19.09.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బలహీనతలను సమాప్తి చేసుకునే సాధనం - గట్టితనం.

అందరు అచంచలమైన, అఢోలమైన, స్థిరమైన స్థితిలో స్థితులై ఉన్నారా? ఏదైతే మహావీరుల యొక్క మహిమ చేయబడుతుందో ఆ కల్పపూర్వం యొక్క మహిమ, వర్ణన స్థితిలో స్థితులవ్వగలుగుతున్నారా? మీ అంతిమ సాక్షిస్థితి, హర్షితముఖ స్థితి, అతీత, ప్రియమైన స్థితికి సమీపంగా వస్తున్నారా? లేదా? ఆ స్థితి ఇంకా దూరంగా ఉందా? ఏదైనా వస్తువు సమీపంగా ఉన్నప్పుడు వాటికి ఏవోక లక్షణాలు, గుర్తులు కనిపిస్తాయి కదా! మరి మీరు ఏమి అనుభవం చేసుకుంటున్నారు? ఆ అంతిమ స్థితి సమీపంగా వస్తుందా? ఆ సమీప స్థితికి ఏ స్థితి గుర్తు? బాబాకి సమీపంగా వస్తున్నారు కదా! ఏమి అనుభవం చేసుకుంటున్నారు? సమీపంగా వెళ్తున్నారా లేదా నడుస్తూ, నడుస్తూ ఆగిపోతున్నారా? పురుషార్ధంలో నడుస్తూ, నడుస్తూ మార్గ మధ్య దృశ్యాలను చూసి ఆగిపోవటం లేదు కదా? ఎగిరేకళను అనుభవం చేసుకుంటున్నారా? ఆగిపోయే కళలో లేరు కదా? స్థూల యాత్రకు వెళ్ళేటప్పుడు కూడా నడుస్తూ, నడుస్తూ ఆగిపోరు. అలాగే ఇది కూడా ఆత్మిక యాత్ర. దీనిలో కూడా ఆగిపోకూడదు. అలసిపోని వారిగా, స్థిరంగా, అచంచలంగా నడుస్తూ వెళ్ళాలి. గమ్యానికి చేరుకోవాలి అని లక్ష్యం పెట్టుకోవాలి కదా! ఎందుకంటే లక్ష్యం గట్టిగా ఉంటే లక్షణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. ఆ గట్టితనం ద్వారా బలహీనతలు కూడా సమాప్తి అయిపోతాయి. ఒకవేళ గట్టితనం లేకపోతే అనేక బలహీనతలు మీకు కనిపిస్తాయి. స్వయాన్ని మహావీర్ గా భావిస్తున్నారా? మహావీరులంటే ఎప్పుడు ఏ బలహీనతతో బలహీనంగా అనుభవం చేసుకోరు. గట్టితనంతో ఒక్క సెకనులో ఆ బలహీనతలను కూడా సమాప్తి చేసుకుంటారు. అలాగే అంగదుని సమానంగా తమ బుద్ధి రూపి పాదాన్ని ఒకే బాబా స్మృతిలో స్థిరం చేస్తారు. దానిని ఎవరు కదిలించలేరు. కల్పపూర్వం కూడా ఇలాగే తయారయ్యారు కదా! ఇది మీకు స్మృతి వస్తుందా? కల్పపూర్వం తయారైన విషయాన్ని ఆ పాత్రను మీరు పునరావృత్తం చేస్తున్నారు. ఇక దీనిలో కష్టమెందుకు? అనేక సార్లు అభినయించిన పాత్రను పునరావృత్తం చేయటం కష్టమా? మీరు చాలా, చాలా కోటాను కోట్ల భాగ్యశాలి ఆత్మలు. మొత్తం విశ్వంలో బాబాని తెలుసుకున్నారు. మీ యొక్క జన్మసిద్ధ అధికారాన్ని పొందుతున్నారు. మీరు ఎంత కొద్దిమంది ఉన్నారు! లెక్కపెట్టేంత మంది ఉన్నారు. ఆ కొద్దిమందిలో కూడా మీరు కొద్దిమంది. కనుక కోటాను కోట్ల భాగ్యశాలి ఆత్మలు కదా! ఇప్పుడు ప్రపంచం అజ్ఞాన నిద్రలో నిద్రపోతుంది. కానీ కొద్దిమంది ఆత్మలైన మీరు బాబా వారసత్వానికి అధికారిగా అవుతున్నారు. వారందరు మేల్కొన్నా మేము ఏదోకటి పొందాలి అనుకుంటారు. కానీ ఏమౌతుంది? తీసుకోగలరా? ఆలస్యంగా వచ్చినప్పుడు పొందగలుగుతారా? ఆ సమయంలో మీ అందరి శ్రేష్టభాగ్యం ప్రత్యక్ష రూపంలో వారికి సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు మీ భాగ్యం గుప్తంగా ఉంది. ఇప్పుడు గుప్తంగా ఉన్న కారణంగా బాబాని తెలుసుకోవటం లేదు, శ్రేష్ట ఆత్మలను తెలుసుకోవటం లేదు. సాధారణంగా భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ప్రపంచంలోని ఆత్మలు అజ్ఞాన నిద్ర నుండి మేల్కొంటారో అప్పుడు ఏడుస్తారు,తపిస్తారు,పశ్చాత్తాప పడతారు, కానీ పొందలేరు. ఆ సమయంలో స్వయంపై స్వయం చాలా గర్వంగా ఉంటుంది. మేము మొదటే బాబాని తెలుసుకుని అధికారిగా అయ్యాము అని. కనుక మీరు ఈ నషాలో ఉండాలి. ఏమి లభించింది? ఎవరు లబించారు? మరియు ఏమేమి జరగనున్నాయి? ఇవన్నీ మీకు తెలుసు. కనుక సదా అతీంద్రియ సుఖంలో ఊగుతూ ఉండాలి. మరి ఇలాంటి స్థితి ఉందా లేదా? అప్పుడప్పుడు చిన్న చిన్న పరీక్షలు మిమ్మల్ని చలింపచేస్తున్నాయా? చలింపచేయటంలేదు కదా? ఒకరి పరిస్టితులు ఒకరు విని భయపడుతున్నారా? స్వయాన్ని మంచిగా చేసుకుంటున్నారా? ఫలితం ఏమి వస్తుంది? మధువన నివాసీయుల ఫలితం ఏమిటి? మధువన నివాసీయులు అంటే లైట్‌హౌస్. లైట్‌హౌస్ చాలా ఉన్నతంగా ఉంటుంది మరియు మార్గం చూపించేదిగా ఉంటుంది. మధువనం డైరెక్షన్ ప్రకారం అందరు నడుస్తున్నారు. అంటే ఇది లైట్‌హౌస్ కదా! మరి ఉన్నత స్థితి అయ్యింది కదా! ఎలా అయితే బాబా గురించి ఉన్నతమైన కర్తవ్యం చేసేవారు అని మహిమ చేస్తారు కదా! అలాగే మధువనం అంటే ఉన్నతమైన ధామం, పేరు మరియు పని కూడా ఉన్నతంగా ఉండాలి కదా! పేరు కూడా మధువనం. మదువన నివాసీయుల విశేషత ఏమిటంటే - మధుర మూర్తులుగా మరియు బేహద్ వైరాగ్య మూర్తులుగా ఉండాలి. ఒకవైపు మధురత అంతగానే రెండవ వైపు బేహద్ వైరాగ్యవృత్తి. వైరాగ్యవృత్తితో కేవలం గంభీమూర్తులుగానే ఉంటున్నారా? అలా ఉండకూడదు. వాస్తవంగా చెప్పాలంటే గంభీరతలో రమణీయత కూడా నిండి ఉండాలి. అజ్ఞాని ఆత్మలు గంభీర రూపంతో ఉంటారు .గంభీర రూపం అంటే పూర్తిగా గంభీరంగా ఉంటారు, రమణీయత యొక్క గుర్తులు ఉండవు. కానీ యదార్ధ గంభీరత అంటే దానిలో రమణీయత అనే గుణం కూడా నిండి ఉండాలి. మీరు మేము ఆత్మలం,శాంత స్వరూపులం అని భావిస్తున్నారు కదా! కానీ కేవలం శాంత స్వరూపులే కాదు, ఆ శాంత స్వరూపంలో ఆనందం, ప్రేమ, జ్ఞానం అన్నీ నిండి ఉన్నాయి. అలాగే బేహద్ వైరాగ్యం అంటే కేవలం వైరాగ్యమే కాదు, దానితో పాటు వెనువెంట మధురత కూడా ఉండాలి. ఇదే మధువన నివాసీయుల విశేషత. బేహద్ వైరాగ్యవృత్తిలో ఉండేవారు ఎప్పుడైనా భయపడతారా? అలజడి అవుతారా? చలిస్తారా? ఎవరు ఎంతగా చలింపచేసినా కానీ బేహద్ వైరాగ్యవృత్తిలో ఉండే ఆత్మ నష్టోమోహ స్మృతి స్వరూపంగా ఉంటుంది. మీరు నష్టోమోహ స్మృతి స్వరూపులేనా? ఏదైనా కొద్దిగా చూసి అంశమాత్రంగా అయినా కొద్దిగా స్నేహం లేదా మోహం ఉంది అంటే ఆ స్నేహ స్వరూపాన్ని ఏమంటారు? ఎవరి పట్ల స్నేహం ఉంటుందో వారికి సహయోగి అవుతారు కదా! మరి ఈ రకంగా కూడా మీరు స్నేహం యొక్క రూపాన్ని ప్రకటించటం స్నేహమంటారా లేదా మోహమంటారా? ఈ విషయంలో మధువన నివాసీయులు పాస్ అయ్యారా? మధువనం యొక్క వాయుమండలం, మదువన నివాసీయుల వృత్తి, తరంగాలు లైట్ హౌస్. కనుక ఒక్క సెకనులో ఇవన్నీ నలువైపుల వ్యాపించేస్తాయి. ఇలా భావిస్తూ మధువన నివాసీయులు పాత్ర అభినయిస్తున్నారా? నిమిత్తంగా భావించి పాత్ర అభినమిస్తున్నారా లేదా చిన్న పిల్లలుగా అయిపోతున్నారా? ఏమి ఫలితం వస్తుంది? ఇప్పుడు చాలా చేయాలి. ఇప్పుడేమీ జరుగలేదు, ఇక ముందు చాలా జరుగనున్నాయి. అకస్మాత్తుగా జరుగుతుంది అని మీరు ఆలోచిస్తున్నారు. పరీక్ష అనేది అకస్మాత్తుగానే వస్తుంది, చెప్పి రాదు.మొదటే ఇటువంటి పరీక్షలు రానున్నాయి అని బాబా చెప్పారు, కానీ పరీక్ష మాత్రం ఆ సమయంలో అకస్మాత్తుగానే వస్తుంది. అకస్మాత్తుగా వచ్చే పరీక్షలలో సంకల్ప మాత్రంగా అయినా మీరు చలిస్తే అంగదుని సమానంగా అయినటా? చివరి స్థితి మీకు రాలేదా? అన్నింటికంటే సమీపస్థితి ఏమిటి? అది సన్ముఖంగా కనిపించాలి. దాని సమీపంగా వస్తూ ఉంటే అది సన్ముఖంగా కనిపిస్తుంది. ఈ సమీప స్థితిని అనుభవం చేసుకుంటున్నారా? ఆ స్థితి ఎదురుగా కనిపిస్తుందా? ఈ రోజు ఇలా ఉన్నాము, రేపు అలా అవుతాము అని ఆ స్థితి సన్ముఖంగా కనిపిస్తుందా? సాకారంలో బ్రహ్మాబాబాలో భవిష్య స్వరూపం మరియు అంతిమ సంపూర్ణ స్వరూపం ఎదురుగా స్పష్టంగా కనిపించేది కదా! బాబాని అనుసరించాలి కదా! ఎలా అయితే బాబా ఎదురుగా సంపూర్ణస్థితి మరియు భవిష్యస్థితి ఎదురుగా కనిపించేదో, ఎదురుగా అనుభవం అయ్యేదో అలాగే మీది కూడా స్పష్టంగా కనిపిస్తుందా? లేదా భవిష్యత్తు ఏమౌతుంది? అని అనుకుంటున్నారా? అది ప్రకటితం అవ్వదు, కానీ మహావీర్ పురుషార్టీ ఆత్మల బుద్ధిలో సదా స్వయం పట్ల స్పష్టంగా ప్రకటితం అవుతూ ఉంటుంది. ఇలా స్వయం స్థితి స్పష్టంగా కనిపిస్తుందా? లేదా కొద్దిగా దాగి ఉందా? స్పష్టంగా కనిపించటంలో ఏదైనా తేడా వస్తుందా? ట్రాన్సపరెంట్ గా (స్పష్టంగా) కనిపిస్తుందా లేదా ఏమైనా మచ్చలు దాస్తున్నాయా? మధువన నివాసీయులు స్థిరంగా ఉన్నారు కదా? ఎందుకు? ఏమిటి? అనే ప్రశ్నలు లేవు కదా? ఏదైతే పాత్ర నడుస్తుందో ఆ పాత్రలో గుహ్య రహస్యాలు నిండి ఉంటాయి. ఆ రహస్యం ఏమిటి? అది మీకు తెలుసా? ఏదైతే పాత్ర నడుస్తుందో ఆ పాత్రలో మీరు అన్నీ పాస్ అయిపోయారు, కొన్ని పాస్ అవ్వాలి. డ్రామాలో మీకు ఇప్పుడు ఈ పాత్ర యొక్క రహస్యం ఏమిటి? అనేది మీకు అర్ధమౌతుందా? బాబా సమయం యొక్క సూచనలు ఇచ్చేటందుకు మధ్యమధ్యలో గంటలు మ్రోగించి మేల్కోల్పుతారు. అందుకే మీ జడచిత్రాల దగ్గర కూడా గంటలు కొడతారు. గంటలు కొట్టి మేల్కొల్పుతారు, గంటలు కొట్టి నిద్రపుచ్చుతారు. ఈ గంటలు కొట్టడం కూడా సమయానికి సూచన. ఎందుకంటే శాస్త్రవాదులు సమయం గురించి చాలా వేల సంవత్సరాలు అని చెప్తూ పెద్దదిగా చేసేసారు, అందరిని నిద్రపోయేలా చేసేసారు. అందరు అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం ఉంది అని భావిస్తున్నారు. మరి ఇక్కడ దైవీ పరివారంలో ఆత్మలు నడుస్తూ,నడుస్తూ యాయ యొక్క ఏవోక రంగు రూపాలలో, ఏవోక పద్ధతుల ద్వారా సోమరిగా అయిపోయి సమయం యొక్క గ్రహింపుకు దూరంగా పురుషార్థం యొక్క వేగంలో బలహీనంగా అయిపోతున్నారు. కొంతమంది సోమరితనం నుండి విశ్రాంతిలోకి కూడా వెళ్ళిపోతున్నారు. బాధ్యత ఉన్నప్పుడు సమయానికి లేవాలి, సమాయానికి ఇది చేయాలి అనే ధ్యాస ఉంటుంది కదా! ఏ ప్రోగ్రామ్ లేకపోతే సోమరితనంగానే నిద్రపోతారు. అలాగే ఇక్కడ కూడా పురుషార్థంలో సోమరితనం వచ్చేస్తుంది. ఎవరైనా సోమరితనంతో పురుషార్ధం యొక్క సోమరితనపు నషాలో నిమగ్నమైపోతే ఏమి చేయాలి? వారిని కదిలించాలి. కదిలించి లేపాలి. ఎలాంటి నిద్రయో అలాంటి కదలిక ఉండాలి. బాగా నిద్రపోతున్న వారిని బాగా కదిలిస్తేనే ఆ నిద్ర నుండి బయటికి వస్తారు. కొద్దిగా నిద్రపోతున్న వారిని కొద్దిగానే కదిలించాలి. ఇప్పుడు కదిలించటం కూడా కాదు, కొద్దిగా అలజడి జరిగితేనే అందరు మేల్కొంటారు. నిద్ర నుండి లేవకపోతే ఏదోక పద్ధతిని పాటిస్తారు కదా! దాని ద్వారా వారు మేల్కొంటారు. అలాగే ఇక్కడ కూడా డ్రామాలో నిమిత్తంగా అయిన ఆత్మలు సూచనా స్వరూప మూర్తులు. కనుక ప్రపంచంలోని ఆత్మలను కొద్దిగా చలింపచేస్తే అలజడి చేస్తే వారందరు మేల్కొంటారు. ఎందుకంటే తేలికైన నిద్ర నిద్రపోతున్నారు, మేల్కొన్నారు. మేల్కొన్న తర్వాత మరలా రెడీ కావటం లేదు. ఎవరినైనా అకస్మాత్తుగా మేల్కొల్సితే భయపడతారు కదా! అప్పుడు ఏమౌతుంది? యదార్ధ రూపంతో మేల్కొల్పితే మొదట భయపడినా తర్వాత తెలివిలోకి వస్తారు. కనుక ఇలా జరుగకూడదు అనే భయం కూడా వారికి కలగకూడదు. వారి ధ్వనిలో కూడా మార్పు రాకూడదు. ధ్వనిలో మార్పు వచ్చినా, ముఖంలో మార్పు వచ్చినా దానిని పాస్ అంటారా? కనుక ఇప్పుడు చాలా కఠినమైన పరీక్షలు రానున్నాయి. పరీక్షలు చాలా సమయం వస్తాయి. కానీ మీరు చదువులో సోమరిగా అయిపోతున్నారు. పరీక్షల సమయంలో ఎంత ధ్యాస పెట్టుకోవాలి! ఇప్పుడు పరీక్ష అనేది ఏమీ లేదు, ఇక ముందు చాలా పరీక్షలు రానున్నాయి.. ఇక ముందు ముందు మీరు కలలో, సంకల్పంలో ఊహించని పరీక్షలు కూడా వస్తాయి. ఎలా అయితే హద్దు యొక్క డ్రామాను సాక్షిగా చూస్తున్నారో అలాగే ఈ డ్రామాను కూడా సాక్షిగా చూడండి. భయానక పరిస్థితులు వచ్చినా, నవ్వు వచ్చే దృశ్యాలు వచ్చినా రెండింటిని సాక్షిగా చూడాలి. తేడా రాకూడదు. ఎందుకంటే డ్రామా కదా! ఇటువంటి ఏకరస స్థితి ఉండాలి. ఎవరైనా రమణీయక పాత్ర అభినయిస్తున్నా, ఎవరైనా స్నేహి ఆత్మ యొక్క పాత్ర అభినయిస్తున్నా, గంభీర పాత్ర అభినయిస్తున్నా, సాక్షి అయ్యి చూడాలి, భయపడకూడదు, యుద్ధం చేయకూడదు. కొంతమంది భయపడటం లేదు కానీ, యుద్ధంలో నిమగ్నమైపోతున్నారు. ప్రతి పరిస్థితిలో తప్పకుండా ఏదోక కళ్యాణం ఉంటుంది. కనుక సాక్షి స్థితిలో స్థితులై చూడాలి. దీనినే ఏకరస స్థితి అని అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? బాబా సృతిలో నిమగ్నమైనప్పుడే ఈ స్థితి తయారవుతుంది. బాబా మరియు వారసత్వం అంతే ఇక మూడవది ఏదీ ఉండకూడదు. ఏ విషయం చూస్తున్నా, వింటున్నా, ఎవరు సంబంధ, సంపర్కంలోకి వస్తున్నా సాక్షి అయ్యి పాత్ర అభినయించాలి. ఇదే సంలగ్నతలో నిమగ్నమై ఉండాలి. బాబా, బాబా ఇచ్చే వారసత్వం ఇదే ఆనందంలో ఉండాలి. ఇప్పుడు ఈ స్థితిని తయారుచేసుకోండి. దీనిని పరిశీలించడానికే మీకు పరీక్ష వస్తుంది. పరీక్షలు రాకపోతే మీ స్థితి ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరు తమ శారీరక స్థితిని పరిశీలించుకునేటందుకు ధర్మామీటర్ పెట్టుకుంటారు కదా! ధర్మామీటర్ ద్వారా ఎవరి స్థితి వారే పరిశీలించుకోవచ్చు. ఎవరు చెప్పక్కర్లేదు. కనుక భయపడకండి, లోతులోకి వెళ్ళండి. అప్పుడు భయం సమాప్తి అయిపోతుంది. లోతులోకి వెళ్ళటం లేని కారణంగా భమపడుతున్నారు. మదువన నివాసీయులు ముఖ్యంగా బాబాను కలుసుకునేటందుకు వచ్చారు. దీనిలో కూడా మీరందరు శ్రేష్టభాగ్యశాలి ఆత్మలు. కనుక ప్రోగ్రామ్ తయారుచేసుకుంటూ ఉండండి. ప్రోగ్రామ్ లేకుండా ప్రాప్తి పొందలేరు. విశేషత కదా! మధువనంలో బాబాయే స్వయంగా పరుగు పెట్టుకుంటూ వస్తున్నారు. కనుక కొద్దిగా కూడా అలజడిలోకి రాకండి. అంతిమ చివరి పరిక్షలో మీరు ఫెయిల్ కాకూడదు. కనుక మొదటే బాబా పరీక్ష గురించి చెప్తున్నారు. ఎందుకంటే పరిపక్వంగా తయారు చేసుకునేటందుకు. ఫలితం మంచిగా కావాలి. ఒకరికొకరు స్నేహిగా, సహయోగిగా మంచిగా ఉన్నారు. ఇప్పుడు సూక్ష్మసేవ యొక్క మిషనరీ కూడా మంచిగా నడుస్తుంది. మధువన నివాసీయులు విశేషంగా సూక్ష్మ సేవను కూడా ప్రారంభించారు. చాలా సేవాకేంద్రాలలో కూడా సూక్ష్మసేవ జరుగుతుంది. కానీ వర్తమాన ఫలితం అనుసరించి ఈ సేవలో మధువన నివాసియులే మొదటి నెంబర్. అందువలన శుభాకాంక్షలు, ఎలా అయితే ఇప్పటి వరకు స్నేహం, సహయోగం యొక్క ప్రత్యక్ష ఋజువు చూపించారో అలాగే మీరందరు కూడా శక్తిశాలి ఔషదంగా తయారవ్వాలి. మీ శక్తిశాలి ఔషదం ద్వారా అందరు ఆరోగ్యవంతులుగా అవ్వాలి. ఇప్పుడు వేగం పెంచాలి, ఫలితం మంచిగా ఉండాలి. మీరందరు లైట్‌హౌస్ కనుక నలువైపుల ఈ లైట్ యొక్క కిరణాలు వ్యాపింపచేయాలి. అన్ని స్థానాలలో మధువన లైట్ హౌస్ యొక్క ప్రభావం పడాలి.

ఇలా పరస్పరం ఏకమతంగా మరియు శ్రేష్ఠ గతితో నడిచేవారికీ, సదా ఒకే బాబా యొక్క స్మృతిలో ఉండేవారికి, పాండవసేన మరియు శక్తి సేనకు ప్రియస్మృతులు మరియు నమస్తే.