03.12.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఎదుర్కొనేటందుకు కోరికలను త్యాగం చేయండి.

ఈరోజు ప్రతి ఒక్కరికి అవ్యక్తస్థితిని అనుభవం చేయిస్తున్నాను. ప్రతి ఒక్కరు శక్తిననుసరించి అనుభవం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు నిరాకారి మరియు అలంకారిగా ఎంత వరకు అయ్యారని చూస్తున్నాను. రెండూ అవసరమే. అలంకారి ఎప్పుడూ దేహ అహంకారి అవ్వరు. అందువలన సదా అలంకారి మరియు నిరాకారిగా అయ్యానా అని మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇదే మన్మనాభవ! మధ్యాజీభవ! స్వస్థితిని మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి అని అంటారు. మాస్టర్ సర్వశక్తివంతులు అయ్యారు కదా! ఈ స్థితిలో సర్వ పరిస్థితుల నుండి అతీతం అయిపోగలరు. ఈ స్థితిలో స్వభావం అనగా సర్వుల పట్ల స్వభావం (ఆత్మ) అనుభవం అవుతుంది. మరియు అనేక పాత స్వభావాలు సమాప్తి అయిపోతాయి. స్వ భావం అంటే స్వయంలో ఆత్మ భావాన్ని చూడండి. అప్పుడు భావ - స్వభావాల విషయాలు సమాప్తి అయిపోతాయి. ఎదుర్కునే శక్తి ప్రాప్తిస్తుంది. ఎప్పటి వరకు అయితే ఏదైనా సూక్ష్మ లేదా స్థూల కోరిక ఉంటే ఎదుర్కునే శక్తి రాదు. కోరిక ఎదుర్కోనివ్వదు. బ్రాహ్మణుల అంతిమ సంపూర్ణ స్వరూపం ఎందుకు మహిమ చేయబడిందో తెలుసా? ఆ స్థితి యొక్క వర్ణన - "ఇచ్చా మాత్రం అవిద్యా". ఆ స్థితి బ్రాహ్మణులైన మాకు తయారయ్యిందా? అని మిమ్మల్ని మీరు అడగండి. ఇలాంటి స్థితి తయారైనప్పుడే జైజై కారాలు మరియు హాహాకారాలు కూడా వస్తాయి. ఇది మీ అందరి అంతిమ స్వరూపం. మీ స్వరూపం యొక్క సాక్షాత్కారం అవుతుందా? సదా మీ సంపూర్ణ మరియు భవిష్య స్వరూపం ఎలా కనిపించాలంటే ఎలా అయితే శరీరం వదిలేసే వారికి బుద్ధిలో ఇప్పుడు ఈ శరీరం వదిలి కొత్త శరీరం ధారణ చేయాలని తెలుస్తుందో అలా అనుభవం అవ్వాలి. సదా బుద్దిలో ఇప్పుడిప్పుడే ఈ స్వరూపాన్ని ధారణ చేయాలి అనే స్మృతి ఉండాలి. ఎలా అయితే స్థూల శరీరం చాలా త్వరగా ధారణ చేస్తున్నారో అలాగే ఈ సంపూర్ణ స్వరూపము ధారణ చేయండి. చాలా సుందర మరియు శ్రేష్ట వస్త్రాన్ని ఎదురుగా చూస్తూ మరలా పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రం ధారణ చేయడం ఎందుకు కష్టమవుతుంది? మీ శ్రేష్ట సంపూర్ణ స్వరూపం లేదా స్థితి గురించి తెలుసు మరియు ఆ స్వరూపం ఎదురుగా ఉన్నా కానీ ఆ శ్రేష్ట స్వరూపాన్ని ధారణ చేయడంలో ఆలస్యం ఎందుకు అవుతుంది? ఏ రకంగానైనా అహంకారం ఉంటే అది అలంకార హీనంగా చేస్తుంది. అందువలన నిరహంకారి, నిరాకారి మరియు అలంకారి. ఈ స్థితిలో స్థితులై సర్వాత్మల కళ్యాణకారి అయిన వారే విశ్వరాజ్యాధికారి అవుతారు. ఎప్పుడైతే సర్వుల పట్ల కళ్యాణకారి అవుతారో సర్వుల కళ్యాణం చేసే వారు స్వయానికి అకళ్యాణం ఎలా చేసుకుంటారు? సదా స్వయాన్ని విజయీరత్నంగా భావించి ప్రతి సంకల్పం మరియు కర్మ చేయండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. ఓడిపోయే వారు కేవలం ఓటమియే కాదు, కానీ ధర్మరాజు శిక్షలు కూడా అనుభవించాలి. ఓటమి మరియు శిక్ష అంగీకరమేనా? ఓడిపోయే సమయంలో ఓటమి కంటే ముందు శిక్షలను ఎదురుగా ఉంచుకోండి. శిక్షించటం వలన భూతం కూడా పారిపోతుంది. కనుక శిక్షను ఎదురుగా ఉంచుకోవటం ద్వారా భూతం పారిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఓడిపోవటం ఎవరి పని? మాస్టర్ సర్వశక్తివంతుల పని కాదు. అందువలన అవే పాత విషయాలు, పాత నడవడిక ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులకు శోభించదు. అందువలన సంపూర్ణ స్వరూపాన్ని ఇప్పుడిప్పుడే ధారణ చేసే ప్రతిజ్ఞ చేయండి, ప్రయత్నం కాదు. ప్రయత్నం మరియు ప్రతిజ్ఞలో చాలా తేడా ఉంది. ప్రతిజ్ఞను ఒక సెకనులో చేస్తారు. ప్రయత్నంలో సమయం పడుతుంది. అందువలన ఇప్పుడు ప్రయత్నం చేసే సమయం కూడా గడిచిపోయింది. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసి సంపూర్ణ రూపం యొక్క ప్రత్యక్షత చేయాలి. సాక్షాత్తు బాబా సమానంగా సాక్షాత్కారమూర్తిగా అవ్వాలి. ఇలా మిమ్మల్ని మీరు సాక్షాత్కారమూర్తిగా భావించడం ద్వారా ఎప్పుడు ఓడిపోరు. ఇప్పుడు ప్రతిజ్ఞ చేసే సమయం కానీ ఓడిపోయే సమయం కాదు. ఒకవేళ మాటిమాటికి ఓడిపోతూ ఉంటే వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఉన్నతోన్నత పదవి పొందలేరు. మాటిమాటికి ఓడిపోయేవారు దేవతలకు హారాలు తయారు చేసేవారిగా అవుతారు. ఎంత మాటిమాటికి ఓడిపోతారో అంతగా హారాలు తయారు చేయవలసి ఉంటుంది. రత్నజడిత హారం తయారు చేస్తారు కదా! మరియు మరలా ద్వాపరయుగం నుండి భక్తులుగా అయినప్పుడు అనేక మూర్తులకి హారాలు వేయవలసి ఉంటుంది. అందువలన ఓడిపోకూడదు. ఇక్కడ ఎవరైనా ఓడిపోయేవారు ఉన్నారా? ఓడిపోకపోతే బలిహారం అయిపోతారు. ఇప్పుడు బలిహారం అయ్యేటందుకు లేదా బలి అయ్యేటందుకు తయారై ఉన్నారా?. సమాప్తిలో బలి ఇస్తారా లేక అయిపోయారా? ఎవరైతే బలిహారం అయిపోయారో వారికి పరీక్ష పెడతాను. ఇంతమంది నుండి ఈ\రోజు నుండి ఏ ఫిర్యాదు రాకూడదు. ఓడిపోవటం అనేదే లేనప్పుడు ఫిర్యాదులు ఎక్కడ నుండి వస్తాయి? మీ అందరి పరీక్ష వతనంలో తయారవుతుంది.