05.02.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నషా మరియు గమ్యం.

ఒక సెకనులో స్వయాన్ని సంపూర్ణ గమ్యం యొక్క స్థితిలో, నషాలో స్థితులు చేసుకోగలుతున్నారా? సంపూర్ణ గమ్యం ఏమిటో తెలుసా? ఎప్పుడైతే సంపూర్ణ గమ్యానికి చేరుకోవాలి అనే స్థితిలో ఉంటారో, అప్పుడు నషా స్వతహాగానే ఉంటుంది. ఒకవేళ మీ గమ్యం బుద్దిలో గుర్తు ఉండకపోతే నషా కూడా ఉండదు. గమ్యం యొక్క స్థితిలో స్థితులైన దానికి గుర్తు - నషా, ఇటువంటి నషా సదా ఉంటుందా? ఎవరైతే స్వయం నషాలో ఉంటారో వారు ఇతరులను కూడా స్వతహాగా నషాలో స్థిరం చేయగలుగుతారు. ఎలా అయితే ఏదైనా హద్దు యొక్క నషా అంటే త్రాగినవారు వారి నడవడిక ద్వారా, వారి నయనాల ద్వారా వీరు బాగా త్రాగారు, నషాలో ఉన్నారు అని తెలిసిపోతుంది కదా! అలాగే మీరందరు శ్రేష్ట నషాలో, ఈశ్వరీయ నషాలో ఉన్నారు. కనుక ఈ స్థితి దూరం నుండే అందరికి అనుభవం కావాలి. దూరం నుండే వీరు ఈశ్వరీయ నషాలో ఉన్న ఆత్మలు అని అనుభవం కావాలి. ఇలా స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఎలా అయితే మీరు ఎక్కడినైనా వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని చూడగానే వీరు ప్రభువుకి ప్రియమైన ఆత్మలు అని అనుభవం చేసుకుంటున్నారా? భక్తిమార్గంలోని కొంతమంది ఆత్మలను చూస్తే వీరు ప్రభు ప్రేమలో లీనమైపోయారు అని అనుభవం అవుతుంది కదా! అలాగే మీరు కూడా ఈ ప్రపంచంలో, ఈ కార్యవ్యవహారాలు చేస్తూ అందరికి ప్రభుప్రియమైన ఆత్మలుగా అనుభవం అవుతున్నారా? లేదా దర్శనీయమూర్తి యొక్క స్థితి కేవలం అంతిమంలోనే అవుతుందా? ఏమని భావిస్తున్నారు? అంతిమం వరకు మీరు సాధారణంగానే ఉండిపోతారా లేదా ఇప్పుడే మీ ముఖం ద్వారా ఈ మెరుపుని చూపిస్తారా? లేదా కేవలం అంతిమ సమయంలోనే పరదా లోపల తయారవుతూ ఉంటారా? పరదా లోపల తయారవుతూ ఉంటే పరదా తీసేస్తే ఏమౌతుంది? దృశ్యం సమాప్తి అయిపోతుంది కదా! అలాగే మీరు కూడా అంతిమ సమయంలో ప్రత్యక్షం అవుతారా? కొంచెం సమయం మీ యొక్క ఈ మెరుపు చూపించాలి. మొదటి, రెండవ నెంబర్ కి నిమిత్తమైన ఆత్మలు సాధారణ గుప్త రూపంలో, తమ సాకార గుప్త పాత్రను అభినయించి వెళ్ళిపోతున్నారు. మరి ఇతరాత్మలకు ఏ మెరుపు కనిపిస్తుంది? మీ ద్వారా మెరుపు కనిపించాలి. కానీ కనిపించటంలో మీరెవరు? తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు కదా? మరి తండ్రి ఎలా ప్రత్యక్షం అవుతారు? పిల్లల ప్రత్యక్ష కర్మ ద్వారానే తండ్రి ప్రత్యక్షం అవుతారు. ఓహో ప్రభు! అని ఆత్మల పిలుపు వినిపిస్తుంది, పశ్చాతాపం యొక్క అల కనిపిస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడైతే వారు సాకారంలో అనుభవం చేసుకోరో అప్పటి వరకు బాబా యొక్క పరిచయం కూడా అందరికి తెలియదు. ఎప్పుడైతే మీ ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుందో అప్పుడు వీరు బాబా యొక్క పిల్లలు, బాబా వీరి ద్వారా కార్యం చేయిస్తున్నారు, వీరంతా పొందారు, మేము ఏమీ పొందలేదు అని పశ్చాత్తాపం వారికి కలుగుతుంది. ఈ ప్రత్యక్ష ఆత్మిక మెరుపు, ఫరిస్తా స్థితి యొక్క మెరుపు ముఖం ద్వారా, నడవడిక ద్వారా కనిపించాలి. ఎప్పుడైతే మీలో ఈ స్థితి కనిపిస్తుందో మీ నిమిత్త ఆత్మల స్థితి చూసి వారు బాబా వీరిని చాలా మంచిగా తయారు చేసారు అని అనుభవం చేసుకుంటారు. తర్వాత పశ్చాత్తాపపడతారు. మీరు ఈ మెరుపు చూపించకపోతే ఏమనుకుంటారు? వారికి జ్ఞానం లభించలేదు. జ్ఞానం ద్వారా వారిని వారు తెలుసుకోవటం లేదు, కానీ మీ ప్రత్యక్ష నడవడిక ద్వారా, మెరుపు ద్వారా, నిశ్చయం ద్వారా వారికి పశ్చాత్తాపం అనుభవం అవుతుంది. బాబా యొక్క మహావాక్యం ఏమిటంటే - నేను పిల్లల ముందు ప్రత్యక్షం అవుతాను, కానీ విశ్వం ముందు ఎవరు ప్రత్యక్షం అవుతారు? సాకారంలో బాబా యొక్క కర్తవ్యం బ్రహ్మాబాబా ద్వారా చేసి చూపించారు. మరి ఇప్పుడు పిల్లలు బాబా యొక్క కర్తవ్యాన్ని చేసి చూపించాలి. బాబా యొక్క కర్తవ్యం ఏమిటంటే వెన్నెముకగా ఉండటం, గుప్త రూపంలో పిల్లలకు సహాయకారి అవ్వటం. కానీ గుప్తంగా ఉన్న బాబాని ప్రత్యక్షం చేయటం పిల్లల కర్తవ్యం. ఎలా అయితే బ్రహ్మాబాబా, మమ్మా అంటే తల్లి, తండ్రి ఇద్దరు గుప్త పాత్రను అభినయించారో అలాగే అంతిమం వరకు కూడా బాబా గుప్తంగానే ఉంటారు, గుప్త వాతావరణం ఉంటుంది అని అనుకోకండి. జయజయకారాలు అనేవి శక్తుల మహిమయే. ఓహో ప్రభు! అనే పిలుపు బాబాది. ఇలా మీరు ఎప్పుడైతే పరస్పరం అనుభవం చేసుకుంటూ ముందుకు వెళ్తారో, విశేషమైన ధ్యాస పెట్టుకుంటారో అప్పుడు బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది, మీరు ఎంత పెద్ద సంఘటనలో ఉన్నప్పటికీ అందరిలో విశేషాత్మలుగా అనుభవం కావాలి. వీరు బాబా స్మృతిలో చాలా మంచిగా కూర్చున్నారు అని వారికి అనుభవం కావాలి. ఇప్పుడు మీకు సాధారణ ధ్యాస ఉంది. కానీ ఇప్పుడు అది మారి విశేషమైన ధ్యాస పెట్టుకోవాలి. మీ ముఖం ద్వారా, మీ మెరుపు ద్వారా, మీ నిశ్చయం ద్వారా బాబా యొక్క ప్రత్యక్షత జరగాలి. దీని కొరకు కేవలం స్మృతిని శక్తిశాలిగా తయారుచేసుకోండి.