11.06.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మూడు లోకాల్లో బాప్ దాదాకి సమీపంగా ఉండే రత్నాల యొక్క గుర్తులు.

ఈ గ్రూపు ఏ గ్రూపు? ఈ గ్రూపుని అలంకరించి ఏవిధంగా తయారుచేశారు? మరియు తయారయ్యి వెళ్తున్నారు కదా! అయితే వీరిని మార్చి ఏవిధంగా తయారు చేశారు? మేము ఏవిధంగా తయారయ్యాము అనేది సాక్షాత్కారం అయితేనే ఇతరులను ఆవిధంగా తయారు చేయగలరు. మేము ఆత్మిక సేవాధారులం అయ్యి వెళ్తున్నాము అని ఈ గ్రూపు వారు భావిస్తున్నారు. అందరు స్వయాన్ని సేవాధారిగా భావించి సేవాస్థానానికి వెళ్తున్నారు కదా లేక మీ మీ ఇళ్ళకు వెళ్తున్నారా? ఏమని భావించి వెళ్తున్నారు? మీ లౌకిక పరివారం దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ఏ విధంగా భావిస్తారు? అది కూడా సేవాస్థానమేనా లేక కేవలం సెంటరే సేవాస్థానమా? ఇంటిని కూడా సేవాస్థానంగా భావిస్తే స్వతహాగానే సేవ జరుగుతూ ఉంటుంది. సేవాధారులకి ప్రతీ స్థానంలోను సేవ ఉంటుంది. ఎక్కడ ఉన్నా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ సేవాధారికి ప్రతీ స్థానం మరియు ప్రతి సమయం సేవయే కనిపిస్తుంది. మరియు సేవలోనే నిమగ్నమై ఉంటారు. ఇంటిని కూడా సేవాస్థానంగా భావించి ఉంటారు. బుద్ధిలో సేవ యొక్క స్మృతి ఉండటం వలన ఆ స్మృతి శక్తితో కర్మబంధన కూడా సహజంగా మరియు త్వరగా సమాప్తం అయిపోతుంది. ఒక్క సెకండు లేదా ఒక్క సంకల్పంలో కూడా సేవ లేకుండా ఉండలేరు. అలాంటి వారినే సత్యమైన ఆత్మిక సేవాధారి అని అంటారు. ఆత్మిక సేవాధారులు ఆత్మతో కూడా సేవ చేస్తారు. లైట్‌హౌస్ ఒక స్థానంలో ఉంటూనే తన లైట్ ద్వారా నలువైపుల సేవ చేస్తుంది. అదేవిధంగా ఎవరైతే సేవాధారులు ఉంటారో వారు కూడా ఏదో ఒక స్థానంలో ఉంటూ బేహద్ సృష్టి యొక్క బేహద్ సేవలో తత్పరులై ఉంటారు. అయితే లైట్‌హౌస్ మరియు మైట్ హౌస్ గా అయ్యారా? రెండు రకాలుగా అయ్యారా లేక కేవలం లైట్ హౌస్ అయ్యారు మరియు మైట్ హౌస్ గా ఇప్పుడు ఇంకా అవ్వాలా? లైట్ హౌస్ అనగా జ్ఞానస్వరూపం, మైట్ హౌస్ అనగా యోగయుక్త స్థితి. అయితే అందరు జ్ఞాని ఆత్మలుగా, యోగి ఆత్మలుగా అయ్యి వెళ్తున్నారు కదా! లేక ఇప్పటికీ ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా? పూర్తిగా అలంకారం చేసుకున్నారా? మామూలుగా కూడా కుమారీగా ఉన్నప్పుడు స్వచ్చత మరియు తమని తాము మంచిగా అలంకరించుకుంటారు. అదేవిధంగా ఇక్కడ భట్టీలో కూడా పూర్తిగా జ్ఞానం మరియు గుణాల యొక్క అంలకారాలతో అలంకరించుకున్నారు. అలంకరించుకుని వెళ్తున్నారా లేక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా అలంకరించుకోవాలా? పూర్తి అస్త్రశస్త్రధారిగా అయితే అక్కడ సదా విజయీ అవుతారు. శస్త్రాలు శత్రువుని ఎదురుగా రానివ్వవు. అయితే శస్త్రధారిగా అయ్యారా శత్రువుని చూడగానే దూరం నుండే పారిపోవాలి. అందరు ఆవిధంగా అయ్యారా? మధువన వరదాన భూమి యొక్క ప్రభావంలో ఉండి మాట్లాడుతున్నారా లేక అవినాశి శస్త్రధారిగా మిమ్మల్ని మీరు అలంకరించుకున్నారా? రేపు క్రిందకి దిగినప్పుడు అదే ఉన్నత స్థితి ఉంటుందా? ఇది కూడా పక్కా చేసుకోండి - ఎక్కడికి వెళ్ళినా కానీ స్వయంతో స్వయం, మధువనం యొక్క సంఘటన మధ్యలో, ఈశ్వరీయ సభ మధ్యలో ఏదైతే ప్రతిజ్ఞ చేశామో అది సదా స్థిరంగా ఉంటుంది. ఇలాంటి అవినాశి ముద్ర ప్రతీ ఒక్కరు మీకు మీరు వేసుకున్నారా? నిశ్చయానికి విజయం అవశ్యం మరియు ధైర్యం పెట్టుకునేవారికి బాప్ దాదా మరియు ఈశ్వరీయ పరివారం యొక్క ఆత్మలు కూడా సహాయకారి అవుతారు. మీ ధైర్యాన్ని కదిలించాలని ఎవరు ఎంతగా ప్రయత్నించినా కానీ ఏదైతే ప్రతిజ్ఞ చేశారో ఆ ప్రతిజ్ఞ యొక్క శక్తితో కొంచెం కూడా పాదం కదపకూడదు. ఏ పాదం? దాని ద్వారానే స్మృతియాత్ర చేస్తున్నారు. సృష్టి అంతా కదిపినా కానీ మీరు సృష్టిలోని ఆత్మలకంటే శక్తిశాలి. మొత్తం సృష్టి అంతా ఒకవైపు, మీరు ఒక్కరే ఒకవైపు ఉన్నా కానీ మీ శక్తియే శ్రేష్టమైనది. ఎందుకంటే సర్వశక్తివంతుడైన బాబా మీ తోడుగా ఉన్నారు. అందువలనే శివ శక్తులు అనే మహిమ ఉంది. శివుడు మరియు శక్తులు ఇద్దరూ కలిసి ఉంటే వారి ముందు సృష్టిలోని ఆత్మలు ఎంత? అనేకులు అయినా కానీ ఒక్కరితో కూడా సరిసమానం కాదు. ఇంత నిశ్చయబుద్ది లేదా ప్రతిజ్ఞను పాలను చేయాలనే ధైర్యం పెట్టుకునేవారిగా అయ్యి వెళ్తున్నారు కదా! ప్రాక్టికల్ (ప్రత్యక్ష) పరీక్షలు వస్తాయి. థియరీ పరీక్షలు అయితే సహజంగా ఉంటాయి. ఎవరికైనా 7 రోజుల కోర్సు చెప్పటం, మ్యూజియం లేదా ప్రదర్శినిలో అర్థం చేయించటం ఇవన్నీ థియరీ పరీక్షలు లాంటివి. కానీ ప్రాక్టికల్స్ లో ఎవరైతే ఇలా పాస్ అవుతారో వారే పాస్ విత్ ఆనర్ ఎవరైతే ఇలా పాస్ అవుతారో వారే బాప్ దాదాకి దగ్గరగా ఉండే రత్నంగా అవుతారు. దగ్గరగా ఉండటం ఇష్టమనిపిస్తుందా లేక దూరం నుండి చూడటం ఇష్టమనిపిస్తుందా? పాస్ విత్ ఆనర్ గా అవుతారా? ఈ ధైర్యం కూడా పెట్టుకోవాలి. ఈ ధైర్యాన్ని అవినాశిగా చేసుకునేటందుకు ఒక విషయం సదా ధ్యాసలో ఉంచుకోవాలి. ఏ సాంగత్యంలోకి రాకుండా స్వయాన్ని కాపాడుకోండి. అనేక రకాల ఆకర్షణలు పరీక్షలుగా వస్తాయి కానీ ఆకర్షితం అవ్వకూడదు. పరీక్షలుగా భావించి హర్షిత ముఖులై వాటిని దాటేయాలి. సాంగత్యదోషం అనేది అనేక రకాలుగా ఉంటుంది. మాయ సంకల్పాల రూపంలో కూడా తన సాంగత్యం యొక్క రంగుని అంటించడానికి ప్రయత్నిస్తుంది. ఈ వ్యర్థ సంకల్పాలు లేదా మాయా ఆకర్షణ యొక్క సంకల్పాలలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వకూడదు. స్థూల సంబంధీకుల సాంగత్యం,ఈ విషయంలో కేవలం కుటుంబ సంబంధాలే కాదు, వాటితో పాటు ఇతర సంబంధాలు కూడా వస్తాయి. స్నేహితుల సాంగత్యం కూడా సంబంధీకుల రంగులోకే వస్తుంది. ఇలా ఏ సంబంధీకుల రంగులోకి వెళ్ళకూడదు. దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఆ తర్వాత అన్నం యొక్క సాంగత్యదోషం కూడా ఉంటుంది. ఒకవేళ ఎప్పుడైనా కానీ ఏ సమస్య వలన అయినా కానీ లేదా ఏ సంబంధం యొక్క స్నేహానికి వశమై కూడా అన్నదోషంలోకి వచ్చారంటే మీ మనస్సుకి ఆ సాంగత్యం యొక్క రంగు అంటుకుంటుంది. దీని నుండి కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. అదేవిధంగా కర్మ యొక్క సాంగత్యం కూడా ఉంటుంది. దీని నుండి కూడా రక్షించుకోవాలి. అప్పుడు పాస్ విత్ ఆనర్ అవుతారు. సాంగత్యదోషం యొక్క పరీక్షలో పాస్ అయిపోతే బాబాకి సమీపంగా రాగలరని భావించండి. ఒకవేళ సాంగత్యదోషంలోకి వచ్చేస్తే దూరం అయిపోతారు. అప్పుడిక నిరాకారి వతనంలో, ఇప్పుడు అనగా సంగమయుగంలో మరియు భవిష్యత్తులో సమీపంగా ఉండలేరు. ఒక్క సాంగత్యదోషం మూడు లోకాలలో మిమ్మల్ని దూరం చేసేస్తుంది. ఒక్క సాంగత్యదోషం నుండి రక్షించుకోవటం ద్వారా మూడు లోకాలలో మూడు కాలాలలో బాబాకి సమీపంగా ఉండే భాగ్యం ప్రాప్తింపచేసుకోగలరు. ఈ గ్రూపుని బాప్ దాదా హంసల యొక్క సంఘటన అని అంటున్నారు. హంసల యొక్క కర్తవ్యం లేదా స్వరూపం ఏమిటి? హంసల స్వరూపం - పవిత్రత. కర్తవ్యం - సదా గుణాల రూపి ముత్యాలను ధారణ చేయటం, అవగుణాల రూపి రాళ్ళను ఎప్పుడూ కూడా బుద్ధి ద్వారా స్వీకరించరు. ఇదే హంసల యొక్క కరవ్యం. కానీ ఈ కర్తవ్యాన్ని పాలన చేసేటందుకు బాప్ దాదా నుండి సదా ఆజ్ఞ లభిస్తూ ఉంటుంది. ఆ ఆజ్ఞ ఏమిటి? ఈ ఆజ్ఞ గురించి చిత్రం కూడా తయారయ్యింది. చెడు చేయకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు, ఆలోచించకూడదు. ఒకవేళ ఈ ఆజ్ఞని సదా స్మృతిలో ఉంచుకుంటే సత్యమైన హంస అయ్యి సర్వ గుణ సాగరుడైన బాబా యొక్క సాగరతీరాన కూర్చుని ఉంటారు. కనుక మీ బుద్ధికి జ్ఞాన సాగరుడైన బాబావైపు తప్ప మరే గమ్యం ఇవ్వకూడదు. ఎందుకంటే హంసల స్థావరం - సాగరం. కనుక స్వయాన్ని హంసగా భావించి మీ ప్రతిజ్ఞలను పాలన చేస్తూ ఉండాలి. అర్ధమైందా? ముత్యాలు మరియు రాళ్ళు వేరు చేయటం నేర్చుకున్నారా? రాళ్ళు ఎలా ఉంటాయి? రత్నాలు ఎలా ఉంటాయి? ఆ ఙ్ఞానం అయితే ఉంది కదా! ఇప్పుడు ఒకొక్క హంస ఏమేమి అద్భుతం చేసి చూపిస్తారో చూస్తాను. హంసల సంఘటన అందరినీ స్వతహాగానే ఆకర్షిస్తుంది. కనుక సాంగత్యదోషం నుండి రక్షించుకోవాలి మరియు ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి.అనేక సాంగత్యాలు వదలాలి, ఒకే సాంగత్యం జోడించాలి. బుద్ధి సదా ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. స్థూల సంబంధంలో కూడా ఈశ్వరీయ సాంగత్యంలో ఉండాలి. ఈ సాంగత్యం ఆధారంగా అనేక సాంగత్యదోషాల నుండి రక్షించుకోగలరు. కేవలం పరివర్తన చేసుకోవాలి. కోమలతాన్ని అద్భుతంలోకి పరివర్తన చేయాలి. కోమలత్వాన్ని చూపించకూడదు. కేవలం సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో కోమలంగా అవ్వాలి. కర్మలో కోమలంగా అవ్వకూడదు. దీంట్లో కూడా శక్తి స్వరూపంగా అవ్వాలి. ఒకవేళ శక్తి స్వరూపము అనే కవచాన్ని సదా ధారణ చేస్తే శక్తిరూపంగా అయిపోతారు. అప్పుడు మాయ యొక్క ఏ బాణమూ తగలదు. కనుక కర్మలో కోమలంగా అవ్వకూడదు. ముఖము, ముఖకవళికల్లో కోమలత ఉండకూడదు. ఈ విషయాలన్నింటినీ స్మృతిలో పెట్టుకుని పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. రుజువుగా తయారయ్యి ప్రత్యక్ష రుజువు చూపించే ఆశారత్నాలు ఈ గ్రూపులో కనిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరు ఒకరికంటే ఒకరు ముందుకి వెళ్ళాలి. ఇతరులు ముందుకి వెళ్ళటం చూసి సంతోషపడటం కాదు, ఇలా కేవలం ఇతరులను చూస్తూనే ఉండిపోతే భక్తులు అవుతారు. జ్ఞాన స్వరూప మరియు యోగయుక్త ఆత్మలుగా అవ్వాలి. జ్ఞాని యోగి ఆత్మలుగా అవ్వాలి. ఇప్పుడు పరీక్ష ఫలితం చూస్తాను. ప్రత్యక్ష రుజువు చూపించినవారు మొదటినెంబరు అవుతారు. ఎవరైతే ఆలోచిస్తూనే ఉండిపోతారో వారికి రాజ్యభాగ్యం ఇవ్వటానికి బాబా కూడా ఆలోచిస్తారు. ఎవరైతే స్వయానికి స్వయమే అవకాశాన్ని కోరతారో వారికి బాప్ దాదా కూడా విశ్వ రాజధాని యొక్క రాజ్యభాగ్యంలో ముందు అవకాశం ఇస్తారు. ఒకవేళ స్వయానికి స్వయం అవకాశం కోరకపోతే బాప్ దాదా కూడా విశ్వ సింహాసనాన్ని ఎందుకు ఇస్తారు? కనుక స్వయానికి స్వయమే అవకాశాన్ని కోరండి. వారినే అవకాశదారి అని అంటారు. గాలి బుడగగా అవ్వకూడదు. అది చాలా వేగంగా ఎగురుతుంది కానీ గాలి ఉన్న కాసేపే. ఇక్కడ మీలో అవినాశి శక్తిని నింపుకోవాలి. తాత్కాలిక గాలిని ఆధారంగా తీసుకోకూడదు. మంచిది.