05.11.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఆలస్యం ప్రమాదకరమైనది.

ప్రతి ఒక్కరు మీ ప్రకాశాన్ని మరియు శక్తిని (లైట్ - మైట్) పరిశీలించుకోగలుగుతున్నారా? స్వయాన్ని పరిశీలించుకునే పరిశీలనా శక్తి మీలో ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు పురుషార్ధి మూర్తిగా భావిస్తున్నారా లేక సాక్షాత్తు మరియు సాక్షాత్కార మూర్తిగా కూడా భావిస్తున్నారా? అనుభవం చేసుకుంటున్నారా? ఇది అంతిమ స్థితి అని భావిస్తున్నారా? ఇప్పుడే మీ భక్తులు మీ ఎదురుగా వస్తే మీ ముఖం ద్వారా వారికి ఏ మూర్తి యొక్క సాక్షాత్కారం అవుతుంది? ఏమి సాక్షాత్కారం అవుతుంది? సాక్షాత్కార మూర్తి సదా సంపూర్ణ స్థితి యొక్క సాక్షాత్కారం చేయిస్తారు. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మీ ఎదురుగా వస్తే వారికి ఆవిధమైన సంపూర్ణ స్థితిని సాక్షాత్కారం చేయించగలుతున్నారా? మీ పురుషార్థం యొక్క ఎక్కేకళ మరియు దిగేకళ వారికి సాక్షాత్కారం అవ్వటం లేదు కదా! ఫోటో తీసే సమయంలో కదిలితే ఫోటో మంచిగా వస్తుందా? అదేవిధంగా సదా ప్రతి సెకను మాకు ఫోటో తీస్తున్నారని భావించండి. ఫోటో తీయించుకునే సమయంలో అన్ని రకాలుగా ధ్యాస ఉంచుతారు. అలాగే మీపై కూడా చాలా ధ్యాస ఉంచుకోవాలి. సర్వోన్నత లేదా పురుషోత్తమ సంగమయుగం యొక్క డ్రామా రూపి కెమెరా ప్రతి సెకను మీ అందరికి ఫోటో తీస్తుంది. ఇదే చిత్రం చరిత్ర రూపంలో మహిమ చేయబడుతుంది. ఇప్పటి భిన్న - భిన్న స్థితుల యొక్క చిత్రం భిన్న - భిన్న రూపాలలో పూజింపబడుతుంది. డ్రామా రూపి కెమెరాలో ఫోటో తీయించుకుంటున్నాను అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇప్పటి ఒకొక్క చిత్రం, ఒక్కొక్క చరిత్ర మహిమ పూజకి యోగ్యంగా అవుతుంది. ఇక్కడ కూడా మీరు స్టేజ్ పై ఏదైనా డ్రామా వేస్తున్నప్పుడు మరియు సాక్షాత్కారం చేయించేటప్పుడు ఎంత ధ్యాస ఉంచుకుంటారు. అలాగే బేహద్ స్టేజ్ మధ్యలో నేను పాత్ర అభినయిస్తున్నాను. మొత్తం విశ్వాత్మల దృష్టి నా వైపు ఉంది అని భావించటం ద్వారా త్వరగా సంపూర్ణతని ధారణ చేయగలరు. అర్ధమైందా! ఒక స్లోగన్ సదా స్మృతి ఉంచుకుంటే దాని ద్వారా త్వరగా సంపూర్ణం కాగలరు. అది ఏ స్లోగన్? (వెళ్ళాలి మరియు రావాలి). ఇది సరే కానీ ఎలా వెళ్ళాలి? సంపూర్ణం అయ్యి వెళ్ళాలి, లేదా ఇలాగే వెళ్ళిపోతారా? దీని కొరకు ఏమి స్మృతి ఉంచుకోవాలి?

“ఆలస్యం ప్రమాదకరమైనది" అనేది స్మృతిలో ఉంచుకోవాలి. ఒకవేళ ఏదైనా విషయంలో ఆలస్యం చేస్తే రాజ్య భాగ్య అధికారం తీసుకోవటంలో కూడా అంత ఆలస్యం అవుతుంది. అందువలన సదా స్మృతి ఉంచుకోండి - వర్తమాన సమయం అనుసరించి ఒక సెకను కూడా ఆలస్యం చేయకూడదు. ఈ రోజులలో సంపూర్ణం అంటే సంపూర్ణ కర్మాతీతంగా అవ్వడానికి పురుషార్ధం చేస్తూ చేస్తూ ముఖ్యంగా ఒక ఫిర్యాదు అందరి నుండి వస్తుంది. సంపూర్ణం అవ్వాలనుకుంటున్నారు, కానీ ఆ ఫిర్యాదు సంపూర్ణం అవ్వనివ్వటం లేదు. ఆ ఫిర్యాదు ఏమిటి? వ్యర్ధ సంకల్పాల ఫిర్యాదు.

సంపూర్ణం అవ్వటంలో వ్యర్ధ సంకల్పాల తుఫాను విఘ్నం చేస్తుంది. ఇది చాలామంది యొక్క ఫిర్యాదు. ఇప్పుడు దానిని తొలగించుకోవడానికి ఈ రోజు యుక్తి చెప్తున్నాను. మనస్సు యొక్క వ్యర్ధ సంకల్పాల ఫిర్యాదు ఎలా తొలగిపోతుంది? స్మృతియాత్ర ముఖ్య విషయం. కానీ దీని కొరకు రకరకాల యుక్తులు ఉన్నాయి. అవి ఏమిటి? గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర ప్రతి సమయానికి కాల నిర్ణయం యొక్క డైరీ తయారై ఉంటుంది. వారి యొక్క ఒకొక్క గంటకి కార్యక్రమం నిర్ణయం అయి ఉంటుంది. అలాగే మీరు కూడా ఉన్నతోన్నతమైనవారు కదా! కనుక ప్రతి రోజూ అమృతవేళ రోజంతటి కాల నిర్ణయం యొక్క డైరీ తయారు చేసుకోండి. మీ మనస్సుని ప్రతి సమయం కాల నిర్ణయంలో బిజీ చేస్తే వ్యర్ధ సంకల్పాలు సమయం తీసుకోవు. కాల నిర్ణయం చేసుకోకుండా తీరికగా ఉంటే వ్యర్ధ సంకల్పాలు వస్తాయి. సమయాన్ని నిర్ణయం చేసుకునే పద్ధతి నేర్చుకోండి. మీ కాల నిర్ణయాన్ని మీరే తయారు చేసుకోండి. రోజంతటిలో ఈరోజు ఏమేమి చేయాలి అని నిర్ణయించుకోండి. అప్పుడు సమయం సఫలం అవుతుంది. మనస్సుని దేనిలో బిజీ చేయాలి? దీని కొరకు నాలుగు విషయాలు చెప్పాను. 1.కలయిక 2.వర్ణన 3. మగ్నస్థితి 4. సంలగ్నత. సంలగ్నత జోడించడంలో కూడా చాలా సమయం పడుతుంది కదా! కనుక మగ్నస్థితిలో తక్కువగా ఉంటున్నారు. అందువలనే సంలగ్నత, మగ్నస్థితి మరియు కలయిక, వర్ణన. వర్ణన అంటే సేవ. కలయిక అంటే ఆత్మిక సంభాషణ. బాప్ దాదాతో కలుసుకుంటారు కదా! కనుక ఈ నాలుగు విషయాలలో మీ సమయాన్ని నిర్ణయం చేసుకోండి. ఒకవేళ రోజు యొక్క మీ దినచర్య నిర్ణయం చేసుకుంటే మధ్యలో అలజడి చేయడానికి వ్యర్థ సంకల్పాలకి సమయమే లభించదు. గొప్ప వ్యక్తులు బిజీగా ఉన్న కారణంగా ఇతర వ్యర్థ విషయాలపై ధ్యాస మరియు సమయం పెట్టరు. అలాగే మీ దినచర్యలో సమయం నిర్ణయం చేసుకోండి. ఇంత సమయం ఈ విషయంలో, ఇంత సమయం ఈ విషయంలో ఉండాలి అని. ఇలా కాల నిర్ణయం చేసుకుంటే అప్పుడు ఈ ఫిర్యాదు సమాప్తి అయిపోతుంది మరియు సంపూర్ణంగా అయిపోతారు.