14.06.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్వ స్థితిలో స్థితులై ఉండేటందుకు పురుషార్ధం మరియు గుర్తులు.

మీ యొక్క అనాది మరియు ఆది స్వ స్థితిని తెలుసుకుంటున్నారా? సదా మీ స్వ స్థితిలో స్థితులయ్యే ధ్యాస ఉంటుందా? స్వ స్థితి అంటే మీ యొక్క అనాది స్థితి. ఆ స్వ స్థితిలో స్థితులవ్వటం కష్టమనిపిస్తుందా? స్థితిలో స్థితులవ్వటం కష్టమనిపిస్తుంది, కానీ స్వ స్థితిలో స్థితులవ్వటం సహజమనిపిస్తుంది కదా? స్వ స్థితిలో స్థితులవ్వటం స్వతహాగా మరియు సరళంగా ఉండాలి కదా! స్వ స్థితిలో సదా స్థితులై ఉండేటందుకు మఖ్యంగా నాలుగు విషయాలు కావాలి. ఒకవేళ ఈ నాలుగు విషయాలు సదా స్థిరంగా ఉంటే మీ స్వ స్థితి సదా ఉంటుంది. ఒకవేళ ఈ నాలుగు విషయాలలో మీకు ఏదైనా లోపం ఉంటే స్వ స్థితిలో కూడా లోపం వచ్చేస్తుంది. స్వ స్థితి గురించి ఏదైతే వర్ణన చేస్తున్నారో, దానిని ఎదురుగా పెట్టుకుని ఈ నాలుగు విషయాలు సదా ఉన్నాయా? అని పరిశీలించుకోండి. మీ స్వ స్థితిని ఎలా వర్ణన చేస్తున్నారు? మీ స్వ స్థితి యొక్క లక్షణాలు ఏమిటి? బాబా గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల యొక్క స్వరూపంగా అవ్వటాన్నే స్వ స్థితి లేదా అనాది స్థితి అని అంటారు. అయితే ఇటువంటి స్వ స్థితి సదా ఉండేటందుకు నాలుగు విషయాలు అవసరం. అవి ఏమిటి? ఆ నాలుగు విషయాలు స్మృతి ఉండటం ద్వారా అనాది స్థితి స్వతహాగా ఉంటుంది. ఆ నాలుగు విషయాలు ఏమిటి? సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ యొక్క స్థితి స్వతహాగానే ఉంటుంది. మొదట అనాది స్థితి నుండి మధ్య స్థితిలోకి ఎందుకు వచ్చేసారు? అనేది ఆలోచించండి. దీనికి కారణం ఏమిటి? దేహాభిమానం అని పిల్లలు చెప్పారు. దేహాభిమానంలోకి రావటం వలన ఏమౌతుంది? దేహాభిమానంలోకి రావటానికి కారణం ఏమిటి? పరస్థితి సహజంగా అనిపిస్తుంది. స్వ స్థితి ఎందుకు కష్టంగా అనిపిస్తుంది? ఈ దేహం కూడా స్వయంతో వేరైనదే కదా! మరి ఈ దేహంలో సహజంగా స్థితులవుతున్నారు, మరి స్వ స్థితిలో ఎందుకు స్థితులు కాలేకపోతున్నారు? కారణం ఏమిటి? సదా సుఖ, శాంతిమయ జీవితం కూడా ఎప్పుడు తయారవుతుంది, అంటే మీ జీవితంలో ఈ నాలుగు విషయాలు ధారణ చేయాలి. ఆ నాలుగు విషయాలు ఏమిటంటే - 1. హెల్త్ అంటే ఆరోగ్యం 2. వెల్త్ అంటే ధనం 3.హ్యాపీ అంటే సంతోషం 4, హోలీ అంటే పవిత్రత, ఈ నాలుగు విషయాలు సదా మీ జీవితంలో ఉంటే దు:ఖం, అశాంతి అనేది ఎప్పుడు అనుభవం చేసుకోరు. ఇలా మీ స్వ స్థితి యొక్క స్వరూపం కూడా సదా సుఖము, శాంతి, ఆనందం, ప్రేమ స్వరూపంలో స్థితులు కాగలుగుతారు. ఈ స్వ స్థితి యొక్క విస్మృతిలోకి వచ్చేస్తున్నారు. కారణం ఏమిటి? సంపద లోటుగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా బలహీనం అయిపోతుంది. పవిత్రంగా కూడా కాలేకపోతున్నారు. దీని కారణంగా సంతోషంగా కూడా ఉండలేకపోతున్నారు. ఆరోగ్యం అంటే ఏమిటి? సంపద అంటే ఏమిటి? మీ ఆత్మ సదా నిరోగిగా ఉండాలి. మాయ యొక్క వ్యాధి యొక్క ప్రభావం మీపై పడకూడదు, దీనినే ఆరోగ్యం అంటారు. అలాగే సంపద అంటే బాబా నుండి మీకు ఏదైతే ఖజానా లభిస్తుందో, బాబా నుండి ఏవైతే సర్వశక్తులు వారసత్వ రూపంలో లభిస్తున్నాయో, ఆ లభించిన జ్ఞాన ఖజానాను, సర్వశక్తుల ఖజానాను సదా స్థిరంగా ఉంచుకోవాలి. ఇలా ఉంటున్నాయా లేదా మీ స్వ స్థితి క్రిందికి వచ్చేస్తుందా? అలాగే పవిత్రత అంటే సంకల్పంలో, స్వప్నంలో కూడా అపవిత్రత ఉండకూడదు. దీని ద్వారా స్వ స్థితి స్వతహాగానే తయారవుతుంది. ఈ నాలుగు విషయాల యొక్క లోపం కారణంగానే సదా మీరు స్వ స్థితిలో ఉండలేకపోతున్నారు. కనుక నాలుగు విషయాలు పరిశీలించుకోండి. ఆరోగ్యం, సంపద ఎంత వరకు వచ్చాయి? ఆరోగ్యం , సంపద, పవిత్రత ఈ మూడు విషయాలు ఉంటే సంతోషం స్వతహాగానే ఉంటుంది. కనుక ఈ నాలుగు విషయాలు సదా ధ్యాసలో ఉంచుకోవాలి. అనారోగ్యంతో రోగిగా ఉండేవారు స్వయాన్ని సుఖీగా అనుభవం చేసుకోరు కదా? రోగం కారణంగా దు:ఖం యొక్క అల ఉత్పన్నం అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సదా ఆరోగ్యవంతంగా లేకుండా మాయా వ్యాధితో ఉంటే దు:ఖం, అశాంతి యొక్క అల ఉత్పన్నం అవుతుంది. ఈ నాలుగు విషయాలు సదా స్థిరంగా ఉండేటందుకు ఏ పురుషార్థం చేయాలి? ఇవి ఎప్పుడు మాయం కాకూడదు, దీని కొరకు సహజ పురుషార్థం చెప్పండి! సహజంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. మీరు కూడా సహజాన్నే కోరుకుంటారు కదా! ఎందుకంటే ఆత్మలో ఆది దేవతా ధర్మ సంస్కారం ఉన్న కారణంగా అర్థకల్పం చాలా సుఖాలలో ఉండేది. ఏ శ్రమ లేదు. ఆ అర్థకల్పం యొక్క సంస్కారం ఇప్పుడు ఆత్మలో ఉండిపోయిన కారణంగా, ఏదైనా కష్టమైన విషయం వస్తే అది చేయలేకపోతుంది. సహజ విషయాన్ని కోరుకుంటుంది, కనుక ఇప్పుడు మీరు కూడా సహజమైన పురుషార్ధం గురించి చెప్పండి, అది ఏమిటి? బాబా స్మృతి సహజంగా ఉండాలి మరియు సదా ఉండాలి మరియు ఆరోగ్యవంతంగా, ధనవంతంగా, సంతోషవంతంగా, పవిత్రంగా స్థిరంగా ఉండాలి దీనికి సహజమైన పురుషార్థం చెప్పండి? నాలుగు విషయాలు వెనువెంట ఉండాలి. ఎలా అయితే మీ యొక్క నిరాకారి, ఆకారి రెండు రూపాలు కదా! నిరాకారి ఆత్మ సాకారి శరీరంతో సంబంధంలోకి వచ్చి ప్రతి కార్యం చేస్తుంది. ఒకవేళ ఈ రెండింటి సంబంధం లేకపోతే ఏ కార్యం చేయలేదు, అలాగే నిరాకారి బాబా మరియు సాకారి బాబా ఇద్దరు కలిసి వచ్చి మనకి జ్ఞానం చెప్తున్నారు. ఇలా ప్రతి కర్మ, సంకల్పంలో ఈ నాలుగు విషయాలు సహజంగా ఉండేలా ఏదైనా పురుషార్థం చెప్పండి? కేవలం నిరాకారుడిని జ్ఞాపకం చేసుకున్నా, కేవలం సాకారిని జ్ఞాపకం చేసుకున్నా ఈ నాలుగు విషయాలు సహజంగా రావు. నిరాకారం మరియు సాకారం రెండు సదా వెంట ఉండాలి. రెండు సదా వెంట ఉండటం ద్వారా మీరు ఏదైతే సంకల్పం చేస్తారో, అది మొదట వారితో పరిశీలన చేయించుకోండి. పరిశీలన చేయించుకున్న తర్వాత ఏ కర్మ చేసినా నిశ్చయబుద్ధి అయ్యి చేయగలరు. సాకారంలో కూడా బ్రహ్మాబాబా ఎవరైనా నిమిత్త ఆత్మలు ఉంటే వారితో పరిశీలన చేయించుకోండి అని చెప్పేవారు కదా! అప్పుడు నిశ్చయబుద్ది అయ్యి చేయగలుగుతారు. నిర్భయత మరియు నిశ్చయం రెండు గుణాలు ఎదురుగా పెట్టుకోండి. ఎక్కడైతే సదా నిశ్చయం మరియు నిర్భయత ఉంటుందో, అక్కడ శ్రేష్ట సంకల్పానికి సదా విజయం ప్రాప్తిస్తుంది. ఏ సంకల్పం చేస్తున్నా నిరాకారి బాబాని, సాకారి బాబాని ఎదురుగా పెట్టుకుని పరిశీలన చేయించుకున్న తర్వాత నిశ్చయంతో మరియు నిర్భయంతో చేయండి. అప్పుడు సమయం కూడా వ్యర్ధం అవ్వదు, ఈ పని చేయమా, వద్దా సఫలం అవుతుందా, లేదా అనే వ్యర్దసంకల్పాలు సమాప్తి అయిపోతాయి. వర్తమాన సమయంలో ఆత్మలో ఏ బలహీనత యొక్క వ్యాధి ఉంది? వ్యర్దసంకల్పాలలో సమయాన్ని పోగొట్టుకోవటమే వర్తమాన సమయంలో ఆత్మ యొక్క బలహీనత. ఈ అనారోగ్యం కారణంగానే ఆత్మ సదా ఆరోగ్యవంతంగా ఉండలేకపోతుంది. అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది మరియు అప్పుడప్పుడు బలహీనం అయిపోతుంది. కనుక సదా ఆరోగ్యవంతంగా ఉండే సాధనం మీదిగా చేసుకోండి అప్పుడు సమయం కూడా రక్షించబడుతుంది. ఎలా అయితే మీరు ఏదైనా కర్మ చేసేటప్పుడు సాకారంలో బ్రహ్మాబాబా ఉన్నప్పుడు పరిశీలన చేయించుకునేవారు కదా! అది సాధారణమైన విషయం అయినప్పటికి బాబా చేత పరిశీలన చేయించుకున్న తర్వాత ప్రత్యక్ష కర్మలోకి తీసుకువచ్చేవారు. అలాగే మీరు కూడా ఇక్కడ ప్రతి కర్మ పరిశీలన చేయించుకుని అప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఇప్పుడు చాలా సమయం మీరు కర్మ చేయాలి అనుకుంటున్నారు. కానీ ప్రత్యక్షంలో అనుభవీగా కాలేకపోతున్నారు. బాప్ దాదాను సదా తోడుగా అనుభవం చేసుకుంటే ఆరోగ్యవంతంగా, ధనవంతంగా ఉండలేరా? బాప్ దాదాను అంటే నిరాకారి బాబాను, సాకార బాబాను ఇద్దరిని వెంట ఉంచుకోవటం ద్వారా ఆరోగ్యం, సంపద రెండు వచ్చేస్తాయి. అప్పుడు సంతోషంగా స్వతహాగా ఉండగలుగుతారు. కనుక సహజ పురుషార్థం ఏమిటి? నిరాకారుడైన బాబాను మరియు సాకారుడైన దాదాని ఇద్దరిని సదా వెంట ఉంచుకోవాలి. సదా వెంట ఉంచుకోవటం లేని కారణంగానే మీకు కష్టమనిపిస్తుంది. సదా బాబాని వెంట ఉంచుకోవటం కష్టమా? బాబాని తెలుసుకున్నారు, గ్రహించారు, అంగీకరించారు. అన్ని సంబంధాలు ఒకే బాబాతో పెట్టుకుంటున్నారు. ఇక రెండవవారు ఎవరు లేరు, మరి మీకు నడవటంలో కష్టం ఎందుకు? బాబా తోడుని ఎందుకు వదిలేస్తున్నారు? సీత తోడుని ఎందుకు వదిలేసింది? కారణం ఏమిటంటే - ఆజ్ఞ అనే రేఖను ఉల్లఘించింది. ఇది చంద్రవంశీయుల సీత పని, లక్ష్మి పని కాదు. లక్ష్మి అంటే సూర్యవంశానికి సంబంధించినది, కనుక మీరు మర్యాదా అనే రేఖ నుండి బుద్ధి ద్వారా కూడా బయటికి రాకూడదు. వస్తే చంద్రవంశీయులు అయిపోతారు. బుద్ధి రూపి పాదం మర్యాదా అనే రేఖ నుండి సంకల్పంలో, స్వప్నంలో కూడా బయటికి రాకూడదు. వచ్చింది అంటే స్వయాన్ని చంద్రవంశీ సీతగా భావించండి. సూర్యవంశీ లక్ష్మిగా కాదు. సూర్యవంశీయులు అంటే బలవంతులు. బలవంతులు ఎప్పుడు ఎవ్వరికి వశం కారు. కనుక సదా బాబాను తోడుగా ఉంచుకునేటందుకు బాబా మర్యాద అనే రేఖ లోపల ఉండండి. రేఖ బయటికి రాకండి, బయటికి వచ్చేస్తే ఫకీరుగా అయిపోతారు. ఇక అప్పుడు సహాయం కావాలి, ముక్తి కావాలి ఇలా అడుగుతూ ఉంటారు. మీరు ఫకీరుగా అయిన దానికి గుర్తు ఏమిటంటే ఆరోగ్యం, సంపద పోగొట్టుకుంటారు. అందువలనే ఫకీరుగా అయిపోతున్నారు. కనుక రేఖను దాటకండి, ఫకీరుగా అవ్వకండి. రేఖ లోపల ఉంటే మాయాజీత్ గా కాగలుగుతారు. రేఖను దాటారు అంటే మాయతో ఓడిపోతారు. అందువలన సదా ఆరోగ్యవంతంగా, ధనవంతంగా, సంతోషవంతంగా,పవిత్రంగా అవ్వండి. ఈ నాలుగు విషయాలలో ఈ రోజు నాకు ఏ విషయం లోపంగా ఉంది అని పరిశీలించుకోండి. ఆరోగ్యంగా ఉన్నానా? సంతోషంగా ఉన్నానా? ధనవంతంగా ఉన్నానా? పవిత్రంగా ఉన్నానా? లేకపోతే ఎందుకు లేను? ఆ రోగాన్ని తెలుసుకుని దానికి మందు వేసుకోండి. మీకు అన్ని రకాలైన మందులు బాబా ద్వారా లభించాయి కదా! అన్ని ప్రాప్తులు లభించాయి. అన్ని ప్రాప్తులు ఉన్నప్పటికి సమయానికి మీరు ఎందుకు ఉపయోగించుకోలకపోతున్నారు? సమయం అయిపోయిన తర్వాత ఎందుకు గుర్తు వస్తుంది? బలహీన సమయంలో మీకు ఆ మందులు ఉపయోగపడటం లేదు. సమయం అయిపోయిన తర్వాత చేస్తున్నారు. అప్పుడు సమయం కూడా గడిచిపోతుంది. కనుక సమయానికి అన్నీ స్మృతి రావాలి. దీని కొరకు మీ బుద్ధి విశాలంగా మరియు జ్ఞాన స్వరూపంగా ఉండాలి. అలా లేని కారణంగా సమయానికి మీకు స్మృతి రావటం లేదు. తర్వాత మరలా ఏదోక తోడుని కోరుకుంటున్నారు. ఆ తోడు వెంట లేని కారణంగా ఓడిపోతున్నారు. కనుక ఎప్పుడు స్వయాన్ని రోగిగా చేసుకోకండి, ఎక్కడైనా ఏ రకమైన రోగమైనా ప్రవేశించింది అంటే ఒక వ్యాధి అనేక వ్యాధులను తీసుకువస్తుంది. ఒక దానిని సమాప్తి చేస్తే ఇక అనేక రోగాలు రావు. ఆ ఒకటి ఏమిటో తెలుసుకుని దానిని సమాప్తి చేయండి. అలా ఒక వ్యాధి వచ్చినప్పుడు మీరు సోమరిగా ఉంటున్నారు. చిన్నదే కదా, ఒకటే కదా అనుకుంటున్నారు. కానీ వర్తమాన సమయ ప్రమాణంగా అలా తేలికగా వదిలేసిన వ్యాధి కూడా ఒకోసారి పెద్దదిగా అయిపోతుంది. అందువలన తేలికగా భావించి దానిని సమాప్తి చేయకుండా ఉండకండి. దానిని సమాప్తి చేసేయండి. అక్కడే సమాప్తి చేసేయండి. అప్పుడు ఆత్మ నిర్బలంగా అవ్వదు. ఆరోగ్యవంతంగా ఉంటుంది, సాకారంలో కూడా బ్రహ్మబాబా సదా వెంట ఉండే అనుభవం మీకు ఉండేది కదా! ఒంటరిగా ఉండటం ఇష్టమనిపించేది కాదు. ఇలా మీరు మీ సంస్కారాలతో వెంట ఉంటున్నారు కదా! అలాగే బాబాతో ఎందుకు వెంట ఉండటంలేదు? నివృతి మార్గం వారిగా ఎందుకు అయిపోతున్నారు? నివృతిమార్గం వారికి అన్ని ప్రాప్తులు ఉంటాయి. కానీ వెతుకుతూ భ్రమిస్తూ ఉంటారు. కనుక సదా బాబా వెంట ఉండండి, బాబా సంబంధంలో ఉండండి. పరివారం యొక్క పాలనలో ఉండండి. ఎవరైతే పాలనలో ఉంటారో వారు సదా నిశ్చింతగా, హర్షితంగా ఉంటారు. ఈ పాలన నుండి బయటికి ఎందుకు వచ్చేస్తున్నారు? నివృతి మార్గంలోకి వెళ్ళకండి. సదా బాబా తోడుని అనుభవం చేసుకోవటం ద్వారా స్వతహాగానే సర్వ ప్రాప్తులు లభిస్తాయి. స్వయం సన్యాసులుగా అయిపోతున్నారా? సన్యాసుల గురించి చప్తారు కదా! వీరు బికారీలు అని. ఈ అడుక్కునే వారికంటే మేము మంచివారము అని చెప్తారు కదా! మరి మీరు ఏ సమయంలో బాప్ దాదా మరియు పరివారం యొక్క తోడుని వదిలేస్తున్నారో ఆ సమయంలో ముళ్ళ అడవిలోకి వెళ్ళిపోయి సన్యాసులుగా అయిపోయినట్లు కదా! ఎలా అయితే ఆ సన్యాసులు అడవులలో తిరుగుతూ ఉంటారో, అలాగే మీరు బాప్ దాదా మరియు పరివారం యొక్క తోడుని వదిలేసి మాయా అడవులలో తిరుగుతూ అలజడి అయిపోతూ ఉన్నారు. ఏదోక తోడు లభించాలి అని మరలా వెతుకుతున్నారు. ఇలా నివృతి మార్గంలో ఉండేవారు ఒంటరిగా ఉన్న కారణంగా ఏ కర్మలో సఫలతను పొందలేరు. ఏ కర్మ చేస్తున్నా మీకు సఫలత లభిస్తుందా? ఎలా అయితే అడవులలో తిరిగే సన్యాసులకు ఏ కర్మ చేస్తున్నా సఫలత లభించదో అలాగే మీరు కూడా బాబా తోడుని వదిలేసి ఒంటరిగా నివృతి మార్గం వారిగా అయిపోతే మీకు కూడా ఏ కర్మలో సఫలత లభించదు. మరలా సఫలత ఎలా లభిస్తుంది అని అడుగుతున్నారు, ఒంటరిగా అయిపోతున్నారు, ఉదాసీనంగా అయిపోతున్నారు, మాయకి దాసీ అయిపోతున్నారు. అందువలనే మీకు సఫలత లభిచటం లేదు. కనుక ఒంటరిగా అవ్వకండి, ఉదాసీనంగా అవ్వకండి, మాయకు దాసీగా అవ్వకండి.