31.12.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అమృతవేళ నుండి పరివర్తనా శక్తి యొక్క ప్రయోగం.

ఈరోజు బాప్ దాదా వర్తమానం మరియు భవిష్యత్తు రెండు కాలాల్లో రాజ్యాధికారులు అంటే విశ్వకళ్యాణకారి మరియు విశ్వరాజ్యాధికారి రెండు రూపాలలో పిల్లలను చూస్తున్నారు. ఎంతెంత విశ్వకళ్యాణకారి అవుతారో అంతంత విశ్వరాజ్యాధికారి అవుతారు. ఈ రెండు అధికారాలు పొందేటందుకు విశేషంగా స్వపరివర్తనా శక్తి కావాలి. ఇంత క్రితం కూడా చెప్పాను కదా- అమృతవేళ నుండి రాత్రి వరకు పరివర్తనా శక్తిని ఎంత కార్యంలో ఉపయోగించాలి? మొదట పరివర్తన - కళ్లు తెరుస్తూనే 'నేను శరీరాన్ని కాదు, ఆత్మను' - ఇది సమయం యొక్క ఆది పరివర్తనా సంకల్పం. ఈ ఆది సంకల్పం పైనే మొత్తం రోజంతటి దినచర్య ఆధారడి ఉంటుంది. ఒకవేళ ఆది సంకల్పంలో పరివర్తన కాకపోతే మొత్తం రోజంతా స్వరాజ్యం లేదా విశ్వకళ్యాణంలో సఫలీకృతులు కాలేరు. ఆది సమయం నుండి పరివర్తనా శక్తిని కార్యంలోకి తీసుకురండి. ఎలా అయితే సృష్టి ఆదిలో పరంధామం నుండి దేవాత్మ, సతో ప్రధాన ఆత్మ పాత్రలోకి వస్తుంది. అదేవిధంగా ప్రతీ రోజుకు ఆదికాలం - అమృతవేళ, కనుక ఈ ఆదికాలంలో మేల్కొంటూనే మొదటి సంకల్ప స్మృతిలో బాబాని కలుసుకోవడానికి బ్రాహ్మణ ఆత్మనైన నేను అవతరించాను అనే శక్తిశాలి సంకల్పం చేయాలి. ఈ సమర్ధ లేదా శ్రేష్ట సంకల్పమే శ్రేష్ఠ మాట, శ్రేష్ఠ కర్మకు ఆధారం అవుతుంది.

మొదటి పరివర్తన - "నేను ఎవరు". పరివర్తనా శక్తికి ఆధారం పునాది ఇదే. తరువాత రెండవ పరివర్తన - "నేను ఎవరి వాడిని?, సర్వ సంబంధాలు ఎవరితో ఉన్నాయి? సర్వ ప్రాప్తులు ఎవరి ద్వారా లభిస్తాయి?" మొదట దేహం యొక్క పరివర్తన, తరువాత దేహ సంబంధాల పరివర్తన, తరువాత సంబంధాల ఆధారంగా ప్రాప్తుల యొక్క పరివర్తన, వాటి పరివర్తననే సహజ స్మృతి అంటారు. కనుక ఆదిలోనే పరివర్తనా శక్తి ఆధారంగా అధికారి కాగలరు. అమృతవేళ తరువాత మీ దేహ కార్యక్రమాలు చేసుకునే సమయంలో ఏ పరివర్తన అవసరం? దీని ద్వారా నిరంతర సహజయోగి అయిపోతారు. సదా ఈ సంకల్పం చేయండి - నేను చైతన్య సర్వ శ్రేష్ట మూర్తిని మరియు ఈ శరీరం నాకొక మందిరం, చైతన్యమూర్తికి ఈ దేహం చైతన్య మందిరం. మందిరాన్ని అలంకరిస్తున్నాను. ఈ మందిరంలో స్వయం బాప్ దాదా యొక్క ప్రియమూర్తి విరాజమానమై ఉంది. ఈ మూర్తి యొక్క గుణమాలను స్వయం బాప్ దాదా స్మరణ చేస్తున్నారు. ఈ మూర్తి యొక్క మహిమ స్వయం బాబా చేస్తున్నారు. అలాంటి విశేష మూర్తికి ఇది విశేష మందిరం అనే స్మృతిలో ఉండాలి. మూర్తి ఎంత విలువైనదో ఆ మూర్తి ఆధారంగా మందిరానికి కూడా విలువ ఉంటుంది. కనుక ఏమి పరివర్తన చేయాలి? స్వయమే మూర్తి అయ్యి స్వయమే మందిరానికి నిమిత్తంగా అయ్యి మందిరాన్ని అలంకరించుకోండి. ఈ పరివర్తనా సంకల్పం ఆధారంగా నాది అనే భావన అంటే దేహాభిమానం పరివర్తన అయిపోతుంది.

తరువాత గాడ్లీ స్టూడెంట్ (ఈశ్వరీయ విద్యార్థి) రూపం సదా స్మృతిలో ఉండాలి. దీనిలో ఏ విశేష పరివర్తనా సంకల్పం ఉండాలి? దీని ద్వారా ప్రతి సెకెను యొక్క చదువు, ప్రతి అమూల్యమాట యొక్క ధారణ ద్వారా, వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క ప్రతి సెకెనుకి శ్రేష్ఠ ప్రాప్తి తయారవ్వాలి. పరివర్తనా సంకల్పం ఏమిటంటే “ నేను సాధారణ విద్యార్థిని కాదు, ఇది సాధారణ చదువు కాదు, స్వయంగా బాబా రోజూ దూరదేశం నుండి మమ్మల్ని చదివించడానికి వస్తున్నారు. భగవంతుని మహావాక్యాలు మా చదువు. శేష్టాతి శ్రేష్ఠమైన బాబా యొక్క శ్రీమతం మా చదువు". ఈ చదువు యొక్క ప్రతి మాట కోటానుకోట్ల సంపాదన చేయించేది. ఒకవేళ ఈ ఒకమాట ధారణ చేయకపోయినా ఒక మాటను పోగొట్టుకున్నట్లు కాదు, కోటానుకోట్ల సంపాదన మరియు అనేక జన్మల శ్రేష్ట ప్రాలబ్దము లేదా శ్రేష్ట పదవి పొందటంలో లోపం వస్తుంది. భగవంతుడు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాము. నా కోసం బాబా టీచర్ అయ్యి వచ్చారు. నేను విశేష ప్రియమైన విద్యార్థిని కనుక నా కోసం వచ్చారు" అనే పరివర్తనా సంకల్పం ఉండాలి. ఎక్కడ నుండి వచ్చారు, ఎవరు వచ్చారు మరియు ఏమి చదివిస్తున్నారు? ఇదే శ్రేష్ట సంకల్పం రోజూ క్లాస్ వినే సమయంలో ధారణ చేసి చదువుకోండి. సాధారణ క్లాస్ కాదు, వినిపించే వ్యక్తిని చూడకండి, కానీ మాట్లాడేటువంటి మాటలు ఎవరివో వారిని ఎదురుగా పెట్టుకోండి. అంటే వ్యక్తంలో అవ్యక్త బాబాని మరియు నిరాకారి బాబాని చూడండి. కనుక ఏమి పరివర్తన చేయాలో అర్థమైందా! చదువు చదువుకున్నారు, ఇంకా ముందుకు వెళ్లండి, ఇప్పుడు ఏమి చేయాలి? ఇప్పుడు సేవా పాత్ర అభినయించాలి.

సేవలో ఏ రకమైన సేవ అయినా అనగా ఈశ్వరీయ సేవ అయినా, కుటుంబం యొక్క సేవ అయినా, లౌకిక కుటుంబం అయినా, కర్మబంధన ఆధారంగా సంబంధం అయినా కాని కుటుంబంలో సేవ చేస్తూ ఇదే పరివర్తనా సంకల్పం చేయండి - మరజీవ జన్మ తీసుకున్నారు. అంటే లౌకిక కర్మ బంధన సమాప్తి అయిపోయింది. కర్మబంధన అని భావించి నడవకండి. కర్మబంధన, కర్మబంధన అని ఆలోచించడం మరియు చెప్పడం ద్వారానే బందీ అయిపోతారు. కాని ఈ లౌకిక కర్మబంధన యొక్క సంబంధం ఇప్పుడు మరజీవ జన్మ తీసుకున్న కారణంగా శ్రీమతం ఆధారంగా అది కూడా సేవా సంబంధం. కర్మబంధన కాదు, సేవాసంబంధం. సేవా సంబంధంలో రకరకాల ఆత్మల జ్ఞానాన్ని ధారణ చేసి, స్నేహసంబంధంగా భావించి, నడిస్తే బంధన విసిగించదు. అతి పాప ఆత్మ, అతి అపకారి ఆత్మ, కొంగ వంటి ఆత్మపై కూడా అసహ్యం ఉండకూడదు. నిరాధారంగా కాదు, కాని విశ్వకళ్యాణకారి స్థితిలో స్థితులై, దయాహృదయులు అయ్యి దయాభావం పెట్టుకుంటూ సేవా సంబంధంగా భావించి సేవ చేస్తారు. మరియు ఎంత నిరాశ కేసులకైనా సేవ చేసినప్పుడే బహుమతి లభిస్తుంది. ప్రసిద్ద విశ్వకళ్యాణిగా మహిమ చేయబడతారు. శాంతిదూత అనే బహుమతి లభిస్తుంది. కనుక కుటుంబం బంధన కాదు, సేవా సంబంధం అనే పరివర్తనా సంకల్పం చేయండి. కానీ సేవ చేస్తూ చేస్తూ తగుల్పాటులోకి రాకూడదు. అప్పుడప్పుడు డాక్టర్ కూడా పేషెంట్ యొక్క తగుల్పాటులోకి వచ్చేస్తారు. సేవా సంబంధం అంటే త్యాగి మరియు తపస్వీ రూపం. సత్యమైన సేవ యొక్క లక్షణాలు - త్యాగం మరియు తపస్సు.

అలాగే వ్యవహారంలో కూడా సలహా ప్రకారం నిమిత్తమాత్రంగా శరీర నిర్వహణ కానీ ముఖ్య ఆధారం - ఆత్మ నిర్వహణ. శరీరం నిర్వహణలో ఆత్మ నిర్వహణ ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యాపారం చేస్తూ శరీరం నిర్వహణ మరియు ఆత్మ నిర్వహణ రెండింటి సమానత ఉండాలి. లేకపోతే వ్యాపారం మాయాజాలం అయిపోతుంది. ఈ జాలం ఎంత పెరుగుతూ ఉంటే అంత చిక్కుకుంటూ ఉంటారు. ధనం వృద్ధి చేసుకుంటూ కూడా స్మృతి విధిని మర్చిపోకూడదు. స్మృతి యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి రెండూ వెనువెంట ఉండాలి. ధనం యొక్క వృద్ధి వెనుక పడి స్మృతి విధిని వదిలేయకూడదు. దీనినే లౌకిక స్థూలకర్మని కూడా కర్మయోగస్థితిలో పరివర్తన చేసుకోవటం అంటారు. కేవలం కర్మ చేసేవారు కాదు, కానీ కర్మయోగులు కర్మ అంటే వ్యవహారం, యోగం అంటే పరమార్ధము. పరమార్ధము అంటే పరంపిత యొక్క సేవ కోసం చేస్తున్నారు. కనుక వ్యాపారం మరియు పరమార్ధము రెండు వెనువెంట ఉండాలి. అలాంటి వారినే శ్రీమతం ప్రకారం నడిచే కర్మయోగులు అంటారు. వ్యాపారం చేసే సమయంలో ఏమి పరివర్తనా సంకల్పం చేయాలి? నేను కేవలం వ్యాపారిని కాదు, పరమార్ధిని అంటే ఏదైతే చేస్తున్నానో అది ఈశ్వరీయ సేవ కోసం చేస్తున్నాను అనే పరివర్తనా సంకల్పం స్మృతిలో ఉంటే మనస్సు మరియు తనువు యొక్క రెండు రకాల సంపాదన చేసుకుంటారు. స్థూలధనం కూడా వస్తూ ఉంటుంది మరియు మనస్సు ద్వారా అవినాశి ధనం కూడా జమ అవుతుంది. ఒకే తనువు ద్వారా ఒకే సమయంలో మనస్సు మరియు ధనం యొక్క డబల్ సంపాదన అవుతుంది. కనుక నేను రెండు రకాల సంపాదన చేసుకువాడిని అని సదా స్మృతిలో ఉంచుకోండి. ఇక ఈశ్వరీయ సేవలో సదా నిమిత్తమాత్రం అనే మంత్రం లేదా చేసేవారిగా భావించాలి అంటే చేయించేవారిని మర్చిపోకూడదు. అప్పుడు సేవలో సదా నిర్మాణమే నిర్మాణం చేస్తూ ఉంటారు.

ఇంకా ముందుకి వెళ్ళండి. ముందుకి వెళ్తే అనేకరకాల వ్యక్తులు మరియు వైభవాలు అంటే అనేకరకాల వస్తువులతో సంబంధం ఉంటుంది. దీనిలో కూడా సదా వ్యక్తిలో వ్యక్త భావానికి బదులు ఆత్మిక భావాన్ని ధారణ చేయండి. వస్తువులు మరియు వైభవాల పట్ల అనాసక్త భావాన్ని ధారణ చేస్తే వైభవాలు మరియు వస్తువులు అనాసక్త ఆత్మ ముందు దాని రూపంలోకి ఉంటాయి. ఆసక్తి గల వారిని అయస్కాంతం వలె ఆకర్షిస్తూ ఉంటాయి. అప్పుడు వాటిని వదిలించుకోవాలనుకున్నా వదలవు. అందువలన వ్యక్తి పట్ల ఆత్మభావం మరియు వైభవాల పట్ల అనాసక్త భావం యొక్క పరివర్తనను ధారణ చేయండి.

ఇంకా ముందుకి వెళ్ళండి. పాత ప్రపంచం యొక్క ఆకర్షణమయ దృశ్యాలు ఉంటాయి. అల్పకాలిక సుఖసాధనాలను ఉపయోగించుకుంటారు లేదా చూస్తారు. కానీ ఆ సాధనాలను లేదా దృశ్యాలను చూస్తూ అక్కడక్కడ సాధనని మర్చిపోయి సాధనాలలో వచ్చేస్తున్నారు. సాధనాలకి వశీభూతం అయిపోతున్నారు. సాధనాల ఆధారంగా సాధన అంటే ఇసుక పునాదిపై ఇల్లు కడుతున్నట్లు భావించండి. వారి పరిస్థితి ఏమౌతుంది? మాటిమాటికి అలజడి అవుతారు. ఇంచుమించు పడిపోయినట్లే అనే పరిస్థితి ఉంటుంది. అందువలన పరివర్తన చేయండి - సాధనాలు వినాశీ మరియు సాధన అవినాశి. వినాశీ సాధనాల ఆధారంగా అవినాశి సాధన ఉండదు. సాధనాలు నిమిత్తమాత్రం, సాధన ఆధారంగానే నిర్మాణం జరుగుతుంది. కనుక సాధనాలకి విలువ ఇవ్వకండి, సాధనకి విలువ ఇవ్వండి. సదా నేను సిద్ధి స్వరూపాన్ని అని భావించండి. కాని సాధనాల స్వరూపం కాదు. సాధన సిద్ధిని ఇస్తుంది. సాధనాల ఆకర్షణలో స్వరూపాన్ని మర్చిపోకండి. ప్రతి లౌకిక వస్తువుని చూస్తూ, లౌకిక విషయాలు వింటూ, లౌకిక దృశ్యాలను చూస్తూ లోకాన్ని అలౌకికంలోకి పరివరన చేసుకోండి అంటే జ్ఞాన స్వరూపులై ప్రతి విషయంలో జ్ఞానం తీయండి. ఆ విషయంలోకి వెళ్ళకండి. జ్ఞానంలోకి వెళ్ళండి. ఏమి పరివర్తన చేసుకోవాలో అర్థమైందా! మంచిది.
ఇంకా ముందుకి వెళ్ళండి. ఇప్పుడు ఇక ఏమి మిగిలిపోయింది? నిద్రపోవటం మిగిలింది. నిద్రపోవటం అంటే బంగారు ప్రపంచంలో నిద్రపోవటం. నిద్రను కూడా పరివర్తన చేయండి. పరుపుపై నిద్రించకండి, మరి ఎక్కడ నిద్రపోవాలి? బాబా స్మృతి యొక్క ఒడిలో నిద్రపోండి. ఫరిస్తాల ప్రపంచంలో, స్వప్నాలలో విహరించండి. ఇలా స్వప్నాలను మరియు నిద్రను కూడా పరివర్తన చేయండి. ఆది నుండి అంతిమం వరకు పరివర్తన చేయండి. పరివర్తనా శక్తిని ఎలా ఉపయోగించాలో అర్థమైందా!

ఈ క్రొత్త సంవత్సరం పరివర్తనా శక్తి యొక్క బహుమతి ఇస్తున్నాను. స్వపరివర్తన మరియు విశ్వ పరివర్తన అనే బహుమతి ద్వారా విశ్వపరివర్తనా సమయం సమీపంగా తీసుకురాగలరు. క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు అయితే అందరు ఇస్తారు, కానీ బాప్ దాదా క్రొత్త సంవత్సరంలో సదా తీవ్ర పురుషార్థి అయ్యే కొత్తదనం యొక్క శుభాకాంక్షలు ముందుగానే ఇస్తున్నారు. క్రొత్త సంవత్సరం, క్రొత్త సంస్కారాలు, క్రొత్త స్వభావం, క్రొత్త ఉత్సాహ, ఉల్లాసాలు, నవవిశ్వం కొరకు శ్రేష్ట సంకల్పం, సర్వులకి ముక్తి, జీవన్ముక్తి యొక్క వరదానం ఇచ్చే శ్రేష్ట సంకల్పం సదా ఉండాలనే క్రొత్తదనానికి శుభాకాంక్షలు చెప్తున్నారు. పాత సంస్కారాలు, పాత నడవడికకు వీడ్కోలు ఇవ్వాలి. మంచిది.

విదేశాలకు మరియు ఢిల్లీకి సమీప సంబంధం ఉంది. విదేశం వారు రాజ్యం ఇస్తారు. ఢిల్లీ వారు రాజ్యం తీసుకుంటారు. మీరందరు కూడా ఢిల్లీ రాజధానికి రావలసి ఉంటుంది. మీ విదేశీ స్థానాలు చాలా చిన్న చిన్న ద్వీపాలు అయిపోతాయి. అక్కడికి విహరించడానికి వెళ్తారు. విదేశం వారు మరియు ఢిల్లీ వారు ఇద్దరూ రాజ్యం ఇవ్వడానికి మరియు తీసుకోవడానికి తయారీలు చేయాలి. క్రైస్తవులు ఇస్తారు, కృష్ణుడు తీసుకుంటాడు. ఎలా ఇస్తారు? ఏమి చేసారు? వారిది విజ్ఞానశక్తి, మీది శాంతిశక్తి, విజ్ఞాన శక్తి సమాప్తి అయిపోతుంది మరియు శాంతిశక్తి విజయం పొందుతుంది. శాంతిశక్తిని పెంచుకోవటం అంటే రాజ్యం తీసుకోవటం.

ఇలా ప్రతి కర్మలో పరివర్తనా శక్తి ద్వారా స్వపరివర్తన మరియు విశ్వపరివర్తన చేసేవారికి, ప్రతి సెకను, ప్రతి సంకల్పం, ప్రతి కర్మ క్రొత్తగా అంటే స్వర్ణిమంగా చేసేవారికి, విశేషంగా అంటే సతో ప్రధానంగా చేసేవారికి, క్రొత్త సంవత్సరంలో స్వయంలో మరియు విశ్వంలో క్రొత్త చమత్కారాన్ని చూపించే వారికి, ఇప్పటి వరకు అసంభవం అని భావించే స్వయం పట్ల, విశ్వం పట్ల ఆ అసంభవాన్ని సంభవం చేసేవారికి, ఇటువంటి సదా సఫలతామూర్తి, శ్రేష్ట సిద్ధి స్వరూప ఆత్మలకి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.