నష్టోమోహ అయ్యేటందుకు రకరకాలైన యుక్తులు.
స్వయాన్ని ప్రతి ఒక్కరు స్మృతి స్వరూపంగా
భావిస్తున్నారా? స్మృతి స్వరూపంగా అవ్వటం ద్వారా స్థితి ఎలా తయారవుతుంది మరియు
ఎప్పుడు తయారవుతుంది? స్మృతి స్వరూపంగా అయినప్పుడు నష్టోమోహగా అయిపోతారు. ఇలా
నష్టోమోహ స్మృతి స్వరూపంగా అయ్యారా? ఇప్పుడు విస్మృతి స్వరూపంగా ఉన్నారా? స్మృతి
స్వరూపం నుండి విస్మృతి స్వరూపంలోకి ఎందుకు వచ్చేస్తున్నారు? అంటే తప్పకుండా
ఏదోక మోహం, తగుల్పాటు ఇప్పటి వరకు ఉండిపోయినట్లే. బాబాతో చేసిన మొట్టమొదటి
ప్రతిజ్ఞ ఏమిటి? అన్ని సాంగత్యాలు వదిలి ఒకే బాబా యొక్క సాంగత్యాన్ని జోడిస్తాము
అని, ఈ ప్రతిజ్ఞను పక్కాగా నిలుపుకోవటం రావటంలేదా? మొదటి ప్రతిజ్ఞయే
నిలుపుకోకపోతే మొదటి నెంబర్ రాజ్యంలో రాజ్యాధికారిగా లేదా రాజ్య సంబంధంలోకి ఎలా
వస్తారు? రెండవ నెంబర్ రాజ్యంలోకి వస్తారా? ఎవరైతే మొదటి ప్రతిజ్ఞ నష్టోమోహ
అయ్యేటువంటి స్థితిని నిలుపుకుంటారో వారే సత్యయుగంలో మొదటి జన్మ యొక్క
రాజ్యంలోకి వస్తారు. మొదటి ప్రతిజ్ఞ అనండి లేదా మొదటి పాఠం అనండి లేదా జ్ఞానం
యొక్క మొదటి విషయం అనండి లేదా అలౌకిక జన్మ యొక్క మొదటి శ్రేష్ట సంకల్పం అనండి
దీనిని నిలుపుకోవటం మీకు కష్టమనిపిస్తుందా? మీ స్వరూపంలో స్థితులవ్వటం, మీ
స్థితిలో స్థితులవ్వటం ఇది మీకు కష్టమనిపిస్తుందా? మీ స్వరూపం ఏమిటి? మీ స్థితి
ఏమిటి? అని మీకు సహజంగానే స్మృతి వచ్చింది కదా! మరి స్మృతి స్వరూపంగా ఉంటున్నారా?
ఈ అలౌకిక జన్మ యొక్క స్వరూపం యొక్క స్మృతిని కష్టంగా ఎందుకు అనుభవం
చేసుకుంటున్నారు? సాధారణ మానవులకు చెప్తారు కదా! మానవాత్మ యొక్క విశేషత ఏమిటంటే
మానవులు ఏది కావాలంటే అది చేయగలరని, పశువులు చేయలేవు. మరి సాధారణ మానవులు ఏది
కావాలంటే అది చేసి చూపించగలుగుతున్నప్పుడు మీరు శ్రేష్టమానవులు, శక్తి స్వరూప
ఆత్మలు, జ్ఞానస్వరూప ఆత్మలు, బాబా యొక్క సమీప సంపర్కంలోకి వచ్చే ఆత్మలు, బాబా
యొక్క డైరెక్ట్ పాలన తీసుకునే ఆత్మలు, పూజ్యనీయ ఆత్మలు, బాబా కంటే శ్రేష్ట
పదవిని పొందే ఆత్మలు మరి మీరు ఏది కావాలంటే అది చేయలేరా? అప్పుడిక సాధారణ
ఆత్మలలో, శ్రేష్టాత్మలలో తేడా ఎమి ఉంటుంది? సాధారణ ఆత్మలు ఎప్పుడు కావాలంటే,
అప్పుడు ఎలా కావాలంటే అలా చేయగలుగుతున్నారు, మరి మీరు ఆ విశేషతను ప్రత్యక్షంలోకి
తీసుకురాలేరా? మీరు కూడా ఇప్పటి వరకు అనుకోవటం లేదు, కాని అయిపోతుంది, ఏది
చేయాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాము అని అంటున్నారంటే ఇవి మాస్టర్
సర్వశక్తివాన్ శ్రేష్టాత్మల మాటలు కావు, సాధారణ ఆత్మల మాటలు. మరి స్వయాన్ని
సాధారణ ఆత్మలు అనుకుంటున్నారా? మీ అలౌకిక జన్మను, అలౌకిక కర్మను మర్చిపోతున్నారా?
ఏ వ్యక్తి లేదా వస్తువుతో లేదా ఏదైనా వ్యక్త భావంతో తగులుపాటు మీకు ఎందుకు
ఉంటుంది? వస్తువుని చూస్తున్నా ఆ వస్తువు యొక్క తేడాలో అలౌకిక జన్మ యొక్క
ప్రాప్తిని ఎదురుగా పట్టుకోండి. ఆ వస్తువులకు ఈ అలౌకిక జన్మలో లభించే
ప్రాప్తులకు రాత్రికి, పగలుకి ఉన్నంత తేడా అనుభవం అవుతుంది.
ఇది అనుభవం అవుతుందా? ఆ వ్యక్తభావాల నుండి లభించే దు:ఖం, అశాంతి ఇప్పటి వరకు
మీకు పూర్తిగా అనుభవం కాలేదా? ఏ వ్యక్తిని చూస్తున్నా ఆ వ్యక్తుల ద్వారా పాత
ప్రపంచం యొక్క సంబంధాలు మరియు ఈ అలౌకిక జన్మ యొక్క సంబంధాలు రెండింటి తేడాను
గుర్తు పెట్టుకోండి. ఈ అలౌకిక జన్మలో ఆ సంబంధాలను సమాప్తి చేసుకోలేరా? ఎప్పుడైతే
క్రొత్త జన్మ తీసుకుంటారో అప్పుడు పాత జన్మ వ్యక్తులతో పాత సంబంధాలు సమాప్తి
అయిపోతాయి కదా? మరి క్రొత్త జన్మలో పాత సంబంధాల తగుల్పాటు ఎలా వస్తుంది?
వ్యక్తులతో కూడా తగుల్పాటు ఎలా పెట్టుకుంటున్నారు? మీ జన్మయే మారిపోయింది. మరి
జన్మతో పాటు సంబంధం, కర్మ మారలేదా? మారలేదంటే మీరు ఇప్పటి వరకు అలౌకిక జన్మ
తీసుకోలేనట్లే. సాధారణంగా కూడా ఎక్కడ జన్మ ఉంటుందో, దానిని అనుసరించే కర్మ
ఉంటుంది. అక్కడి సంబంధ, సంపర్కాలే ఉంటాయి. ఇక్కడ మీది అలౌకిక జన్మ, మరి లౌకికంతో
ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నారు? లౌకిక కర్మ ఎందుకు చేస్తున్నారు? జన్మ
మారినప్పుడు కర్మ, సంబంధం కూడా మారిపోవాలి కదా! ఇది పరంపరగా వస్తున్న విధానం.
దీనిని ప్రత్యక్షంలోకి తీసుకురావటం కష్టమా? నష్టోమోహగా అవ్వటం సహజమా లేదా కష్టమా?
ఎందుకు కష్టమనిపిస్తుంది? ఎందుకంటే ఈ సమయంలో మోహం ఉత్పన్నం అవుతుంది. ఆ సమయంలో
మీ ముఖం చూసుకోండి. మీకు దర్పణం లభించింది కదా! ఆ దర్పణం మీ వెంట ఉండటం లేదా?
అద్దంలో మీ ముఖం చూసుకుంటే మోహం సమాప్తి అయిపోతుంది. ఈ ముఖం చూసుకునే అభ్యాసం
ఉన్నట్లయితే మీలో ఉన్న లోపం మీకు కనిపించి స్వతహాగా మోహం తొలగిపోతుంది. ముఖం
చూసుకునే అభ్యాసం ఉన్నవారు మాటిమాటికి అనుకోనప్పటికి అద్దం వైపుకే వెళ్ళిపోతారు.
కొంతమందికి మాటిమాటికి ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది. కనుక వారికి ఒక సమయం,
ప్రోగ్రామ్ అవసరం లేదు. స్వతహాగానే అద్దం వైపుకి వెళ్ళిపోతారు. ఎందుకంటే అది
అలవాటు. అలాగే ఇక్కడ కూడా బాబా మీకు జ్ఞానమనే దర్పణం ఇచ్చారు. మీ స్వమాన రూపి
దర్పణంలో మీ ముఖాన్ని మాటిమాటికి చూసుకుంటూ ఉండండి. అప్పుడు ఈ దేహాభిమానం కూడా
స్వమానంలోకి మారిపోతుంది. స్థూల శరీర వస్త్రంలో కూడా ఏదైనా మార్పు
కనిపించినప్పుడు అద్దంలో చూసుకోగానే వెంటనే అది ఏమిటో తెలిసిపోతుంది కదా! అలాగే
ఇది కూడా అలౌకిక జ్ఞాన దర్పణం. దీనిలో మీ వాస్తవిక స్వరూపాన్ని చూసుకున్నట్లయితే,
దేహాభిమానంలోకి రావటం ద్వారా ఈ వ్యర్ధ సంకల్పాల స్వరూపం, వ్యర్ధ మాటల స్వరూపం
వ్యర్ధ కర్మ, సంబంధాల స్వరూపం ఇవన్నీ వ్యర్ధం నుండి సమర్ధం లోకి మారిపోతాయి.
అప్పుడు మోహం ఉంటుందా? ఇలా ఎప్పుడైతే నష్టోమోహగా అయిపోతారో, నష్టోమోహతో పాటు సదా
స్మృతి స్వరూపంగా స్వతహాగా అయిపోతారు. ఎప్పుడైతే సర్వ ప్రాప్తులు ఒక బాబా ద్వారా
ప్రాప్తిస్తుంటే దానిలో మీరు తృప్తి ఆత్మగా అవ్వటంలేదా? ఏదైనా వస్తువు
అప్రాప్తిగా ఉన్నప్పుడు మీకు తృప్తి ఉండదు. మరి మీరు ఇప్పటి వరకు సర్వప్రాప్తి
స్వరూపంగా అవ్వలేదా? తృప్తి ఆత్మగా కాలేదా? బాబా ఇచ్చినవి ఇన్ని జన్మలలో వినాశి
ఆత్మలు ఎప్పుడైనా ఇచ్చారా? అనేక జన్మలలో అనేక వస్తువులు, అనేక ప్రాప్తులు మీరు
పొందలేదు. కానీ ఇప్పుడు బాబా ద్వారా ఒకే జన్మలో అన్ని ప్రాప్తులు పొందుతున్నారు.
మరి ఇక మీ బుద్ది ఎక్కడికి వెళ్ళాలి? భ్రమించేవారి నుండి, ఏడిపించేవారి నుండి,
మోసం చేసేవారి నుండి విడిపించుకున్నారు కదా! ఇంకా దానిలోనే ఉంటున్నారా? మీరు
ఇతరాత్మలను చాలా ప్రశ్నలు అడుగుతారు కదా! అలాగే బాబా కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న
అడుగుతున్నారు, ఒక ప్రశ్నకు ఇప్పటి వరకు మీరు ఎవరూ జవాబు ఇవ్వలేదు. ఎవరైతే జవాబు
ఇచ్చారో వారు సదాకాలికంగా ప్రసన్నంగా ఉంటున్నారు. ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వని వారు
మాటిమాటికి దిగిపోయే కళలోకి వచ్చేస్తున్నారు. కనుక నష్టోమోహగా అయ్యేటందుకు మీ
యొక్క సృతి స్వరూపాన్ని పరివర్తన చేసుకోండి. మేము గృహస్థీలము అని స్మృతి
ఉన్నప్పుడే మీకు మోహం వస్తుంది. మా ఇల్లు, మా సంబంధీకులు అనుకున్నప్పుడే మోహం
వస్తుంది. అయితే ఈ హద్దు యొక్క బాధ్యతలను బేహాద్ బాధ్యతలోకి పరివర్తన చేసుకోండి.
ఈ బేహద్ బాధ్యత ద్వారా హద్దు బాధ్యతలు స్వతహాగానే పూర్తి అయిపోతాయి. బేహద్‌ను
మర్చిపోయి హద్దు బాధ్యతలను నిలుపుకోవటంలో ఎంతగా మీ సంకల్పాలను, సమయాన్ని
ఉపయోగిస్తూ ఉంటారో అంత నిలువుకోవడానికి బదులు క్రిందికి వచ్చేస్తారు. మేము మా
కర్తవ్యం నిలుపుకుంటున్నాము అని మీరు అనుకుంటారు. కానీ అది నిలువుకోవటం,
సంభాళించటం కాదు, మీ హద్దు యొక్క స్మృతిలోకి వస్తున్న కారణంగా నిమిత్తంగా అయ్యి
ఆ ఆత్మల భాగ్యం తయారు చేయడానికి బదులు క్రిందికి తీసుకురావడానికి నిమిత్తం
అవుతున్నారు. అంటే ఆ ఆత్మలు పరివర్తన అవ్వటం లేదు. మీ యొక్క నడవడికను చూసి
అలౌకిక బాబాతో సంబంధం జోడించడం నుండి కూడా వంచితం అయిపోతున్నారు. కనుక
కర్తవ్యాన్ని నిలువుకోండి, మంచిదే కానీ మోహం పెట్టుకోకండి. ఎప్పుడైతే మోహం
పెట్టుకుంటారో అప్పుడు అనేకాత్మల బంధనలో స్వతహాగానే చిక్కుకుంటారు. మీరు
కర్తవ్యం అని భావిస్తున్నారు. కానీ అది మోహంలోకి మారిపోతుంది. అందువలన సదా ఈ
స్మృతిని పరివర్తన చేసుకునే పురుషార్ధం చేయండి. నేను గృహస్థీని, ఫలానా బంధనలో
ఉన్నాను, నేను బాధ్యత కలిగిన ఆత్మను అనుకోవడానికి బదులు 5 స్వరూపాలను స్మృతిలోకి
తీసుకురండి. ఎలా అయితే పంచముఖి బ్రహ్మ అని చెప్తారు కదా! బ్రహ్మకు 3 ముఖాలు కూడా
చూపిస్తారు, 5 ముఖాలు కూడా చూపిస్తారు. అలాగే బ్రాహ్మణాత్మలైన మీరు కూడా పంచ
స్వరూపాల యొక్క స్మృతిలో నిమగ్నమవ్వండి. అప్పుడు విశ్వకళ్యాణకారి కర్తవ్యం
చేయగలుగుతారు. ఆ స్వరూపాలు ఏమిటి? ఆ స్మృతి స్వరూపంలో ఉండటం ద్వారా ఈ అన్ని
రూపాలు మర్చిపోతారు. స్మృతిలో ఉంచుకునే ఆ 5 స్వరూపాలు ఏమిటి? ఎలా అయితే బాబాకి
మూడు రూపాలు చెప్తారో, అలాగే మీరు కూడా ఈ 5 స్వరూపాలు స్మృతి ఉంచుకోండి. 1. నేను
బాబాకి పిల్లవాడిని 2. గాడ్లీ స్టూడెంటును అంటే భగవంతుని విద్యార్థిని 3.ఆత్మిక
యాత్రికుడిని 4.వీరుడిని 5.ఈశ్వరీయ లేదా భగవంతుని సేవాధారిని. ఈ 5 స్వరూపాలు సదా
స్మృతిలో ఉంచుకోవాలి. ఉదయం లేచిన తర్వాత బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తారు కదా!
తండ్రి రూపంలో మీరు పిల్లలుగా అయ్యి మీరు బాబాని కలుసుకోండి. ఉదయం లేవగానే మీ
స్వరూపం ఏమిటంటే నేను పిల్లవాడిని అనుకోండి. అప్పుడిక గృహస్థీ స్థితి ఎక్కడి
నుండి వస్తుంది? పిల్లలు అంటే గృహస్థం ఉండదు కదా? ఇలా ఆత్మ రూపంలో బాబాతో
కలుసుకుని ఆ కలయిక ద్వారా సర్వప్రాప్తులు అనుభవం చేసుకుంటే ఇక బుద్ది అక్కడికి
ఇక్కడికి ఎందుకు వెళ్తుంది? వెళ్తుంది అంటే అమృతవేళ మీ యొక్క ఈ మొదటి స్వరూపం
యొక్క సృతి బలహీనంగా ఉన్నట్లే. అందువలన మీరు పడిపోయే కళలోకి వచ్చేస్తున్నారు.
మొత్తం రోజంతటిలో ఈ పంచ రూపాలను సమయానుసారం రకరకాల కర్మల ప్రమాణంగా స్మృతిలో
ఉంచుకోండి. ఇలా స్మృతిలో ఉండటం ద్వారా నష్టోమోహ కాలేరా? అందుకే బాబా మొదటే కారణం
చెప్పారు. మీ ముఖాన్ని మీరు చూసుకోలేకపోతున్నారు, సదా కర్మ చేస్తూ కుటుంబంలో
ఉంటూ శరీర నిర్వహణ చేసూ మీ దర్పణంలో ఈ స్వరూపాన్ని చూసుకోండి. ఈ స్వరూపాలకు
బదులు ఏ స్వరూపం యొక్క రూపం నాకు లేదు కదా? అని చూసుకోవటం ద్వారా పాడైపోయిన మీ
రూపాన్ని మంచిగా చేసుకోవచ్చు. అప్పుడు సదాకాలికంగా సహజంగానే నష్టోమోహగా
అయిపోతారు. అప్పుడిక నష్టోమోహగా ఎలా కావాలి అనరు, ఇలా తయారుకావాలి అని చెప్తారు.
ఎలా అనే మాటను ఇలా అనే మాటలోకి మార్చుకోండి. మేమే అలా ఉండేవారము, ఇప్పుడు మరలా
అలా తయారవుతున్నాము అని ఎలా అనే మాటను ఇలా మాటలోకి మార్చుకోండి. ఎలా తయారవ్వాలి
అనే దానికి బదులు ఇలా తయారవ్వాలి అనే దానిలోకి పరివర్తన చేసుకోండి. అప్పుడు ఎలా
కావాలంటే అలా తయారుకాగలుగుతారు. ఎలా అనే మాట సమాప్తి అయిపోతుంది మంచిగా
తయారైపోతారు.
ఈ విధంగా ఒక్క సెకనులో స్వయాన్ని విస్మృతి నుండి
స్మృతి స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి, నష్టోమోహ ఆత్మలకు, సదా స్మృతి స్వరూపంగా
అయ్యేవారికి, సమర్థ స్వరూపులకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే..