అలౌకిక కర్మ చేసే కళ.
అవ్యక్తమూర్తి అంటే ఈ శరీరంలో పాత్ర అభినయిస్తూ
అతీతంగా మరియు అతిప్రియంగా ఉండేటువంటి అనుభవిగా తయారయ్యారా? ప్రతి సమయం యజయాని
స్థితి మరియు పిల్లవాని స్థితి రెండు వెనువెంట పాత్ర అభినయించే ప్రయత్నం
చేస్తున్నారా? లేదా ఈ స్వరూపం సహజంగా తయారైపోయిందా? లేదా యజమానిగా
అవుతున్నప్పుడు పిల్లవాని స్థితి మర్చిపోతున్నారా లేదా పిల్లవానిగా
అవుతున్నప్పుడు యజమాని స్థితి మర్చిపోతున్నారా? ఇప్పుడిప్పుడే యజమానిగా కావాలి
మరియు ఇప్పుడిప్పుడే చిన్న పిల్లవానిగా అయిపోవాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా
కావాల. ఇప్పుడిప్పుడే దేహానికి అతీతంగా, కర్మకి అతీతంగా, సంలగ్నతలో నిమగ్నమై
ఉండేటువంటి యోగిగా అవ్వాలి. ఇలా అవ్వగలుగుతున్నారా? సంకల్పం మరియు కర్మ రెండు
సమానంగా అవుతున్నాయా లేదా సంకల్పం మరియు కర్మలో తేడా వస్తుందా? సంకల్పం చేయగానే
వెంటనే అది ప్రత్యక్షరూపంలోకి రావాలి, ఈ అభ్యాసం ఉందా? స్మృతియాత్రపై
నడిచేటువంటి బాటసారులైన మీరు ఇంత సమీపంగా చేరుకున్నారా? సహజంగా కూడా ఉండాలి,
సమీపంగా కూడా ఉండాలి. ఈ రెండు అనుభవం అవుతున్నాయా? ఇలా స్మృతియాత్ర యొక్క అనేక
అనుభవాలు చేసుకుంటూ, చేసుకుంటూ ఇప్పుడు జ్ఞానస్వరూపంగా మరియు శక్తి స్వరూపంగా
అయ్యారా? ఎలా అయితే యాత్రలో మధ్య మధ్యలో బోర్డులు వ్రాసి పెడతారు కదా! దాని
ద్వారా మీరు ఎక్కడి వరకు చేరుకున్నారు, ఎక్కడికి చేరుకోవాలి, ఎంత దూరం ఉంది
ఇవన్నీ తెలుస్తాయి కదా! అలాగే మీరు కూడా స్మృతియాత్రలో పయనించే బాటసారులు. మరి
మీరు ఎన్ని మార్గాలు దాటారు, అంటే స్మృతియాత్రలో ఎన్ని స్థితులు మీరు దాటారు?
స్మృతియాత్ర యొక్క చివరి స్థితి ఏమిటి? దానిని స్పష్టంగా చూడగలుగుతున్నారా?
తెలుసుకోగలుగుతున్నారా? ఎలా అయితే ఏదైనా వస్తువు సమీపంగా మరియు సన్ముఖంగా
వచ్చినప్పుడు సహజంగా మరియు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు కదా! అలాగే మీ యొక్క
గమ్యాన్ని సహజంగా మరియు స్పష్టంగా తెలుసుకోగలుగుతున్నారా? లేక ఇప్పుడు చూడటం
ద్వారా దూరంగా అనిపిస్తుందా? చూస్తూ ఉంటున్నారా లేదా కేవలం తెలుసుకున్నారంతేనా?
సన్ముఖంగా, సమీపంగా వచ్చేసారా? అనేక సార్లు మీరు ఆ గమ్యానికి చేరుకున్నారు. అది
అనుభవం చేసుకుంటున్నారా? అనుభవం అవుతుందా? మరి ఆ అనుభవంలో ఉంటూ మీరు ఎక్కడి వరకు
చేరుకున్నారో మీకు ఎందుకు తెలియటం లేదు? స్థితి యొక్క అనుభవం అవుతుంది, మరి ఆ
స్థితిలో స్థితులవ్వటం మీకు కష్టమనిపిస్తుందా? ఆ స్థితిలో సదా ఎందుకు స్థితులు
కాలేకపోతున్నారు? కారణం ఏమిటి? సేవ లేదా బ్రాహ్మణుల కర్మ ఏదైతే ఉందో ఆ కర్మనే
అలౌకిక కర్మ అని అంటారు. ఇలా అలౌకిక కర్మ లేదా ఈశ్వరీయ సేవ ఎప్పుడు మీ స్థితిని
క్రిందికి తీసుకురావడానికి నిమిత్తం కాకూడదు. ఒకవేళ ఏదైనా అలౌకిక కర్మ కారణంగా
మీరు క్రిందికి వచ్చేస్తున్నారు. అంటే ఆత్మకు అలౌకిక కర్మ చేసే కళ రావటం లేదు
అని అర్ధం. కళలు చూపించేవారు, సర్కస్ లో గారడీ చేసేవారు. ప్రతి కర్మ చేస్తూ
ప్రతి కర్మలో తమ కళను చూపిస్తారు. రకరకాలైన ఆటలు చూపిస్తారు. ఆ ఆటల యొక్క కర్మయే
కళగా అయిపోతుంది. అలాగే మీరెవరు? శ్రేష్టాత్మలు, కర్మయోగులు, నిరంతర యోగులు,
సహయోగులు, రాజయోగులు. మరి ప్రతి కర్మను అతీతంగా మరియు ప్రియంగా చేసుకునే కళ మీకు
రావటంలేదా? వారు శారీరక కళ చూపించడానికి ఎంత కోరికతో చేస్తారు! మరి మీ బుద్ధి
యొక్క కళను, అలౌకిక కర్మను ఇతరాత్మలు కళ రూపంలో చూడడానికి మొత్తం విశ్వాత్మలు
కోరికతో ఉన్నారు. మరి మీరు మీ కళను చూపించరా? ఎలా అయితే వారు సర్కస్ లో
శరీరాన్ని ఎలా కావాలంటే అలా, ఏ అంగాన్ని ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే
అంత సమయం మలచగలుగుతున్నారు. ఇది కూడా కళ కదా! అలాగే మీరందరు ఎప్పుడు కావాలంటే
అప్పుడు ఎంత సమయం కావాలంటే అంత సమయం ఎక్కడ కావాలంటే అక్కడ బుద్ధిని స్థిరం
చేయలేకపోతున్నారా? అది శరీరం యొక్క ఆట, ఇది బుద్ధి యొక్క ఆట. దీనిని కళ అని
అంటారు. ఇలా మీరు 16 కళా సంపన్నంగా అవుతారు. ఈ బుద్ధి యొక్క కళ ద్వారా సర్వ కళలు
స్వతహాగానే వచ్చేస్తాయి. బుద్ధి యొక్క కళ సర్వ కళలను నింపుతుంది. సర్వకళా
సంపన్నంగా అయిపోతారు. కనుక ఈ కళలో ఎంత వరకు అభ్యాసిగా అయ్యారు? అనుభవీగా అయ్యారు?
ఇప్పుడిప్పుడే బాబా మీకు ఒక్క సెకనులో అశరీరీ అయిపోండి అని సలహా ఇస్తే అవ్వగలరా?
ఒక్క సెకనులో స్థితులు కాగలుగుతారా? చాలా పనిలో మీరు బిజీగా ఉన్నా కానీ అలాంటి
సమయంలో మీకు ఈ సలహా లభిస్తే ఒక్క సెకనులో మీరు ఆ స్థితిలో స్థితులు కాగలరా?
యుద్ధం ప్రారంభించేటప్పుడు అకస్మాత్తుగా ఆజ్ఞాపిస్తారు. ఇప్పుడిప్పుడే మీ
ఇల్లులన్నీ వదిలేసి బయటికి వచ్చేయండి అని, అప్పుడు ఏం చేస్తారు? తప్పనిసరిగా
వచ్చేస్తారు కదా! అలాగే బాప్ దాదా కూడా అకాస్మాత్తుగా ఈ శరీరరూపి ఇంటిని వదిలి,
దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి, ఈ ప్రపంచానికి అతీతంగా మీ స్వీట్
హోమ్ కి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోగలరా? యుద్ధస్థలంలో ఆగిపోరు కదా? మీ స్వీట్
హోమ్ కి వెళ్ళకుండా ఆ సమయంలో యుద్ధ స్థలంలోనే గడిపితే ఏమౌతుంది? వెళ్ళిపోవటం
మంచిగా అనిపిస్తుందా లేదా ఇవి తీసుకెళ్దామా, వదిలేద్దామా అని ఇలాంటి ఆలోచనలలో
సమయాన్ని పోగొట్టుకుంటున్నారా? ఇలా అశరీరీ అవ్వటంలో, యుద్ధం చేయటంలో సమయం పడితే
అంతిమంలో మీకు మార్కులు ఎలా వస్తాయి? ఏ డివిజన్లోకి వస్తారు? ఒకవేళ మీరు యుద్ధం
చేస్తూ చేస్తూ మీరు ఉండిపోయారు, ఫస్ట్ డివిజన్లోకి వస్తారా? మరి ఇలా అతీతంగా,
ఎవరెడిగా అయ్యారా? సేవ చేస్తన్నప్పుడు స్థితి మరింత శక్తిశాలిగా అవుతుంది.
ఎందుకంటే మీ యొక్క శ్రేష్ట స్థితియే ఈ సమయం యొక్క పరిస్థితులను పరివర్తనలోకి
తీసుకువస్తుంది. సేవాలక్ష్యం ఏమిటి? దేని కోసం మీరు సేవ చేస్తున్నారు?
పరిస్థితులను పరివర్తన చేయటం కొరకే సేవ చేస్తున్నారు కదా! సేవలో స్థితి
సాధారణంగా ఉంటే అది సేవ అవుతుందా? కనుక స్మృతి యాత్ర యొక్క నాలుగు సబ్జెక్టులు
ఏవైతే ఉన్నాయో, వాటిని పరిశీలించుకోండి. ఈ నాలుగు సబ్జెక్టులలో నేను ఎంత వరకు
చేరుకున్నాను? అని మొదటి స్థితి ఉందా లేక ఇప్పటి వరకు కూడా వియోగిగా ఉన్నారా?
వియోగి అయిన తర్వాత యోగిగా అవుతున్నారా? మొదట మీరు వియోగిగా ఉండేవారు, తర్వాత
యోగిగా అయ్యారు. యోగిగా అయిన తర్వాత సహయోగిగా అవుతున్నారు. సహయోగిగా అయిన
తర్వాత చివరి స్థితి ఏమిటి? సర్వస్వత్యాగి అయ్యారా? ఈ నాలుగు సబ్జెక్టులను
ఎదురుగా పెట్టుకుని పరిశీలించుకోండి. ఎన్ని గమ్యాలు నేను దాటాను?ఎన్ని మొట్లు
నేను ఎక్కాను? అనేది చూసుకోండి. మొదటి స్థితి వియోగి ఇప్పుడు ఆ స్థితి లేదా ఇంకా
ఆ స్థితి ఉందా? వియోగి నుండి యోగి గా అయ్యారు, యోగీ స్థితి నుండి సహయోగిగా
అయ్యారు, సహయోగి నుండి సర్వస్వత్యాగి ఇలా నాలుగు మెట్లు. ఈ నాలుగు మెట్లలో మీరు
ఎంత వరకు ఎక్కారు, వాటిని ఎంత వరకు దాటారు? అనేది చూసుకోండి. లేదా ఇప్పటి వరకు
అప్పుడప్పుడు మాటిమాటికి వియోగిగా అవటంలేదు కదా? సదా యోగి, సహాయోగి అయ్యి
నడుస్తున్నారా? ఒకవేళ ఏదైనా విఘ్నం వస్తుంది, విఘ్నానికి వశం అవటం అంటే వియోగి
అవ్వటం కదా? వియోగి అవ్వటం లేదు కదా? విఘ్నం అనేది యోగయుక్త స్థితిని సమాప్తి
చేస్తుంది. స్మృతిని విస్మృతిలోకి తీసుకువచేస్తుంది. విస్మృతి అంటే వియోగమే కదా!
కనుక యోగీ స్థితి అంటే నిరంతరం ఉండాలి. ఎలా అయితే శరీరం, ఆత్మ రెండు కలిసి
పాత్ర అభినయిస్తాయో అంత వరకు అవి రెండు వేరు అవ్వవు. అలాగే బాబా యొక్క స్మృతి
కూడా మీకు బుద్ధి నుండి ఎప్పుడు వేరు కాకూడదు. బుద్ధి యొక్క తోడు అంటే సదా బాబా
స్మృతి ఉండాలి. అటువంటి ఆత్మను యోగి ఆత్మ అని అంటారు. ఇటువంటి యోగీ ఆత్మను ఏ
స్మృతి తన వైపు ఆకర్షితం చేయదు. ఎలా అయితే చాలా ఉన్నతమైన శ్రేష్టశక్తి ముందు
తక్కువ శక్తి ఉన్నది ఏమీ చేయలేదు కదా! అలాగే సర్వవక్తివంతుడైన బాబా స్మృతిని సదా
మీ వెంట ఉంచుకుంటే ఇక ఏ స్మృతి మీ బుద్ధిలో యుద్ధం చేయదు. ఇటువంటి ఆత్మనే
సహజయోగి, స్వతహాయోగి అని అంటారు. ఇటువంటి స్వతహా యోగిగా అయ్యారా? సదా ప్రతి
సెకను, ప్రతి సంకల్పం, ప్రతి మాటలో సహయోగం తప్పనిసరిగా ఉండాలి అటువంటి వారినే
యోగి అని అంటారు. ఒకవేళ సంకల్పంలో సహయోగిగా కాకపోతే కర్మలో అవ్వండి, కర్మలో
కాలేకపోతే ఏ విషయంలో సహయోగి కాగలిగితే ఆ విషయంలో సహయోగి అవ్వండి. ఒకవేళ ఏ
విషయంలో సహయోగిగా కాకపోతే యోగీ ఆత్మలుగా కాలేరు. ఒక్క సంకల్పం కూడా బాబా యొక్క
సహయోగం లేకుండా ఉండకూడదు, ఉంటే దానిని వ్యర్థం అని అంటారు. ఎవరైతే వ్యర్థంగా
పోగొట్టుకుంటారో వారు |ఎప్పుడు ఎవరికి సహయోగిగా కాలేరు. అలాగే స్వయం శక్తిశాలిగా
కూడా కాలేరు. ఇలా సర్వస్నేహిగా, సహయోగిగా, సర్వస్వత్యాగిగా అవ్వాలి.
భక్తిమార్గంలో కూడా ఏదైనా ఈశ్వరార్పణం అని దానం చేస్తారు. వారికి కూడా వినాశి
రాజ్యపదవి ప్రాప్తిస్తుంది. మరి మీరు ప్రతి సంకలాన్ని, ప్రతి సెకను ఈశ్వరీయ
సేవలో, ఈశ్వరునికి సహయోగం రూపంలో ఉపయోగిస్తున్నప్పుడు మీకు ఎంత శ్రేష్ఠ ప్రాప్తి
లభిస్తుంది? ఇలా మహాదాని ఆత్మ సర్వస్వత్యాగిగా సహజంగా కాగలుగుతుంది. ఇలా
సర్వస్వత్యాగి ఆత్మ వర్తమానంలో మరియు భవిష్యత్తులో కూడా సర్వశ్రేష్ట,
భాగ్యశాలిగా అవుతుంది. కేవలం భవిష్యత్తులోనే కాదు, వర్తమాన సమయంలో కూడా అటువంటి
శ్రేష్ట భాగ్యశాలి ఆత్మ యొక్క భాగ్యాన్ని చూస్తూ అనుభవం చేసుకుంటూ ఇతరాత్మలు
కూడా వారి భాగ్యం యొక్క మహిమ చేస్తూ ఉంటారు మరియు అనేకాత్మలను కూడా ఆ
శ్రేష్టభాగ్యవాన్ ఆత్మ తన భాగ్యం ఆధారంగా భాగ్యశాలిగా తయారుచేయడానికి నిమిత్తం
అవుతుంది. కనుక యోగమనే సబ్జెక్టులో ఈ నాలుగు స్థితులు నేను ఎంత వరకు దాటాను?
గమ్యం ఎంత సమీపంగా ఉంది? అనేది పరిశీలించుకోండి.
ఇలా సహజంగా స్వతహాగా మరియు సహజంగా యోగిగా ఉండే ఆత్మలకు
బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.