11.09.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


డబల్ రిఫైన్ స్థితి.

ఈరోజు మాట్లాడాలా? లేక చూడాలా? చూడటమే మాట్లాడటమా? ఏది మాట్లాడాలో అది నోటితో మాట్లాడకుండా నయనాలతో మాట్లాడే అనుభవం ఉందా? అలా చేయగలరా? అలా చేశారు కూడానా? ఈరోజు మాస్టర్ జ్ఞాన సాగరులు, శక్తివంతులు, సపలతామూర్తులు మరియు సేవాధారుల సభ ఇది. మరయితే నయనాల ద్వారా తెలుసుకోలేరా? మీ మనస్సు యొక్క భావనని లేదా బుద్ధి యొక్క సంకల్పాలను నయనాల ద్వారా ప్రకటితం చేయలేరా? ఇది కూడా ఈ చదువులోని పాఠం. మరయితే చెప్పండి, ఈ రోజు బాప్ దాదా ఏమి చెప్పాలనుకుంటున్నారో? తెలుసు కదా మీకు! మాస్టర్ జ్ఞాన సాగరులు కదా! ఈ పాఠం చదివేశారా అయితే పరీక్ష తీసుకోవటానికి తయారేనా? మహావీరులే, ఇది మహావీరుల గ్రూపు కదా! ఇతరుల యొక్క బ్యాటరీని చార్జ్ చేసే ఇన్ చార్జ్ లు. బాప్ దాదా అయితే చూస్తున్నారు - ఈ గ్రూపులో అందరూ నెంబరువారీగా పాస్ అయినవారే. అనేక విషయాలను, అనేక అనుభవాలను చూసి దాటి దాటి పాస్ అవ్వలేదా? పాస్ అనే మాటకి మూడు అర్థాలతో పాస్ అవ్వాలి. 1. ఏ సమస్యని లేదా మార్గాన్ని అయినా దాటటం అనగా పాస్ చేయటం. 2. చదువులో పాస్ అవ్వటం 3. దగ్గరగా ఉండటాన్ని కూడా (హిందీలో పాస్ రహనా) ఇలాగే అంటారు. ఇలా మూడు రకాలుగా పాస్ అవ్వాలి. త్రిశూల తిలకం అనగా మూడు రకాలుగా పాస్ అవ్వటం. ఈ తిలకం కనిపించటం లేదా? ఈ గ్రూపులో ఉన్నవారి యొక్క మస్తకంలో ఈ త్రిశూలం యొక్క తిలకం మీకు కనిపిస్తుందా? బాప్ దాదాకి ఈ రోజు ఈ సభ ఏవిధంగా కనిపిస్తుందో తెలుసా? మీ సాక్షాత్కారం మీకు అవుతుంది కదా! (దాదీని చూస్తూ) వీరు సాక్షాత్కారమూర్తి, మీరు సాక్షి. అయితే చెప్పండి, ఈ గ్రూపుకి ఏమి సాక్షాత్కారం అవుతుంది? వీరు (దాదీ) మైక్, మీరు (దీదీ) మైట్. అవునా? వీరు శక్తిని ఇస్తారు. వారు మైక్ అయ్యి మాట్లాడతారు. బాప్ దాదాకి ఏమి సాక్షాత్కారం అవుతుంది? ఇప్పుడు డబల్ కిరీటాన్ని ధారణ చేయకపోతే భవిష్యత్తులో కూడా డబల్ కిరీటం లభించదు. ఈరోజు కిరీటధారి, తిలకధారి, సింహాసనాధికారులైన రాజర్షిల సభను చూస్తున్నారు. భవిష్య సభ ఈ సభ ముందు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడే మీ సంగమయుగి కిరీటం, తిలకం మరియు సింహాసనాధికారి, పురుషోత్తమ మర్యాదా సంపన్న స్వరూపాన్ని చూడండి మరియు దాంతోపాటు మీ భవిష్య స్వరూపాన్ని కూడా చూడండి. అప్పుడు రెండింటిలో ఏ మూర్తి ఆకర్షణీయంగా, అలౌకికంగా, ఆత్మీయంగా కనిపిస్తుంది? ఇప్పటిదా లేక భవిష్యత్తుదా? మీ స్వరూపాలను సదా సాక్షాత్కారం చేసుకుంటూ మరియు చేయిస్తూ ఉన్నారా లేక ఇప్పటికీ పరదా వెనుక తయారవుతున్నారా? వేదిక పైకి రాలేదా? వర్తమాన సమయంలో వేదికపై ఏ రూపంలో ఉంటున్నారు? ఇప్పటి మీ స్థితి ఎంత వరకు ఉన్నట్లు మీరు భావిస్తున్నారు? అంతిమ స్థితి, మరయితే అంతిమానికి చేరుకున్నారా? శుద్ధంగా ఉన్నారా? పరిశుద్ధంగా ఉన్నారా? పరిశుద్ధతలో కూడా ఈరోజుల్లో డబల్ పరిశుద్దత ఉంటుంది. అయితే ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నారా? డబల్ పరిశుద్ధం అవ్వలా లేక పరిశుద్ధం అవ్వాలా? ఒకసారి అయితే పరిశుద్ధం అయిపోయారు కదా! అంతిమ పరిశుద్ధతకి తారీఖు ఏది? ముందుగానే పరిశుద్ధం అవ్వకపోతే మీ ప్రజలు మరియు భక్తులు మీ సంపూర్ణ స్వరూపాన్ని ఏవిధంగా సాక్షాత్కారం చేసుకోగలరు? లేకపోతే మీ చిత్రాలను కూడా వంకరటింకరగా తయారుచేస్తారు. మీ యొక్క సంపూర్ణ స్థితిని వారు సాక్షాత్కారం చేసుకోకపోతే వారు చిత్రాలు ఏవిధంగా తయారు చేస్తారు? చిత్రాలు కూడా పరిశుద్ధంగా తయారు చేయలేరు. కనుక ముందుగానే మీ యొక్క సంపూర్ణ సాక్షాత్కారం చేయించాలి. ఇప్పుడే మీ భక్తుల ద్వారా గుణగానం చేసే సంస్కారాన్ని నింపితేనే ద్వాపరయుగం నుండి రాగానే మీ చిత్రాల ముందు గుణగానం చేస్తారు. సర్వాత్మలలో సర్వ రకాల ఆచారాలు పద్దతుల యొక్క సంస్కారాలు ఇప్పటి నుండే నింపాలి కదా! ఇది నింపుకునే సమయం, ఆ తర్వాత వాటిని ప్రత్యక్షం చేసుకునే సమయం. మీలో కల్పమంతటి యొక్క పూజ్య మరియు పూజారి రెండింటి సంస్కారాలు ఇప్పుడు నింపుకుంటున్నారు. ఎంతగా పూజ్యులు అవుతారో దానిని అనుసరించి పూజారి స్థితి కూడా స్వతహాగానే తయారవుతూ ఉంటుంది. ఎలాగైతే ఆత్మలైన మీలో కల్పమంతటి సంస్కారాలు నిండుతున్నాయో అలాగే మీ భక్తులలో కూడా ఇప్పుడే సంస్కారాలు నిండుతాయి. కనుక మీ స్వరూపం ఇప్పుడు ఎలా ఉంటుందో వారిలో అలాంటి సంస్కారాలే వారిలో నిండుతాయి. అందువలన ఇప్పుడు త్వరత్వరగా మిమ్మల్ని మీ అంతిమ స్థితికి తీసుకువెళ్ళండి. జరిమానా కట్టనవసరం లేకుండా అంతిమ స్థితికి చేరుకోండి. ఎవరైతే డబల్ పరిశుద్ధంగా అయిపోతారో వారికి జరిమానా (శిక్షలు) ఉండవు. అంతిమ స్థితి పొందిన వారికి ఏ ఫైల్ మిగిలిపోదు. కనుక మిగిలిన ఫైల్స్ అన్నింటినీ సమాప్తం చేసుకోండి. మహావీరులకి కూడా జరిమానా పడితే ఇక వారు మహావీరులా? కనుకనే చెప్పాను - ఈరోజు మాట్లాడేది లేదు, సైగలతోనే అర్ధం చేసేసుకునేవారు మీరు. ఇది కిరీటధారి, సింహాసనాధికారి గ్రూపు. అలాంటి వారు వినటం ద్వారా అర్ధం చేసుకోవటం ఏమిటి? ఇప్పటికి కూడా చెప్పటం ద్వారా చేసేవారు అయితే, చెప్తే చేసేవారు మనుష్యులు, మీరు దేవతల కంటే కూడా శ్రేష్ఠులు. బ్రాహ్మణులు లేదా ఫరిస్తాలు ఏదైనా అనండి. పరిస్తాలు సైగతోనే అర్ధం చేసుకుంటారు. భూలోక వాసులు అయితే చెప్పటం ద్వారా అర్ధం చేసుకుంటారు.

విశ్వమంతటి ముందు ఈ గ్రూపు వారిని ఏవిధంగా భావిస్తున్నారు? ఏది ఉందో అదే చెప్పాలి. వీరు సృష్టినంతటినీ శరణాగతం చేసుకునేవారు, అంతేకానీ శరణాగతం అయ్యేవారు కాదు. బాప్ దాదా ముందు కూడా శరణాగతం అయ్యేవారు కాదు కదా! బాబాని సేవాధారిగా చేసుకునేవారు. మరయితే శరణాగతి అయ్యారా లేక శరణాగతి చేసుకునేవారు అయినట్లా? సృష్టిలో మహిమా యోగ్య మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకే. ఈరోజు బాప్ దాదా సంపూర్ణ రూపాన్ని చూస్తున్నారు. సదా ఆజ్ఞాకారులు అని ఎవరిని అంటారంటే ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా చేయరు. ఈ గ్రూపు దీంట్లో పాస్ కదా! సదా స్వయాన్ని అఙ్ఞాకారి స్వరూపంలో స్థితులు చేసుకుని ఆ తర్వాత ఏ సంకల్పం అయినా చేయండి. ఎవరైతే ఇలా సంపూర్ణ ఆఙ్ఞాకారిగా ఉంటారో వారు సంపూర్ణ విశ్వాసపాత్రులుగా కూడా ఉంటారు. ఈ గ్రూపు వారు సంపూర్ణతకి సమీపంగా ఉన్నారు కదా! సంపూర్ణ విశ్వాసపాత్రులు అని ఎవరిని అంటారు? విశ్వాసపాత్రుల యొక్క ముఖ్య గుణం ఏమిటి? వారి యొక్క ముఖ్య గుణం ఏమిటంటే వారి ప్రాణం పోయినా కానీ ప్రతీ వస్తువుని సంభాళిస్తారు. ఏ వస్తువుని వ్యర్ధం చేసి నష్టం తీసుకురారు. సంకల్పం, సమయం, మాట మరియు కర్మ ఈ నాలుగింటిలో దేనినైనా వ్యర్ధం చేస్తే అది నష్ట ఖాతాలోకి వెళ్తుంది. అలాంటి వారిని సంపూర్ణ విశ్వాసపాత్రులు అని అంటారా? ఎందుకంటే ఎప్పటి నుండి జన్మ తీసుకున్నారో అప్పటినుండి విశ్వాసపాత్రులు, ఆజ్ఞాకారులు, నిజాయితీపరులు అయ్యారా? నిజాయితీ పరులు ఒక్క పైసా విషయంలో కూడా నిజాయితీగా ఉంటారు. మరయితే ఎప్పటి నుండి జన్మ తీసుకున్నారో అప్పటి నుండి మనస్సు అనగా సంకల్పం, సమయం,కర్మ ఏవైతే చేస్తామో అవన్నీ బాబా యొక్క సేవార్ధం చేస్తాం, ఈ ప్రతిజ్ఞ చేశారా? సర్వ సమర్పణ అయ్యారా? కనుక ఇవన్ని ఈశ్వరీయ సేవార్ధం అయిపోయాయి కదా! ఒకవేళ ఈశ్వరీయ సేవకి బదులు ఎక్కడైనా సంకల్పం, సమయం లేదా తనువు ద్వారా వ్యర్ధ కార్యం జరిగితే వారిని ఏమంటారు? సంపూర్ణ విశ్వాసపాత్రులు అని అంటారా? ఒక్క సెకండు ఏమైనా పెద్ద విషయమా అని అనుకోకండి. ఒక్క నయా పైసాలో అయినా నిజాయితీ లేకపోతే వారిని సంపూర్ణ నిజాయితీపరులు అని అనరు. ఈ గ్రూపు అయితే సంపూర్ణ ఆజ్ఞాకారులు, సంపూర్ణ విశ్వాసపాత్రులు కదా! ఇటువంటి సంపూర్ణ ఆజ్ఞాకారులు, సంపూర్ణ విశ్వాస పాత్రులు, నిజాయితీ పరులు ఉన్న ఈ గ్రూపుకి ఏమి చెప్తారు? నమస్తే చెప్తారు. నమస్తే తర్వాత ఏమవుతుంది? బాబా అయితే సంపూర్ణ ఆజ్ఞాకారి. ఒకరినొకరు చూసుకుని హర్షిస్తున్నారు కదా! సంగమయుగి సభ యొక్క సుందరత ఇది. మంచిది.