స్వచ్చత మరియు ఆత్మిక బలం కలిగిన ఆత్మయే
ఆకర్షణామూర్తి.
స్వయాన్ని ఈ డ్రామాలో హీరో పాత్రధారిగా మరియు ముఖ్య
పాత్రధారిగా భావిస్తున్నారా? ముఖ్య పాత్రధారుల పైనే అందరి ధ్యాస ఉంటుంది కనుక
ప్రతి సెకను స్వయాన్ని ముఖ్య పాత్రధారిగా భావించి పాత్ర అభినయిస్తున్నారా?
ఎవరైతే ప్రసిద్ధమైన పాత్రధారులు ఉంటారో వారిలో ముఖ్యంగా మూడు విషయాలు ఉంటాయి.
అవి ఏమిటి? వారు 1.ఏక్టివ్ గా అంటే చురుకుగా ఉంటారు 2. ఏక్యురేట్ అంటే ఖచ్చితంగా
ఉంటారు.3. ఎట్రాక్టివ్ అంటే ఆకర్షణామూర్తిగా ఉంటారు. ఈ మూడు విషయాలు
ప్రసిద్ధమైన పాత్రధారులలో తప్పకుండా ఉంటాయి. ఇలా స్వయాన్ని ప్రసిద్ధమైన మరియు
ముఖ్య పాత్రధారిగా భావిస్తున్నారా? ఏ విషయంలో ఆకర్షితం చేస్తారు? ప్రతి కర్మలో,
ప్రతి నడవడికలో ఆత్మీయత యొక్క ఆకర్షణ ఉండాలి. ఎలా అయితే ఎవరైనా శారీరకంగా అందంగా
ఉంటే వారు కూడా తమ వైపు ఆకర్షితం చేసుకుంటారు కదా! అలాగే ఎవరి ఆత్మ అయితే
స్వచ్ఛంగా ఉంటుందో, ఆత్మిక బలం కలిగి ఉంటారో వారు కూడా తమ వైపు ఆకర్షితం
చేసుకుంటారు. ఎలా అయితే ఆత్మ జ్ఞానీ మహాత్మలు కూడా ద్వాపరముగం యొక్క ఆదిలో సత్వ
ప్రధాన స్థితిలో ఉన్నప్పుడు వారిలో కూడా అత్మిక ఆకర్షణ ఉండేది కదా! వారు తమ వైపు
ఆకర్షితం చేసుకుని ఇతరులకు కూడా ఈ ప్రపంచం నుండి అల్పకాలికంగా వైరాగ్యం
ఇప్పిస్తారు కదా! వ్యతిరేక జ్ఞానం ఉన్న వారిలోనే ఇంత ఆకర్షణ ఉన్నప్పుడు ఎవరైతే
యదార్థ మరియు శ్రేష్ఠ జ్ఞానస్వరూపులు ఉంటారో వారిలో కూడా ఆత్మిక ఆకర్షణ ఉంటుంది.
శారీరక అందం సమీపంగా లేదా ఎదురుగా రావటం ద్వారా ఆకర్షితం చేస్తుంది కానీ అత్మిక
ఆకర్షణ దూరంగా ఉన్నప్పటికీ ఏ ఆత్మనైనా తన వైపు ఆకర్షించుకుంటుంది. ఇంత ఆకర్షణ
అంటే ఆత్మీయత స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? అలాగే మరలా ఖచ్చితంగా కూడా ఉండాలి.
దేనిలో ఖచ్చితంగా ఉండాలి?మనస్సు అంటే సంకల్పం కొరకు కూడా శ్రీమతం లభించింది,
వాణీ కొరకు కూడా ఏదైతే శ్రీమతం లభించిందో మరియు కర్మణా కొరకు ఏదైతే శ్రీమతం
లభించిందో ఆ అన్ని విషయాలలో ఖచ్చితంగా ఉండాలి. మనస్సులో ఖచ్చితం పోకూడదు. ఏవైతే
నియమాలు ఉన్నాయో, మర్యాదలు లోఉన్నాయో,సలహాలు ఉన్నాయో వాటన్నింటిలో ఖచ్చితంగా
మరియు చురుకుగా ఉండాలి.ఎవరైతే చురుకుగా ఉంటారో వారు ఏ సమయంలో, ఎలా కావాలంటే అలా
స్వయాన్ని ఎలా తయారుచేసుకోవాలంటే అలా తయారుచేసుకుంటారు, ఎలా నడిపించుకోవాలంటే
అలా నడిపించుకుంటారు మరియు అలాంటి రూపం ధారణ చేస్తారు కనుక ముఖ్య పాత్రధారులు
ఎవరైతే ఉన్నారో వారిలో ఈ మూడు విషయాలు నిండి ఉంటాయి. వీటిలో ఏ విశేషత ఏ.శాతంలో
తక్కువగా ఉంది? అనేది చూసుకోవాలి. ఆత్మీయత ఉంది, ఆకర్షించుకుంటున్నారు కానీ ఎంత
శాతం ఉండాలో అంత ఉందా? ఒకవేళ శాతంలో లోపం ఉంటే వారిని సంపూర్ణం అని అనరు కదా!
పాస్ అయితే అయిపోయారు కానీ మార్కులు ఆధారంగా నెంబర్ ఉంటుంది కదా! మూడవ డివిజన్
వారిని కూడా పాస్ అనే అంటారు కానీ ఎక్కడ మూడవ డివిజన్ వారు, ఎక్కడ మొదటి డివిజన్
వారు తేడా ఉంది కదా! కనుక ఇప్పుడు శాతాన్ని పరిశీలన చేసుకోవాలి.స్టేజ్ అనేది
ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. ఎందుకంటే ప్రత్యక్ష పాత్రలో వేదిక పైనే ఉంటారు
కదా! ఇప్పుడు కేవలం శాతం ఆధారంగా నెంబర్ లభిస్తుంది. ఈ రోజు చాలా పెద్ద సంఘటన
అయ్యింది. ఎలా అయితే బాబాకి సమాన పిల్లలు ప్రియంగా అనిపిస్తారో అలాగే మీరు కూడా
పరస్పరం ఒకే సమాన స్థితిలో కలుసుకుంటే ఈ సితారల మేళా కూడా మంచిగా అనిపిస్తుంది
కదా! సంగమయుగ మేళా అయితే ఉంది కానీ ఆ మేళాలో కూడా ఇది మేళా.మేళాలో కూడా
విశేషమైన మేళా ఎక్కువగా ఇష్టమనిపిస్తుంది.పెద్ద పెద్ద మేళాలలో కూడా ఒక విశేష
స్థానం తయారుచేస్తారు. అక్కడ అందరి కలయిక జరుగుతుంది. సంగమయుగం బేహద్ మేళాయే
కానీ దానిలో కూడా ఈ స్థూల విశేష స్థానంలో సమాన ఆత్మలు పరస్పరం కలుసుకుంటారు.
ప్రతి ఒక్కరికి తమ సమానంగా మరియు పమీపంగా ఉండే ఆత్మలతో కలుసుకోవటం మంచిగా
అనిపిస్తుంది. విశేషాత్మలతో మేళా తయారుచేసేటందుకు స్వయాన్నికూడా విశేషంగా
చేసుకోవాలి. కొందరు విశేషంగా, కొందరు సాధారణంగా ఉంటే దానిని మేళా అని అనరు. బాబా
సమానంగా దివ్య ధారణల విశేషతను ధారణ చేయాలి. బాబా ద్వారా ఏదైతే పాలన తీసుకున్నారో
దానికి ఋజువు చూపించాలి. బాబా పాలన ఎందుకు చేసారు? విశేషతలు నింపేటందుకు.
లక్ష్యం ఉంది కానీ లక్షణాలు లేకపోతే వారిని ఏమంటారు? అతి తెలివైనవారు అంటారు.
ఒకరు - తెలివైనవారు, రెండు - బేహద్ తెలివైనవారు. బేహద్దులో ఏ హద్దు ఉండదు.
మంచిది.