పుడు సంహారమూర్తి అవ్వాలి. విరాఠ రూపాన్ని ధరించాలి.
రోజురోజుకీ సమయం నాజూకు అవుతుంది. కనుక సంహారమూర్తిగా అవ్వాలి. వేటిని
సంహరించాలి? మీ సంస్కారాలని. ఇప్పుడు మీ వికర్మలపై మరియు వికర్మ చేసే ఆత్మలపై
ఇప్పుడు విరాఠ రూపం ధారణ చేసి ఒక సెకనులో భస్మం చేయాలి. శంకరుడు కన్ను తెరవగానే
ఒక సెకనులో వినాశనం అయిపోతుంది అని అంటారు కదా! ఇది సంహారమూర్తి కర్తవ్యం యొక్క
స్మృతిచిహ్నం. విరాఠ రూపీ అయ్యి ఎవరిపైనైనా దృష్టి వేసి వారి వికారి
సంస్కారాలని భస్మం చేయాలి. కనుక వికర్మలు, వ్యర్ధ కర్మలు మరియు వికర్మలపై
ఇప్పుడు విరాఠ రూపాన్నిధరించాలి. ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని
ధరించాలి, విరాఠ సంహారి రూపం ధరించాలి. ఇది అంతిమ సమయం. ఇప్పుడు విరాఠ రూపధారి
అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మీలను ఎదుర్కోలేరు. ఇప్పుడు ఇముడ్చుకునే సమయం
కాదు. వికర్మలను, వ్యర్ద సంకల్పాలను లేక వికర్మల యొక్క వికర్మ, మరియు నడవడికను
ఇముడ్చుకోవటం కాదు, సంహరించాలి. ఇప్పుడు స్నేహాన్ని ఇముడ్చుకోవాలి. శక్తి
రూపాన్ని ప్రత్యక్షం చేయాలి. శక్తులు ఒకే సమయంలో 3 విషయాలు ధారణ చేయాలి.
1.మస్తకంలో స్నేహ గుణం 2.రూపంలో ఆత్మీయత మరియు 3.వాణీలో వజ్రం వలె గట్టిగా
ఉండాలి. ఒకొక్క మాట వికర్మలను మరియు వికర్మీలను సమాప్తి చేసే విధంగా ఉండాలి.
ఎప్పుడైతే ఈ మూడు విషయాలను ధారణ చేస్తారో అప్పుడే వికర్మలు మరియు వికర్మీలు
భస్మం అయిపోతారు. శక్తుల దృష్టి ద్వారా వికర్మీ ఆత్మలు కంపించిపోతారు. వేటితో?
తమ వికర్మలతో కంపించిపోతారు. కనుక ఇప్పుడు సంహారకారి అవ్వండి మరియు త్వరత్వరగా
సంహారం చేయండి. అక్కడక్కడ అలంకరణ చేసుకుంటూ సంహార కర్తవ్యాన్ని
మర్చిపోతున్నారు. చాలా అలంకరించుకున్నారు, ఇప్పుడు సంహారం చేయండి. మాస్టర్
బ్రహ్మ అయ్యారు, పాలన చేసారు, అలంకరణ చేసుకున్నారు, కాని ఇప్పుడు సంహరించే
పాత్ర అభినయించాలి. శక్తుల అలంకరణ మరియు శక్తులు చేసే నవాలు మరియు శక్తుల యొక్క
ఏ కార్యం కొరకు మహిమ ఉంది? సింహగర్జన. సింహగర్జన చేసి ఆసురీలపై నాట్యం చేయాలి.
నాట్యం చేయటం ద్వారా ఏమౌతుంది? నాట్యం చేస్తే క్రింద ఉన్న వస్తువులు అణిగిపోయి
సమాప్తి అయిపోతాయి. నిర్భయత మరియు వినాశనానికి గుర్తు ఈ సింహగర్జన. శక్తులే
కానీ పాండవులు చేయలేరు అని కాదు. పాండవులు కూడా శక్తిరూపం. శక్తిరూపంలో ఇద్దరూ
వచ్చేస్తారు. ఈ మూడు కర్తవ్యాలు ప్రత్యక్షరూపంలో నడుస్తున్నాయి. ఇప్పుడు
బలహీనుల పని కాదు. మైదానంలోకి బలహీనులు రారు, వీరులే వస్తారు. ఇప్పుడు ఎదురుగా
రండి. ఈ రూపంలో ప్రత్యక్షం అయితే తర్వాత ఏమౌతుంది? ప్రత్యక్షత. బాబా మరియు
పిల్లల యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఎంత ప్రత్యక్షం అవుతారో అంత ప్రత్యక్షత
జరుగుతుంది. బాబాని ప్రఖ్యాతి చేయడానికి ప్రత్యక్షం అవ్వాలి. ఇప్పటి వరకు మీ
బలహీనతలు వీడ్కోలు ఇవ్వకపోతే విశ్వ కళ్యాణకారిగా ఎలా అవుతారు? అందువలన మీ
బలహీనతలకి ఇప్పుడే వీడ్కోలు ఇచ్చేయండి, అప్పుడే విశ్వకళ్యాణకారిగా కాగలరు.
మంచిది.