సమయం కోసం ఎదురుచూడకుండా ఎవరెడీగా ఉండేవారే
సత్యమైన పురుషార్థి.
ఎలా అయితే పరీక్షా సమయం సమీపంగా వస్తుందో మీ సంపూర్ణ
స్థితి యొక్క సాక్షాత్కారం లేదా అనుభవం ప్రత్యక్ష రూపంలో అవుతుందా? ఎలా అయితే
నెంబర్ వన్ ఆత్మ నడుస్తూ, తిరుగుతూ తన సంపూర్ణ స్థితిని ప్రత్యక్ష రూపంలో అనుభవం
చేసుకుంటూ ఉండేది. అలాగే మీకు మీ సంపూర్ణ స్థితి సమీపంగా మరియు స్పష్టంగా అనుభవం
అవుతుందా? ఎలా అయితే పురుషార్ధి బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ రెండు స్థితులు
స్పష్టంగా కనిపించేవి. అలాగే మీకు మీ సంపూర్ణ స్థితి ఇంత స్పష్టంగా మరియు
సమీపంగా అనుభవం అవుతుందా? ఇప్పుడిప్పుడే ఈ స్థితిలో ఉన్నాము మరలా ఇప్పుడిప్పుడే
అలా అవుతాము అనే అనుభవం అవుతుందా? ఎలా అయితే సాకారంలో భవిష్యత్తు కూడా
ఇప్పుడిప్పుడే అనేలా అనుభవం అయ్యేది కదా! భలే ఎంత కార్యంలో నిమగ్నమై ఉన్నా కానీ
మీ ఎదురుగా సదా సంపూర్ణ స్థితికి చేరుకోవాలి అనే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మీరు
సంహర స్థితిని సమీపంగా తెచ్చుకుంటారో అంత సమయం కూడా సమీపంగా వస్తుంది. సమయం
మిమ్మల్ని సమీపంగా తీసుకువస్తుందా లేదా మీరు సమయాన్ని సమీపంగా తీసుకువస్తారా?
ఏమి జరుగుతుంది? ఆ వైపు నుండి సమయం సమీపంగా వస్తుంది. ఈ వైపు నుండి మీరు సమీపంగా
అవుతారు. రెండింటి మేళా జరుగుతుంది. సమయం ఎప్పుడు వచ్చినా కానీ స్వయాన్ని సదా
సంపూర్ణ స్థితిని సమీపంగా తీసుకువచ్చే పురుషార్థంలో సమయం యొక్క నిరీక్షణ లేకుండా
తయారుగా ఉంచుకోవాలి. పురుషార్ధి సదా ఎవరెడీగా ఉండాలి. ఎవరి కోసం ఎదురుచూడకూడదు.
మీరు పూర్తిగా తయారుగా ఉండాలి. మేము సమయాన్ని సమీపంగా తీసుకువచ్చేవారమే. కానీ ఈ
సమయం మమ్మల్ని సమీపంగా తీసుకురాదు అనే నషా ఉండాలి. ఎంతగా మీ ఎదురుగా ఈ సంపూర్ణ
స్థితి సమీపంగా వస్తుందో అంత విశ్వాత్మల ఎదురుగా మీ అంతిమ కర్మాతీత స్థితి
యొక్క సాక్షాత్కారం స్పష్టంగా అవుతుంది. దీని ద్వారా సాక్షాత్కారమూర్తిగా అయ్యి
విశ్వం ముందు సాక్షాత్కారం చేయించే సమయం సమీపంగా వచ్చిందా, లేదా అనేది
నిర్ణయించవచ్చు. సమయమైతే చాలా త్వర త్వరగా పరుగు పెడుతుంది. 10 సంవత్సరాలు అంటూ
24సంవత్సరాలు వరకు చేరుకున్నారు సమయం యొక్క వేగం, అనుభవం యొక్క వేగం కంటే వేగంగా
అనుభవం అవుతుంది కదా! ఈ లెక్కతో మీ సంపూర్ణ స్థితి కూడా స్పష్టంగా మరియు సమీపంగా
ఉండాలి. ఎలా అయితే స్కూల్ లో కూడా స్థితి ఎదురుగా ఉన్నప్పుడు దానికి చేరుకోవాలి
అని అనుకుంటారు కదా! ఇలా సంపూర్ణ స్థితి కూడా చాలా సహజంగా అనుభవం అవ్వాలి.
దీనిలో 4 సంవత్సరాలు పడుతుందా లేదా 4 సెకనులు పడుతుందా? అసలైతే ఇది సెకను విషయం.
ఇప్పుడు సెకనులో సమీపంగా తీసుకువచ్చే స్కీమ్ లేదా ప్లాన్ తయారుచేయండి. ప్లాన్
తయారు చేయటంలో కూడా సమయం పడుతుంది. కానీ ఆ స్థితిలో స్థితులైతే సమయం పట్టదు.
ప్రత్యక్షత సమీపంగా వస్తున్నట్లు భావిస్తున్నారు. వాయుమండలం మరియు వృత్తులు
పరివర్తనలోకి వస్తున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షతా సమయం ఎంత త్వరగా ముందుకి
వెళ్తుంది అనేది మీరు అర్ధం చేసుకోవాలి. కష్ట విషయం సహజం అయిపోతూ ఉంది. సంకల్పం
సిద్ధిస్తూ ఉంది. నిర్భయత మరియు సంకల్పంలో ధృఢత - ఇవే సంపూర్ణ స్థితికి సమీప
గుర్తులు. ఈ రెండు కనిపిస్తున్నాయి. సంకల్పంతో పాటు మీ ఫలితం కూడా స్పష్టంగా
కనిపించాలి. దీనితో పాటు వెనువెంట ఫలం యొక్క ప్రాప్తి కూడా స్పష్టంగా కనిపించాలి.
ఈ సంకల్పానికి ఈ ఫలితం, ఈ కర్మకు ఈ ఫలం ఇలా అనుభవం అవుతుంది. దీనినే ప్రత్యకఫలం
అంటారు. మంచిది!
ఎలా అయితే బాబా యొక్క మూడు రూపాలు ప్రసిద్ధమైనవో అలాగే మీ మూడు రూపాలు
సాక్షాత్కారం అవుతున్నాయా? ఎలా అయితే బాబాకు తన మూడు రూపాల యొక్క స్మృతి ఉంటుందో,
అలాగే నడుస్తూ, తిరుగుతూ మేము మాస్టర్ త్రిమూర్తులం అని మీ మూడు రూపాల యొక్క
స్మృతి ఉండాలి. మూడు కర్తవ్యాలు వెనువెంట ఉండాలి. స్థాపన చేసే సమయం వేరుగా,
వినాశన కర్తవ్యం యొక్క సమయం వేరుగా ఉండకూడదు. మరలా రావటం కాదు. క్రొత్త రచన
రచించుకుంటూ వెళ్తున్నారు మరియు పాతది వినాశనం అవుతూ ఉండాలి. ఆసురీ సంస్కారాలు
లేదా ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటి వినాశనం కూడా చేసుకుంటూ వెళ్ళాలి. క్రొత్త
సంస్కారాలు తెచ్చుకుంటున్నారు, పాత సంస్కారాలను సమాప్తి చేసుకుంటున్నారు. కనుక
సంపూర్ణం మరియు శక్తిరూపం, వినాశకారి రూపం లేని కారణంగా సఫలతను
పొందలేకపోతున్నారు. రెండు వెనువెంట ఉండటం ద్వారా సఫలత వస్తుంది. ఈ రెండు రూపాలు
స్మృతి ఉండటం ద్వారా దేవతా రూపం కూడా వచ్చేస్తుంది. రెండు రూపాల స్మృతినే అంతిమ
పురుషార్ధి స్థితి అంటారు. ఇప్పుడిప్పుడే బ్రాహ్మణరూపం, ఇప్పుడిప్పుడే శక్తిరూపం.
ఏ సమయంలో ఏ రూపం యొక్క అవసరం ఉంటుందో ఆ సమయంలో ఆ రూపాన్ని ధారణ చేసి కర్తవ్యంలో
నిమగ్నమైపోవాలి, ఈ అభ్యాసం ఉండాలి. ఈ అభ్యాసం ఒక సెకనులో ఆత్మాభిమానిగా అయ్యే
అభ్యాసం ఉన్నప్పుడే అవుతుంది. మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించాలి. ఈ
అభ్యాసం చాలా అవసరం. ఇటువంటి అభ్యాసీలు అన్ని కార్యాలలో సఫలం అవుతారు. ఎవరిలో
స్వయాన్ని మలుచుకునే శక్తి ఉంటుందో వారే సత్యమైన బంగారం. ఎలా అయితే స్థూల
కర్మేంద్రియాలను ఎక్కడ కావాలంటే అక్కడ మలచగలుగుతున్నారు కదా! ఒకవేళ అలా మలవకపోతే
దానిని అనారోగ్యం అంటారు. బుద్ధిని కూడా అలా సహజంగా మలచగలగాలి. బుద్ధి మనల్ని
మలిచేవిధంగా ఉండకూడదు. ఇటువంటి సంపూర్ణ స్థితి యొక్క స్మృతిచిహ్నం కూడా మహిమ
చేయబడుతుంది. రోజు రోజుకి మీలో పరివర్తన అయితే అనుభవం అవుతుంది కదా! సంస్కారాలు
లేదా స్వభావం లేదా లోపాన్ని చూసినప్పుడే క్రిందికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు
ఎవరి స్వభావ, సంస్కారాలను చూస్తున్నా, తెలుసుకుంటున్నా వాటి వైపు బుద్ధియోగం
వెళ్ళకూడదు. ఇంకా ఆ ఆత్మ పట్ల శుభభావన ఉండాలి. ఒకవైపు విన్నారు, రెండవవైపు అది
సమాప్తి అయిపోవాలి. ఇప్పుడు రోజు రోజుకి ఈ పరివర్తన రావాలి.