29.04.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బేహద్ పరీక్షలో పాస్ అయ్యేటందుకు సాధనం.

ఈరోజు భట్టీ యొక్క సమాప్తియా లేక భట్టీ యొక్క ప్రత్యక్ష పరీక్ష యొక్క ప్రారంభమా? ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? పరీక్ష హాలుకి వెళ్తున్నారా లేక మీ మీ స్థానాలకి వెళ్తున్నారా? పరీక్ష హాలుగా భావించినప్పుడు ప్రత్యక్షంగా పాస్ అయ్యి చూపిస్తారు. కనుక ఇంటికి వెళ్తున్నామని అనుకోకూడదు. అలా కాదు. చాలా పెద్ద కోర్సు పాస్ అయ్యి చాలా పెద్ద పరీక్ష వ్రాయటానికి పరీక్ష హాలులోకి వెళ్తున్నారు. సేవాకేంద్రాల్లో చదువుకున్నంత సేపు స్కూలులో చదువుకుంటున్నట్లు. కానీ మధువన వరదాన భూమిలో స్వయంగా బాప్ దాదా లేదా నిమిత్తమైన పెద్ద మహారథీల ద్వారా ట్రైనింగ్ తీసుకుంటున్నారు లేదా చదువుకుంటున్నారంటే కాలేజి లేదా యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. స్కూలు పరీక్ష మరియు యూనివర్సిటీ యొక్క పరీక్షలో తేడా ఉంటుంది. చదువులో కూడా తేడా ఉంటుంది. ఈ భట్టీలో ట్రైనింగ్ తీసుకోవటం అంటే యూనివర్సిటీ యొక్క విద్యార్ధిగా అవ్వటం. ఆ యూనివర్సిటీ చదువు యొక్క పరీక్ష కోసం ఇప్పుడు వెళ్తున్నారు. యూనివర్సిటీలో పరీక్ష తర్వాతే డిగ్రీ లభిస్తుంది. అదేవిధంగా భట్టీకి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ పరీక్ష పాస్ అయిన తర్వాత వర్తమానం మరియు భవిష్యత్తు కొరకు డిగ్రీ మరియు పదవి ప్రాప్తిస్తుంది. దీనిని సామాన్య విషయంగా భావించకూడదు. మొదట్లో సేవాకేంద్రాల్లో చదువుకున్నారు మరియు పరీక్షలు కూడా దాటారు కానీ యూనివర్సిటీ పరీక్ష బాప్ దాదా ద్వారా తిలకం లేదా ముద్ర వేయించుకున్న తర్వాత ప్రాక్టికల్ పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? జన్మజన్మాంతరాలు ఫెయిల్ అయిన మచ్చ మిగిలిపోతుంది. అందువలన ఫెయిల్ అయ్యే సంస్కారం లేదా అలాంటి నడవడిక ఏదైన అనుభవం అయితే మిగిలిపోయిన ఆ మచ్చని లేదా బలహీన నడవడిక లేదా సంస్కారాన్ని ఈరోజే తొలగించుకుని వెళ్ళాలి. దీని ద్వారా పరీక్ష హాలులోకి వెళ్ళిన తర్వాత పరీక్షలో ఫెయిల్ అవ్వలేరు. అర్ధమైందా! ఆ పరీక్ష అయితే అయిపోయింది, అది అయితే సహజం కానీ నెంబరు లేదా మార్కులు అనేవి ప్రత్యక్ష పరీక్ష తర్వాతే నిర్ణయించబడతాయి. స్మృతి మరియు దృష్టి రెండింటినీ పరివర్తన చేసుకుని వెళ్ళాలి. స్మృతిలో ఏమి ఉండాలి? ప్రతి సెకను నాకు పరీక్ష జరుగుతుంది. దృష్టిలో ఏమి ఉండాలి? చదివించేవారు తండ్రి, నేను విద్యార్ధిని ఆత్మను. ఈ విధంగా స్మృతి, వృత్తి మరియు దృష్టి మార్చుకుని వెళ్ళటం ద్వారా ఫెయిల్ అవ్వరు . ఫుల్ పాస్ అయిపోతారు. కనుక భట్టీని సాధారణ విషయంగా భావించకూడదు. ఈ భట్టీ యొక్క ముద్ర మరియు తిలకాన్ని సదా స్థిరంగా ఉంచుకోవాలి. యూనివర్సిటీ యొక్క సర్టిఫికెట్ ద్వారా సర్వీస్ లభిస్తుంది మరియు పదవి లభిస్తుంది. అదేవిధంగా భట్టీ యొక్క ఈ తిలకం లేదా ముద్ర సదా మీ దగ్గర ప్రాక్టికల్‌గా స్థిరంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది చాలా పెద్ద సర్టిఫికెట్. ఎవరికైతే సర్టిఫికెట్ ఉండదో వారు ఏ పదవిని పొందలేరు. అదేవిధంగా ఇది కూడా ఒక సర్టిఫికెట్. భవిష్య లేదా వర్తమాన ప్రాప్తి లేదా సఫలత కొరకు సర్టిఫికెట్‌ని సదా జాగ్రత్తగా పెట్టుకోండి. నిర్లక్ష్యంతో పోగొట్టుకోకండి. ఎప్పుడూ కూడా మాయకి ఆధీనమై లేదా వశమై పురుషార్ధంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీరేమో సర్టిఫికెట్ ఉందనుకుంటారు కానీ మాయ లేదా రావణుడు ఆ సర్టిఫికెట్ ని దొంగిలించేస్తాడు. ఈరోజుల్లో దొంగలు లేదా జేబు దొంగలు ఎంత యుక్తిగా తమ పని చేస్తారు. బయటకి కొంచెం కూడా తెలియదు కానీ లోపల ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా పురుషార్థంలో నిర్లక్ష్యం వస్తే రావణుడు లోలోపలే సర్టిఫికెట్ ని దొంగిలించేస్తాడు. మరియు మీరు పదవిని పొందలేరు అందువలన ధ్యాస పెట్టండి. అర్థమైందా! ఈ గ్రూపు సేవాధారి గ్రూపు. కానీ ఇప్పుడు ఏవిధంగా అవ్వాలి? ఎలాగైతే సేవాధారులో అలాగే సేవలో 1. త్రికాలదర్శి అనే తెలివిని నింపాలి. 2. ఆత్మీయత అనే సువాసనను నింపాలి. మూడు విషయాలు 1. సేవ 2. తెలివి 3. సువాసన. సువాసన అనేది సూక్ష్మంగా ఉంటుంది. ఆత్మీయత అనే సువాసన మరియు త్రికాలదర్శి అనే తెలివి మీలో నింపుకోవటం ద్వారా సేవాధారితో పాటు విజయీలు అయిపోతారు. కనుక ఈ తెలివి మరియు సువాసన ఎంత వరకు స్వయంలో నింపాను అని పరిశీలించుకోండి. ఇప్పుడు కూడా పరీక్ష హాలులోకి వెళ్ళే రెండు గంటలు ముందు కూడా పరీక్ష కోసం తయారవుతూ ఉంటారు. అదేవిధంగా మీకు కూడా పరీక్ష హాలులోకి వెళ్ళే ముందు మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. బ్రహ్మాకుమారులతో పాటు తపస్వి కుమారులుగా కనిపించాలి అని చెప్పాను కదా! మీ నయనాలలో, మీ ముఖంలో ఆత్మీయతను ధారణ చేస్తే మీరు అలౌకికంగా, అతీతంగా మరియు అందరికీ ప్రియంగా కనిపిస్తారు. కేవలం భట్టీకి వచ్చిన వారే కాదు. మధువనం వచ్చేవారందరు ఈ ధారణను విశేష రూపంతో చేయాలి. భట్టీ విజయవంతం అయ్యిందా? వీరి చదువుతో మీరు సంతుష్టంగా ఉన్నారా? భట్టీలోని చదువుతో పురుషార్ధం పరంగా మీరు సంతుష్టం అయ్యారా? ఏదీ మిగిలిపోలేదు కదా! (ఏదీ మిగలలేదు) ఎప్పుడైనా మిగులుతుందా? మీ రక్షణా సాధనాలు మీరు వెతుక్కుంటారు. ఏమైనా అయితే ఇలా అనవచ్చు అని. కానీ దీని ద్వారా కూడా బలహినత వచ్చేస్తుంది. కనుక ఇలా కూడా ఆలోచించకూడదు. ఎప్పుడూ కూడా మేము ఫెయిల్ అవ్వము, ఇప్పుడు మరియు జన్మజన్మాతంరాల వరకు కూడా గ్యారంటి, మీరు ఎప్పుడూ ఫెయిల్ అవ్వరు. అలాంటి వారినే ఫుల్ పాస్ అని అంటారు. కుమారుల విశేషత ఏమిటంటే ఏది కావాలంటే అది చేయగలరు. ఇలాంటి ఆత్మలు తప్పకుండా కావాలి. ప్రతీ సంకల్పాన్ని ప్రతీ సెకను బాబాకి అర్పణ చేసేటందుకు ఆత్మబలం కావాలి. పిల్లలకి అన్ని ఇస్తారు, ఏది ఉన్నా కానీ అంతా పిల్లలకే ఇస్తారు. మీరు కూడా వారసులను తయారు చేస్తున్నారు మరియు తయారవుతున్నారు కూడా. ఇతరుల విలపవర్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే అన్నింటిని అర్పణ చేయటానికి కూడా విల్ పవర్ ఉండాలి. అది ఇక్కడి నుండి నింపుకుని వెళ్ళాలి. అన్నీ అర్పణ చేసేస్తే ఏవిధంగా అయిపోతారు? నష్టోమోహ ఎప్పుడైతే మోహం పోతుందో అప్పుడు బంధన్ముక్తులు అయిపోతారు. మరియు బంధన్ముక్తులే యోగయుక్తులుగా లేదా జీవన్ముక్తులుగా కాగలరు. అర్థమైందా! సంగమయుగంలో మీ దగ్గర ఏ ఖజానాలు ఉన్నాయి? జ్ఞాన ఖజానా అయితే బాబా ఇచ్చారు. కానీ మీ ఖజానాలు ఏవి? సమయం మరియు సంకల్పం, ఏవిధంగా అయితే బాబా తనదంతా పూర్తిగా పిల్లలకి అర్పణ చేసేశారో అదేవిధంగా మీరు కూడా స్మృతిలో ఏదైతే ఉందో అదంతా అర్పణ చేయాలి. స్థూలధనం ద్వారా ఏది కావాలంటే అది పొందవచ్చు. అదేవిధంగా ఈ సమయం యొక్క ఖజానాలు సమయం మరియు సంకల్పం - వీటి ద్వారా కూడా మీరు ఏది కావాలంటే అది పొందవచ్చు. ప్రాప్తి అంతటికీ ఆధారం సంగమయుగి సమయం మరియు శ్రేష్ట స్మృతి. ఇవే ఖజానా. వీటినే అర్పణ చేయాలి. పూర్తిగా అర్పణ చేసి వెళ్తున్నారా? లేక జేబుఖర్చు కోసం కొంచెం దాచుకున్నారా? అవసరానికి పనికొస్తుందని కొంచెం ఏదో మూలలో దాచి పెట్టుకోలేదు కదా, జేబు పూర్తిగా ఖాళీ అయిపోయిందా? (కుమారులు ఒక పాట పాడారు) ప్రస్తుతం మధువనంలో ఏ మూల ఖాళీ లేదు, ప్రతీ చోట సితారల మెరుపు కనిపిస్తూ ఉంది. మరయితే ఖాళీ అని ఎందుకు అంటున్నారు? సూర్యుడు వ్యక్తం నుండి అవ్యక్తం అయినప్పుడు సితారల మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా తండ్రి వ్యక్తం నుండి అవ్యక్తం అయ్యారు. విశ్వానికి సితారల మెరుపు చూపించడానికి. మరి ఖాళీ అని ఎందుకు అంటున్నారు? స్థూల సూర్యుడిని అయితే అస్తమించాడు అని అంటారు, కానీ జ్ఞాన సూర్యుడు వ్యక్తం నుండి అవ్యక్త రూపంలోకి వెళ్తారు. కానీ సితారలతో పాటే ఉన్నారు. సాకార రూపంతో అయితే సదా తోడుగా ఉండలేరు. సాకారంలో ఉంటూ కూడా సదా తోడుగా ఉండేటందుకు అవ్యక్త స్థితి, అవ్యక్త తోడు అని భావించేవారు. ఇప్పుడు కూడా అవ్యక్త రూపంలో సదా తోడుగానే ఉన్నారు. ఎందుకంటే అవ్యక్త రూపం వ్యక్త శరీర బంధన్ముక్తం. మీ అందరికీ సదా తోడుగా ఉండేటందుకు, ఈ శరీర స్మృతి నుండి దూరం చేసేటందుకు ఈ అవ్యక్త పాత్ర నడుస్తూ ఉంది. కానీ బాప్ దాదా అయితే ప్రతీ బిడ్డతో సదా తోడుగా ఉన్నారు. ఆదిలో ఒక పాట తయారు చేశారు - ఎందుకు అధైర్యం మాతా.... (ఈ పాట అక్కయ్యలు పాడి వినిపించారు) ప్రతీ ఒక్కరికీ ఇప్పటికీ తోడుగానే ఉన్నాను. ఎవరు కావాలంటే వారు అనుభవం చేసుకోవచ్చు. తండ్రి అవ్యక్తం కనుక అవ్యక్తంగా అయితేనే కలుసుకోగలరు. ఈ అలౌకిక అనుభవం చేసుకునేటందుకు సదా వ్యక్త భావం నుండి అతీతంగా వ్యక్త దేశం యొక్క స్మృతికి అతీతంగా అనగా సాక్షిగా అవ్వటం ద్వారానే ప్రతీ సమయం తోడుని అనుభవం చేసుకోగలరు. అర్ధమైందా? మంచిది