22.10.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణస్థితికి గుర్తు లోపం లేనివారిగా అవ్వటం.

అన్నీ తెలిసినవారిగా అనగా మాస్టర్ అయ్యారా? మాస్టర్ జ్ఞానసాగరులు అయ్యారా? మాస్టర్ జ్ఞానసాగరులు అయ్యి మొత్తం జ్ఞానం అంతా తెలుసుకున్నారా? మాస్టర్ జ్ఞానసాగరులు అన్నీ తెలిసిన మాస్టర్‌ అయ్యారా లేక అవుతున్నారా? ఇప్పటి వరకు అవుతూనే ఉన్నారా? జ్ఞానసాగరులు అయిపోయారా లేక అవుతున్నారా? జ్ఞానసాగరులు అవుతున్నారా లేక దయాసాగరులుగా అవుతున్నారా? తయారవుతున్నారా లేక తయారై పోయారా? (తయారువుతున్నాము). ఎంత వరకు అంతిమ స్థితి సాకార బాబాలో చూసారు కదా! అంతవరకు జ్ఞాన సాగరులుగా అన్నీ తెలిసినవారిగా అయ్యారా? సాకార బాబా సమానంగా అవ్వటంలో తేడా ఉంది. అందువలనే సంపూర్ణం అనటం లేదు. ఎంత సంపూర్ణంగా అవ్వాలో ఉదాహరణ స్పష్టంగా ఉంది కదా! మాస్టర్ రచయిత యొక్క నషాలో ఎక్కువ ఉంటున్నారా లేక రచన యొక్క నషాలో ఉంటున్నారా? ఏ నషాలో ఎక్కువ సమయం ఉంటున్నారు? ఈరోజు ఈ ప్రశ్న ఎందుకు అడిగాను? ఈరోజు సర్వ రత్నాలను చూస్తున్నాను మరియు పరిశీలిస్తున్నాను. ఎంత వరకు లోపం లేనివారిగా అంటే సంపూర్ణంగా అయ్యారని. ఒకవేళ సంపూర్ణం కాకపోతే ఫెయిల్ అయిపోతారు. కనుక ఈ రోజు సంపూర్ణం మరియు ఫెయిల్ యొక్క రేఖ చూస్తున్నాను. అప్పుడు ప్రశ్న అడిగాను - సంపూర్ణం అయ్యారా? బాబా యొక్క మహిమ - సర్వ గుణాలలో సంపన్నం కదా! కనుక పిల్లలు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులు అవ్వవలసిందే. కేవలం జ్ఞానం కలిగి ఉండటం కాదు. కానీ మాస్టర్ జ్ఞానసాగరులు అవ్వాలి. అందువలన మాస్టర్ జ్ఞాన సాగరులు అయ్యారా? అని ప్రశ్నించాను. మాస్టర్ కదా! మాస్టర్ జ్ఞాన సాగరులు కూడా లేదు అని చెప్తారా? ఒకవేళ మీకు రెండు లెక్కలు ఉంటే బాప్ దాదాకి కూడా 2 రహస్యాలు ఉన్నాయి. ఈరోజు ఒకొక్కరిలో మూడు విషయాలు విశేషంగా చూస్తున్నారు. ఈ రోజు అమృతవేళ ఏమి చూశారో ఆ దినచర్య చెప్తున్నాను. ఈ రోజున బాప్ దాదా ఒకొక్క రత్నంలో మూడు విషయాలు చూసారు. అవి ఏమిటి? ఇది కూడా ఒక వ్యాయామం. ఈరోజు ఏ మూడు విషయాలు చూస్తున్నారు అంటే 1.ప్రతి ఒక్కరి లైట్ (ప్రకాశం) 2. మైట్ (శక్తి) మరియు 3. రైట్ (హక్కు). రైట్ అనే మాటకి (ఆంగ్లభాషలో) రెండు అర్థాలు ఉన్నాయి. 1. రైట్ అని సత్యాన్ని అంటారు. 2. రైట్ అని అధికారాన్ని అంటారు. అధికారిగా ఎంత అయ్యారు మరియు ఎంత యదార్థ రూపంలో ఉన్నారు. కనుక రైట్, మైట్ మరియు లైట్. ఈ మూడు విషయాలు చూశారు. ఫలితం ఏమి వచ్చిందో కూడా చెప్తున్నాను. ఇప్పుడు చాలా సేపు చేసారు కదా! కనుక దాని యొక్క ఫలితం చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం ధ్వని వ్యాపించే వరకే ఫలితం ఉంది. ధ్వని వ్యాపింప చేయడంలో పాస్ అయిపోయారు. కానీ ఆత్మలని బాబా సమీపంగా తీసుకువచ్చే ఆహ్వానం ఇప్పుడు చేయాలి. ధ్వనిని వ్యాపించారు. కానీ ఆత్మలని ఆహ్వానం చేయటం మరియు బాబాకి సమీపంగా తీసుకురావటం ఈ పురుషార్ధం ఇప్పుడు మిగిలి ఉంది. ఎందుకంటే స్వయం కూడా ధ్వనికి అతీతంగా వెళ్ళే కోరికతో ఉన్నారు. కానీ అభ్యాసిగా లేరు. అందువలన మాట ద్వారా మాటను వ్యాపింపచేస్తున్నారు. కానీ ఎంత స్వయం ఆ మాటకి అతీతంగా అయ్యి సంపూర్ణతని స్వయంలో ఆహ్వానం చేస్తారో అంతగా ఆత్మలని ఆహ్వానం చేయగలరు. ఇప్పుడు కూడా ఆహ్వానం చేస్తున్నారు. కానీ ఫలితం - రాకపోకలలో ఉన్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఆహ్వానం తర్వాత వారు వచ్చి ఆహుతి అయిపోవాలి. ఈ కర్తవ్యం ఇప్పుడు చేయాలి. జ్ఞానం వైపు ఆకర్షితం అవుతున్నారు, కానీ జ్ఞాన సాగరుని వైపు ఆకర్షితం చేయాలి. ఇప్పటి వరకు మాస్టర్ రచయిత అయిన వారు రచన యొక్క ఆకర్షణలో ఆకర్షితం అయిపోతున్నారు. అందువలన స్వయం ఎవరు ఎంతగా ఉన్నారో అలా మరియు అంతగానే ఉదాహరణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు శక్తిరూపం మరియు మహావీర స్వరూపం ముఖకవళికలలో లేదు. శక్తి లేదా మహావీర ముఖం ఎలా కనిపించాలంటే ఏ ఆసురీ లక్షణానికి వచ్చే ధైర్యం ఉండకూడదు. కానీ ఇప్పటి వరకు ఆసురీ లక్షణాలతో పాటు అక్కడక్కడ అసురీ లక్షణాలు కలవారు కూడా ఆకర్షితం చేస్తున్నారు. దీనిని మీరు రాయల్ మాయ రూపంలో వాతావరణం అలా ఉంది అంటారు, వైబ్రేషన్ అలా ఉంది, సమస్య అలా ఉంది కనుక ఓడిపోయాము అంటారు.

కారణం చెప్పటం అంటే మిమ్మల్ని మీరు కారాగారంలో బంధించుకోవటం. ఇప్పుడు సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇక కారణాలు వినరు. చాలా సమయం కారణాలు విన్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యం చూపించాలి. కానీ కారణాలు కాదు. ఇప్పుడు కొద్ది సమయంలో ధర్మరాజు యొక్క రూపాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతిమ సమయం. అనుభవం చేసుకుంటారు - ఇంత సమయం తండ్రి రూపంలో కారణాలు విన్నారు, స్నేహం ఇచ్చారు, దయ చూపించారు. చాలా క్షమించారు. కానీ ఇక ఆ రోజులు చాలా కొద్దిగా ఉన్నాయి. ఇక ముందు ఒక సంకల్పం యొక్క పొరపాటు ద్వారా ఒకటికి 100 రెట్లు శిక్ష ఎలా లభిస్తుందో అనుభవం చేసుకుంటారు. ఇప్పుడిప్పుడే చేసారు మరియు ఇప్పుడిప్పుడే దానికి ఫలం లేదా శిక్ష ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు అటువంటి సమయం చాలా త్వరలో రానున్నది. అందువలనే బాప్ దాదా నూచన ఇస్తున్నారు, ఎందుకంటే బాప్ దాదా పిల్లల స్నేహి, ఇప్పుడు మాస్టర్ రచయిత స్థితి యొక్క నషాను ధారణ చేసి రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి. బాబా ఎదురుగా రచన ఉంది. కానీ ఇప్పుడు ఇలాంటి సమయం రానున్నది - మాస్టర్ రచయిత, మాస్టర్ జ్ఞానసాగరులు అయ్యి శక్తిశాలి స్థితిలో లేకపోతే రచన ఇంకా రకరకాల రంగు, రూపం రచిస్తుంది. అందువలన సంపూర్ణంగా అయ్యేటందుకు మీ స్థితిలో పూర్తిగా స్థితులవ్వండి. అప్పుడు ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. ఇప్పుడు చిన్నతనం యొక్క పొరపాటు, సోమరితనం యొక్క పొరపాట్లు, బద్దకం, నిశ్చింత యొక్క పొరపాట్లు ఉన్నాయి. ఈ నాలుగు రకాల పొరపాట్లని సత్యయుగంలో మర్చిపోయినట్లు మర్చిపోండి. ఇలా శక్తిశాలి స్వరూపం, శస్త్రధారి స్వరూపం, సదా జాగృతి స్వరూపమై మీ ప్రత్యక్ష రూపం చూపించండి. ఇప్పుడే మీ భక్తులు గుప్త వేషధారి దేవతలైన మిమ్మల్ని పొందడానికి దాహంతో ఉన్నారు. మీ సంపూర్ణ మూర్తి ప్రత్యక్షం అయినప్పుడే మీ శక్తులు ప్రత్యక్షంలో తమ ఇష్టదేవతని పొందుతారు. ఇప్పుడు అనేక రకాలుగా ఉన్నారు. ధ్వని వింటారు, కానీ ఇది కూడా స్మృతి ఉంచుకోవాలి. ఒకవైపు ఆసురీ ఆత్మల ధ్వని, ఆకర్షణ ఇంకా పూర్తి ఫోర్సులో ఉంటుంది. రెండవవైపు మీ భక్తుల పిలుపు కూడా అనేక రకాలుగా మరియు పూర్తి ఫోర్సులో ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో ఏదీ తీసుకురావాలి, ఏది తీసుకురాకూడదు అనేది కూడా పరిశీలించే బుద్ది ఉండాలి. అందువలన ఇప్పుడు దయ చూపించే సమయం అయిపోయింది. ఇప్పుడు ఆత్మీయత యొక్క సమయం. ఒకవేళ ఆత్మీయత లేకపోతే రకరకాల మాయా రంగుల్లోకి వచ్చేస్తారు. అందువలన ఈ రోజు బాప్ దాదా మరలా సూచన ఇస్తున్నారు. ఎలా అయితే మిలట్రీ సేన మొదట ఒక ఈల వేస్తారు. తర్వాత చివరి ఈల అంతిమం. అదేవిధంగా అపాయకర సమయం అనే సూచనకి ఈ రోజు ఇది మొదటి ఈల. తయారుగా ఉండడానికి ఈల వేస్తారు. అందువలన ఇప్పుడు పరీక్షల పేపర్ తీసుకోవడానికి తయారవ్వండి. బాప్ దాదా ఇరువురు అవ్యక్తులు, మేము వ్యక్తంలో ఏమి చేసినా పర్వాలేదు అని భావించకండి. ప్రతీ ఒక్కరికి ఒకొక్క సెకను యొక్క , ఒకొక్క సంకల్పం యొక్క చిత్రం వతనంలో స్పష్టంగా ఉంటుంది. అందువలన నిశ్చింతగా అవ్వకండి. ఈశ్వరీయ మర్యాదలతో నిశ్చింత అవ్వకండి. ఆసురీ మర్యాదలు లేదా మాయతో నిశ్చింత అవ్వాలి. ఈశ్వరీయ మర్యాదలతో కాదు. నిశ్చింత యొక్క ప్రవాహం కొంచెం కొంచెం వతనం వరకు చేరుకుంటుంది. అందువలన ఈ రోజు బాప్ దాదా మరలా స్మృతి ఇప్పిస్తున్నారు. సంపూర్ణతని సమీపంగా తీసుకురావాలి. సమస్యలని దూరంగా పారద్రోలాలి.
సంపూర్ణతని సమీపంగా తీసుకురావాలి. అక్కడక్కడ సంపూర్ణతకి బదులు సమస్యలను ఎదురుగా పెట్టుకుంటున్నారు. సమస్యలని ఎదుర్కుంటే సమస్యలు సమాప్తి అయిపోతాయి. కానీ ఎదుర్కోవటం రావటం లేదు. అందువలన ఒక సమస్య నుండి అనేక సమస్యలు వచ్చేస్తాయి. ఆ సమస్య ఉత్పన్నం అవ్వగానే అక్కడే సమాప్తి చేసేస్తే వృద్ధి అవ్వవు. సమస్యని వెంటనే సమాప్తి చేస్తే వంశం వృద్ధి అవ్వదు. అంశం ఉంటే వంశం అవుతుంది. అంశాన్నే సమాప్తి చేసేస్తే వంశం ఎక్కడి నుండి వస్తుంది? కనుక సమస్యల జననాన్ని అదుపు చేయాలి. ఇప్పుడు సైగ మాత్రంగా చెప్తున్నాను. తర్వాత ప్రత్యక్ష రూపంలో అన్నింటినీ మీ స్థితియే చెప్తుంది, దాగదు. నారదుని ముఖం సభ మధ్యలో దాగిందా? అలాగే ఇప్పుడు బాబా గుప్తంగా ఉంచుతున్నారు, కానీ కొంచెం సమయం తర్వాత గుప్తంగా ఉండలేరు. వారి ముఖం వారి నడవడికను ప్రత్యక్షం చేస్తుంది. ఈ రోజులలో సైన్స్ వారు పరిశోధన చేస్తున్నారు. గుప్త వస్తువు ఏదైనా కానీ ప్రత్యక్షం అవ్వాలని. అలాగే శాంతిశక్తి కూడా స్వతహాగా ప్రత్యక్షం అవుతుంది. చెప్పటం లేదా చేయటం ద్వారా అవ్వదు. అర్ధమైందా!

కనుక భవిష్య సమయం యొక్క సూచన ఇస్తున్నాను. అందువలన ఇప్పుడు అపాయకర సమయాన్ని ఎదుర్కునేటందుకు నాజూకు స్థితి వదలాలి. అప్పుడే అపాయకర సమయాన్ని ఎదుర్కోగలరు. హర్షితముఖిగా ఉండే గుణం పురుషార్ధంలో చాలా సహాయం చేస్తుంది. ముఖం ఎలా హర్షితంగా ఉంటుందో అలాగే ఆత్మ కూడా సదా హర్షితంగా ఉండాలి. ఈ సహజ గుణాన్ని ఆత్మలో తీసుకురావాలి. సదా హర్షితంగా ఉంటే మాయా ఆకర్షణ ఏదీ ఉండదు. ఇది బాబా యొక్క గ్యారంటీ. కానీ ఆత్మ సదా హర్షితంగా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. హర్షితంగా ఉంటే అప్పుడే మాయ ఆకర్షణ నుండి దూరంగా ఉంచటం బాబా యొక్క పని. ఈ గ్యారంటీ బాబా మీతో విశేషంగా చేస్తున్నారు, అందరితో చేయటం లేదు. ఎందుకంటే ఆది రత్నాలతో ఆదిదేవునికి విశేష స్నేహం ఉంటుంది. కనుక ఆదిని అనాదిగా చేయండి. అనాదిగా అయిపోతే మాయా ఆకర్షణ ఉండదు. సమస్యలు ఎదురుగా రావు. బాబా యొక్క స్నేహం స్మృతిలో ఉంటే ఆ సర్వశక్తివంతుని స్నేహం ముందు సమస్య ఎలా ఉంటుంది? ఎక్కడ బాబా యొక్క స్నేహం, ఎక్కడ సమస్య? చిన్న రాయి మరియు పర్వతానికి ఉన్నంత తేడా ఉంది. అనాది రత్నంగా అయ్యేటందుకు సర్వశక్తివంతుని శక్తి మరియు స్నేహాన్ని సదా వెంట ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ ఒంటరిగా భావించకూడదు. తోడు లేకుండా జీవితం యొక్క ఒక సెకను కూడా ఉండకూడదు. స్నేహి, సహయోగులు ఎప్పుడు వేరు కారు. తోడు అయిన బాబాని వెంటనే ఉంచుకోకుండా ఒంటరిగా ఉండటం వలన మాయ విజయం పొందుతుంది.