28.07.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అపవిత్రత మరియు వియోగాన్ని సంహరించే శక్తులే- ఆసురీ సంహారిణి.

మీరు బాబా దగ్గరకు రావటంతోనే బాబా ద్వారా ముఖ్యంగా ఏ రెండు వరదానాలు లభించాయి? ఆ ముఖ్యమైన రెండు వరదానాలు తెలుసుకుంటున్నారా? మొట్ట మొదట రావటంతోనే ఇవే రెండు వరదానాలు లభించాయి - యోగీభవ మరియు పవిత్రభవ. ప్రపంచం వారికి కూడా ఒక సెకనులో 35 సంవత్సరాల జ్ఞానసారం కూడా ఈ మాటలనే చెప్తున్నారు కదా! పురుషార్ధం యొక్క లక్ష్యం మరియు ప్రాప్తి ఇదే కదా! మరియు సంపూర్ణ స్థితి లేదా సిద్ధి యొక్క ప్రాప్తి కూడా ఇదే ఉంటుంది. మొట్ట మొదట రావటంతోనే ఏదైతే వరదానం లభించిందో లేదా ఆత్మలైన మీ అందరి వాస్తవిక స్వరూపం ఇదే అని స్మృతి ఇప్పించారో ఆ మొదటి స్మృతి లేదా వరదానం పొంది జీవితంలో ఈ రెండు విషయాలు ధారణ చేసారా? అంటే యోగీభవ మరియు పవిత్రభవ యొక్క జీవితం తయారయ్యిందా లేదా ఇప్పుడు తయారవుతుందా? ధారణామూర్తిగా అయిపోయారా లేదా ఇప్పుడు ధారణ చేస్తున్నారా? అవ్వటానికి అయితే చాలా సాధారణ విషయం కదా! రోజంతటిలో అనేక సార్లు ఈ రెండు విషయాలు వర్ణన చేస్తూ ఉంటారు. ఈ రెండు విషయాలు ధారణ అయిపోయాయా లేదా అవుతున్నాయా? ఒకవేళ యోగీ స్థితిలో కొద్దిగా వియోగిగా ఉన్నా, భోగి అని అయితే అనరు. ఇది రెండవ స్థితి. అప్పుడప్పుడు మాయ యోగి నుండి వియోగిగా చేసేస్తుంది. యోగంతో పాటు వియోగం కూడా ఉంటే యోగి అని అంటారా? మీరు స్వయమే ఇతరులకు చెప్తారు కదా! ఒకవేళ పవిత్రతలో కొద్దిగా అపవిత్రత ఉన్నా వారిని ఏమంటారు? ఇప్పుడు కూడా వియోగులా? లేదా వియోగులుగా అవుతున్నారా? చక్రవరి రాజాగా అయ్యే సంస్కారం ఉన్నకారణంగా అపుడప్పుడు యోగంలో, అప్పుడప్పుడు వియోగంలో చక్రం తిరుగుతున్నారా? మీరు విశ్వం యొక్క సర్వాత్మలను ఈ చక్రం నుండి తొలగించేవారు కదా! లేదా మీరే చక్రం తిరిగేవారా? చక్రం నుండి తొలగించేవారు స్వయం చక్రం తిరుగుతారా? అప్పుడు ఇతరులను ఎలా తొలగిస్తారు? ఎలా? ఎలా అయితే భక్తిమారం యొక్క అనేక చక్రాల నుండి విడిపించుకున్నారు, అప్పుడే మీ నిశ్చయం మరియు నషా ఆధారంగా ఈ భక్తి యొక్క చక్రాల నుండి విడిపించుకోండి అని అందరికి ప్రతిజ్ఞ చేస్తున్నారు. అలాగే అది తనువు ద్వారా చక్రం తిరగటం, ఇది మనస్సు ద్వారా చక్రం తిరగటం. శరీరంతో చక్రం తిరగటం ఇప్పుడు వదిలేసారు. మరి మనస్సు యొక్క చక్రం ఇప్పుడు వదలలేదా? అప్పుడప్పుడు వియోగి, అప్పుడప్పుడు యోగి ఇలా మనస్సు ద్వారా చక్రం తిరుగుతున్నారు. మాస్టర్ సర్వశక్తివంతులను కూడా చక్రంలోకి తీసుకువచ్చే శక్తి ఇప్పటివరకు మాయకు ఉందా? ఇప్పటి వరకు మాయను ఇంత శక్తిశాలిగా చూసి మాయను మూర్ఛితం చేయటం లేదా మాయను ఓడించటం రావటం లేదా? మాపై యుద్ధం చేస్తుంది అని ఇప్పటి వరకు దానిని చూస్తూ ఉంటున్నారా! ఇప్పుడు శక్తి సేన, పాండవసేన అయిన మీరు ఇతరాత్మలపై మాయా యుద్ధం చూస్తూ దయాహృదయులుగా అయ్యి దయ చూపించే సమయం వచ్చింది. ఇప్పటి వరకు కూడా మీపై మీరు కూడా దయ చూపించుకోలేదా? ఇప్పుడు శక్తుల యొక్క శక్తి ఇతరాత్మల సేవ పట్ల కర్తవ్యంలో ఉపయోగించే సమయం. ఇప్పుడు స్వయం పట్ల శక్తిని కార్యంలో ఉపయోగించే సమయం కాదు. ఇప్పుడు శక్తుల కర్తవ్యం - విశ్వకళ్యాణం. విశ్వకళ్యాణకారులు అని మహిమ ఉందా లేదా స్వయం కళ్యాణులా? పేరు ఏమిటి మరియు పని ఏమిటి! పేరు ఒకటి, పని ఇంకొకటా? ఎలా అయితే లౌకికంలో కూడా చిన్నవారిగా ఉన్నప్పుడు సోమరిగా, బాధ్యతాధారిగా లేకపోతే సమయం లేదా శక్తి లేదా ధనం స్వయం పట్లే ఉపయోగిస్తారు. కానీ ఎప్పుడైతే హద్దులో కూడా రచయితగా అవుతారో ఏవైతే శక్తులు లేదా సమయం ఉన్నాయో వాటిని రచన పట్ల ఉపయోగిస్తారు. ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మాస్టర్ రచయితలుగా, జగత్ మాతలుగా అవ్వలేదా? విశ్వ ఆధారమూర్తులుగా అవ్వలేదా? శక్తులకు ఒక సెకను దృష్టితో ఆసురీలను సంహరిస్తారు అని మహిమ ఉంది కదా! మరి స్వయం ఆసురీ సంస్కారాలను లేదా అపవిత్రతను సెకనులో సంహరించలేదా? లేదా ఇతరుల పట్ల సంహారిణీగా ఉంటూ స్వయం పట్ల లేరా? విశ్వం యొక్క ఉద్దారమూర్తులుగా కాలేదా? విశ్వం యొక్క ఆధారమూర్తులుగా కాలేదా? ఎలా అయితే శక్తులకు ఒక సెకను దృష్టితో ఆసురీలను సంహరిస్తారు అని మహిమ ఉందో, అలా మీలో ఉన్న ఆసురీ సంస్కారాలను లేదా అపవిత్రతను సెకనులో సంహరించలేదా? లేదా ఇతరుల పట్ల సంహారిణిగా ఉంటూ స్వయం పట్ల లేరా? ఇప్పుడు ఒకవేళ మాయ ఎదుర్కుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా అయితే తాకగానే ముడుచుకుపోయే వృక్షం చూసారు కదా! ఎవరైనా మనుష్యులు ఒకవేళ కొద్ధిగా చేయివేసినా శక్తిహీనంగా అయిపోతుంది. దానిలో సమయం పట్టదు. అలాగే మీ యొక్క కేవలం ఒక సెకను శుద్ధసంకల్ప శక్తితో మాయ ముడుచుకుపోయే వృక్షంలా మూర్చితం అయిపోవాలి. ఇటువంటి స్థితి రాలేదా? ఇప్పుడు ఇదే ఆలోచించండి - విశ్వకళ్యాణం కొరకే కొద్ది సమయం మిగిలి ఉంది. లేకపోతే విశ్వాత్మలు మిమ్మల్ని నిందిస్తారు - మీరు 35 సంవత్సరాలు ఇంత పాలన తీసుకున్నారు. అయినప్పటికీ యోగీభవ, పవిత్రభవ అవుతున్నారు, మాకు 4 సంవత్సరాలలో వారసత్వం తీసుకోండి అని చెప్తున్నారు అంటారు, మీ నింద మీకే ఇస్తారు. అప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు ఏదైతే అవుతాము, చేస్తాము అంటున్నారో ఈ బాష కూడా మారాలి. ఇప్పుడు మాస్టర్ రచయితగా అవ్వండి. విశ్వకళ్యాణకారిగా అవ్వండి. ఇప్పుడు మీ పురుషార్ధంలో సమయం ఉపయోగించే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇతరులచే పురుషార్థంలో చేయించటంలో సమయం ఉపయోగించండి. రోజు రోజుకి ఎక్కేకళ ఉండాలి అని చెప్తున్నారు కదా! ఎక్కేకళ సర్వులకు ఆధారం - ఈ లక్ష్యాన్ని ప్రతి సెకను స్మృతిలో ఉంచుకోండి. మీ పట్ల ఏదైతే సమయం ఉపయోగిస్తున్నారో అది ఇతరుల సేవలో ఉపయోగించటం ద్వారా స్వతహాగానే మీ సేవ అయిపోతుంది. స్వయం పరివర్తన కొరకు పాత పద్ధతులను పరివర్తన చేయండి. సమయం మారుతుంది, సమస్యలు మారుతున్నాయి,ప్రకృతి యొక్క రంగు, రూపం మారుతుంది. అలాగే స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోండి. అవే ఆచార, వ్యవహారాలు, అదే వేగం, అదే భాష, అవే మాటలు ఇప్పుడు మారిపోవాలి. మీరు స్వయాన్ని పరివర్తన చేసుకోకపోతే ప్రపంచాన్ని ఎలా మారుస్తారు! ఎలా అయితే తమోగుణం అతిలోకి వెళ్తుంది, ఇది అనుభవం అవుతుంది కదా! కనుక మీరు అతీంద్రియ సుఖంలో ఉండండి. వారు అతి పడిపోయే వైపు వెళ్తుంటే, మీరు ఉన్నతి వైపు వెళ్ళండి. వారికి పడిపోయే కళ, మీకు ఎక్కేకళ, ఇప్పుడు సుఖాన్ని అతీంద్రియ సుఖంలోకి తీసుకురావాలి. అందువలనే అతీంద్రియ సుఖం గోప, గోపికలను అడగండి అని అంతిమ స్థితి గురించి మహిమ ఉంది. సుఖం అతి అవ్వటం ద్వారా దు:ఖపు అల యొక్క సంకల్పం కూడా అంతిమం అయిపోతుంది. ఇప్పుడు చేస్తాము, అవుతాము అని చెప్పకూడదు. తయారయ్యి తయారు చేస్తున్నాము అనాలి. ఇప్పుడు కేవలం సేవ కొరకే ఈ పాత ప్రపంచంలో కూర్చున్నారు. లేకపోతే బాబా ఎలా అయితే అవ్యక్తం అయ్యారో మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళేవారు. కానీ శక్తులకు బాధ్యత, అంతిమ కర్తవ్యం యొక్క పాత్ర నిర్ణయించబడి ఉంది. కేవలం ఈ పాత్ర కొరకే బాబా అవ్యక్త వతనంలో మరియు మీరు వ్యక్తంలో ఉన్నారు. వ్యక్తభావంలో చిక్కుకున్న ఆత్మలకు ఈ వ్యక్తభావం నుండి విడిపించే కర్తవ్యం ఆత్మలైన మీదే. ఈ కర్తవ్యం కొరకే ఇప్పటి వరకు ఈ స్థూల వతనంలో ఉన్నారు. ఆ కర్తవ్యాన్ని పాలన చేయటంలో నిమగ్నమవ్వండి, అప్పటి వరకు బాబా కూడా మిమ్మల్ని అందరిని సూక్ష్మవతనానికి ఆహ్వానిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంటికి వెంటే వెళ్ళాలి కదా! మీరు లేకుండా బాబా కూడా ఒంటరిగా ఇంటికి వెళ్ళరు. అందువలన ఇప్పుడు త్వరత్వరగా ఈ స్థూలవతనం యొక్క కర్తవ్యాన్ని పాలన చేయండి, తర్వాత వెంట ఇంటికి వెళ్తారు మరియు మీ రాజ్యంలో రాజ్యం చేస్తారు. ఇప్పుడు ఎంత సమయం అవ్యక్త వతనంలో ఆహ్వానం చేస్తారు? అందువలన బాబా సమానంగా అవ్వండి, బాబా విశ్వకళ్యాణకారి మిమ్మల్ని సంపన్నంగా చేయలేరా? చేసారు కదా! ఎలా అయితే బాబా ప్రతి సంకల్పం, ప్రతి కర్మ పిల్లల పట్ల, విశ్వాత్మల పట్ల ఉపయోగించారో అలా తండ్రిని అనుసరించండి. మంచిది.

ప్రతి సంకల్పం, ప్రతి కర్మ విశ్వకళ్యాణార్ధం ఉపయోగించేవారికి, బాబా సమానంగా అయ్యే పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.