03.02.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వయాన్ని తెలుసుకోవటం ద్వారా నియమం మరియు సమయం యొక్క గ్రహింపు.

ఎలా అయితే బాబా కొరకు బాబా ఏవిధంగా ఉన్నారో, ఎలా ఉన్నారో ఆవిధంగా తెలుసుకోవాలి అని చెప్తారు కదా! అలా తెలుసుకోవటం ద్వారా మనకు సర్వప్రాప్తులు లభిస్తాయి. అలాగే బాబాని తెలుసుకోవటంతో పాటు స్వయాన్ని నేనెవరు? ఎలా ఉండేవాడిని అని తెలుసుకోవటం ద్వారా సర్వప్రాప్తులు లభిస్తాయి, ఇలా తెలుసుకుని నడుస్తున్నారా? అంటే బాబాని సర్వ స్వరూపాల ద్వారా, సర్వ సంబంధాల ద్వారా తెలుసుకోవటం ఎంత అవసరమో అలాగే బాబా ద్వారా స్వయాన్ని తెలుసుకోవటం కూడా అంతే అవసరం. తెలుసుకోవటం అంటే అంగీకరించటం. నేనెవరు? ఎలా ఉన్నాను? అని ఇలా అంగీకరించి నడిస్తే మీ స్థితి ఎలా తయారువుతుంది? దేహంలో ఉంటూ విదేహిగా కాగలుగుతారు. వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా కాగలుగుతారు. నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తాగా లేక కర్మ చేస్తూ కర్మాతీతంగా కాగలుగుతారు. ఎందుకంటే స్వయం మిమ్మల్ని మీరు మంచిగా తెలుసుకుంటారో, అంగీకరిస్తారో దాని ద్వారా నియమం పైకి, క్రిందికి అవ్వదు. నియమాన్ని తెలుసుకోవటం అంటే నియమంలో నడవటం. స్వయాన్ని అంగీకరించి నడవటం ద్వారా స్వతహాగానే మీరు నియమంలో ఉండగలుగుతారు. ఇది నియమమా, కాదా అని ఆ ఆత్మలకు ఆలోచించవలసిన అవసరం ఉండదు. స్వయం యొక్క స్థితిలో స్థితులై ఉన్న కారణంగా వారు ఏ కర్మ చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ సంకల్పం చేసినా అది నియమంగా అయిపోతుంది. సాకారంలో బ్రహ్మాబాబా స్వయం యొక్క స్మృతిలో ఉండి కర్మ చేసారు. అదే బ్రాహ్మణ పరివారానికి నియమంగా అయిపోయింది కదా! ఈ నియమాలన్నీ ఎలా తయారయ్యాయి? బ్రహ్మాబాబా ద్వారా ఏదైతే కర్మ జరిగిందో అవే బ్రాహ్మణ పరివారానికి నియమాలుగా తయారయ్యాయి. అలాగే స్వయం యొక్క స్మృతిలో ఉండి ప్రతి కర్మ చేయటం ద్వారా అది నియమంగా అవుతుంది, మరియు వెనువెంట సమయం యొక్క గ్రహింపు కూడా లభిస్తుంది. సమయం యొక్క గ్రహింపు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఆఫీసర్స్ మొత్తం ప్లాన్స్ అన్నీ తమ ఎదురుగా పెట్టుకుంటారు కదా! ప్లాన్లు చూస్తూ తమ తమ కార్యవ్యవహారాలను నిర్ణయించుకుంటారు. విమానం లేదా ఓడ నడిపించేవారు ఏయే ప్రదేశాలకు ఎలా తీసుకు వెళ్ళాలి అని ప్లానులు అన్నీ రెడీగా ఉంచుకుంటారు కదా! ఆ మార్గాలన్నీ స్పష్టంగా ఎదురుగా పెట్టుకుంటారు కదా! అలాగే ఎవరైతే స్వయాన్ని తెలుసుకుంటారో వారికి స్వతహాగానే నియమం ఎదురుగా ఉంటుంది. ఆ నియమంలో స్వతహాగా నడుస్తూ ఉంటారు. దానితో పాటు సమయం యొక్క గ్రహింపు కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. కనుక మొత్తం రోజంతా స్వయం ఎవరు? ఎలా ఉంటారు? అనే స్మృతి సదా ఉండాలి. అందువలనే మీకు నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరు చేస్తారు అనే మహిమ కూడా ఉంది - ఇది స్మృతి ఉంచుకోవాలి. ఇలా స్వయాన్ని ఎవరైతే కర్మ చేస్తారో అదే నియమంగా తయారవుతుంది. వారిని చూసి అందరు అనుసరిస్తారు. కనుక ఈ స్మృతి సదా ఉండాలి. మొదట స్థితి ఏదైతే ఉందో దాని కొరకు పురుషార్థం చేయాలి. ప్రతి అడుగు ఇది రైటా లేదా రాంగా అని ఆలోచించి వేయాలి. ఇది మన నియమమా, కాదా అని ఆలోచించాలి. ఇలా ఎప్పుడైతే స్వయం యొక్క స్మృతిలో సదా ఉంటారో అప్పుడు ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు. స్వయం యొక్క స్మృతిలో ఉండి ప్రతి అడుగు వేయటం ద్వారా ఏ కర్మ నియమం లేకుండా జరుగదు. సాకారంలో బ్రహ్మాబాబా స్వయం యొక్క నషాలో ఉన్న కారణంగా అధికారంతో చెప్పేవారు. బాబా కూడా సాకార బ్రహ్మాబాబా ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా నేను మంచిగా చేస్తాను అని బాబా కూడా చెప్పేవారు. ఎందుకంటే అధికారం ఉంది. ఇంత అధికారం బ్రహ్మబాబాకు ఎక్కడి నుండి వచ్చింంది? స్వయం నషాలో చేసేవారు కనుక కర్మ ఆయన ద్వారా వ్యతిరేకంగా జరిగేది కాదు. ఒకవేళ నా ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా బాబా మంచిగా చేస్తారు అని చెప్పేవారు. ఇలా బాబా స్వయం స్మృతి యొక్క నషాలో ఉండేవారు. కనుక నా ద్వారా ఏ వ్యతిరేకకర్మ జరుగదు అని చెప్పేవారు. ఇలాంటి నషా మీ అందరికి కూడా నెంబర్‌ వన్‌గా ఉండాలి. మరి మీరందరు తండ్రిని అనుసరించేవారు కదా? అనుసరించేవారికి ఈ స్థితి రాదా? దీనిని కూడా అనుసరించటం అంటారు కదా! సాకారంలో బ్రహ్మాబాబా మొదటి ఆత్మ. మొదటి ఆత్మ నిమిత్తంగా ఏదైతే చేసి చూపించారో దానిని రెండవ, మూడవ నెంబర్ ఆత్మలు అన్ని విషయాలలో కూడా అనుసరించాలి. నిరాకార స్వరూపంలో అనుసరించటం అనేది వేరే విషయం. కానీ సాకారంలో నిమిత్తంగా ఏది చేసి చూపించారో అది అందరు నెంబర్‌వార్ పురుషార్థానుసారం అనుసరించాలి. వీరినే సంపూర్ణ నిశ్చయబుద్ది ఆత్మలు అని అంటారు. ఎలా అయితే బాబాపై 100శాతం నిశ్చయం ఉందో అలాగే వెనువెంట స్వయంపై కూడా ఇంత నిశ్చయబుద్ది అయ్యి నడవాలి. ఇంత నషా మీకు ఉంటుందా? ఎలా అయితే సాకారంలో బ్రహ్మాబాబా నిమిత్తంగా అయ్యి ప్రతి కర్మను నియమంగా రూపంగా చేసి చూపించారో అలాగే మీరందరు కూడా ప్రత్యక్షంగా బ్రహ్మాబాబాను అనుసరించాలి. ఇలాంటి స్థితి ఉందా? ఏదైనా బండి మంచిగా పట్టాలపై నడుస్తున్నప్పుడు, మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు ప్రమాదం జరుగదు అనే నిశ్చయం ఉంటుంది. నిశ్చింతగా నడిపిస్తారు. అలాగే మీకు కూడా స్వయం యొక్క స్మృతి యొక్క నషా మీ పునాది మంచిగా ఉంటే మీ మాట, మీ కర్మ నియమం లేకుండా జరుగదు. ఇటువంటి స్థితి సమీపంగా వస్తుంది. దీనినే సంపూర్ణ స్థితికి సమీపంగా రావటం అంటారు. ఇలా స్వమానంలో స్థితులవ్వటం ద్వారా అభిమానం సమాప్తి అయిపోతుంది. ఎంత స్వమానమో అంత నిర్మాణత. అందువలన వారికి అభిమానం ఉండదు. ఎలా అయితే నిశ్చయబుద్ది ఆత్మలకు ప్రతి కర్మలో విజయం నిశ్చితమై ఉంటుందో అంటే వారి ప్రతి కర్మ నియమ ప్రమాణంగానే ఉంటుంది. కనుక వారికి తప్పనిసరిగా విజయం లభిస్తుంది. అలాగే స్వయాన్ని నేను ఎంత వరకు ఈ స్థితికి చేరుకున్నాను అని పరిశీలన చేసుకోండి. ఎంత స్వయం మీరు ఈ స్థితికి సమీపంగా చేరుకుంటారో అంత ఇతరులను కూడా సమీపంగా తీసుకురాగలుగుతారు. కనుక రోజు రోజుకి ఇటువంటి పరివర్తన అనుభవం అవుతుంది. కనుక పరిశీలన చేసుకుని కర్మ చేయండి. ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోండి. ఇది వేరే విషయం, కానీ స్వయం మీపై మీరు నిశ్చయం పెట్టుకుని ఎవరినైనా అడగటం ఇది వేరే విషయం. మీరు ఏ కర్మ చేస్తున్నా నిశ్చయబుద్ధి అయ్యి చేయండి. బాబా కూడా పిల్లలకు గౌరవం ఇచ్చి సలహా ఇస్తారు కదా! కనుక ఇలాంటి స్థితికి ఎంత వరకు చేరుకున్నాను? అనేది పరిశీలన చేసుకోండి. అప్పుడు ఇక మీకు నేను సత్యం చేస్తున్నానా లేదా అసత్యం చేస్తున్నానా అనే సంకల్పం రాదు. ఎందుకంటే మీరు మాస్టర్ జ్ఞానసాగరులు. కనుక మీ స్వయం యొక్క నషాలో ఎప్పుడు లోటు రాకూడదు. కార్యవ్యవహారాల నిమిత్తం ఒకరికొకరికి గౌరవం ఇచ్చుకోవటం ఇది ఒక నియమం. కనుక ఎటువంటి స్థితియో అలాంటి దానిలో మీరు ఉదాహరణగా అయ్యి చూపించండి. సాకార బ్రహ్మాబాబా ద్వారా ఏవైతే విషయాలు చూసారో, విన్నారో వాటిని అనుసరించటం సహజమే కదా! కనుక ఇలాంటి సమీప స్థితికి చేరుకొండి. కనుక ఇప్పుడు ఇలాంటి మహాన్ పురుషార్థం, గుహ్య పురుషార్ధం నడవాలి. సాధారణ పురుషార్థం కాదు. ఈ సాధారణ పురుషార్థం అనేది చిన్నతనం, మీరు విశేషాత్మలు కనుక విశేష పురుషార్ధం చేయాలి.