30.07.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహారథి అంటే మహానత.

ఈరోజు పాండవ సేన భట్టీ యొక్క సమాప్తి సమారోహమా లేక ఈరోజు ప్రారంభం చేస్తున్నారా? (సమీపత ప్రారంభం అయ్యింది). విశేషంగా ఏమి వృద్ధి చేసుకున్నారు మరియు దాని కొరకు విశేషంగా ఏమి సంకల్పం చేసారు? పరివర్తన ప్రారంభమైందా లేక అవుతుందా? సంకల్ప రూపంలోకి తీసుకువచ్చారా లేక సంస్కార రూపంలో నింపుకున్నారా? (ప్రతి ఒక్కరు తమ ఆలోచన చెప్పారు) పాండవసేన భట్టీ యొక్క పేపర్ ఇది. ఈ ఒక్క ప్రశ్నతో పరీక్ష అయిపోయింది. వర్తమాన సమయంలో సంకల్పం మరియు కర్మ వెనువెంట ఉండటమే అవసరం. ఇప్పుడిప్పుడే సంకల్పం చేసారు, ఇప్పుడిప్పుడే కర్మలోకి తీసుకువచ్చారు. సంకల్పం మరియు కర్మలో చాలా తేడా ఉండకూడదు. మహారథి అంటే మహానత అని అర్థం. మహానత కేవలం సంకల్పంలోనే కాదు, అన్నింటిలో ఉండాలి. ఇది మహారథిలకు గుర్తు. సంకల్పాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురావటానికి ఆలోచించడంలో సమయం పట్టదు. ఎందుకంటే మహారథిల సంకల్పం ప్రత్యక్షంలో సంభవం అయ్యే విధంగా ఉంటుంది. ఇది చేయాలా, వద్దా? ఎలా చేయాలి, ఏమౌతుంది..... ఇలా ఆలోచించవలసిన అవసరం ఉండదు. సంకల్పం రాగానే సిద్ధి అయిపోయే విధమైన సంకల్పాలు ఉత్పన్నం అవుతాయి. దీని ద్వారా మీ స్థితిని పరిశీలించుకోగలరు.

యోగసిద్ధిని పొందటం, కర్మ సిద్ధిని పొందటమే అంతిమ స్థితి. అన్నీ సిద్ధించాలంటే ముఖ్యంగా ఏ శక్తి ధారణ చేయాలి? సంకల్పం, వాణి, కర్మ అన్నీ సిద్ధి పొందాలి. దీని కొరకు ఏ శక్తి కావాలి? అందరు ఏవైతే శక్తులు చెప్పారో అవి అన్ని సరైనవే. కానీ వీటన్నింటి కంటే ముందు కంట్రోలింగ్ పవర్ (అదుపులో పెట్టుకునే శక్తి) కావాలి. ఒకవేళ నియంత్రణ లేకపోతే వ్యర్ధం కలిసిన కారణంగా సిద్ధి లభించదు. యదార్థ సంకల్పానికి, మాటకి, కర్మకి సిద్ధి లభించకుండా ఉండదు. కానీ వ్యర్థం కలుస్తున్న కారణంగా సిద్ధి లభించటం లేదు. యదార్థతకి సిద్ధి లభిస్తుంది. వ్యర్థానికి లభించదు. వ్యర్థాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దీని కొరకు కంట్రోలింగ్ పవర్ తప్పక కావాలి. ఏదొక బలహీనత కారణంగా కంట్రోలింగ్ పవర్ లోపంగా ఉంది. ఈ బలహీనత ఎందుకు వస్తుంది? తమ సంస్కారాలని తొలగించుకోలేకపోతున్నారు. ఈ సంకల్పం యదార్ధమా లేక వ్యర్ధమా అని తెలుసుకుంటూ కూడా కంట్రోలింగ్ పవర్ లేదు, అదుపులో చేసుకున్నప్పుడు ఆ సంస్కారానికి బదులు మరో సంస్కారాన్ని నింపుకోగలరు. నియంత్రణా శక్తి యొక్క లోపం కారణంగా స్వయాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. మీ రచనకి రచయితగా అవ్వటం వస్తుందా? ఏ రచన రచించాలో ఆ యదార్ధ రచన రచించడంలో లోపం ఉంది. స్వయమే అలజడి అయిపోయేలాంటి రచన రచిస్తున్నారు. ఇప్పుడు పాండవ సేన ప్రత్యక్షంలో ఏమి ఉదాహరణ ఇవ్వాలి? బలహీన మాటలు, బలహీన కర్మ యొక్క సమాప్తి సమారోహం చేయాలి. భట్టి యొక్క సమాప్తి సమారోహం కాదు. బలహీనత యొక్క సమాప్తి మరియు సంకల్పం శక్తిశాలిగా ఉండాలి. ఒకొక్క సంకల్పం అద్భుతం చేసి చూపించేదిగా ఉండాలి. బలహీనత స్థానంలో అద్భుతం నిండాలి. బలహీనత అనే మాటయే ఇప్పుడు శోభించదు. విశ్వం అంతా మీపై ఆధారపడి ఉంది. విశ్వానికి ఆధారమూర్తులు మరియు ఉద్ధారమూర్తులు అయిన వారి నోటి నుండి బలహీనత అనే మాట రావటం శోభించదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మూర్తి ద్వారా అందరికీ ఏమి సాక్షాత్కారం అవుతుంది? బాప్ దాదా యొక్క సాక్షాత్కారం. ఇలాంటి అలౌకిక మెరుపు అందరి మూర్తిలో కనిపించాలి. ఎవరైనా కానీ ఆ మెరుపుని చూసి బలి అయిపోవాలి. అందరినీ బలి చేయగలరు. కొందరికి ముక్తిధామం, కొందరికి జీవన్ముక్తిధామం యొక్క మార్గం చూపించాలి. ఎవరు తమ పాత్ర యొక్క హక్కు మీ నుండి తీసుకోకుండా ఉండకూడదు. ఆత్మలందరికీ మీ ద్వారా తమ యదార్ధ పాత్ర మరియు బాబా యొక్క వారసత్వం తప్పకుండా తీసుకోవాలి. మీ మూర్తిలో ఇలాంటి మెరుపు ఉండాలి - ఎవరు తమ వారసత్వం తీసుకోవటం నుండి వంచితం కాకూడదు. ఇలా మిమ్మల్ని మీరు దాత యొక్క పిల్లలుగా, దాతగా భావించాలి. ఇచ్చేవారిలో సంతోషం మరియు మెరుపు ఉంటుంది. అది ఇప్పుడు గుప్తంగా ఉంది. ఆ సంస్కారాలను ఇప్పుడు ప్రత్యక్షం చేయండి. ఏ విషయంలో నిమగ్నం అయి ఉన్న కారణంగా ఆ మెరుపు ఇప్పటికీ ప్రత్యక్షం కాలేదు? బలహీనతలను తొలగించుకోవటంలో బిజీగా ఉన్నారు. సమాప్తి చేసుకోవాలి, కానీ త్వరగా పూర్తి చేసుకోవాలి. అదే ఖాతాను కొందరు 5 ని||లో కొందరు అరగంటలో పూర్తి చేసుకుంటున్నారు. కొందరు అయితే రోజంతా ఆలోచిస్తూ కూడా ఖాతా పూర్తి చేసుకోలేకపోతున్నారు. మీరందరు విశేష ఆత్మలు, విశేష ఆత్మల ప్రతి సంకల్పం, ప్రతి కర్మ విశేషంగా ఉండాలి. వాటి ద్వారా ప్రతి ఆత్మకి ముందుకి వెళ్ళే ప్రేరణ లభించాలి. ఎందుకంటే మీరందరూ ఆధారమూర్తులు. ఒకవేళ ఆధారమూర్తులే ఇలా ఉంటే ఇతరులు ఏమి చేస్తారు? విశేష ఆత్మలు కనుక విశేష ధ్యాస పెట్టుకోవాలి. జరిగిపోయిన దానిని ఇప్పుడు సంకల్పంలోకి కూడా రానివ్వకూడదు. ఒకవేళ పొరపాటుగా అయినా పాత సంస్కారాల విషం ప్రత్యక్షం అయినా కానీ ఇది పూర్వజన్మ యొక్క సంస్కారం అని భావించండి. ఇప్పటిది కాదు. జరిగిపోయిన పాత విషయాలను మాటిమాటికి ఎవరైనా వర్ణన చేస్తే దానిని వ్యర్ధం అంటారు. ఈ పాండవ సేన మొదట పరివారంలో ఒక ఉదాహరణ అయ్యి చూపించాలి. ఎలా అయితే సాకార బాబా ఉదాహరణ అయ్యారు కదా! బాబాని అనుసరించండి. అందువలనే ఈరోజు పాత సంస్కారాలు మరియు సంకల్పాల సమాప్తి సమారోహం యొక్క రోజు. అర్ధమైందా!

ఈ గ్రూపు యొక్క పేరు ఏమిటి? పేరు పెట్టేటప్పుడు దేని ఆధారంగా పెడతారు? ఈరోజు ఏ రోజు? బృహస్పతి వారం (గురువారం). బృహస్పతి దశ అంటే సఫలత. కనుక ఈ గ్రూపు సర్వులకి సహయోగి, సఫలతామూర్తుల సంఘటన. ఎప్పుడైనా ఏ రకంగా అయినా ఎవరికైనా సహయోగం కావాలంటే దాత యొక్క పిల్లలు సదా ఇచ్చేవారిగానే ఉంటారు. వారి చేయి ఎప్పుడూ ఇవ్వడంలో ఆగదు. ఎప్పుడైతే సర్వులకి స్నేహి అవుతారో అప్పుడే సర్వులకి సహయోగి అవుతారు. స్నేహిగా కాకపోతే సర్యులకి సహయోగిగా కూడా కాలేరు. అందువలన ఈ గ్రూపు మనసా, వాచా, కర్మణా మరియు సంబంధంలో కూడా సహయోగి అవ్వాలి మరియు సపలతామూర్తి అవ్వాలి. అందువలన సర్వుల సహయోగి సఫలతామూర్తుల సంఘటన అని చెప్పాను.

సర్వులకి సహయోగి అవ్వడానికి మీకు మీరు తొలగించుకోవలసి కూడా ఉంటుంది. కార్యం నుండి తొలగిపోకూడదు. మిమ్మల్ని మీరు తొలగించుకోవటం అంటే పాత సంస్కారాలని తొలగించుకోవాలి. పాత సంస్కారాలే సర్వులకి సహయోగి అవ్వటంలో విఘ్నం వేస్తాయి. కనుక మీ సంస్కారాలను తొలగించుకోవాలి. ఇతరుల సంస్కారాలను తొలగించటం గురించి చెప్పటం లేదు. మీ సంస్కారాలని తొలగించుకుంటే ఇతరులు మిమ్మల్ని స్వతహాగానే అనుసరిస్తారు. 1. స్వయం 2. బాబా ఇక మూడవవారిని చూస్తూ కూడా చూడకండి. మూడవ విషయం చూడవలసి వచ్చినా కానీ చూస్తూ చూడకుండా మిమ్మల్ని మరియు బాబాని చూడండి. ఇదే స్లోగన్ స్మృతి ఉంచుకోవాలి. తొలగించుకుంటాం కానీ సర్వులకి సహయోగి అవుతాం. కల్పపూర్వపు జ్ఞాపకం ఉందా? గోవర్ధనగిరి యొక్క స్మృతిచిహ్న రూపం ఏమి తయారుచేస్తారు? ఎప్పుడైనా చూశారా? భక్తిమార్గంలో గోవర్ధనగిరి పూజ కోసం ఏమి తయారుచేస్తారు? (గొబ్బెమ్మలు తయారుచేస్తారు). పరత్వానికి వ్రేలు ఇవ్వడం అంటే పాత సంస్కారాలు తొలగించుకోవడంలో వ్రేలు ఇవ్వటం. మొదట ఈ పరత్వం ఎత్తాలి. అప్పుడు ఈ కలియుగీ ప్రపంచం మారి మరలా కొత్త ప్రపంచం తయారవుతుంది. ఏదొక స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి. అది కూడా మంచిదే. కానీ స్లోగన్ యొక్క స్వరూపంగా కూడా అవ్వాలి. స్లోగన్ అనేది ఒక సాధనం, కానీ సాధన ద్వారా స్వరూపం అవ్వటం మంచిది. ఏ విశేషత ద్వారా మాలలో మణులుగా అవుతారు? మణుల యొక్క విశేషత ఇదే - ఏకమతంగా అయ్యి ఒకే దారంలో గ్రుచ్చబడతారు. ఒకే సంలగ్నత, ఏకరస స్థితి మరియు ఏకమతం అన్నీ ఒకటే ఒకటి. ఒకే రకం మణులు ఒకే దారంలో ఉంటాయి కదా! అదేవిధంగా ఒకే మతంపై నడిచేవారిగా ఉండాలి మరియు పరస్పరంలో కూడా ఏకమతంగా ఉండాలి. సంకల్పం కూడా ఒకే విధంగా ఉండాలి. రెండు మతాలు ఉంటే వారు రెండవ అంటే 16,000 మాలలో పూసలు అవుతారు. ఒకే మతం ఉండే వాతావరణం తయారుచేయాలి. ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడే అలాంటి వాతావరణం తయారవుతుంది. ఏదొక విషయంలో భిన్నత వస్తుందనుకోండి, ఎందుకంటే శక్తిననుసరించి, యోగ్యతననుసరించి ఉంటారు కదా! కనుక భిన్నతని ఇముడ్చుకోండి. ఇముడ్చుకునే శక్తి కావాలి. ఇలా పరస్సరంలో ఏకత ద్వారానే సమీపంగా వస్తారు. అందరి ఎదురుగా ఉదాహరణగా అవుతారు. అందరిలో ఎవరి విశేషత వారికి ఉంటుంది. ఎవరైనా కానీ వారి విశేషతలను చూస్తే మీరు విశేష ఆత్మగా అయిపోతారు. లోపాలను పూర్తిగా చూడకూడదు. ఎలా అయితే చంద్రునికి, సూర్యునికి గ్రహణం పడితే చూడకూడదు అంటారు కదా! లేకపోతే గ్రహచారం పట్టుకుంటుంది అంటారు. అలాగే ఎవరి లోపమైనా కానీ అది కూడా గ్రహణం. ఎవరైనా పొరపాటుగా చూసినా కానీ గ్రహచారం పట్టుకుంటుంది. కనుక సత్యమైన బంగారంగా అవ్వాలి. ఏదైనా కొద్దిగా కల్తీ ఉన్నా అదే కనిపిస్తుంది. విశేషతలని అణిచి వేస్తుంది. ఇతరులపై ప్రభావం పడేలా మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. ఒక దెబ్బతో పరివర్తన చేయాలి. ఒక్కసారిగా అతీతం అయిపోతే ఇతరుల తగుల్పాటు కూడా స్వతహాగానే తొలగిపోతుంది. మంచిది.