05.03.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


భట్టీ యొక్క అలౌకిక ముద్ర.

ఈరోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి మస్తకంలో రెండు విషయాలు చూస్తున్నారు, అవి ఏమిటి? 1. భాగ్యం, 2. సౌభాగ్యం. ఈ రెండు విషయాలను చూస్తున్నారు. భట్టీకి వచ్చి మీయొక్క భాగ్యాన్ని మరియు సౌభాగ్యాన్ని మంచిగా చూసుకోగలరు మరియు తెలుసుకోగలరు. మీ మస్తకంలో మెరిసే భాగ్యసితారను చూసుకోగలరా? భట్టిలో మీకు ఈ దర్పణం లభించింది.ఈ దర్పణం ద్వారా మీ బాగ్యాన్ని మరియు సౌభాగ్యాన్ని చూసుకోగలరు భట్టీకి రావడం అంటే రెండు విషయాలు పొందడం. ఆ రెండు విషయాలు ఏమిటి? ఈరోజు భట్టీకి వచ్చిన వారిని కలుసుకునేందుకు వచ్ఛాను. వారికి పరీక్ష తీసుకుంటున్నాను. అయితే చెప్పండి, ముఖ్యంగా ఏ రెండు విషయాలు లబిసున్నాయి? (ప్రతి ఒక్కరు రకరకాల పాయింట్లు చెప్పారు). ప్రతి ఒక్కరు ఏవైతే చెప్పారో అవి మంచిగా చెప్పారు. ఎందుకంటే మాతలు ఇంతగా అయినా చెప్పగలిగే యోగ్యాంగా అయ్యారంటే చాలా సేవ చేయగలుగుతారు. భట్టీ ద్వారా మీకు లభించిన ముఖ్య రెండు విషయాలను వెంట తీసుకునే వెళ్ళాలి. 1. స్వయాన్ని చూసుకునే దర్పణం 2. యోగం. అంటే సృతి యొక్క గ్లోబ్. ఈ ప్రకాశ గోళాన్ని సదా వెంట ఉంచుకునే వారి చేతిలో మరే గోళం వస్తుంది? కృష్ణుని చేతిలో సృష్టి యొక్క గోళం ఉంటుంది కదా! ఇక్కడ ప్రకాశ గోళం అనగా ప్రకాశ చిత్రంలో సదా ఉండాలి. ప్రకాశగోళంగా అవడం ద్వారానే విశ్వరాజ్య గోళం చేతిలోకి తీసుకోగలరు. ఇప్పుడు ప్రకాశమయ గోళం, భవిష్యత్తులో రాజ్యగోళం. భట్టీలో 1.దర్పణం లభించింది 2. స్మృతియాత్రను నిరంతరం శ్రేష్టంగా తయారుచేసుకునేటందుకు ప్రకాశ గోళం కూడా లభించింది. రెండింటినీ తీసుకువెళ్ళాలి. ఇక్కడ వదిలి వెళ్ళకూడదు. ఈ రెండు బహుమతులను వెంట తీసుకువెళ్ళి, సదా వెంట ఉంచుకున్నట్టయితే ఏవిధంగా తయారవుతారు? బాబా మహిమకు సంబంధించి ఒక పాట తయారుచేసారు కదా! అది ఏమిటి? సత్యం - శివం- సుందరం..... ఆవిధంగా మీరు కూడా మాస్టర్ సత్యం - శివం - సుందరంగా అయిపోతారు. ఈ దర్పణం ద్వారా సత్యం మరియు వాస్తవిక సుందరత సాక్షాత్కారం అవుతుంది. మీ ముఖాన్ని ఈ విధంగా తయారుచేసుకున్నారా? దీని కోసమే భట్టీకి వచ్చారు కదా! భట్టీలో లౌకిక స్థితిని స్వాహా చేసేసారా? ఏ రకమైన లౌకిక వృత్తి, దృష్టి, సంబంధం యొక్క స్మృతి, లౌకిక మర్యాద, లౌకిక లోకమర్యాదలకు వశమై అలౌకిక రీతి మరియు ప్రీతిని మర్చిపోవటం లేదు కదా? అలౌకిక ప్రీతి మరియు అలౌకిక రీతి (విధానం) యొక్క ముద్ర పక్కాగా వేసుకున్నారా? ముద్ర పూర్తిగా వేసుకున్నారా, భలే ఎవరు ఎంతగా ఆ ముద్రను తొలగించాలని ప్రయత్నించినా కానీ తొలగించలేకుండా ఉండాలి. ఇలాంటి ముద్ర వేసుకున్నవారు చేయి ఎత్తండి? లౌకిక లోకమర్యాదల పరీక్ష చాలా కఠినంగా వస్తుంది. స్వయాన్ని రక్షణగా ఉంచుకోవాలని కొందరు అనుకుంటున్నారు. కానీ ఎవరు ఎంత ధైర్యం పెట్టుకుంటారో అంత సహాయం ప్రాప్తిస్తుంది, దీంట్లో రక్షణ ఉంది. మొదటే మీ గురించి మీరు సంశయబుద్ధిగా ఉంటే ఓడిపోతారు. మేము ఫెయిల్ అయిపోతామేమో అనే సంశయం మీ గురించి ఎందుకు పెట్టుకుంటున్నారు? మేము విజయం పొందే చూపిస్తాము అని ఎందుకు అనుకోవడం లేదు, విజయీరత్నాలు కదా! కనుక ఎప్పుడూ కూడా పురుషార్ధంలో మీ గురించి మీరు సంశయబుద్దిగా కాకూడదు. సంశయబుద్ది అవ్వడం ద్వారానే ఓడిపోతున్నారు. మీ యొక్క సంశయ సంకల్పమే మాయాజీత్ గా అవ్వనివ్వకుండా చేస్తుంది.

ఎక్కువమంది విజయీ రత్నాలు విజయీ తిలకం పెట్టుకుని వెళ్తున్నారు. సదా విజయం మా యొక్క జన్మ సిద్ద అధికారం - ఈ స్మృతిలో ప్రతీ అడుగు వేయాలి. అధికారి అయి కర్మ చేయడం ద్వారా విజయం అంటే సఫలత యొక్క అధికారం తప్పక లభిస్తుంది. ఇక లభిస్తుందా లేదా అనే సంకల్పం రావలసిన అవసరమే ఉండదు. స్వప్నంలో కూడా నాకు విజయం లభిస్తుందో లేదో తెలియదు అనే సంకల్పం రాకూడదు. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అయిన మీ నోటి నుండి ఏమో తెలియదు అనే మాట రాకూడదు. సృష్టి యొక్క ఆది, మధ్య, అంత్యం మూడు కాలాలను తెలుసుకున్నారు. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అయ్యారు, మరి మాస్టర్ నాలెడ్జ్ ఆత్మల నోటి నుండి ఏమో లభిస్తుందో లేదో తెలియదు అనే మాట రాకూడదు. ఇది అఙ్ఞానుల భాష, జ్ఞాని ఆత్మల భాష కాదు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా కానీ జ్ఞానం ఆధారంగా మీకు తెలుస్తుంది కదా! ఈ పొరపాటు పని చేశానని తెలిసిపోతుంది కదా! ఇది అవుతుందో లేదో - ఇలా అనటం బ్రాహ్మణుల భాష కాదు. భట్టీ నుండి ఈ ముద్ర గట్టిగా వేయించుకుని వెళ్ళాలి. 21 జన్మల వరకు ఆ ముద్ర పక్కాగా ఉండాలి. భట్టీ యొక్క రెండు బహుమతులు మీ దగ్గర పెట్టుకున్నారా? ఇప్పుడు భట్టి నుండి వెళ్ళి ఏమి చేస్తారు? భట్టీకి ఎందుకు వచ్చారు? స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు, స్వయంలో ఎవరు ఎంత పరివర్తన తీసుకువస్తారో అంతగా ఇతరులను కూడా పరివర్తన చేయగలరు. ఇప్పుడు సేవలో చూస్తే పరివర్తన తక్కువగా ఉంటుంది. కనుక దర్పణం తీసుకువెళ్తున్నారు చూసుకొండి - నన్ను నేను పరివర్తన చేసుకునే శక్తి నాలో ఎంత వచ్చింది? ఒకవేళ మీలో స్వయాన్ని పరివర్తన చేసుకునే శక్తి తక్కువగా ఉంటే ఇతరులను కూడా అంతమాత్రమే పరివర్తన చేయగలరు, కనుక రెండు విషయాలు గుర్తు పెట్టుకోండి - 1. ప్రతి విషయంలో స్వయం పరివర్తన అవ్వాలి. లౌకికం నుండి అలౌకికంలోకి రావాలి. మరియు 2 పరిపక్వత రావాలి. పరిపక్వత లేకపోతే సఫలత కూడా లభించదు. పరివర్తన కూడా ఉండాలి మరియు మీ యొక్క పరిపక్వత అంటే గట్టితనం. కనుక కుటుంబంలో ఉంటూ కార్యం చేసే సమయంలో ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకుంటే నిశ్చయమే విజయం - సహజ విషయం చెప్పాను కదా! మాతలకు సహజ విషయాలు కావాలి కదా! మాతలు తమ అలంకరణ అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా! బాప్ దాదా కూడా అదే పని ఇస్తున్నారు.

ఈ భట్టీ మధువన బేహద్ భట్టీ . మీ ప్రవృత్తిని కూడా ఈ బేహద్ భట్టీ యొక్క మోడల్ రూపంగా తయారుకావాలి. ఏ వస్తువు యొక్క మోడల్ అయినా చిన్నదే తయారు చేస్తారు. ఎలాగైతే భట్టీ చేసుకుని వెళ్తున్నారో ఆవిధంగా మీ ప్రవృత్తిని కూడా ఒక మోడల్ రూపంగా తయారు చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? అవే భట్టీ విషయాలు, భట్టీ ధారణ, భట్టీ దినచర్య అదేవిధంగా నడుస్తుంది. అందువలన ప్రవృత్తిలో ఉంటూ మీ వృత్తిని భట్టీ వలె పెట్టుకోవాలి. వృత్తిని మార్చుకోకూడదు. ఎలాగైతే భట్టీలో ఉన్నతమైన వృత్తి ఉంటుందో అలాగే కుటుంబంలో ఉన్నా కానీ ఉన్నతమైన వృత్తి ఉంచుకోవాలి. వృత్తిని మార్చుకున్నారంటే కుటుంబం పరిస్థితులు స్థితిని అలజడి చేసేస్తాయి. ఒకవేళ మీ వృత్తిని ఉన్నతంగా ఉంచుకున్నట్లయితే, ప్రవృత్తిలో వచ్చే అనేక పరిస్థితులు మిమ్మల్ని అలజడి చేయలేవు. అర్ధమైందా! కనుక ఇదే వృత్తిని వెంట తీసుకువెళ్లండి. అప్పుడు చూడండి, విజయీగా అయిపోతారు. మాతలపై అందరి కంటే ఎక్కువ స్నేహం ఉంటుంది. ఎందుకంటే మాతలు చాలా దు:ఖాలను సహించారు. అందువలన ఎక్కువగా బాబాను పిలిచింది కూడా మాతలే. చాలా దు:ఖాన్ని సహించిన కారణంగా మాతలు దెబ్బలను సహించిన కారణంగా, అలసిపోయి ఉన్నారు. కనుక బాబా స్నేహంతో పాదాలు ఒత్తుతున్నారు. మాతల పాదాలు ఒత్తినట్లు మహిమ ఉంది కదా! ఇక్కడ పాదం అంటే స్తూలమైన పాదం కాదు, విశేష స్నేహం ఇవ్వటమే పాదాలను ఒత్తటం. వీరికి స్నేహం మరియు ధైర్యం ఇవ్వాలి. కేవలం స్నేహాన్ని మాత్రమే గుర్తుంచుకోకండి కానీ ఏదైతే ధైర్యం ఇచ్చారో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచిది. .

భట్టిలో చదువుకున్న మొత్తం చదువు లేదా తీసుకున్న శిక్షణల సారాంశాన్ని మూడు మాటల్లో గుర్తుంచుకోండి. ఆ మూడు మాటలు ఏవి? త్రెంచుకోవాలి, మలుచుకోవాలి మరియు జోడించాలి. కర్మబంధన తెంచుకోవడం నేర్చుకున్నారు కదా! మరియు మలుచుకోవడం కూడా నేర్చుకున్నారు . మీ స్వభావ సంస్కారాలను మలుచుకోవడం కూడా నేర్చుకున్నారు మరియు జోడించడం కూడా నేరుకున్నారు. కనుక ఈ మూడు మాటలు గుర్తుపెట్టుకోండి. సదా స్వయాన్ని చూసుకోండి - తెంచుకుంటున్నానా,. మలుచుకుంటున్నానా మరియు జోడిస్తున్నానా? మూడింటిలో ఏదీ లోపం ఉండకూడదు. అప్పుడు త్వరగా సంపూర్ణం అయిపోతారు. ఈ గ్రూపుకు బాబా స్మృతి యొక్క తిలకం ఇసున్నారు, తిలకం అనేది స్మృతికి గుర్తు. కనుక సదా స్మృతిలో ఉంచుకోండి, ఈ యొక్క నయనాలతో వినాశీ వస్తువులు ఏవైతే చూస్తున్నారో వాటిని చూస్తూ కూడా మీ క్రొత్త సంబంధాలు మరియు క్రొత్త సృష్టిని చూస్తూ ఉండండి. ఈ స్మృతి తిలకాన్ని బాబా ఈ గ్రూపుకి ఇస్తున్నారు. అప్పుడు ఏ విషయాల్లో మీరు ఓడిపోరు. ఎందుకంటే మీరు చూసే ప్రతి వస్తువు వినాశీ, ఇలా అనుకుంటే మీరు ఓడిపోయేది ఉండదు. అందువలన స్వయం విజయిగా అయ్యేటందుకు - రోజు అమృతవేళ ఈ స్మృతితిలకాన్ని స్వయానికి పెట్టుకోండి. అమాయక మాతలు, ఈ మాతలే ఒకవేళ సేవ అనే మైదానంలోకి వస్తే స్వయాన్ని సింహంగా భావించే వారందరు మేకల వలె మాతల చరణాల ముందు తలవంచుతారు. ఎందుకంటే ఏ విషయంలో అయితే వారు బలహీనంగా లేదా పచ్చిగా ఉన్నారో ఆ విషయంలో మీరు ప్రత్యక్ష రుజువు. మీయొక్క ప్రత్యక్ష రుజువును చూసి వారు సిగ్గుపడతారు. మేకగా అయిపోతారని అంటారు కదా! మాతలు ఇంత శ్రేష్ఠ సేవ చేయగలరు - సింహంలా ఉన్నవారిని ఒక్కసెకెనులో మేకగా చేస్తారు. మాతలు ఇలాంటి మాంత్రికులు. తమ గారడీతో సింహాన్ని మేకలా, మేకని సింహంలా చేసేస్తారు. మాతలైన మీరు కూడా ఇలాంటి గారడీ చేయగలరు. మీరు పులిలా అయిపోతే సింహం అయిన వారు మేకలా అయిపోతారు. ఇప్పుడు అంతిమ ధర్మయుద్ధం ఏదయితే చూపించారో ఆ ధ్వని ప్రసిద్ధం అవ్వాలి. మీ సేవ ద్వారా సింహం లాంటి వారు మేకలా అయిపోతే అప్పుడు వారి వెనుక వారి అనుచరులు కూడా వచ్చేస్తారు. కేవలం ఒక సింహాన్ని మేకగా మారిస్తే అనేక సింహాలు జాలంలోకి వచ్చేస్తాయి. అందువలన మాతలు ఇంత ఉన్నత సేవ కోసం తయారుగా ఉండాలి. ఇంతమంది శక్తిదళం కలిసి గుంపుగా ఎదుర్కుంటే వారు నిలువగలరా? ఛాలెంజ్ (శపధం) చేసే ధైర్యం ఉండాలి. ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చే పరీక్షలను దాటాలి. 1.థియరీ పరీక్ష 2.ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలో పాస్ అయిపోయారు. ఇప్పుడు ప్రాక్టికల్ పరీక్షలో పాస్ అవ్వాలి. శక్తులు ధైర్యంగా ఉంటే సర్వశక్తివంతుడు సహాయం చేస్తారు - ఇది సదా గుర్తు ఉంటుంది కదా! ఇప్పుడు బదులు ఇవ్వాలి. ఇంత శ్రమ తీసుకున్నారు కదా! దానికి బదులు ఇవ్వాలి. వీరందరు పులులు. పులి ఎవరికీ భయపడదు, నిర్భయంగా ఉంటుంది. ఏమో ఏమిటో అనే భయం ఉండదు. దీంతో కూడా నిర్భయంగా అవ్వాలి. ఇలా పులిగా అయ్యారా? (అయిపోతాం) ఎప్పుడు అవుతారు? మొదటి రోజు భట్టీకి రావటం అనగా పరివర్తన అవ్వడం. పరివర్తనా సమారోహం జరుపుకుంటున్నారు కదా! బాప్ దాదా కూడా పరివర్తనా సమారోహానికి వచ్చారు. ఈరోజు అంతిమ ముద్ర వేసుకోవాలి, మరలా ఈ పరివర్తనను మరిచిపోకండి. ప్రతి ఒక్కరు స్వయంలో ఏదోక విశేషతను నింపుకోవాలి. ఏదోక సబ్జెక్టులో నెంబర్‌ వన్‌గా అవ్వాలి. అసలైతే అన్నింటిలో అవ్వాలి. ఒకవేళ అన్నింటిలో అవ్వలేకపోతే ఏదోక సబ్జెక్టులో అయినా విశేషంగా నెంబర్‌వన్‌గా స్వయాన్ని తయారుచేసుకోవాలి. ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత సేవలో మరింత సహాయకారులుగా అవ్వాలని ఏదైతే చెప్పానో దాని కోసం ప్లాన్ తయారు చేశారా? ఏదైతే ప్లాన్ తయారుచేసుకున్నారో దాని అనుసారంగా తయారుగా కూడా ఉండాలి. విఘ్నాలు వస్తాయి. కానీ అవసరం అయిన విషయం గురించి తయారీలు చేసుకుంటారు. ప్రవృత్తిలో మీకు ఏదైనా అవసర సందర్భం వస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటారు కదా! అదేవిధంగా మిమ్మల్ని మీరు స్వతంత్రులుగా తయారుచేసుకునేటందుకు ఏదోక ఏర్పాటు చేసుకోండి. ఎవరినైనా తోడుగా పెట్టుకోండి. దైవీ పరివారంలో కూడా ఒకరికొకరు సహాయకారి అవ్వవచ్చు. కానీ అలా ఎప్పుడు అవుతారంటే ఒకరికొకరు స్నేహం ఇచ్చుకుంటూ సహయోగిగా చేసుకున్నప్పుడు. ప్లాన్ తయారుచేయండి - బంధనాల నుండి తేలిక అవ్వటం ఎలా? కొందరు తెలివైనవారు ఉంటారు, తమ బంధనాలు తెంచుకోవటానికి యుక్తి రచిస్తారు. ఏవైనా ఏర్పాట్లు దొరికితే వస్తాను అని అనకూడదు. మీకు మీరే ఏర్పాట్లు చేసుకోవాలి. మిమ్మల్ని మీరే స్వతంత్రులు చేసుకోవాలి. ఇతరులు ఎవరో చేయరు. యోగయుక్తులై ప్లాన్ ఆలోచిస్తే మీ కోరిక పూర్తి అవ్వటానికి ఏర్పాట్లు కూడా లభిస్తాయి. కేవలం నిశ్చయబుద్దియై మీ ఉత్సాహాన్ని తీవ్రం చేయండి. ఉత్సాహం డీలాగా ఉంటే మీకు ఏర్పాట్లు కూడా లభించవు. సహాయకారులు ఎవరూ కూడా దొరకరు. అందువలన ధైర్యవంతులు అవ్వండి, అప్పుడు ఎవరొకరు మీకు సహాయకారి అవుతారు. ప్రతి ఒక్కరు స్వయాన్ని స్వతంత్రంగా తయారుచేసుకోవడానికి ఎంత శక్తి నింపుకున్నారో ఇప్పుడు చూస్తాను. మాయాజీతులు కదా! కాని స్వయాన్ని స్వతంత్రులుగా చేసుకునే శక్తి చాలా ఉండాలి. ఎంత వరకు ఈ శక్తి మీలో నిండిందో పరీక్ష ఉంటుంది. ఎవరైతే కుటుంబంలో ఉంటూ కూడా మీరు స్వతంత్రులై సేవలో సహాయకారి అవుతారో వారికి బహుమతి కూడా పంపబడుతుంది మంచిది.

చిన్న పిల్లలు భగవంతునితో సమానం. అందరూ ఒకటే కానీ గుర్తింపు కోసం మాత్రమే గుజరాతీయులు, పంజాబీలు అని అంటారు. గుజరాత్ వారు నెంబర్ వన్ అయ్యి చూపిస్తారు కదా! బహుమతికి యోగ్యంగా ఎవరు అవుతారో చూస్తాను. ఒక్కొక్క రత్నానికి తమతమ విశేషత ఉంది. కొందరిలో స్నేహం యొక్క విశేషత, కొందరిలో సహయోగం యొక్క విశేషత, కొందరిలో శక్తి యొక్క విశేషత, కొందరిలో దివ్యగుణ మూర్తిగా అయ్యే విశేషత, కొందరిలో జ్ఞానం యొక్క విశేషత... ఇలా ఒకొక్కక్కరిలో ఒకొక్క విశేషత ఉంది. ఇప్పుడు సర్వశక్తులు మీలో నింపుకోవాలి. సర్వగుణ సంపన్నంగా, 16 కళా సంపూర్ణంగా కావాలి. సర్వ గుణ సంపన్నంగా కాకపోతే 16కళల నుండి 14 కళల్లోకి వచ్చేస్తారు. చంద్రుని కళలు కొంచెం తగ్గినా కానీ బావుండదు. సంపూర్ణత వలనే సుందరత ఉంటుంది. తీవ్ర పురుషార్థీల బాణం సదా గురి వైపే ఉంటుంది. ఎప్పుడూ మాయతో ఓడిపోకూడదు. ప్రకాశగోళంగా అయ్యి వెళ్ళాలి. జ్ఞానాన్ని కూడా ప్రకాశం అని అంటారు. కనుక ప్రకాశం మరియు శక్తి కూడా(లైట్ మైట్). ప్రయత్నం అనే మాట బలహీనమైనది. ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడే మొదటే మాయ తయారుగా ఉంటుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు త్వరగా అనారోగ్యం వస్తుంది కదా! అలాగే ప్రయత్నిస్తాను అని అనటం కూడా ఆత్మ యొక్క బలహీనత. కనుక నిశ్చయమే విజయం. రోజంతటిలో ఏ స్మృతులు ఉంటాయో అవే కలలు వస్తాయి. కనుక రోజంతటిలో శక్తి స్వరూపం యొక్క స్మృతిలో ఉంటే బలహీనత అనేది స్వప్పంలో కూడా రాలేదు. మంచిది.