24.06.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఎవరెడి అయ్యి అంతిమ సేవ యొక్క ఆహ్వానం చేయండి.

స్వయాన్ని బాబా సమానంగా భావిస్తున్నారా? బాబా సమాన స్థితిని సమీపంగా అనుభవం చేసుకుంటున్నారా? సమానంగా అవ్వటంలో ఇప్పుడు ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉందా లేదా కొద్దిగా తేడా ఉందా? అందరి లక్ష్యమైతే బాబా సమానంగా అవ్వాలి అని మరియు బాబా లక్ష్యమైతే పిల్లలను తన కంటే ఉన్నతంగా చేయాలి అని. అయితే ప్రత్యక్షంలో ఏమి ఉంది? బాబా సమానంగా ఎదుర్కునే శక్తి మీలో రాలేదు. నెంబర్‌వారీ పురుషార్ధం అనుసారంగా మీ స్థితిలో తేడా ఉంది. కొంతమందికి కొంచెం తేడా ఉంది. కొంతమందికి కొంచెం తేడా ఉంది. అందరు ఒకే విధంగా లేరు. 50 శాతం తేడా ఉన్నా కూడా చాలా తేడా ఉన్నట్లే కదా! మరి దీనిని ఎంత సమయంలో తొలగించుకుంటారు? ఇప్పటి వరకు బాబా మరియు పిల్లలలో ఇంత తేడా ఎందుకు? స్వయాన్ని ఎవరెడిగా భావిస్తున్నారా? ఎవరెడి అంటే అర్థం ఏమిటి? ఎవరెడి ఆత్మ సదా సమయాన్ని ఆహ్వానం చేస్తుంది. మాయకు ప్రతిజ్ఞ చేస్తుంది మరియు అంతిమ సమయాన్ని ఆహ్వానం చేస్తుంది. ఎవరైతే ఎవరెడిగా ఉంటారో వారు ఆహ్వానం చేస్తూ స్వయం కూడా సదా తయారుగా ఉంటారు. అంతిమ సమయంలో పరిస్థితులను ఎదుర్కునేటందుకు ఇప్పుడు తయారుగా ఉన్నారా? ఒకవేళ సమయం వచ్చేస్తే 50 శాతం తయారైపోయారా? సమానత యొక్క ప్రాప్తి ఏమిటి? 50 శాతమే తయారైతే ప్రాప్తి కూడా శాతమే వస్తుంది. ఎవరెడి అంటే సదా అంతిమ సమయంలో స్వయం సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి. సంపన్నంగా కావాలి కదా! సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు అని మహిమ ఉంది. కనుక ఎవరెడి అంటే సంపన్నస్థితిని సంపాదించుకోవాలి. ఇలా ప్రత్యక్షంలో మీ స్థితి ఎలా తయారవుతుంది? కేవలం ఒక అడుగు వేయటానికి ఆలస్యం ఉండాలి అంతే. ఒక అడుగు వేయటంలో ఎంత సమయం పడుతుంది? మీరు తయారవ్వటానికి అంత తేడా ఉండాలి. దీనిని ఒకటి, రెండు శాతం అంటారు. ఇలా ఒకటి, రెండు శాతం ఎక్కడ, 50 శాతం తేడా ఎక్కడ! ఇలా ఎవరెడిగా, సర్వగుణ సంపన్నంగా, బాబా సమానంగా అయ్యేటందుకు బాప్ దాదా ద్వారా ముఖ్యంగా మూడు వస్తువులు ప్రతి ఒక్కరికి లభించాయి. ఆ మూడు ప్రాప్తులు మీ దగ్గర ఉంటే బాబా సమానంగా అవ్వటంలో ఏ ఆలశ్యాం అవ్వదు. ఆ మూడు వస్తువులు ఏమిటి? శ్రీమతం, సమర్పణ మరియు సేవ అని పిల్లలు చెప్పారు. ఇవి నడుస్తున్నాయి, మీరు చేసే విషయాలు మీరు చెప్పారు. కానీ బాబా మీకు ఇచ్చిన వస్తువులు ఏమిటి? సేవ కూడా చేస్తున్నారు మరియు బాబాకి సమర్పణ కూడా అయ్యారు. కానీ దేని ఆధారంగా? జన్మ కూడా తీసుకున్నారు కానీ ఎవరు ఇచ్చారు? వారసత్వంలో కూడా ముఖ్యంగా బాబా మనకు ఏమి ఇస్తున్నారు? ప్రతి ఒక్కరు చెప్పారు. భలే రహస్యమైతే వస్తుంది కానీ స్పష్టం చేయటానికి రకరకాల రూపాలతో మీరు చెప్పారు. మొదట బాబా మీకు ఒకటి - లైట్ అంటే ప్రకాశం, రెండు - మైట్ అంటే శక్తి, మూడు - డివైన్ ఇన్ సైట్ అంటే దివ్యనేత్రం. ఈ మూడు బాబా మీకు ఇస్తున్నారు. ఈ మూడు విషయాలు మీ దగ్గర లేకపోతే తీవ్రపురుషార్ధిగా అయ్యి బాబా సమానంగా కాలేరు. ఆత్మలు ఇప్పుడు పూర్తిగా అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. కనుక వారికి మొదట కావల్సింది లైట్ అంటే ప్రకాశం, ఈ లైట్ తో పాటు వారికి వెనువెంట మైట్ అంటే శక్తి ఇవ్వకపోతే ఈ ప్రకాశం యొక్క లాభాన్ని వారు పొందలేరు. కనుక లైట్, మైట్మ రియు డివైన్ ఇన్ సైట్ ఈ మూడింటి ద్వారా వర్తమానం, భూతకాలం మరియు భవిష్యత్తు ఈ మూడు కాలాల గురించి, మూడు జీవితాల గురించి తెలుసుకోగలుగుతారు. ఈ మూడు విషయాలు మీకు ప్రాప్తిస్తున్నాయి. అప్పుడే మీరు వారసత్వాన్ని పొందగలుగుతున్నారు. మొదట లైట్, రెండు మైట్, మూడు డివైన్ ఇన్ సైట్ వీటి ద్వారానే మీ బర్త్ రైట్ అంటే మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందగలుగుతారు మరియు వీటి ద్వారా రైట్ అంటే సత్యం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతారు. రైట్ అనే మాటకు రెండు అర్ధాలు ఉన్నాయి. ఒకటి - బర్త్ రైట్ అంటే జన్మసిద్ధ అధికారం రెండు - జన్మసిద్ధ అధికారం అంటే వారసత్వం. రెండవది - రైట్ అంటే సత్యం ఏమిటి, అసత్యమేమిటి వీటి గ్రహింపు మీకు దొరికింది. అందువలనే బాబాని సత్యం అని అంటారు. సత్యం అంటే రైట్. ఈ సత్యాన్ని కూడా మీరు ఎప్పుడు గ్రహించగలుగుతారు? మూడు విషయాలు మీకు ప్రాప్తించినప్పుడు గ్రహించగలుగుతారు. ఒకవేళ ఒక విషయం తక్కువగా ఉన్నా కూడా అసత్యం నుండి సత్యంలోకి రాలేరు. వెలుగు ఉన్నప్పుడే మార్గాన్ని దాటగలుగుతారు. చీకటిలో మార్గాన్ని దాటలేరు కదా! మీ పురుషార్ధం యొక్క వేగాన్ని ఎలా తీవ్రం చేసుకోగలుగుతారు? పాత ప్రపంచంలో కూడా ఏదైనా మార్గాన్ని మూసేసినప్పుడు వేగం బలహీనం అయిపోతుంది కదా! ప్రపంచంలో వేగంగా వెళ్ళకుండా ఉండేటందుకు, ప్రమాదాలు జరగకుండా ఉండేటందుకు మార్గాన్ని బంద్ చేస్తున్నారు కదా! స్పీడ్ గా వెళ్ళకండి అని బోర్డ్ పెడతారు కదా! ప్రమాదాలు జరగకుండా ఉండేటందుకు బోర్డ్ పెడతారు. వాటన్నింటికి ఆధారం - లైట్. అలాగే ఇక్కడ కూడా పురుషార్ధంలో ముందుకి వెళ్ళేటందుకు కూడా ఆధారం - లైట్. పూర్తిగా లైట్ లేకపోతే పురుషార్థంలో వేగంగా వెళ్ళలేరు, బలహీనమైపోతారు. ఈ లైట్ తో పాటు వెనువెంట మైట్ అంటే శక్తి ఇది కూడా ఉండాలి. లైట్ ఆధారంగా నడువగలరు. కానీ శక్తి లేకపోతే ఏవైనా విఘ్నాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోలేరు. అందువలన వేగం ఆగిపోతుంది. అప్పుడు పురుషార్థంలో ముందుకి వెళ్ళడానికి బదులు ఆగిపోతారు. మాటి మాటికి ఆగిపోతున్న కారణంగా కూడా తీవ్రపురుషార్ధిగా కాలేరు. ఇలా ఒకటి-లైట్, రెండు-మైట్, మూడు- డివైన్ ఇన్ సైట్ అంటే దివ్యనేత్రం. మాయ నడుస్తూ, నడుస్తూ మీ దివ్యనేత్రాన్ని కూడా బంద్ చేసేస్తుంది. ఎలా అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ వారు ఎవరినైనా పట్టుకునేటందుకు లేదా ఏదైనా అలజడిని బంద్ చేసేటందుకు గ్యాస్ ని వదిలేస్తున్నారు. అది కళ్ళల్లోకి వెళ్ళిపోతుంది. కళ్ళ నుండి నీరు వచ్చేస్తున్న కారణంగా ఏదీ కూడా చూడలేకపోతున్నారు! ఏది చేయాలనుకుంటున్నారో అది చేయలేకపోతున్నారు. అలాగే మీకు కూడా బాబా ద్వారా దివ్యనేత్రం లభించింది. ఈ దివ్యనేత్రంలో మాయ యొక్క గ్యాస్ లేదా దుమ్ముపడినప్పుడు మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అది చూడలేకపోతున్నారు. కనుక ఈ మూడు విషయాలు చాలా అవసరం. ఈ మూడు మంచిగా, యదార్ధరీతిలో ఉంటే, ఈ మూడింటిని ధారణ చేస్తే దాని ఆధారంగా నడుచుకున్నప్పుడు ఎప్పుడు అసత్య కర్మ చేయరు. సదా సత్యం వైపే వెళ్తారు. అసలు మీకు అసత్యమే జరుగదు. ఎందుకంటే మీరు దివ్యనేత్రం ద్వారా సత్యం ఏమిటి, అసత్యమేమిటి అనేది తెలుసుకోగలుగుతున్నారు. ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడిక అసత్యం వైపు వెళ్ళరు. కానీ ఒకొక్కసారి మాయ యొక్క దుమ్ము పడుతున్న కారణంగా సత్యాన్ని, అసత్యాన్ని పరిశీలించలేకపోతున్నారు. అందువలన సత్యాన్ని వదిలేసి అసత్యం వైపు వెళ్ళిపోతున్నారు. ఏదైనా అసత్య కర్మ జరుగుతున్నప్పుడు సంకల్పం వస్తుంది. కానీ గ్రహించలేకపోతున్నారు. అంటే ఈ మూడు విషయాలలో ఏదోక విషయంలో మీకు లోపంగా ఉంది. అందువలనే నిర్ణయించలేకపోతున్నారు. ఎప్పటి వరకు సత్యం ఏమిటో, అసత్యమేమిటో తెలుకోరో అంతవరకు వారసత్వాన్ని పొందలేరు. సత్యకర్మ ద్వారానే సంపూర్ణ వారసత్వం లభిస్తుంది. ఒకవేళ సత్యకర్మ మీరు చేయటం లేదు, అప్పుడప్పుడు సత్యకర్మ, అప్పుడప్పుడు అసత్యకర్మ చేస్తున్నారు అంటే అప్పుడు మీకు సంపూర్ణ వారసత్వం కూడా లభించదు. ఎంతగా సత్య సంకల్పం, సత్య కర్మ చేయటంలో లోపం ఉంటుందో అంతగా వారసత్వం తీసుకోవటంలో కూడా లోపం వస్తుంది. కనుక ఈ మూడు ప్రాప్తులను సదా స్థిరంగా ఉంచుకోవాలి. దీని కొరకు ముఖ్యంగా ఏ విషయంపై ధ్యాస ఉండాలి? రివైజ్ కోర్స్ లో కూడా బాబా ఈ విషయం గురించి సహజయుక్తి రివైజ్ చేస్తూ వచ్చారు. రివైజ్ కోర్స్ ధ్యాసతో వింటున్నారు కదా! చదువుకుంటున్నారు కదా, లేదా అన్నీ తెలిసిపోయాయి అనుకుంటున్నారా? అన్నీ తెలిసిపోయాయి అనుకుని రివైజ్ కోర్స్ ని ప్రక్కన పెట్టేస్తున్నారా? ఈరోజు బాబా పరీక్ష తీసుకుంటున్నారు. ఒక్క రోజు కూడా రివైజ్ కోర్స్ యొక్క మురళి మిస్ అవ్వనివారు ఎవరైనా ఉన్నారా? ధారణ చేయటంలో ధ్యాస పెట్టుకున్నవారు చేతులు ఎత్తండి! రావటం, వెళ్ళటంలో మురళి మిస్ చేస్తున్నారా? లేదా చదువుకుంటున్నారా? మిస్ అయిపోతున్నారా? లేదా జ్ఞానమంతా తెలిసిపోయింది అనుకుంటున్నారా? భలే మీరు తెలుసుకున్నారు కానీ ఇప్పుడింకా తెలుసుకోవసినవి ఉండిపోయాయి. మంచిగా రివైజ్ కోర్స్ రివైజ్ చేసుకుంటే స్వయం కూడా అనుభవం చేసుకోగలుగుతారు. రివైజ్ కోర్స్ చేస్తున్నప్పుడు ఈ మురళీలు పాతగా అనిపిస్తున్నాయా? కొతగా అనిపిస్తున్నాయా? క్రొత్తవారికి క్రొత్త విషయాలుగా అనిపిస్తాయి. కానీ పాతవారికి రివైజ్ కోర్స్ ద్వారా ఏమి అనుభవం అవుతుంది? క్రొత్తగా అనిపిస్తున్నాయా? రివైజ్ కోర్స్ అనేది డ్రామానుసారం ఎందుకు జరుగుతుంది? ఇది కూడా డ్రామాలో నిర్ణయంచబడిన పాత్ర. రివైజ్ ఎందుకు చేస్తారు?ధ్యాస తక్కువ అయిపోయినప్పుడు, స్మృతి తక్కువ అయిపోయినప్పుడు మాటి మాటికి రివైజ్ చేయిస్తారు. ఇక్కడ కూడా రివైజ్ కోర్స్ నడుస్తుంది. మీరు ఇంకా ప్రత్యక్షంలోకి రాలేదు. ఎంత విన్నారో ఎంత ఇతరులకు వినిపిస్తున్నారో అంత ప్రత్యక్ష శక్తి మీలో నింపుకోలేదు. అందువలన బాబా శక్తిశాలిగా తయారు చేసేటందుకు ఈ కోర్స్ చెప్తున్నారు. పాతవారిని శక్తిశాలిగా చేసేటందుకు, క్రొత్తవారిని శక్తిశాలిగా తయారు చేయటంతో పాటు తమ పూర్తి హక్కు తీసుకునేటందుకు ఈ రివైజ్ కోర్స్ బాబా నడిపిస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ లోపాన్ని నింపుకునేటందుకు ధ్యాస పెట్టుకుని మాటి మాటికి రివైజ్ చేసుకుంటూ ఉండండి. రివైజ్ కోర్స్ ద్వారా ఏవైతే స్వభావ, సంస్కారాలను పరివర్తన చేసుకోవాలనుకుంటున్నారో అవి పరివర్తన అవ్వాలి. ఇది మద్యలో పరీక్ష వచ్చింది. మొదటి విషయం అడుగుతున్నారు. రివైజ్ కోర్స్ లో కూడా చాలా రివైజ్ జరుగుతుంది. ఇది అమృతవేళ పరస్పరం ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. అమృతవేళకు గొప్పతనం ఇవ్వాలి. అమృతవేళ అని పేరు ఎలా అయితే ఉందో ఆ వేళకు వరదానం కూడా లభిస్తుంది. అందుకే శ్రేష్టకర్మ చేసేటప్పుడు ఈ రోజు వరకు కూడా వేళను చూస్తారు. మంచి సమయమా, కాదా అని చూస్తారు కదా! అలాగే ఇక్కడ కూడా పురుషార్ధం కొరకు, సహజ ప్రాప్తి కొరకు అన్నింటికంటే మంచి వేళ ఏమిటి? అమృతవేళ, అమృతవేళ సమయంలో ఆత్మను అమృతంతో నింపుకోవాలి. అప్పుడు మొత్తం రోజంతటి కర్మ కూడా అలాగే ఉంటుంది. ఎలా అయితే అమృతవేళ అంటే వేళ శ్రేష్టమైనదో, అమృతం శ్రేష్టమైనదో అలాగే మీ సంకల్పం, కర్మ మొత్తం రోజంతా శ్రేష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ శ్రేష్టవేళను సాధారణ రీతిలో పోగొట్టుకుంటే మొత్తం రోజంతటి సంకల్పం, కర్మ కూడా సాధారణంగానే వెళ్ళిపోతుంది. కనుక అమృతవేళ అంటే మొత్తం రోజంతటికి పునాది వేళ అని భావించండి. ఒకవేళ మీరు వేసుకునే పునాది బలహీనంగా, సాధారణంగా వేసుకుంటే పైన తయారయ్యే బిల్డింగ్ కూడా అలాగే ఉంటుంది. దాని కారణంగా పునాది వైపు చాలా ధ్యాస పెడతారు.మొత్తం రోజంతటికి పునాది సమయం - అమృతవేళ, ఆ వేళ యొక్క మహత్వాన్ని తెలుసుకుని నడిస్తే కర్మ కూడా మహత్వంగా తయారవుతుంది. అమృతవేళను బ్రహ్మముహుర్తమని ఎందుకు అంటారు? బ్రహ్మముహుర్తమా లేదా బ్రహ్మా ముహుర్తమా? బ్రహ్మముహుర్తం కూడా రైట్. ఎందుకంటే బ్రహ్మ సమానంగా అమృతవేళ క్రొత్తరోజు ప్రారంభిస్తున్నారు. స్థాపనాకార్యం జరుగుతుంది. ఇది కూడా రైట్ కానీ బ్రహ్మముహుర్తం అంటే అర్ధం ఏమిటి? ఆ సమయంలో ఆత్మ సహజంగా బ్రహ్మలోక నివాసిగా అయ్యే అనుభవం చేసుకుంటుంది. అటువంటి వాతావరణం ఉంటుంది. ఇక మిగతా సమయాలలో పురుషార్ధం చేసి ధ్వనికి అతీతంగా, వాయుమండలానికి అతీతంగా స్వయం శ్రమ చేసి అతీతంగా అవుతారు. కానీ అమృతవేళ ఈ శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. ఎలా అయితే బ్రహ్మ ఇల్లు శాంతిధామమో అలాగే అమృతవేళ కూడా స్వతహాగానే శాంతి యొక్క వాతావరణం ఉంటుంది. శాంతిగా ఉన్నకారణంగా శాంత స్వరూప స్థితి, శాంతిధామ నివాసిగా అయ్యే స్థితి స్వతహాగా ధారణ చేయగలుగుతారు. బాబా నుండి ఏదైతే శ్రీమతం లభించిందో దానిని అమృతవేళ స్మృతిలోకి తీసుకువస్తే ఆ సమయంలో బ్రహ్మముహుర్త సమయంలో అమృతవేళలో స్మృతి కూడా సహజంగా ఉంటుంది. చదువుకునేవారు కూడా ఆ చదువు బాగా జ్ఞాపకం ఉండడానికి ఈ సమయంలోనే లేచి చదువుకుంటారు. ఎందుకంటే అమృతవేళ చదువుకున్నది సహజంగా జ్ఞాపకం ఉంటుంది. అలాగే మీ స్మృతిని కూడా సమర్థవంతంగా తయారు చేసుకోవాలి. స్వతహా స్మృతి స్వరూపంగా తయారు చేసుకోవాలి. అమృతవేళ సహాయంతో శ్రీమతం యొక్క పాలన ద్వారా సహజంగా సమర్థవంతులుగా కావాలి. మరి ఇలా సమయానికి విలువ ఇస్తున్నారా లేదా అప్పుడప్పుడు ఇవ్వటం అప్పుడప్పుడు ఇవ్వకపోవటం ఇలా ఉంటున్నారా? ఈ విలువ తెలుసుకోవటం లేని కారణంగా అప్పుడప్పుడు పైకి, క్రిందికి అవుతున్నారు. ఏమౌతుంది? చాలా సహజమైన యక్తి చెప్తున్నారు ఈ యుక్తికి విలువ ఇవ్వాలి. ఎలా అయితే శ్రీమతానుసారం సమయం యొక్క గ్రహింపు చెప్తున్నారు. ఆ సమయంలో ఆవిధంగా కర్తవ్యము చేసినటైయితే చాల సహజంగా సర్వప్రాప్తులు పొందుతారు. శ్రమ నుండి విడిపించబడతారు. కనుక శ్రమ నుండి విడిపించుకునేటందుకు బాబా ఏదైతే సాధనం చెప్పారో ఆ సాధనాన్ని సొంతం చేసుకోండి.

ఇలా సదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అయ్యి నడిచేవారికి సర్వాత్మలకు దివ్యనేత్రాన్నిఇచ్చే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.