శ్రేష్టస్థితిని తయారు చేసుకునేటందుకు సాధనం-
మూడు మాటలు సృతి ఉంచుకోండి.
1.నిరాకారిగా అవ్వాలి 2. అలంకారిగా అవ్వాలి 3.కళ్యా ణకారిగా అవ్వాలి.
స్వయాన్ని పదమా పదమ్ భాగ్యశాలిగా భావించి ప్రతి అడుగు
వేస్తున్నారా? కమలపుష్పాన్ని కూడా పద్మం అని అంటారు కదా! అలాగే అడుగు అడుగు
పద్మం సమానంగా అంటే అతీతంగా, ప్రియంగా అయ్యి నడవటం ద్వారానే మీకు ప్రతి అడుగులో
కూడా కోటానుకోట్ల సంపాదన జరుగుతుంది. ఇలా శ్రేష్ట ఆత్మలుగా అయ్యారా? రెండు
రకాలుగా మీ స్థితి తయారయ్యిందా? ఒక అడుగులో కోట్లు అంటే ఎంత ఖజానాకు మీరు
యజమానులు అయిపోయారు? ఇలా స్వయాన్ని అవినాశి ధనవంతులుగా మరియు సంపత్తి వంతులుగా
మరియు అతీతంగా మరియు ప్రియంగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ పరిశీలన చేసుకోండి -
ఒక అడుగు కూడా కోటానుకోట్ల సంపాదన లేకుండా వేయకూడదు. ఈ సమయంలో మీరు పదమాపతులు
అంటే అవినాశి సంపత్తి వంతులుగా అవుతున్నారు. దీని ఆధారంగానే మొత్తం కల్పం
సంపత్తివంతులుగా మహిమ చేయబడతారు. అర్దకల్పం స్వయం యొక్క, విశ్వరాజ్యం యొక్క
అఖండ రాజ్యం నడుస్తుంది. నిర్విఘ్నరాజ్యానికి అధికారిగా అవుతారు. మరలా అర్దకల్పం
భక్తులు మీ యొక్క ఈ స్థితిని గుణగానం చేస్తారు. మీ భక్తులు కూడా జీవితంలో ఏ
రకమైన లోటు అనుభవం చేసుకోరు. వారు ఎవరి దగ్గరకు వస్తారు? మీ యొక్క
స్మృతిచిహ్నాలైన చిత్రాల దగ్గరకే వస్తారు. అంటే మీ చిత్రాల ద్వారా కూడా భక్తులు
అల్పకాలిక ప్రాప్తిని అనుభవం చేసుకుంటారు. తమ యొక్క లోపాలను, బలహీనతలను
తొలగించుకుంటూ ఉంటారు. మొత్తం కల్పంలో ప్రత్యక్ష జీవితంలోనైనా లేదా స్మృతిచిహ్న
రూపంలోనైనా సదా మీరు సంపత్తివంతులుగా, శక్తివంతులుగా, గుణవంతులుగా,
వరదానమూర్తులుగా అవుతున్నారు. కనుక ఒక అడుగు మీరు వేస్తున్నారు అంటే లేదా
సంకల్పం చేస్తున్నారు అంటే మరి శ్రేష్ఠ స్వరూపంలో స్థితులై నడుస్తున్నారా?
శ్రేష్ట స్థితిలో స్థితులై సంకల్పం చేస్తున్నారా? హద్దు యొక్క రాజు అతను
రాజధానిని చూస్తున్నప్పుడు ఏ స్థితిలో, ఏ దృష్టిలో చూస్తారు? ఏ నషాతో చూస్తారు?
ఈ ప్రజలందరు నా పిల్లలు అనే దృష్టితో చూస్తారు. అలాగే మీరు కూడా ఇప్పుడు ఈ
సృష్టిని చూస్తున్నప్పుడు లేదా ఏ ఆత్మనైనా చూస్తున్నప్పుడు ఏమని భావించి
చూస్తున్నారు? వీరు విశ్వానికి యజమానులు, ఈ రోజు ఇలా అయిపోయారు. మరలా తిరిగి
విశ్వానికి యజమానులుగా అవుతారు అనే దృష్టితో చూస్తున్నారా? విశ్వాన్ని ఇలా
సంపత్తితో, సంపన్నంగా, సుఖదాయిగా తయారు చేస్తున్నారా? తయారు చేయాలి కదా!
ఒకప్పుడు మీరందరు విశ్వయజమానులు. కానీ ఇప్పుడు ఈ స్థితిలోకి వచ్చేసారు. ఈ రోజు
మన స్థితి ఎలా అయిపోయింది? కనుక ఆ నషాలో స్థితులై ఆ రూపంతో, ఆ వృత్తితో, ఆ
దృష్టితో ప్రతి ఆత్మను చూస్తున్నారా? మీరు ఒకప్పుడు విశ్వయజమానులు, వారందరు మీ
ప్రజలు, భక్తులు, పిల్లలు. విశ్వయజమానిగా ఉన్న మీరు ఈ రోజు ఈ స్థితికి వచ్చేసారు.
కనుక ఆత్మలను పిల్లలు అనే దృష్టితో చూస్తున్నారా? ఏ ఆత్మనైనా ఏ స్థితిలో ఉంటూ
చూస్తున్నారు? ఆ సమయంలో మీ స్థితి ఎలా ఉంటుంది? పిల్లలు చెప్పారు, మీరు
చెప్పినవన్నీ యదార్థమే, కానీ ఇప్పుడు మీరు చెపినవన్నీ యదార్థమే. ఎందుకంటే మీరు
అయదార్థతను వదిలేసారు. ఇప్పుడు అయదార్థ మాటలు మీ నోటి నుండి రావటం లేదు కానీ
మీరు ఏదైనా ఆత్మను చూస్తున్నప్పుడు ఏమి గుర్తు ఉంచుకోవాలి? ఏమి ఆలోచన
పెట్టుకోవాలి అంటే అన్ని ఆత్మలకు బాబా ద్వారా నేనే వరదానిగా, మహాదానిగా అవ్వాలి
అని. ఏ ఆత్మ మీ వరదానం నుండి, మహాదానం నుండి వంచితం కాకూడదు. ఎవరైతే వరదాని,
మహాదానిగా ఉంటారో వారి ఎదురుగా ఎవరైనా వచ్చినా ఆ ఆత్మకు ఏదోకటి ఇచ్చి వెళ్తారు.
వారి నుండి తీసుకుని వెళ్తారు తప్ప ఖాళీగా వెళ్ళరు. ఏ ఆత్మను కూడా వారు ఖాళీగా
పంపించరు. ఇలా సర్వాత్మలకు నేను వరదాని, మహాదానిని, ఆ ఆత్మలకు నేను ఏదోకటి
ఇవ్వాలి అనే సంకల్పం మీకు ఉండటం ద్వారా, ఏ ఆత్మ వచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళదు.
ఏదోకటి తీసుకునే వెళ్తుంది. ఇలా భావించి ప్రతి ఆత్మను చూస్తున్నారా? దాత పిల్లలు
అంటే దాతలుగానే ఉండాలి. ఎవరైనా బాబా దగ్గరకు వచ్చినప్పుడు బాబా ఖాళీ చేతులతో
పిల్లలను పంపించరు. అలాగే తండ్రిని అనుసరించండి. స్థూలంగా కూడా ఇంటికి
వచ్చినవారికి కూడా ఏదోకటి కానుక ఇచ్చి పంపిస్తారు కదా! ఏదోకటి ఇస్తారు. ఈ ఆచారం
కూడా ఎక్కడి నుండి వచ్చింది? సూక్ష్మ కర్తవ్యానికి సృతిచిహ్నమే స్థూలంగా
తయారుచేసారు. ఆ సూక్ష్మ కర్తవ్యాన్ని స్మృతి ఇప్పించటానికి స్టూల సాధనాన్ని
తయారుచేస్తారు. మీరు అనుకుంటారు కదా! ఏదైనా స్టూల బహుమతి ఇచ్చి పంపించాలి అని.
అలాగే సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి - నా దగ్గరకు వచ్చిన ఆత్మకు ఏదోకటి ఇచ్చి
పంపించాలి అని. అప్పుడే మీరు విశ్వరాజ్యంలోకి వస్తారు. అప్పుడు వారు మీకు
ప్రజలుగా అవుతారు. ఇలా సదాచారి అంటే సదా మహాదాని యొక్క దృష్టి, వృత్తి, కర్మ
తయారుచేసుకోండి. అప్పుడే విశ్వయజమానిగా అవుతారు. ఇలాంటి స్థితి అంటే సదా
సంపత్తివంతులుగా ఉండండి. దీని కొరకు మూడు మాటలు స్మృతి ఉంచుకోవాలి. ఆ మూడు మాటలు
ఏమిటి? ఆ మూడు మాటలు స్మృతి ఉంచుకోవటం ద్వారా స్వతహాగా మీ యొక్క సంకల్పం
విశ్వకళ్యాణ కారిగా ఉంటుంది. ఆ మూడు మాటలు ఏమిటి? సదా నిరాకారి, అలంకారి,
కళ్యాణకారి. ఈ మూడు మాటలు స్మృతి ఉంచుకుంటే సదా మీ స్థితిని శ్రేష్టంగా తయారు
చేసుకోగలుగుతారు. మనసా, వాచా, కర్మణా సేవలో ఈ మూడు స్థితులు ఉన్నతంగా ఉండాలి. ఏ
సమయంలో కర్మలోకి వస్తున్నారో, ఆ సమయంలో స్వయాన్ని పరిశీలించుకోండి. సదా
అలంకారిమూర్తి అయ్యి కర్మ చేస్తున్నానా? అలంకారమూర్తిగా ఉంటే దేహ అహంకారిగా
ఉండరు. అలంకారం ద్వారా అహంకారం సమాప్తి అయిపోతుంది. అందువలన స్వయాన్ని అలంకారి
మూర్తిగా భావించండి. ఈ అలంకారంలో స్వదర్శనం తిరుగుతుందా? చూసుకోండి. ఒకవేళ మీకు
ఈ అలంకారంలో స్వదర్శనచక్రం తిరుగుతూ ఉంటే అనేక రకాలైన మాయా చక్రాలలోకి మీరు రారు.
ఎందుకంటే ఈ స్వదర్శనచక్రం అనేది అన్ని రకాల చక్రాల నుండి రక్షిస్తుంది. కనుక ఈ
అలంకారంలో స్వదర్శనచక్రం తిరుగుతుందా? అనేది చూసుకోండి. ఏదైనా అలంకారం మీకు
లోపంగా ఉంది, అంటే సర్వశక్తులు లోపంగా ఉన్నట్లే. సర్వశక్తులు మీలో లేకపోతే సర్వ
విఘ్నాల నుండి, సగం బలహీనతల నుండి కూడా ముక్తి కాలేరు. కనుక విషయంలోనైనా,
విఘ్నల ద్వారా అయినా, పాత సంస్కారాల ద్వారా అయినా ,సేవలోనైనా ఏదైనా అసఫలత
వస్తుంది అంటే దానికి కారణం ఏమిటంటే మీలో సర్వశక్తులు లేనట్లే. విఘ్నాల నుండి
ముక్తి పొందాలంటే శక్తిని ధారణ చేయండి. అంటే అలంకార రూపధారి అయ్యి ఉండండి.
అలంకారాన్ని వదిలేస్తున్నారు, అలంకారిగా భావించి నడవటం లేదు.శక్తులు లేకుండా
ముక్తి కావాలని కోరుకుంటున్నారు, ఎలా పూర్తవుతుంది? అందువలన ఈ మూడు మాటలు సదా
స్మృతిలో ఉంచుకుని ప్రతి కార్యం చేయండి. ఈ అలంకారాలను ధారణ చేయటం ద్వారా సదా
స్వయాన్ని వైష్ణవుడిగా భావిస్తారు. భవిష్యత్తులో విష్ణువంశీయుడిగా అవుతారు.
ఇప్పుడు వైష్ణవులుగా కావాలి. అప్పుడే విష్ణురాజ్యంలో విష్ణువంశీయులుగా అవుతారు.
వైష్ణవులు అంటే ఏవిధమైన నీచమైన వస్తువుని ముట్టుకోకూడదు. ఈ రోజుల్లో వైష్ణవులు
కూడా స్థూలమైన తమోగుణ వస్తువులను ముట్టుకోరు కదా! అలాగే మీరు కూడా శ్రేష్టాత్మలు,
సదా వైష్ణవులు. కనుక తమోగుణి సంకల్పాలను. తమోగుణి సంస్కారాలను టచ్ చేయకూడదు.
ఒకవేళ సంకల్పాలను, సంస్కారాలను టచ్ చేస్తున్నారు అంటే ధారణ చేస్తున్నారు అంటే
మీరు సత్యమైన వైష్ణవులా. ఒకవేళ ఇలా సత్యమైన వైష్ణవులుగా కాకపోతే
విష్ణురాజ్యంలోకి రాలేరు. విశ్వయజమానులుగా కూడా కాలేరు. కనుక స్వయాన్ని నేను
ఎంత వరకు సదాకాలికంగా వైష్ణవుడిగా అయ్యాను, అని చూసుకోండి. వైష్ణవకులంలో
ఉండేవారు ఏదైనా తమోగుణీ వస్తువుని ముట్టుకుంటే స్వయాన్ని తమోగుణిగా భావిస్తారు.
అది స్థూలవిషయం. కానీ మీరు సత్యమైన వైష్ణవులు. కనుక పాత విషయాలను, పాత
ప్రపంచాన్ని, పాత ప్రపంచం యొక్క ఏ వ్యక్తి, వైభవాలను బుద్దితో కూడా టచ్ చేయకూడదు.
అతీతంగా ఉండాలి. ఇలా సదా వైష్ణవులుగా అవ్వండి. ఏదోక కారణంగా అయినా, అకారణంగా
అయినా టచ్ చేస్తే వారు స్నానం చేసేస్తారు కదా! అలాగే మీరు కూడా స్వయాన్ని
శుద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏదైనా బలహీనత కారణంగా మీరు కూడా ఏవైనా
పాత తమోగుణీ సంస్కారాలను, సంకల్పాలను టచ్ చేస్తే విశేషంగా జ్ఞానస్నానం చేయాలి.
అంటే ఇలా మనలో పాత స్వభావ, సంస్కారాలు వచ్చినప్పుడు బుద్ధిలో విశేషంగా బాబా
యొక్క స్మృతి, బాబాతో విశేషంగా ఆత్మిక సంభాషణ చేయాలి. దీని ద్వారా ఏమౌతుంది?
తమోగుణీ సంస్కారాలు మిమ్మల్ని ఎప్పుడు టచ్ చేయవు. శుద్ధంగా అయిపోతారు. స్వయాన్ని
ఇలా శుద్ధంగా తయారు చేసుకోవటం ద్వారా శుద్ధ స్వరూప సంస్కారాలు తయారవుతాయి. కనుక
ఇలా చేస్తున్నారు కదా? ఇది ఎలా జరిగిందో తెలియదు అంటున్నారా? అది స్వయం యొక్క
బలహీనతే కదా? మీలో ఎంత శక్తి ఉండాలంటే ఏది మిమ్మల్ని టచ్ చేయకూడదు. ఎవరైనా
శక్తిశాలిగా ఉంటే వారి ఎదురుగా ఒక బలహీన మాట కూడా మాట్లాడలేము కదా! వారి ఎదురుగా
రాలేరు. అజ్ఞానంలో ఎవరైనా అహంకారంగా మాట్లాడుతూ ఉంటే వారి ఎదురుగా ఎవరు ఎదురుగా
ఎవరు రారు కదా! కానీ ఇక్కడ అహంకారం కాదు, ఆత్మీయత. ఆత్మీయతతో ఉన్నప్పుడు ఎవరికి
వచ్చి మిమ్మల్ని టచ్ చేసే శక్తి ఉండదు. భవిష్యత్తులో మీకు ప్రకృతి దాసీ
అయిపోతుంది, ఇదే సంపూర్ణస్థితి కదా! సత్యయుగంలో ప్రకృతి మీకు దాసీ
అవుతున్నప్పుడు, ఇక్కడ మీకు పాత సంస్కారాలు దాసీ అవ్వవా? దాసిగా చేసుకోలేరా?
సత్యయుగంలో మీ దాస, దాసీలు సదా మీ ఆజ్ఞానుసారం, సదా అలాగే అంటూ ఆజ్ఞానుసారం
నడవాలి, మిమ్మల్ని టచ్ చేయకూడదు. మీ బలహీనతలు కూడా మీ ఆజ్ఞానుసారం నడవాలి.
మిమ్మల్ని టచ్ టచ్ చేయకూడదు. ఇటువంటి స్థితి సదాకాలికంగా తయారు చేసుకుంటున్నారా?
ఈ స్థితికి ఎంత వరకు చేరుకున్నారు? ఇది నిన్నటి విషయమా లేదా ఇప్పటి విషయమా లేదా
అనేక సంవత్సరాల విషయమా ? ఇప్పుడు, ఈరోజు, రేపు యొక్క ఆట నడుస్తుంది . ఈ రోజు,
ఇప్పుడు, రేపు విషయంలో చాలా తేడా ఉంది కదా! ఇప్పుడు ఈ ఆట నడుస్తుంది. ఈరోజు ఇలా
ఉన్నారు, రేపు అలా తయారవుతారు, ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు, ఇలా మీ స్థితి అనేది
ఈరోజు, ఇప్పుడు, రేపు ఈ మూడు మాటలపై నడుస్తుంది. టీచర్స్ యొక్క అద్భుతమేమిటంటే
బాబా మిమ్మల్ని టీచర్‌గా తయారుచేసారు. మీరు టీచర్ కాదా? స్వయాన్ని టీచర్‌గా
తయారు చేసుకుంటే, మీ ఫలితం మీకు తెలియటం లేదా? టీచర్ అవ్వటం అంటే బాబా సమానంగా
అయ్యే కర్తవ్యం చేయటం. టీచర్ ఒకవేళ టీచర్‌గా కాకపోతే టీచర్ అని ఎలా అంటారు?
స్వయాన్ని టీచర్‌గా తయారు చేసుకోకపోతే సంపూర్ణ స్థితిని పొందలేరు. స్వయాన్ని
టీచర్ అనుకోవటం లేదు. అందువలనే మీకు బలహీనత వచ్చేస్తుంది. కనుక టీచర్స్ సదా
చూసుకోండి ప్రజలు ఏదైతే మహిమ చేస్తున్నారో ఆ మహిమా యోగ్యంగా నేను తయారయ్యానా అని.
ఆ మహిమ యొక్క ఒకొక్క విషయాన్ని మీలో పరిశీలించుకోండి. మీరు మర్యాదా
పురుషోత్తములేనా? సంపూర్ణ నిర్వికారులు, సంపూర్ణ అహింసకులు. మరి ఈ పూర్తి మహిమ
మీ ప్రత్యక్షంలో కనిపిస్తుందా అని పరిశీలించుకోండి. ఒకవేళ ఏదైనా లోపం ఉంటే ఆ
లోపాన్ని నింపుకుని మహిమాయోగ్యంగా అవ్వండి. ఈవిధంగా సదా సత్యమైన వైష్ణవులుగా
అయ్యేటువంటి అదృష్టవంతమైన మరియు ఉన్నతమైన పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే .