30.11.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సేవాధారుల అద్భుత సర్కస్.

మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా? ఈ గ్రూపులో ఉన్న అధర్ కుమారులు (కుటుంబంలో ఉండే అన్నయ్యలు) అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారా లేక అవ్వడానికి వచ్చారా? తయారవ్వడానికి వచ్చాము అని భావిస్తున్న వారు చేయి ఎత్తండి. ఎవరైతే తయారైపోయారో వారు ఎదురుగా రండి. మాస్టర్ సర్వశక్తివంతులు అంటే సదా పాస్, ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. ఎప్పుడూ ఏ విషయంలోనూ ఫెయిల్ అవ్వరు. ఎప్పుడైనా ఫీలింగ్ వస్తుందా? నిమిత్తమైన టీచర్స్ నుండి వీరు ఫీలింగ్ ప్రూఫ్ అనే సర్టిఫికెట్ లభించిందా? వర్తమాన సమయం ప్రకారం ఈ విషయాలు సాధారణమైనవి కాదు. వర్తమాన పురుషార్థీల ప్రకారం సాధారణమైనవి కూడా గొప్పగా లెక్కించబడతాయి. ఎంత గొప్ప వ్యక్తులు లేదా ఎంత గొప్ప ధనవంతులో అంత చిన్న చెడు కర్మ లేదా చిన్న పొరపాటు యొక్క చిన్న శిక్ష కూడా వారికి పెద్దగా అనిపిస్తుంది. అలాగే వర్తమాన సమయంలో సాధారణ విషయం కూడా గొప్పగా లెక్కించబడుతుంది. మాస్టర్ సర్వశక్తివంతులు అంటే ఫీలింగ్ కి అతీతంగా ఉండేవారు. అన్ని విషయాలలో సంపూర్ణంగా ఉంటారు. జ్ఞానసాగరులుగా ఉంటారు (నాలెడ్జ్ ఫుల్) ఇలా అన్ని మాటల చివర ఫుల్ (సంపూర్ణం) అని వస్తుంది. ఎవరు ఎంత సంపూర్ణం అవుతారో అంత ఫీలింగ్ యొక్క ప్రవాహం లేదా ఫీలింగ్ అనే ఫ్లూ సమాప్తి అయిపోతుంది. లోపం లేని వారిని సంపూర్ణం అని అంటారు. అందరు మాస్టర్ సర్వశక్తివంతులేనా? ఎవరైతే చేయి ఎత్తలేదో వారు కూడా మాస్టర్ సర్వశక్తివంతులే. ఎందుకంటే సర్వశక్తివంతుడైన బాబాని మీ వారిగా చేసుకున్నారు. సర్వశక్తివంతుడైన బాబాని సర్వసంబంధాల ద్వారా మీవారిగా చేసుకున్నారు. ఇదే మాస్టర్ సర్వశక్తివంతుల శక్తి. సర్వశక్తివంతుడిని సర్వసంబంధాలతో మీవారిగా చేసుకున్నారు. ఇంత పెద్ద ప్రత్యక్ష రుజువు లభించినా కానీ స్వయాన్ని ఎందుకు తెలుసుకోవటం లేదు మరియు ఎందుకు అంగీకరించడం లేదు? ఈ ప్రత్యక్ష రుజువుని సదా ఎదురుగా ఉంచుకుంటే సహజంగా మాయను జయించగలరు. అర్ధమైందా! ఎప్పుడైతే సర్వసంబంధాలు ఒకనితో జోడించారో ఇక ఏ విషయం మిగిలి ఉంది! ఇక ఏదీ లేనప్పుడు బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఒకవేళ బుద్ది అటు ఇటు వెళ్తుందంటే ఒకనితో సర్వసంబంధాలు జోడించలేదు అని తెలుస్తుంది. జోడించిన దానికి గుర్తు - అనేకులతో తెగిపోతుంది. ఏ మార్గం లేకపోతే బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఇక అన్ని మార్గాలు తెగిపోతాయి. ఒకనితోనే జోడించబడుతుంది. అప్పుడు బుద్ధి అక్కడికి, ఇక్కడికి పరుగెడుతుంది అనే ఫిర్యాదు సమాప్తి అయిపోతుంది. అర్ధమైందా! ఈ గ్రూపు భట్టికి వచ్చారు. సదా భట్టీలోనే ఉంటుంటే మరలా విశేషంగా ఎందుకు వచ్చారు? భట్టీలోనే ఉన్నాం, కానీ బ్యాటరీ ఎంత వరకు చార్జ్ అయ్యిందో పరిశీలన చేయించుకోవడానికి వచ్చాం అంటారా! చార్జ్ చేయించుకోడానికి వచ్చారా? లేక పరిశీలన చేయించుకోవడానికి వచ్చారా? (రెండింటికీ) అందరు విలువైన సేవాధారుల గ్రూపు, ఈ గ్రూపు యొక్క టైటిల్ విన్నారు కదా! ఈ టైటిల్ విని అందరు సంతోషిస్తున్నారు. దీనిలో కూడా కానీ ఉంది, లక్ష్యం కూడా ఉంది. భట్టీ నుండి సమానంగా అయ్యి వెళ్తాము అనే లక్ష్యం ఉంది. సేవాధారుల గ్రూపు ఇది, కానీ అప్పుడప్పుడు సేవాధారులకి బదులు ఏమవుతున్నారో తెలుసా? బాప్ దాదా వతనం నుండి సేవాధారుల అభినయాన్ని చూస్తున్నారు. అప్పుడప్పుడు చాలా విచిత్ర సర్కస్ చేస్తున్నారు. సర్కస్లో రకరకాల అభినయాలను ఎలా చూపిస్తారో అలాగే ఇక్కడ కూడా రకరకాల సర్కస్ చూపిస్తున్నారు. సర్కస్లో చేసే పాత్రలు చూడడానికి బావుంటాయి, కానీ అప్పుడప్పుడు సేవాధారులు తమ విరాఠ రూపాన్ని చూపిస్తున్నారు. తమ లోపాలపై విరాఠ రూపాన్ని ధారణ చేయడానికి బదులు ఇతరులపై విరాఠ రూపం చూపిస్తున్నారు. వ్యవహారంలో, పరివారంలో, పరమార్ధంలో మూడింటిలో విరాఠ రూప సేవ చూపిస్తున్నారు. అప్పుడప్పుడు వ్యర్థ సంకల్పాల ఊయలలో ఊగే మరో సర్కస్ చూపిస్తున్నారు. వాస్తవానికి అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగాలి, కానీ వ్యర్ధ సంకల్పాలలో ఊగుతున్నారు. మూడవ సర్కస్ ఏమి చూపిస్తున్నారు? స్థితిని మార్చే సర్కస్ చూపిస్తున్నారు. రూపం మరియు స్థితిని మార్చుకునే సర్కస్ ఎక్కువ చూపిస్తున్నారు. వతనంలో కూర్చుని బాప్ దాదా సేవాధారి గ్రూపు యొక్క ఈ సర్కస్ చేస్తున్నారు. చాలా మంచి పురుషార్థులు, కానీ పురుషార్ధం చేస్తూ చేస్తూ అక్కడక్కడ పురుషార్ధం మంచిగా చేసిన తర్వాత ప్రాప్తి ఇక్కడే అనుభవించాలనే కోరిక పెట్టుకుంటున్నారు. కోరిక కూడా ఉంది మరియు మంచిగా కూడా ఉన్నారు. ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి, కానీ అక్కడక్కడ తమ పురుషార్ధం యొక్క ప్రాలబ్ధాన్ని ఇక్కడే పొందాలనే కోరిక వలన జమ చేసుకోవడంలో లోపం వచ్చేస్తుంది. అర్ధమైందా! ఈ విషయం సమాప్తి చేసుకుని వెళ్ళాలి. ప్రాలబ్ధము యొక్క కోరికని సమాప్తి చేసుకుని కేవలం మంచి పురుషార్ధం చేయండి. కోరిక (ఇచ్చా)కి బదులు, మంచి (అచ్చా) అనే మాటను స్మృతిలో ఉంచుకోండి. కోరిక స్వచ్చతని సమాప్తి చేస్తుంది. మరియు స్వచ్చతకి బదులు ఆలోచించేవారిగా అయిపోతారు. ఇది వర్తమానం యొక్క ఫలితం. సేవకులు అంటే చేసేవారు, కానీ ఆలోచించేవారు కాదు. ఇది నమ్మకధారుల గ్రూపు అని బాప్ దాదాకి తెలుసు. నమ్మకధారులు మరియు ధైర్యవంతులు కూడా, కానీ కేవలం మరో విషయాన్ని కలపాలి. సహనశక్తి కలిగినవారిగా అవ్వాలి. అప్పుడు నమ్మకధారుల నుండి సఫలతామూర్తి అయిపోతారు. అర్ధమైందా! ఇప్పుడు నమ్మకధారులు. కానీ ఒక విషయం కలవడం ద్వారా సఫలతామూర్తి అవుతారు. సంపూర్ణత యొక్క సమీపతకి గుర్తు - సఫలత. ఎంతెంత సఫలతామూర్తి అవుతారో అంత సంపూర్ణతకి సమీపంగా వచ్చినట్లు. ఈ గ్రూపు వారు సఫలతామూర్తి అయ్యేటందుకు ఏ స్లోగన్ ఎదురుగా పెట్టుకుంటారు? స్లోగన్ ఇదే - "పవిత్రత సంగమయుగి సంపద". పవిత్రతయే సంపద - ఇదే స్లోగన్. పవిత్రతకి ఎంత విస్తారం ఉంది, ఈ పవిత్రత అంటే ఏమిటి మరియు ఏ యుక్తుల ద్వారా ధారణ చేయగలరు అనే టాపిక్స్ పై టీచర్ క్లాస్ చేస్తారు. బాప్ దాదా కేవలం టాపిక్ ఇస్తున్నారు. సంపూర్ణ పవిత్రత అని దేనిని అంటారు అని పవిత్రత యొక్క విస్తారాన్ని అర్ధం చేసుకోవాలి. పవిత్రతయే సంపద, ఇదే ఈ గ్రూపు యొక్క స్లోగన్. సమాప్తి సమయంలో సంపూర్ణత యొక్క పరీక్ష తీసుకుంటాను. పరీక్షలో ప్రశ్న ముందుగానే చెప్తున్నాను. కనుక పాస్ అవ్వటం సహజమే కదా! సంపూర్ణత అనే విషయాలలో నాలుగు విషయాలపై పరీక్ష ఉంటుంది. ఏ నాలుగు విషయాలు అనేది చెప్పను. మంచిది.