05.12.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రతిజ్ఞ చేసేవారికి మాయ యొక్క సవాలు.

ధ్వనికి అతీతంగా వెళ్ళటం మరియు తీసుకు వెళ్ళటం వస్తుందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్వనిలోకి రావాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు అతీతం అవ్వాలి. ఇటువంటి సహజ అభ్యాసిగా అయ్యారా? ఈ పాఠం పక్కా చేసుకున్నారా? విజయీరత్నంగా అయ్యారా? దేనిపై విజయీ అయ్యారు? అందరి మనస్సులపై విజయం పొందగలరా? ఎలా అయితే బాప్ దాదా యొక్క కర్తవ్యం యొక్క గుణానికి స్మృతి చిహ్నం ఇక్కడ ఉందో అలాగే బాబా సమానంగా విజయీ అయ్యారా! సర్వులపై విజయీ అయ్యారా లేక మీపై ఎవరైనా విజయీ కాగలరా? ఇటువంటి స్థితి భట్టీలో తయారయ్యిందా? భట్టీ నుండి వెళ్ళిన తర్వాత ప్రత్యక్ష పరీక్ష ఉంటుంది. పాస్ విత్ ఆనర్ అంటే సంకల్పంలో కూడా ఫెయిల్ కాకూడదు, అలా తయారయ్యారా? నిన్నటి సమాచారం విన్నారు. 'అలాగే' అనే నినాదం చాలా మంచిగా పెట్టుకున్నారు. ఇలా ప్రతిజ్ఞ చేసేవారు పాస్ విత్ ఆనర్ అవ్వాలి. మాయ సవాలు చేస్తుంది - ప్రతిజ్ఞ చేసేవారికి బాగా ప్రత్యక్ష పరీక్ష తీసుకోవాలి అని. ఎదుర్కునే శక్తిని సదా మీలో స్థిరంగా ఉంచుకోవాలి. అష్టశక్తులు ఏవైతే వినిపించానో వాటిని మీలో ధారణ చేసారా? జ్ఞానమూర్తి మరియు గుణమూర్తి రెండూ అయ్యారా? మాయకి సదాకాలికంగా బాగా వీడ్కోలు ఇచ్చి వెళ్తున్నారా? మీ స్థూల వీడ్కోలుకి ముందు మాయకి వీడ్కోలు ఇవ్వాలి. మాయ కూడా చాలా చతురమైనది. ఎలా అయితే కొంతమంది ఎప్పుడైనా శరీరం వదిలేసినా ఒకోసారి శ్వాస దాగి ఉంటుంది. చనిపోయారని భావిస్తారు, కానీ దాగి ఉన్న శ్వాస మరలా నడవటం ప్రారంభిస్తుంది. అలాగే మాయ తన అతి సూక్ష్మరూపాన్ని కూడా ధారణతో చేస్తుంది. శ్వాస ఎక్కడా దాగి ఉండలేదు కదా, అని వైద్యులు ఎలా పరిశీలిస్తారో అలాగే మూడవ నేత్రం ద్వారా మంచిగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ విషయం మాకు ఈరోజే తెలిసింది అని అనకూడదు. అందువలన బాప్ దాదా ముందు నుండే తెలివైనవారిగా, జాగ్రత్త కలిగినవారిగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిజ్ఞ చేసారు, ఏ స్థానంలో మరియు ఎవరి ముందు చేసారో ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రాప్తి లభించింది. కానీ ప్రాప్తితో పాటు ఏమి చేయాలి? ఆ ప్రాప్తి ద్వారా అందరు తృప్తి అవ్వాలి. ఎంత తృప్తిగా అవుతారో అంత ఇచ్చా మాత్రం అవిద్యాగా అవుతారు. కోరికకు బదులు ఎదుర్కునే శక్తి వస్తుంది.

పాత వృత్తుల నుండి నివృత్తి అయ్యారా? ఇవన్నీ పరీక్షలో ప్రశ్నలు. ఈ పరీక్ష ప్రత్యక్ష పరీక్ష, మిమ్మల్ని మీరు సంపూర్ణ స్పష్టంగా మరియు మాయని లెక్కచేయకుండా ఉండే శక్తిని ధారణ చేశారా? స్వయం మరియు సమయం రెండింటి గ్రహింపు మంచిగా, స్పష్టంగా తెలిసిందా? ఇవన్నీ చేసారా లేక ఇంకేమైనా ఉన్నాయా? అన్ని విషయాలలో తృప్త ఆత్మ అయ్యి, పేపర్ హాలులోకి వెళ్ళడానికి ధైర్యవంతులుగా, శక్తివంతులుగా అయ్యాము అని భావిస్తున్నవారు చేతులు ఎత్తండి. అన్ని విషయాల పరీక్షకి సిద్ధంగా ఉన్నాము, పాస్ విత్ ఆనర్ అయ్యే శక్తివంతులుగా, ధైర్యవంతులుగా అయ్యాము అనే వారు చేతులెత్తండి! మంచిది, ఇప్పుడు ప్రత్యక్ష పరీక్ష యొక్క ఫలితాన్ని చూస్తాను. ఈ నెల పాస్ విత్ ఆనర్ యొక్క ఫలితం ఎవరైతే చూపిస్తారో వారికి బాప్ దాదా విశేష బహుమతి ఇస్తారు. కానీ పాస్ విత్ ఆనర్ అవ్వాలి. కేవలం పాస్ అవ్వటం కాదు. మీ మీ ఫలితాలను వ్రాసి పంపించండి. ఇంత పెద్ద గ్రూప్ నుండి ఎంత మంది పాస్ విత్ ఆనర్ అయ్యారో చూస్తాను. కానీ టీచర్ మరియు మీ సహయోగుల నుండి కూడా సర్టీఫికెట్ తీసుకోవాలి. అప్పుడే బహుమతి ఇస్తారు. సహజమే కదా! ధైర్యవంతులకి ఇది కష్టమా! “ నేను విజయీమాలలోని విజయీరత్నాన్ని " అని స్మృతి ఉంచుకోవాలి. ఈ స్మృతిలో ఉండటం ద్వారా ఓటమి రాదు. అందరు సమాప్తిలో పూర్తి బలి అయ్యి వెళ్తాం అన్నారు, మరి సంపూర్ణంగా బలి అయిపోయారా? మహాబలి అయిపోయి వెళ్తున్నారా లేక ఇప్పుడు కూడా ఇంకా చనిపోవాలా? మహాబలి అయిన వారి ముందు ఏ మాయా బలం పనిచేయదు. ఇలాంటి నిశ్చయం మీలో ధారణ చేసి వెళ్తున్నారు కదా! ఫలితం చూస్తాను. తర్వాత బాప్ దాదా అటువంటి విజయీరత్నాలకి అలౌకిక హారం వేస్తారు. మంచిది.