17.05.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంఘటన రూపి కోటను గట్టిగా చేసుకునేటందుకు సాధనం.

పాండవ భవనాన్ని పాండవుల కోట అని అంటారు. కోటకి మహిమ ఉంది కదా! అలాగే ఈ ఈశ్వరీయ సంఘటన అనేది కూడా ఒక కోట. ఎలా అయితే స్థూలకోటని గట్టిగా ఉంచుతారు, ముఖ్యమైన కోట కదా! శత్రువులు ఎవరు మీ అందరి యుద్ధం చేయకుండా . ఉండేటందుకు. అలాగే ఇక్కడ కూడా ముఖ్యమైన కోట ఏమిటంటే మీ అందరి సంఘటన. ఈ కోటలో మీరు ఎంత గట్టిగా ఉండాలంటే ఏ వికారాల రూపి శత్రువులు మీపై యుద్ధం చేయకూడదు . ఒకవేళ ఏ శత్రువులైనా మీపై యుద్ధం చేస్తున్నారు, అంటే తప్పకుండా మీ కోట గట్టిగా లేనట్లే. అయితే ఈ సంఘటన రూపి కోటను గట్టిగా చేసుకునేటందుకు మూడు విషయాలు అవసరం . ఈ మూడు విషయాలలో గట్టిగా ఉంటే ఈ కోటలో ఏ రూపంలో, ఏ శత్రువు యుద్ధం చేయరు. శత్రువు ప్రవేశించలేరు. వారికి ధైర్యం కూడా ఉండదు. ఆ మూడు విషయాలు ఏమిటి ? 1.స్నేహం, 2.స్వచ్చత, 3.ఆత్మీయత. ఈ మూడు విషయాలు గట్టిగా ఉంటే మీ కోటపై ఏ యుద్ధం జరుగదు . ఒకవేళ ఎక్కడైనా, ఏదైనా యుద్ధం జరుగుతుంది అంటే దానికి కారణం ఏమిటంటే ఈ మూడింటిలో ఏదో ఒకటి లోపంగా ఉన్నట్లే. స్నేహం అయినా లోపం ఉండి ఉండచ్చు లేదా ఆత్మీయత అయినా లోపం ఉండి ఉండచ్చు లేదా స్వచ్ఛత అయినా లోపం ఉండి ఉండచ్చు కనుక సంఘటన రూపి కోటను గట్టిగా ఉంచుకునేటందుకు ఈ మూడు విషయాలపై విశేషమైన ధ్యాస ఉంచుకోవాలి. ప్రతి స్థానంలో ఈ మూడు విశేషతల యొక్క ఫోర్స్ ఉంచుకోవాలి. స్థూలంగా కూడా వాయుమండలాన్ని శుద్ధంగా ఉంచుకునేటందుకు మంచిగా ఉంచుతారు కదా! అలాగే మీరు కూడా వాయుమండలాన్ని మంచిగా పరివర్తన చేసుకోండి. కనుక ఈ విషయాలపై మీరు ధ్యాస ఉంచుకోవాలి. దీని ద్వారా వాయుమండలం కూడా మంచిగా తయారవుతుంది. ఏ విషయానైనా ఆకర్పించాలంటే ముఖ్యంగా ఇవే విషయాలు ఉంటాయి. అందరు స్నేహానికి, స్వచ్ఛతకే ప్రభావితం అవుతారు. కానీ మూడవ విషయం ఆత్మీయత ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది. రెండు విషయాలకైతే ప్రభావితం అయ్యారు. కానీ వృత్తి,దృష్టిపై కూడా ధ్యాస పెట్టుకోవాలి. ఈ ఫలితం ఇప్పుడు తీసుకురావాలి. ఎలా అయితే ప్రజలను స్నేహానికి, స్వచ్ఛతకు ఆకర్షితం చేస్తున్నారో అలాగే ఈ ఆత్మీయతకు కూడా ఆకర్షితం చేయండి. ఒకరినొకరు సంఘటనలోకి తీసుకురావడానికి సంఘటన శక్తిని పెంచుకునేటందుకు పరస్పరం ఈ మూడు విషయాల గురించి ఒకరికొకరు ధ్వాస ఇప్పించుకోండి. ఒకవేళ ఈ మూడు విషయాలలో ఏ విషయం లోపంగా ఉన్నా తప్పకుండా ఏదోక బలహీనత ఉన్నట్లే. బలహీనత ద్వారా మీరు ఏదైతే సఫలత కోరుకుంటున్నారో ఆ సఫలత రాదు. తప్పనిసరిగా లోపం వచ్చేస్తుంది. కనుక ఈ మూడు విషయాలు ధ్యాసలో ఉంచుకోండి. ఒకరికొకరు సంఘటన ద్వారానే కోట గట్టిగా అవుతుంది. ఒకవేళ కోటలో ఒక ఇటుక లేదా ఒక రాడు సహయోగం పూర్తిగా లేకపోయినా ఆ కోట రక్షణగా ఉండదు. కొద్దిగా కోట చలించినా బలహీనత వచ్చేస్తుంది. భలే అనటానికి ఒక ఇటుకే లోపంగా ఉంది అంటున్నారు. కానీ ఆ ఒక ఇటుక యొక్క లోపం ద్వారా నలువైపుల బలహీనత వచ్చేస్తుంది. కనుక కోట గట్టిగా ఉండేటందుకు మూడు విషయాలు చాలా అవసరం. అప్పుడిక ఏ తరంగాలు టచ్ చేయవు. కానీ మీపై మీరు ధ్యాస తక్కువ పెట్టుకుంటున్నారు. ఎలా అయితే సాకార బ్రహ్మాబాబా సాకార రూపంలో దూరం నుండే లైట్‌హౌస్, మైట్‌హౌస్ గా కనిపించేవారు. ఆత్మీయత యొక్క సువాసన కనిపించేది. ఎవరైనా లోపలకు రాగానే, బ్రహ్మాబాబాని చూడగానే లైట్‌హౌస్, మైట్‌హౌస్ గా అనుభవం చేసుకునేవారు. అలాగే ఇప్పుడు మీరు బయటి రూపం యొక్క స్నేహాన్ని, స్వచ్ఛతను అనుభవం చేయిస్తున్నారు. అలాగే ఆత్మీయత యొక్క అలౌకికత యొక్క ప్రత్యక్ష రూపాన్ని బయటికి చూపించండి. అప్పుడే జయజయకారాలు వస్తాయి. ఇప్పుడు డ్రామానుసారం ఏదైతే నడుస్తుందో అది యదార్ధమే. కానీ వెనువెంట ఇప్పుడు శక్తిరూపం యొక్క అనుభవం కూడా కావాలి. ఈ అలౌకికత తప్పకుండా ఉండాలి. ఈ స్థానం ఇతర స్థానాల కంటే భిన్నమైనది. స్వచ్ఛత, స్నేహం అనేది ప్రపంచంలో ఉంది. కానీ ఆత్మీయత ఎవ్వరిలో ఉండదు. ఈశ్వరీయ కార్యం నడుస్తుంది, ఇది సాధారణ విషయం కాదు. ఇది వారు ఇక్కడికి వచ్చి అనుభవం చేసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మీరు అలౌకిక నషాలో ఉన్నప్పుడు వారికి అనుభూతి చేయించగలుగుతారు. కనుక మీ చిత్రం ద్వారా, చరిత్ర ద్వారా, నడవడిక ద్వారా, వాణీ ద్వారా, వృత్తి ద్వారా, వాయుమండలం ద్వారా, అన్ని రకాల సాధనాల ద్వారా బాబా యొక్క ప్రత్యక్ష పాత్రను ప్రత్యక్షము చేయాలి. ఈ అవతరిత భూమిలో ఈ ప్రత్యక్షత అందరికి కనిపించాలి. ఈ లక్ష్యం పెట్టుకోండి. కేవలం స్నేహం బావుంది, స్వచ్చత బావుంది అని ప్రసంశిస్తున్నారు. చిన్నచిన్న స్థానాలలో కూడా ఈ ప్రభావం ఉంది. కానీ కర్మభూమి, చరిత్రభూమి అయిన మధువనంలో చాలా విశేషత కనిపించాలి. మీరు బాణం వేసి నలువైపుల వారిని ఆకర్షితం చేయాలి. బాబా యొక్క స్నేహంలోకి తీసుకురావాలి, సమీపంలోకి తీసుకురావాలి. బాబా పాయింట్స్ అనే బాణం మీరు వేయాలి. దీని కొరకు విశేషంగా ఈ భూమిలోకి వచ్చినవారిని సంబంధ, సంపర్కంలోకి సమీపంగా తీసుకురావాలి. సంపర్కంలోకి వచ్చినవారు సంబంధంలోకి స్వతహాగానే వస్తారు. ఇప్పుడు నలువైపుల ఇదే ధ్వని చెవులలో మారు మ్రోగుతూ ఉండాలి. నలువైపుల ఇదే వాయుమండలం అందరికి బలం ఇవ్వాలి. దీని కొరకు మూడు విషయాల యొక్క అవసరం ఉంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే చేసారో అది మంచిగా చేసారు. అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయానుసారం స్థితి ప్రమాణంగా చాలా చాలా మంచిగా ఉండాలి. నాలుగు సంవత్సరాలలో వినాశి జ్వాల ప్రజ్వలితం చేస్తాము అని ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా! మరి బాబా యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడే వినాశనం యొక్క కార్యం కూడా జరుగుతుంది కదా! కనుక విస్తారం ద్వారా బీజాన్ని ప్రత్యక్షం చేయాలి. ఈ అద్భుతం చేయాలి. కానీ ఇప్పుడు విస్తారంలో బీజమైన బాబా గుప్తమైపోతున్నారు. ఇప్పుడు ఇది వృక్షం యొక్క అంతిమస్థితి కదా! మధ్యలో బీజం గుప్తమైపోతుంది. కానీ అంతిమంలో బీజం గుప్తంగా ఉండదు. అతి విస్తారం తర్వాత, చివరికి బీజమైన బాబాయే ప్రత్యక్షం అవుతారు. ఇప్పుడు మానవాత్మల సంస్కారం ఏమిటంటే, వెరైటీకి ఎక్కువగా ఆకర్షితం అవుతున్నారు. కనుక ఇప్పుడు మీరు కూడా ఆ ఆత్మల యొక్క వెరైటీ యొక్క విస్తారాన్ని గ్రహించి, బీజమైన బాబా వైపు ఆకర్షితం అయ్యేలా సేవ చేయండి. ఆ సేవకు మీరందరు నిమిత్తం కావాలి.