02.04.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


మహిమాయోగ్యులుగా ఎలా అవుతారు?

సదా ఉపరామ్ స్థితి అంటే అతీత స్థితిలో ఉండేటందుకు విశేషంగా ఏ రెండు విషయాల అవసరం ఉంది? ఎందుకంటే వర్తమాన సమయంలో ఉపరామ్ స్థితి అంటే అతీతస్థితిలో ఉండేటందుకు ప్రతి ఒక్కరు నెంబర్ వారీగా పురుషార్ధం చేస్తున్నారు. సహజంగా ఈ ఉపరామ స్థితిలో స్థితులయ్యేటందుకు ఒక రెండు విషయాలు కావాలి. అవి ఏమిటి? మీకు స్మృతి అయితే ఉంది. కానీ ఆ రెండు విషయాలలో ఏ రెండు విషయాలు ఉండాలి? రెండు విషయాలు, రెండు మాటలలో చెప్పండి? ఇప్పుడు మొత్తం జ్ఞానం యొక్క విస్తారాన్ని సార రూపంలోకి తీసుకురావాలి కదా! శక్తులు విస్తారాన్ని సారంలోకి సహజంగా తీసుకురాగలుగుతున్నారా? మీ అనుభవంతో చెప్పండి? ఉపరామ్ స్థితి, సాక్షిస్థితి రెండు ఒకటే. ఈ ఉపరామ స్థితిలో లేదా సాక్షి స్థితిలో ఉండేటందుకు మీకు రెండు విషయాల యొక్క ధ్యాస ఉండాలి. 1. నేను ఆత్మను, మహాన్ ఆత్మను 2. నేను ఆత్మను, ఇప్పుడు ఈ పాత సృష్టికి, పాత ప్రపంచానికి అతిధిని. ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి - మహాన్ మరియు మెహమాన్ అంటే నేను ఉన్నత ఆత్మను మరియు అతిధిని. ఈ రెండు సహజంగా స్మృతిలో ఉండటం ద్వారా బలహీనతలు లేదా తగుల్బాటు కారణంగా ఏదైతే మీకు ఉపరామ్ స్థితి ఉండటం లేదో, ఆకర్షణలోకి వచ్చేస్తున్నారో ఆ ఆకర్షణ స్వతహాగా సమాప్తి అయ్యి అతీతంగా అయిపోతారు. అలాగే స్వయాన్ని మహాన్ గా భావించటం ద్వారా సాధారణ కర్మ, సాధారణ సంకల్పం లేదా సాధారణ సంకల్పానికి వశమై ఏదైతే నడవడిక నడుస్తున్నారో అది పరివర్తన అయిపోతుంది. అలాగే స్మృతి మహాన్ గా ఉండటం ద్వారా సంస్కారాలు, సంకల్పాలు, మాట,కర్మ అన్నీ పరివర్తన అయిపోతాయి. అందువలన సదా స్వయాన్ని మహాన్ గా మరియు అతిధిగా భావించి నడవండి. దీని ద్వారా వర్తమానంలో మరియు భవిష్యత్తులో మరియు తర్వాత భక్తిమార్గంలో కూడా మీరు మహిమాయోగ్యులుగా అవుతారు. ఒకవేళ అతిధిగా మరియు మహాన్ గా భావించటం ద్వారా మహిమాయోగ్యంగా కూడా అవుతారు. మహిమ అనేది కేవలం భక్తిలోనే మొత్తం కల్చమంతా మీకు ఏదోక రూపంలో మహిమ జరుగుతుంది. సత్యయుగంలో మహాన్ గా ఉంటారు. అంటే విశ్వమహారాజుగా, విశ్వమహారాణీగా ఉంటారు. కనుక సత్యయుగంలో ప్రజల ద్వారా మహిమను పొందే, మహిమాయోగ్యులుగా అవుతారు. తర్వాత భక్తి మార్గంలో దేవీ దేవతలుగా అయ్యి ఆ రూపంలో మహిమాయోగ్యులుగా అవుతారు. మరలా సంగమయుగంలో మహాన్ కర్తవ్యం చేసి చూపిస్తున్నారు. కనుక బ్రాహ్మణ పరివారం ద్వారా మరియు ఇతరాత్మల ద్వారా కూడా మహిమాయోగ్యంగా అవుతారు. అంటే ఈ మహాన్ స్థితి అనేది మొత్తం కల్పానికి మహిమాయోగ్యంగా చేస్తుంది. కనుక ఈ సమయంలో అతిధిగా మరియు మహాన్ ఆత్మగా భావించటం ద్వారా మొత్తం కల్పం మీరు మహిమాయోగ్యంగా అయిపోతున్నారు. కనుక ప్రతి కర్మ, ప్రతి సంకల్పం మహాన్ గా ఉందా? నేను అతిధిగా అయ్యి నడుస్తున్నానా లేదా కార్యం చేస్తున్నానా? అనేది పరిశీలించుకోండి. ఇలా మీరు మహాన్ స్థితిలో స్థితులై అతిధిగా అయ్యి కార్యం చేయటం ద్వారా తగుల్బాటు సమాప్తి అయిపోతుంది. అతిధి అంటే కేవలం ఈ సృష్టికే మీరు అతిధులు కాదు, ఈ శరీర రూపి ఇంటికి కూడా మీరు అతిధులు. ఎప్పుడైతే ఈ దేహానికి కూడా మీరు అతిధిగా భావిస్తారో అప్పుడు దేహం యొక్క ఆకర్షణ కూడా సమాప్తి అయిపోతుంది. ఈ దేహం యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సహజంగా తొలగిపోతాయి. మన సొంత ఇంటిని ఏదో కారణంగా అమ్మేసాము అనుకోండి. ఇక దానిపై మనకి నాది అనే భావన ఉంటుందా? ఉండదు కదా! భలే మనం ఆ స్థానంలోనే ఉంటున్నప్పటికీ కూడా అతిధిగానే ఉంటాము. ఇలా నాది అని భావించి నడవటంలో, అతిధిని అని భావించి నడవటంలో ఎంత తేడా ఉంటుంది. ఈ శరీరం కూడా మీది కాదు, ఇప్పుడు మీరు ఎవరు? ఎందుకంటే మీరు మరజీవా జన్మ తీసుకున్నారు. ఈ తనువుని కూడా మీరు బాబాకి అర్పణ చేసారు. అర్పణ చేసారా లేదా నాది అని అనుకుంటున్నారా? మీకు ఇప్పుడు ఈ పాత శరీరం యొక్క ఆయుష్షు సమాప్తి అయిపోయింది. ఈ శరీరం మీకు డ్రామానుసారం ఈశ్వరీయ కర్తవ్యం కోసం బాబా ఇచ్చారు. అందువలన ఇది నా శరీరం అనకండి. ఈ శరీరంతో నాది అనే భావనను సమాప్తి చేసేయండి. ఇప్పుడు బాబా ఆత్మకు కర్మ చేయటానికి, అద్దెగా కొద్ది సమయం కోసం ఈ శరీరాన్ని మనకు ఇచ్చారు. బాబా శరీరంలోకి ప్రవేశిస్తారు, నా శరీరం అనుకోరు కదా! అద్దెకు తీసుకుని వచ్చి, కర్తవ్యం కోసం వచ్చి పాత్ర అభినయిస్తారు, అలాగే మీరు కూడా ఎవరు? బాబా సమాన ఆత్మలు కదా! నా శరీరం అనుకుంటే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అనే శబ్దంతో చాలా ఉంటాయి. ఈ నాది అనే శబ్దం సమాప్తి అయిపోతే ఇక ఏమీ మీకు మిగలవు. అతీతం అయిపోతారు. కనుక ఈ శరీరాన్ని కూడా మీరు ఈశ్వరీయ కర్తవ్యం కోసం అద్దెకు తీసుకున్నారు.ఇక ఏ కరవ్యం కోసం ఈ శరీరాన్ని ఉపయోగించకూడదు. ఇలా స్వయాన్ని అతిధిగా భావించి నడవటం ద్వారా ప్రతి కర్మ స్వతహాగానే మహాన్ గా అయిపోతుంది. శరీరమే మీది కానప్పుడు ఈ శరీర సంబంధంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో లేక వైభవాలు ఉన్నాయో అవి కూడా మీవి కాదు. ఇలా భావించి నడవండి ఇలా భావించి నడవటం ద్వారా సదా నషాలో ఉండగలుగుతారు. స్వతహాగానే మీ ఇల్లు మీకు స్మృతి ఉంటుంది కేవలం మీ ఇల్లే కాకుండా బాబా మనకు 6 విషయాలు చెప్తారు కదా అవి స్వతహాగానే మనకు సృతిలో ఉంటాయి. బాబా పరిచయం చెప్పేటప్పుడు ముఖ్యంగా సార రూపంలో విషయాల గురించి చెప్తారు. ఆ 6 విషయాలలో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు కూడా అతిధిగా భావించి ఆ 6 విషయాలు సదా స్మృతిలో ఉంచుకుంటే స్వయం కూడా సదా మహాన్ గా అయిపోతారు. మీ యొక్క 6 విషయాలు ఏమిటి? మీ పేరు- సర్వోత్తమ బ్రాహ్మణులు, 2. మీ రూపం - సాలిగ్రామం, 3. సమయం యొక్క స్మృతి, 4. మీ ఇల్లు అంటే పరంధామం యొక్క స్మృతి, 5. కర్తవ్యం యొక్క స్మృతి, 6.వారసత్వం యొక్క స్మృతి. ఈ 6 విషయాలు సదా స్మృతిలో ఉండాలి. మీరు మొత్తం జ్ఞానం చాలా విస్తారంగా వినిపిసున్నా కానీ ఈ 6 విషయాలలో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. వీరు ఏ మాట మాట్లాడినా, కర్మ చేసినా దానిలో సారం నిండి ఉంటుంది, అసారంగా ఉండదు, అసారం అంటే వ్యర్ధం. మీ యొక్క ప్రతి మాట, కర్మలో మొత్తం జ్ఞానం యొక్క సారం ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మొత్తం జ్ఞానం బుద్ధిలో ఉన్నప్పుడు జరుగుతుంది. సదా నషాలో ఉండటం ద్వారానే మీరు గమ్యానికి చేరుకోగలుగుతారు. మొత్తం జ్ఞానం యొక్క సారం 6 మాటలలో బుద్ధిలోకి రావటం ద్వారా మొత్తం జ్ఞానం రివైజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫుల్ ఫోర్సులో నషా ఉండాలి. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి మధ్యలోకి వచ్చేస్తుంది. మీకు క్రింది స్థితి అయితే రావటం లేదు, కానీ మధ్య స్థితిలోకి వచ్చేస్తున్నారు. కనుక ఈ వర్తమాన సమయంలో మీ స్మృతి యొక్క స్థితిలో, సేవా స్థితిలో బాబా ఫలితం చూస్తే మధ్యమంగా కనిపిస్తుంది. చాలా మందికి ఎంత ఉండాలో అంత ఉండటం లేదు. అయితే ఈ మధ్య స్థితి యొక్క ఫలితం రావటానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఇప్పటి వరకు మధ్యకాల సంస్కారాలు పూర్తిగా భస్మం కాలేదు. మధ్యకాల సంస్కారాలు అంటే ద్వాపరయుగం నుండి దేహాభిమానం, బలహీన సంస్కారాలు మనలో నిండి ఉన్న కారణంగా మన ఫలితం కూడా మధ్యమంగానే వస్తుంది. ప్లిలలు బాబాకు మేము అవి కోరుకోవటం లేదు, కానీ చాలా సమయం నుండి సంస్కారం అయిపోయిన కారణంగా అవి వచ్చేస్తున్నాయి అని ఫిర్యాదు చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటి? ఈ మధ్యకాల సంస్కారాలను మీరు పూర్తిగా భస్మం చేయలేదు. వైద్యులు కూడా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఆ జబ్బు యొక్క కీటాణువులను పూర్తిగా భస్మం చేయటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అంశం ఉండిపోయినా ఆ కీటాణువుల ద్వారా వంశం వచ్చేస్తుంది. అలాగే ఈ మధ్యకాల సంస్కారాల యొక్క అంశం మీకు ఉండిపోతుంది. ఈ రోజు అది అంశంగా ఉంటుంది, రేపు వంశంగా అయిపోతుంది. ఇలా మధ్యకాల సంస్కారాలకు వశీభూతమైపోతున్న కారణంగా మీక శ్రేష్ట సంస్కారాలకు ఏదైతే ఫలితం రావాలో అది రావటం లేదు. ఇక ఎవ్వరినైనా మీతో మీరు సంతుష్టంగా ఉన్నారా, మీ పురుషార్ధంతో మీరు సంతుష్టంగా ఉన్నారా, మీ సేవతో సంతుష్టంగా ఉన్నారా, మీ బ్రాహ్మణ పరివారం యొక్క సంబంధ, సంపర్కాలతో సంతుష్టంగా ఉన్నారా? అని అడిగితే ఆలోచిస్తున్నారు. అవును అంటున్నారు, కానీ ఆలోచిస్తున్నారు. నిశ్చయంతో చెప్పటం లేదు మీ పురుషార్ధంలో, సేవలో మరియు సంపర్కంలో మూడింటిలో సర్వాత్మల ద్వారా సంతుష్టత యొక్క సర్టిఫికెట్ తీసుకోవాలి. సర్టిఫికెట్ అంటే బాబా ఏమి కాగితంపై వ్రాసి ఇవ్వరు. ప్రతి ఒక్కరి ద్వారా అనుభవం అవ్వాలి. ఇలా సర్వాత్మల సంపర్కంలో స్వయాన్ని సంతుష్టంగా ఉంచుకోవాలి. మరియు సర్వులను సంతుష్టం చేయాలి. దీనిలో ఎవరైతే విజయీగా అవుతారో వారే అష్టదేవతగా, విజయీ రత్నంగా అవుతారు. రెండు విషయాలలో మీరు మంచిగా ఉంటున్నారు. కానీ ఇది మూడో విషయం. దీనిలో శక్తిననుసరించి నెంబర్ వారీగా ఉంటున్నారు. అన్ని విషయాలలో నెంబర్ వారీగా ఉంటున్నారు. కానీ ఈ విషయంలో ఇంకా ఎక్కువగా ఉంటున్నారు. ఒకవేళ ఈ మూడింటిలో సంతుష్టత లేకపోతే శ్రేష్ట లేక అష్టరత్నాలలోకి కూడా రారు. . పాస్ విత్ ఆనర్ అయ్యేటందుకు సర్వుల ద్వారా సంతుష్టత యొక్క పాస్ పోర్ట్ తీసుకోవాలి. కానీ సంబంధ, సంపర్కాల విషయంలో మీకు లోపం వచ్చేస్తుంది. సంపర్కంలో సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టం చేయటం, ఈ విషయంలో పాస్ అయ్యేటందుకు ఏ ముఖ్య విషయం మీకు ఉండాలి? అనుభవం ఆధారంగా చెప్పండి మీ సంబంధ, సంపర్కాలలో ఒకరితో ఒకరికి అసంతుష్టత ఎందుకు వస్తుంది? సర్వులను సంతుష్టం చేసేటందుకు లేదా స్వయం సంపర్కంలో ఆత్మలతో సంతుష్టంగా ఉండేటందుకు లేదా శ్రేష్ఠ సంపర్కాన్ని తయారు చేసుకునేటందుకు ముఖ్య విషయం ఏమిటంటే - మీలో సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ఉండాలి. అసంతుష్టతకు కారణం ఏమిటంటే - ఏ విషయమైనా వాణీ లేదా సంస్కారాలలో లేదా కర్మలలో చూస్తున్నారు. అది మీ వివేకం మీకు ఇది యదార్ధం కాదు అని చెప్తుంది కానీ మీ మాటలోకి, కర్మలోకి వచ్చేస్తుంది. దీని ద్వారా ఇతరాత్మ అసంతుష్టం అయిపోతుంది. కనుక అసంతుష్టతకు కారణం ఏమిటంటే - ఎవరి సంస్కారం అయినా, ఎవరి మాట అయినా, కర్మ అయినా యదార్ధంగా లేనప్పుడు మన వివేకం మనకు అది యదార్ధం కాదు అని చెప్తుంది. కనుక మనం ఆ ఆత్మ పట్ల మాటలో, కర్మలో అలాగే ప్రవర్తిస్తున్నాము. అందువలన ఆ ఆత్మ అసంతుష్టం అయిపోతుంది. ఎవరోకరి సంస్కారాలను, వారి మాటలను లేదా కర్మలను చూసి ఇది యదార్ధం కాదు, ఇలా ఉండకూడదు అని అనుకుంటున్నారు. ఆ సమయంలో మీరు డైరెక్ట్ గా వారికి ఆవిధంగా చెప్పకూడదు, ఆ సమయంలో దానిని మీలో ఇముడ్చుకోవాలి, సహించాలి. ఈ విశేషతలను ధారణ చేస్తే ఇముడ్చుకునే శక్తి, సహనశక్తి మరియు వారికి వారి యొక్క యదార్ధ, అయదార్థ నడవడికను సాక్షాత్కారం చేయించేస్తుంది. ఏదైనా ఒక ఆత్మ తన మాట ద్వారా కానీ, సంస్కారం ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ తప్పు చేస్తున్నప్పుడు మీరు తప్పు అని చెప్పక్కర్లేదు. మీరు సహనశక్తితో, ఇముడ్చుకునే శక్తితో ఉంటే ఆ ఆత్మకే అనుభవం అయిపోతుంది. కానీ ఏమి జరుగుతుంది? వాణీ ద్వారా, వారి నడవడిక ద్వారా అనుభవం అయిపోతుంది. కనుక మీరు వారిని కలుపుకోవటానికి బదులు సంస్కారాలకు వశమై అది బయటకు చెప్తున్నారు. ఈ కారణంగా సంతుష్టం కావటంలేదు, ఇతరులు కూడా అసంతుష్టం అయిపోతున్నారు. కనుక మీలో ఇముడ్చుకునే శక్తి, సహనశక్తి ఉండాలి. దీని ఆధారంగా వారి కర్మను, వారి సంస్కారాన్ని కొద్ది సమయం కోసం తొలగించేయండి. మీ సహనశక్తి, ఇముడ్చుకునే శక్తి ద్వారా ఆ ఆత్మపై కూడా సంతుష్టతా అనే బాణం వేయండి. కానీ మీరు ఇది వేయలేకపోతున్నారు. దీని కారణంగా ఆ ఆత్మ అసంతుష్టం అయిపోతుంది. కనుక సర్వుల సంపర్కంలోకి వచ్చినప్పుడు సర్వులను సంతుష్టం చేయటానికి మరియు మీరు సంతుష్టంగా ఉండేటందుకు ఈ రెండు గుణాలు మరియు ఈ రెండు శక్తులు చాలా అవసరం. దీని ద్వారానే మీ గుణాలు మహిమ చేయబడతాయి. భలే ఆ సమయంలో మీరు విజయం పొందినట్లు కనిపించకపోవచ్చు. కానీ ఓడిపోరు. కానీ ఆ సమయంలో మీ యొక్క ఓటమి అనేక జన్మల కొరకు మీకు కంఠహారంగా అయిపోతుంది. అందువలన ఈ ఓటమిని కూడా విజయీగా భావించండి. కానీ ఈ విషయంలో మీకు లోపం ఉన్న కారణంగా ఈ సబ్జక్టులో ఎంత సఫలతను పొందాలో అంత సఫలతను పొందలేకపోతున్నారు. మీకు బుద్ధిలో జ్ఞానం ఉంది. కానీ ఏ రూపంలో, ఏ సమయం ద్వారా, ఏ యుక్తితో, ఏ జ్ఞానం యొక్క పాయింట్‌ని ఎక్కడ ఉపయోగించాలో ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీరు వారికి నేను శిక్షణ ఇచ్చాను అని అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలో వారికి ఆ శిక్షణను స్వీకరించే సమర్ధత లేదు. అప్పుడు ఆ శిక్షణ పని చేయదు. ఎలా అయితే ఏదైనా ఒక బీజం వేయాలంటే భూమిని చూసి, సమయాన్ని చూసి బీజం వేయాలి, అప్పుడే సఫలత వస్తుంది. సమయం చూడకుండా, భూమిని చూడకుండా మీరు ఎంత పెద్ద క్వాలిటీ బీజం వేసినా అది ఫలాన్నిచ్చే వృక్షంగా తయారవ్వదు. అలాగే జ్ఞానం యొక్క పాయింట్‌ని లేదా శిక్షణను లేదా యుక్తిని ఇతరాత్మలకు తెలియచేసేటప్పుడు భూమిని, సమయాన్ని చూడాలి. భూమి అంటే ఏమిటి? భూమి అంటే ఆ సమయంలో ఆ ఆత్మ యొక్క సమర్థతను చూడాలి మరియు సమయాన్ని కూడా చూడాలి. అప్పుడు మీరు శిక్షణ ఇచ్చినా ఆ బీజం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. లేకపోతే మీరు ఎంత శిక్షణ ఇచ్చినా ఆ ఆత్మ పరివర్తన అవ్వదు. అర్థమైందా? కనుక వర్తమాన సమయంలో సర్వ శ్రేష్ఠాత్మలకు, మహావీర్, మహావీరణీలకు ఈ విశేష పురుషార్థంపై చాలా ధ్యాస ఉండాలి. ఇదే మహావీరత. సంతుష్టంగా ఉన్నవారిని సంతుష్టం చేయటం మహావీరత కాదు, స్నేహి ఆత్మకు స్నేహం ఇవ్వటం మహావీరత కాదు, సహాయోగి ఆత్మతో సహయోగిగా ఉండటం మహావీరత కాదు. కానీ ఎలా అయితే బాబా అపకారులకు కూడా ఉపకారం చేస్తారో, ఎవరైనా అసహయోగిగా ఉన్నా తన సహయోగ శక్తితో ఆ అసహయోగి అత్మను కూడా తన సహయోగిగా తయారు చేస్తారో, అలాగే మీరు కూడా బాబా సమానంగా అవ్వాలి. దీనినే మహావీరత అంటారు. అంతేకానీ ఈ కారణంగా ఇది జరగటం లేదు అని చెప్పకూడదు. వీరు ముందుకు వెళ్ళటం లేదు, తయారవ్వటం లేదు అని అనకూడదు. వారు ముందుకి వెళ్ళినా, వెళ్ళకపోయినా మీరు తీసుకెళ్లగలరు కదా! ఇలా భావించాలి. ఇది కూడా స్నేహం యొక్క సంబంధం. మన సంబంధీకులు ఎవరైనా ఏదైనా విషయంలో బలహీనంగా ఉంటే బలహీనులను, బలహీనులు అని భావించి వదిలేయటం మర్యాద కాదు. అలాగే ఇక్కడ కూడా ఈశ్వరీయ మర్యాద ఏమిటంటే - బలహీనులను బలహీనులు అని భావించి వదిలేయకూడదు. ఇక్కడ కూడా వారికి బలమిచ్చి బలవంతులుగా తయారుచేయాలి. వారికి మీరు సహయోగి అయ్యి ఆ బలహీన ఆత్మలు కూడా హైజంప్ చేసేలా తయారుచేయాలి. అప్పుడు మిమ్మల్ని మహావీర్ అంటారు. ఈ సబ్జెక్టుపై ధ్యాస పెట్టుకోండి. అప్పుడు మీరు సేవలో ఏవైతే ప్లాన్స్ తయారు చేస్తున్నారో, ఏవైతే పాయింట్స్ తీస్తున్నారో, ఆ సేవాప్లాన్స్ అనే ముత్యాలలో ఈ వజ్రం కూడా మెరుస్తూ కనిపిస్తుంది. కేవలం మీ దగ్గర బంగారమే ఉంటే అది దూరం నుండి అందరిని ఆకర్షించదు. కానీ ఆ బంగారం మధ్యలో వజ్రం కూడా ఉండాలి. అప్పుడు అది దూరం నుండే అందరిని ఆకర్షిస్తుంది. అలాగే మీరు బంగారం లాంటి మంచి, మంచి ప్లాన్స్ తయారుచేస్తున్నారు. కానీ దానిలో ఈ వజ్రం ఏదైతే ఉందో దానిని కలపండి. ఏ వజ్రాన్ని? ఎటువంటి ఆత్మకైనా శక్తినిచ్చి ముందుకి తీసుకువెళ్ళే వజ్రం కలపండి. అప్పుడు మీరు తయారుచేసిన ప్రతి ప్లాన్ ప్రత్యక్షంలోకి వస్తుంది. అప్పుడు మొత్తం విశ్వంలో ధ్వని వ్యాపిస్తుంది. మీకు సఫలత కూడా లభిస్తుంది. అప్పుడు దూర, దూరంలో ఉన్న ఆత్మలు కూడా ఈ వజ్రానికి ఆకర్షితమై మీ వద్దకు వచ్చేస్తారు.