04.08.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సర్వీసబుల్ (సేవాధారి ఆత్మలు), సెన్స్ బుల్ (తెలివైనవారిగా ఉండే ఆత్మలు) మరియు ఎసెన్స్ బుల్ (సారయుక్తంగా ఉండే ఆత్మలు) ఆత్మల గుర్తులు.

స్వయాన్ని సేవాధారి ఆత్మలుగా, తెలివైన వారిగా, సారయుక్త ఆత్మలుగా భావిస్తున్నారా? ఈ మూడు గుణాలు బాబా సమానంగా స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే వర్తమాన సమయంలో మీ ఎదురుగా ఏదైతే గుర్తు పెట్టారో దాని సమానంగా సమీపతకు సమీపంగా వస్తున్నారా? ఏ గుర్తు పెట్టారు? బాబా యొక్క గుర్తు. విష్ణువు యొక్క గుర్తు అయితే భవిష్యత్తుకి సంబంధించినది. కానీ సంగమయుగం యొక్క గుర్తు బాబానే కదా! మరి ఆ గుర్తు ఎదురుగా పెట్టుకుని సమానంగా అవుతున్నానా అని చూసుకుంటున్నారా? ఈ మూడు గుణాలలో సమానత అనుభవం చేసుకుంటున్నారా? లేదా ఒక గుణం యొక్క వివేషతను అనుభవం చేసుకుని రెండు, మూడు మర్చిపోతున్నారా? మూడు గుణాలలో సమయప్రమాణంగా ఏ శాతం ఉండాలో ఆ శాతం ఉందా? వర్తమాన సమయం అనుసరించి పురుషార్థం యొక్క శాతం ఏ శాతంలో ఉండాలో ఆ శాతంలో ఉందా? 95 శాతం వరకు చేరుకోవాలి కదా! సమయం కొద్దిగానే మిగిలి ఉంది. దానిని అనుసరించి బాబా 100 శాతం అనటం లేదు. కానీ 95 శాతం అయినా ఉండాలి కదా! అందువలన బాబా 5 శాతం మనకి అవకాశం ఇస్తున్నారు. సమాయానుసారం 100 శాతం తయారైపోతారు. కానీ 100శాతం అనటం లేదు. 95 శాతం తయారవ్వాలి. సంగమయుగం యొక్క పురుషార్ధం యొక్క సమయానుసారం నాలుగు సంవత్సరాలలో ఎంత శాతం తయారు చేసుకుంటారు? సమయం యొక్క శాతం అనుసరించి 95 శాతం ఏమి పెద్ద విషయం కాదు. మరి ఈ లక్ష్యం పెట్టుకుని వేగాన్ని ముందుకు వెళ్ళేలా పంచుకుంటున్నారా? లేదా ఇప్పుడింకా సమయం ఉంది అని భావిస్తున్నారా? ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది. కదా! అని ఆ సంకల్పమైతే రావటం లేదు కదా? ఇక ఆ నాలుగు సంవత్సరాల వరకు ఏమి చేస్తారు? పురుషార్థం చేస్తూ ఉంటారా? ఏదైనా లోపం ఉంటే నాలుగు సంవత్సరాలలో పూర్తి అయిపోతుంది అనే సంకల్పం రావటంలేదు కదా? నాలుగు సంవత్సరాలు ఉంది అంటే నాలుగు సంవత్సరాల వరకు లోపం ఉండిపోతుందా? మీలో ఎంత లోపం ఉంటుంది? 50 శాతం ఉంటుందా? ఒకవేళ ఇంకా 50 శాతం తయారవ్వాలంటే వేగం చాలా ఉండాలి కదా! ఇప్పుడు వేగం ఎంతగా ఉండాలంటే 95 శాతం వరకు చేరుకోవాలి. ఇప్పుడు ఏమి లక్ష్యం పెట్టుకుంటారు? ఇప్పుడు డ్రామానుసారం ఏదైనా లోపం 50 శాతం ఉంటే పర్వాలేదు 50శాతం వరకు చేరుకున్నారు. మరి మిగతా 50 శాతం ఎప్పుడు తయారవుతారు? ఇప్పుడు బాబా కేవలం 5 శాతం మాత్రమే చెపున్నారు. 95 శాతం అందరు తయారవ్వాలి. 5 శాతం కంటే ఎక్కువ మీకు ఉంది. అంటే అంతిమ స్థితికి మీరు దూరంగా ఉన్నట్లే. అప్పుడు బాప్ దాదాకి సమీపంగా వెంట ఉండే లక్ష్యం ఏదైతే పెట్టుకుంటున్నారో అది పూర్తవ్వదు. ఎందుకంటే ఎప్పటి వరకు మొదటి నెంబర్ అవ్యక్తస్థితి పొందరో అంత వరకు సమీప రత్నాలుగా తయారు కాలేరు. ఎంత సమీపంగా కావాలంటే 5 శాతం లోపం ఉండాలి అంతే. బాబా అవ్యక్తం అయిపోయారు, సమీప రత్నాలలో 50 శాతం తేడా ఉంటే దీనిని సమీపత అంటారా? అటువంటి ఆత్మలు అష్ట రత్నాలలోకి వస్తారా? కనుక సాక్షి అయ్యి మీ స్థితిని పరిశీలించుకోవాలి. ఎలా ఉన్నారో అలా వర్ణన చేయాలి. బయటికి మీ మహిమ చేసుకోవటం వేరే విషయం కానీ స్వయాన్ని స్వయం పరిశీలనలో లోతుగా బుద్ధి యొక్క నిర్ణయం తీసుకోవాలి. ఇతరులకు కూడా మీ యొక్క స్థితి అనుభవం అవ్వాలి. కనుక సమీప రత్నాలుగా అయ్యేటందుకు మీ యొక్క వేగాన్ని 95 శాతం వరకు పెంచుకోండి. ఎక్కువమంది 50 శాతం వరకు ఉన్నారు. ఇలా ఉంటే మిమ్మల్ని అష్టదేవతలు అని ఎలా అంటారు? మూడు విషయాలు చెప్పారు కదా! వాటిని మీలో చూసుకోండి. ఆ మూడు విషయాలు ఏమిటి? ఎంత వరకు సేవాధారీ ఆత్మలుగా అయ్యారు? ఎంత వరకు తెలివైన వారిగా అయ్యారు? సారయుక్తంగా ఎంత వరకు అయ్యారు? అనేది చూసుకోండి. సేవాధారీ రూపం ఏమి ఉంటుంది. దానిని ఎదురుగా పెట్టుకుని పరిశీలించుకోండి. వర్తమాన స్థితిని అనుసరించి, వర్తమాన కర్తవ్యం అనుసరించి స్వయం సేవాధారిగా అయ్యారా,? సేవాధారి ఆత్మ అంటే ప్రతి సంకల్పం, ప్రతి మాట, ప్రతి కర్మ, సేవ చేసే యోగ్యంగా ఉండాలి. వారి యొక్క సంకల్పం కూడా సేవ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే సేవాధారి ఆత్మల సంకల్పం సదా విశ్వకళ్యాణం పట్లే ఉంటుంది. అంటే వారికి విశ్వకళ్యాణకారి సంకల్పాలే ఉత్పన్నం అవుతాయి. వ్యర్ధం రాదు. అలాగే సమయంలో కూడా ప్రతి సెకను మనసా, వాచా, కర్మణా సేవలోనే గడుపుతారు. ఇటువంటి ఆత్మను సేవాధారి అంటారు. ఎవరైనా స్థూల వ్యాపారం చేస్తున్నప్పుడు వారి సంకల్పం, కర్మ కూడా దాని గురించే నడుస్తుంది కదా! సంకల్పంలో, స్వప్నంలో కూడా వారికి ఆ వ్యాపారమే కనిపిస్తుంది. అలాగే సేవాధారి ఆత్మలు అంటే ఈ ఆత్మల సంకల్పం కూడా స్వతహాగానే సేవ పట్ల నడుస్తుంది. ఎందుకంటే వారి వ్యాపారమే అది. ఇది సేవాధారి ఆత్మల గుర్తు. అలాగే రెండవది - తెలివైనవారిగా అవ్వాలి. ఇటువంటి వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రతి ఒక్కరు చెప్పారు. మరి ఈ లక్షణాలు వినిపించారు కదా! మరి ఆ లక్ష్యంలో స్థితులవుతున్నారా? సెన్స్ బుల్ అంటే తెలివైనవారు. లౌకికంలో కూడా తెలివైనవారు ఏమి చేస్తారు? ముందు, వెనుక ఆలోచించి అర్థం చేసుకుని అడుగు వేస్తారు. అలాగే ఇక్కడ ఇది బేహద్ తెలివి. ఎవరైతే తెలివైనవారిగా ఉంటారో వారి ముఖ్య లక్షణం ఏమిటంటే - త్రికాలదర్శి అయ్యి మొదటే మూడు కాలాల గురించి తెలుసుకుని, తర్వాత కర్మ చేస్తారు. వారికి కల్పపూర్వం యొక్క స్మృతి కూడా స్పష్టంగా ఉంటుంది. కల్పపూర్వం మేమే విజయీగా అయ్యాము, ఇప్పుడు కూడా విజయీలుగా అవుతున్నాము, అనేక సార్లు విజయీగా అవుతాము అనే స్మృతి వారికి సష్టంగా ఉంటుంది. ఈ విజయీ స్థితి యొక్క నిశ్చయం ఆధారంగా, త్రికాలదర్శి స్థితి అధారంగా ఏ కార్యం చేస్తున్నా ఎప్పుడు వారి కార్యం వ్యర్థం, అసఫలం అవ్వదు. కనుక ఇలా త్రికాలదర్శిగా అవ్వాలి. కేవలం వర్తమాన సమయాన్ని తెలుసుకోవటం దీనిని సంపూర్ణ తెలివి అనరు. ఏ కార్యంలో అసఫలత రాకూడదు. ఏ కార్యం వ్యర్థం కాకూడదు. అవుతుంది అంటే అర్థం ఏమిటి? అంటే మూడు కాలాలను ఎదురుగా పెట్టుకుని కార్యం చేయటంలేదు. ఇంత బెహద్ తెలివి మీరు ధారణ చేయటం లేదు. ఈ బేహద్ తెలివి లేని కారణంగా వర్తమాన సమస్యలను చూసి భయపడిపోతున్నారు. భయపడిపోతున్న కారణంగా సఫలతను పొందలేకపోతున్నారు. సెన్స్ బుల్ అంటే బేహద్ తెలివితో ఉన్న కారణంగా త్రికాలదర్శి అయ్యి ప్రతి కర్మ చేస్తారు. ప్రతి మాట మాట్లాడతారు. దీనినే అలౌకికత అంటారు. తెలివైన ఆత్మలు అంటే వారు ఎప్పుడు సమయాన్ని, సంకల్పాన్ని, మాటను వ్యర్ధంగా పోగొట్టుకోరు. లౌకికంలో కూడా తెలివైనవారు సమయాన్ని ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరు కదా! పోగొట్టుకుంటే ఏమంటారు? వీరికి తెలివి లేదు అంటారు. అలాగే ఎవరైతే తెలివైన ఆత్మలు ఉంటారో వారు ప్రతి సెకను సమర్థంగా అయ్యి ప్రతి కార్యంలో ఉపయోగిస్తారు. వ్యర్థ కార్యాలలో సమయాన్ని ఉపయోగించరు. తెలివైనవారు అంటే వారు ఎప్పుడు వ్యర్థ సాంగత్యం, యొక్క రంగులోకి వెళ్ళరు, ఎప్పుడు ఏ వాతావరణానికి వశం అవ్వరు. ఇవన్నీ తెలివైన ఆత్మల గుర్తులు, అలాగే మూడవది సారయుక్త ఆత్మలు. వీరి లక్షణాలు ఎలా ఉంటాయి? అందరు చెప్పారు. అందరు మంచిగా చెప్పారు. ఎందుకంటే అందరు ఇక్కడ తెలివైనవారు కూర్చున్నారు. ఇలా ఎవరైతే సారయుక్తంగా ఉంటారో వారి గుర్తు - వారిలో ఆత్మీయత అనే సువాసన ఉంటుంది. ఆత్మీయత అనే సువాసనతో ఆత్మిక సర్వశక్తులు వారిలో నిండి ఉంటాయి. ఆ సర్వశక్తుల ఆధారంగా వారు అందరిని తమ వైపు ఆకర్షితం చేసుకుంటారు. ఎలా అయితే స్థూలంగా సువాసన ఇచ్చే వస్తువులు దూరం నుండే అందరిని ఆకర్షితం చేస్తాయి కదా! అనుకోనప్పటికి అందరిని ఆకర్షిస్తాయి. అలాగే ఈ సారయుక్తమైన ఆత్మల ఎదురుగా ఎటువంటి ఆత్మలు వచ్చినా వారి ఆత్మీయత వైపు అందరు ఆకర్షితం అవుతారు. ఎవరిలో అయితే ఆత్మీయత ఉంటుందో వారి విశేషత ఏమిటంటే, తమ ఆత్మీయత ద్వారా వారిని దూరం నుండే ఆకర్షితం చేస్తారు. ఎలా అయితే మనసాశక్తి ఆధారంగా ప్రకృతిని పరివర్తన చేస్తున్నారో లేదా కళ్యాణం చేస్తున్నారో ఆకాశం లేదా వాయుమండలం అన్నింటి సమీపంగా వస్తున్నారు కదా! అన్నింటిని పరివర్తన చేస్తున్నారు కదా! మనసాశక్తి ద్వారా ప్రకృతిని తమోప్రదానం నుండి సతోప్రధానంగా తయారు చేస్తున్నారు. అలాగే విశ్వాత్మలను కూడా మీ ఎదురుగా రానప్పటికి దూరంగా ఉన్నా కూడా మీ ఆత్మీయత యొక్క శక్తితో బాబా యొక్క పరిచయాన్ని, బాబా యొక్క ముఖ్య సందేశాన్ని అందిస్తున్నారు. అది కూడా మనస్సు ద్వారా వారి బుద్ధికి కూడా టచ్ చేయగలుగుతున్నారు. మరి విశ్వకళ్యాణకారి అయ్యి మొత్తం విశ్వంలో ఆత్మలకు ఎదురుగా వెళ్ళి సందేశం ఇవ్వగలుగుతున్నారా? వాణీ ద్వారా అయితే సందేశం అందరికి ఇవ్వలేరు. కనుక వాణీతో పాటు మనసాసేవ కూడా రోజు రోజుకి పెరుగుతుంది. దీనిని కూడా అనుభవం చేసుకుంటారు. ఎలా అయితే బాబా భక్తుల భావనను సూక్ష్మరూపంతో పూర్తి చేస్తున్నారో అలాగే మీరు కూడా సూక్ష్మ మనసాసేవ ద్వారా వారి కోరికలను పూర్తి చేయాలి. ఇది సూక్ష్మ మిషనరీ కదా! మీ శక్తుల ద్వారా శక్తులు మరియు పాండవుల కర్తవ్యం ఏమిటంటే భక్తి ఆత్మలకు మరియు జ్ఞానీ ఆత్మలకు ఇద్దరికి బాబా యొక్క పరిచయాన్ని అంటే బాబా సందేశాన్ని ఇచ్చే కార్యాన్ని అంటే ఈ సూక్ష్మ మిషనరీ అంటే సూక్ష్మ మనసాసేవను పెంచాలి. ఇదే అంతిమ సేవ యొక్క రూపురేఖ. ఎలా అయితే సువాసన అనేది సమీపంగా ఉన్నవారికి వస్తుంది, దూరంగా ఉన్న వారికి వస్తుంది, అలాగే మీరు కూడా కేవలం సన్ముఖంగా వచ్చేవారి వరకే కాదు దూరంగా కూర్చున్నఆత్మలకు కూడా మీ ఆత్మీయత యొక్క శక్తితో వారిని ఆకర్షితం చేయాలి, వారికి సేవ చేయాలి. అప్పుడే మిమ్మల్ని విశ్వకళ్యాణకారి అంటారు. ఇప్పుడు విశ్వకళ్యాణం యొక్క ప్లాన్స్ తయారు చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంలోకి తీసుకురావటం లేదు. ఎప్పుడైతే ఈ సూక్ష్మ మిషనరీ యొక్క కార్యం ప్రారంభం అవుతుందో, అప్పుడు ప్రత్యక్ష కర్తవ్యం జరుగుతుంది. ఆత్మలు బాబా యొక్క బిందువు తీసుకోవటానికి తపిస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. తపిస్తున్న ఆత్మలకు బుద్ధి ద్వారా లేదా సూక్ష్మ దివ్యబుద్ధి యొక్క శక్తి ద్వారా వారి ఎదురుగా కనిపించనప్పటికి ఎదురుగా కనిపిస్తున్నట్లు అనుభవం అవుతుంది. ఇలా ఎప్పుడైతే సూక్ష్మసేవలో నిమగ్నం అవుతారో, అప్పుడే మీ యొక్క విశ్వకళ్యాణి అనే పేరు ప్రసిద్ధం అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని విశ్వకళ్యాణకారి అని అంటున్నారు కదా! మరి మీకు విశ్వకళ్యాణం యొక్క సంకల్పం వస్తుందా? మరి ఇంత పెద్ద కార్యాన్ని వేగంతో చేయగలుగుతున్నారా? విశ్వకళ్యాణం యొక్క కార్యం ఇప్పటి వరకు కొద్దిగానే చేస్తే అది విశ్వం వరకు ఎలా చేరుతుంది? కనుక ఇప్పుడు ప్రత్యక్షంలోకి తీసుకురావాలి కదా! కనుక నలువైపుల ఉన్న ఆత్మలందరు బుద్దివంతులకు కూడా బుద్దివంతులై సూక్ష్మ మిషనరీ ద్వారా అందరి బుద్దులకు బాబా యొక్క సందేశాన్ని టచ్ చేయండి. ఏదోక శక్తి ఏదోక ఆత్మీయత వైపు వారిని మీ వైపు ఆకర్షితం చేసుకోండి, అప్పుడు వారు మీ ఒక సెకను దర్శనం కోసం భ్రమిస్తారు, తపిస్తారు. దీనికి గుర్తుగానే ఇప్పటి వరకు జడచిత్రాల దగ్గర ఆ తరంగాలు అనుభవం అవుతున్నాయి. ఏదైనా ఉత్సవం జరుగుతుంటే జడచిత్రాల ముందు ఎంత గుంపు ఉంటున్నారు! ఆ రోజు ఆ ఘడియ యొక్క దర్శనం కోసం ఎంత మంది తపిస్తున్నారు! అదే విగ్రహాన్ని అనేక సార్లు దర్శనం చేసుకుంటారు, అయినా కానీ ఆ రోజు యొక్క దర్శనం చేసుకోవాలి అని ఎంత కఠినంగా ప్రయత్నం చేస్తారు. ఈ గుర్తు ఎవరిది? ప్రత్యక్షంగా మీరు చేసిన విశేష కర్మ యొక్క ఋజువుకి గుర్తు. మీ యొక్క ప్రత్యక్ష కర్మయే అక్కడ స్మృతిచిహ్నంగా తయారయ్యింది.