10.06.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సూక్ష్మఅభిమానం మరియు తెలివితక్కువతనం.

వర్తమాన సమయంలో నలువైపుల ఉన్న పురుషార్థీల యొక్క పురుషార్థంలో రెండు విషయాలలో బలహీనత మరియు లోపం కనిపిస్తుంది. ఈ లోపం కారణంగా మీరు ఏదైతే అద్భుతం చేసి చూపించాలో అది చేయలేకపోతున్నారు. ఆ రెండు లోపాలు ఏమిటి? ఒకటి - అభిమానం, రెండు - తెలివితక్కువతనం. ఈ రెండు విషయాలు పురుషార్ధాన్ని బలహీనం చేసేస్తున్నాయి. అభిమానం కూడా చాలా సూక్ష్మమైన విషయం అభిమానం కారణంగా ఎవరైనా కొంచెం అయినా ఉన్నతికి సైగ చేస్తే సూక్ష్మంలో ఆ సహనశక్తి యొక్క అల లేని కారణంగా వీరు ఎందుకు చెప్పారు? అనే సంకల్పం వస్తుంది. దీనిని కూడా సూక్ష్మ రూపంలో అభిమానం అని అంటారు. ఎవరైనా మీకు పురుషార్ధంలో సైగ చేసినప్పుడు ఆ సైగను వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటి ఉన్నతికి సాధనంగా భావించి ఆ సైగను లోపల ఇముడ్చుకోవాలి లేదా మీలో ఆ సహనశక్తిని నింపుకోవాలి, ఈ అభ్యాసం మీకు ఉండాలి. సూక్ష్మంగా కూడా మీ వృత్తి లేదా దృష్టి అలజడి అవ్వకూడదు. ఎందుకు? ఎలా జరుగుతుంది? ఇలా అనుకోవటం కూడా సూక్ష్మ దేహాభిమానం. ఇది కూడా ఆత్మాభిమాని స్థితి కాదు. మహిమ చేసే సమయంలో ఆ ఆత్మ పట్ల మీ వృత్తి, దృష్టి అలాగే స్నేహభావన ఉంటుందో, అలాగే మీకు ఆ ఆత్మ శిక్షణ ఇస్తున్న సమయంలో కూడా అదే స్నేహం, శుభచింతక భావన ఉండాలి. ఈ ఆత్మ నా కోసం శుభచింతక స్థితితో ఈ సైగ చేస్తుంది అని భావించాలి. ఈ స్థితినే ఆత్మాభిమాని స్థితి అని అంటారు. ఒకవేళ ఈ స్థితి లేకపోతే అభిమానం వచ్చేస్తుంది. అందువలన అవమానం సహించలేకపోతున్నారు. తర్వాత రెండవ వైపు పూర్తిగా తెలివి తక్కువతనం కారణంగా కూడా కొన్ని విషయాలలో మోసపోతున్నారు. తమని తాము రక్షించుకోవటంలో కూడా తెలివి తక్కువ వారిగా అయిపోతున్నారు. సత్యతలో కూడా తెలివి తక్కువ తనం వచ్చేస్తుంది. ఈ రెండు విషయాలకు బదులు స్వమానం ద్వారా అభిమానాన్ని పూర్తిగా సమాప్తి చేసుకోవాలి. స్వమానం మరియు నిర్మానం ఈ రెండు విషయాలను ధారణ చేయాలి. అభిమానాన్ని మరియు తెలివితక్కువతనాన్ని సమాప్తి చేసుకోవాలి. మనస్సులో సదా స్వమానం యొక్క స్మృతి ఉండాలి. వాచాలో మరియు కర్మణాలో నిర్మాన స్థితి ఉండాలి. అప్పుడు అభిమానం సమాప్తి అయిపోతుంది. మీరు ఉపన్యాసకులుగా అయితే అయ్యారు. కానీ మీలో ఆత్మీయత లేదు, ఆత్మీయత కలిగినవారిగా అవ్వాలి. ఎవరైతే ఆత్మిక స్థితిలో స్థితులై ఆత్మిక సంతోషంలో ఉంటారో వారినే ఆత్మీయులు అని అంటారు. ఈరోజుల్లో ఉపన్యాసం చెప్పే ఉపన్యాసకులు ఎక్కువ కనిపిస్తున్నారు. కానీ ఆత్మికశక్తి తక్కువగా ఉంది. గారడీ చేసేవారు ఒక్క సెకనులో ఎలా ఉన్న దానిని ఎలా చేసి చూపిస్తారు. అలాగే ఆత్మీయతలో కూడా కర్తవ్యం సిద్ది అవ్వాలి. గారడీ చేసేవారి చేతుల్లో సిద్ది ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రతి సంకల్పం, ప్రతి కర్మ కూడా సిద్ది స్వరూపంగా ఉండాలి. సిద్ది అంటే మీ ద్వారా ఏదోక ప్రాప్తి లభించాలి. కేవలం పాయింట్స్ వినటం, వినిపించటం వీరిని ఉపన్యాసకులు అని అంటారు. ఆ ఉపన్యాసం యొక్క ప్రభావం అల్పకాలికంగా పడుతుంది. కానీ ఆత్మీయత యొక్క ప్రభావం సదాకాలికంగా పడుతుంది. కనుక మీ యొక్క కర్మల సిద్ధిని పొందేటందుకు ఆత్మీయతను తీసుకురావాలి. తెలివతక్కువ వారిగా అయిపోతున్న కారణంగా ఏదైతే వింటున్నారో ఆ స్వరూపాన్ని తయారు చేసుకోలేకపోతున్నారు. యోగ్యటీచర్ అంటే తమ యొక్క శిక్షణా స్వరూపంతో ఇతరాత్మలకు శిక్షణ ఇవ్వాలి. మీ స్వరూపం శిక్షణా సంపన్నంగా ఉండాలి. మిమ్మల్ని చూడటం ద్వారా, మీ నడవడిక ద్వారా ఇతరులకు శిక్షణ లభించాలి. ఎలా అయితే సాకారంలో బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగు ద్వారా, ప్రతి కర్మ ద్వారా శిక్షణ లభించిందో అలాగే అది చరిత్రగా మారిందో అలాగే మీరు వేసే ప్రతి అడుగు ద్వారా అందరికి శిక్షణ లభించాలి. వాణీ ద్వారా ఇతరాత్మలకు శిక్షణ ఇవ్వటం సాధారణ విషయం. కానీ ఇప్పుడు అందరు అనుభూతిని కోరుకుంటున్నారు. కనుక మీ శ్రేష్టకర్మ ద్వారా, శ్రేష్ట సంకల్ప శక్తి ద్వారా ఇప్పుడు అందరికి అనుభవం చేయించాలి. మంచిది.