18.01.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సమానత మరియు సమీపత.

సదా నిర్మాణంగా మరియు నిర్మాణం చేసే కార్యంలో సదా తత్పరులై ఉండేవారు మరియు పిల్లలను తన సమానంగా స్వమానధారిగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు.

బాప్ దాదా సమానంగా స్వమానధారిగా, స్వదర్శన చక్రధారిగా మరియు నిర్మాణంగా అయ్యారా? ఈ విశేష ధారణలను ఎంతెంత బాబా సమానంగా తయారు చేసుకుంటూ వెళ్తారో అంతగా సమయాన్ని సమీపంగా తీసుకురాగలరు. సమయాన్ని తెలుసుకునేటందుకు ఇప్పుడు ఇంకా ఎంత సమయం మిగిలి ఉంది? సమయం యొక్క పరిశీలన ఏమిటంటే మీ యొక్క ధారణలలో సమానస్థితి. ఇప్పుడు చెప్పండి - సమయం ఎంత సమీపంగా ఉంది? సమానతలో మీరు సమీపంగా ఉంటే సమయం కూడా సమీపంగా ఉన్నట్లే. కార్యక్రమం మధ్యలో మిమ్మల్ని మీరు పరిశీలించుకునేటందుకు లేదా మీ ద్వారా సమయాన్ని తెలిపేటందుకు సమయం లభించింది. ఈ విశేష మాసంలో ఈ రెండు ముఖ్య విషయాల గురించి ముఖ్యరూపంగా లక్ష్యం రూపంలో పెట్టుకోండి. ఆ రెండు ఏమిటి? ఒకటి - ప్రేమ, రెండు - లవలీనం.

కర్మలో, మాటలో, సంప్రదింపుల్లో లేదా సంబంధంలో ప్రేమ మరియు స్మృతిలో, స్థితిలో లవలీనంగా ఉండడం. ఎవరు ఎంత ప్రియంగా ఉంటారో వారు అంతగా లవలీనంగా ఉండగలరు. ఈ లవలీన స్థితినే మనుష్య ఆత్మలు లీనస్థితి అని చెప్పారు. బాబా ప్రేమలో అనే మాటను వదిలేసి కేవలం లీనమవ్వటం అనే మాటను పట్టుకున్నారు. ఈ నెలలో ఈ రెండు ముఖ్య విశేషతలను ధారణ చేసి బాప్ దాదా సమానంగా తయారవ్వండి. బాప్ దాదా యొక్క ముఖ్య విశేషత లేదా మిమ్మల్ని అందరినీ ఏదైతే విశేషంగా తయారుచేసిందో, అన్నింటినీ మరిపించిందో, దేహీ అభిమానిగా తయారుచేసిందో అదేమిటంటే ప్రేమ మరియు లవలీన స్థితి. ప్రేమ అనేది మీ అందరికీ కూడా ఒక్క సెకెనులో ఐదువేల సంవత్సరాల యొక్క విస్మృతి విషయాలన్నింటినీ స్మృతిలోకి తీసుకు వచ్చింది. సర్వసంబంధాలను జోడించేలా చేసింది. సర్వస్వ త్యాగిగా తయారు చేసింది. ఎలాగైతే బాబా ఒక్క విశేషత ద్వారా ఒక్కసెకెనులో తనవారిగా చేసుకున్నారో, అలాగే మీరందరూ కూడా ఈ విశేషతలను ధారణ చేసి బాబా సమానంగా తయారయ్యారా? సాకార తండ్రిలో ఈ విశేషతలో ఒక్క శాతం కూడా లోపం కనిపించలేదు. పూర్తి పరిపక్వంగా చూశారు. కనుక విశేషాత్మలైన మరియు బాబా సమానంగా తయారైన మీరు కూడా పరిపక్వంగా ఉండాలి. ఈ ముఖ్య విశేషతలో శాతం రాకూడదు, పరిపక్వంగా ఉండాలి. ఎందుకంటే దీనిద్వారానే సర్వాత్మల యొక్క భాగ్యం లేదా అదృష్టం మేల్కొంటుంది. అదృష్ట తాళం తెరిచేటటువంటి తాళం చెవి ఏమిటి? ప్రేమ. ప్రేమయే అదృష్టానికి తాళంచెవి. ఇది మాస్టర్ తాళంచెవి. ప్రేమ అనేది ఎలాంటి దౌర్భాగ్యశాలినైనా గాని భాగ్యశాలిగా చేస్తుంది. దీని గురించి మీరు అనుభవజ్ఞులేనా? ఎంతెంతగా బాప్ దాదాతో ప్రేమ జోడించబడుతుందో, అంతగా బుద్ధితాళం తెరువబడుతూ ఉంటుంది. ప్రేమ తక్కువ ఉంటే అదృష్టం కూడా తక్కువగానే ఉంటుంది. కనుక సర్వాత్మల అదృష్టతాళాన్ని తెరిచే తాళంచెవి మీదగ్గర ఉందా? లేదా మాయ భిన్నభిన్న రూపాల్లో లేదా రంగుల్లో ఈ తాళంచెవిని దొంగిలించడం లేదు కదా? మాయ యొక్క దృష్టి అంతా ఈ తాళంచెవి పైనే ఉంది. అందువలన ఈ తాళం చెవిని సదా జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రేమ అనేది అనేక వస్తువులపై ఉంటుంది. ఏ వస్తువుపైన అయినా ప్రేమ ఉన్నట్టయితే బాబా పైన ప్రేమలో శాతం వచ్చేస్తుంది. మీ దేహంపై కానీ, మీ యొక్క ఏ వస్తువుపై అయినా కానీ, నాది అనే భావం ఉన్నట్టయితే బాబాపై ప్రేమలో శాతం వచ్చేసినట్టే. నాది అనేది తొలగించుకోవడమే బాబా సమానతను తీసుకురావడం. ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ బాప్ దాదా సదా తోడుగా ఉండరు. శాతం తక్కువగా ఉన్నవారు ఎప్పటికీ పరిపక్వ స్థితికి రాలేరు. కొంచెం శాతం అయినా లోపం ఉన్నట్లయితే ఎప్పటికీ పరిపక్వంగా తయారుకాలేరు. అందువలన ఈ సంవత్సరంలో శాతం యొక్క లోపాన్ని తొలగించుకుని పరిపక్వంగా తయారవ్వండి. అప్పుడు ఈ సంవత్సరం వినాశనం యొక్క సంవత్సరాన్ని తీసుకువస్తుంది. ఒక సంవత్సరం సమయాన్ని మీకు ఇస్తున్నాను. ఎందుకంటే మాకేం తెలుసు అని మీరు నిందించకూడదు. ఒక్క సంవవత్సరం అనేక సంవత్సరాల శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారుచేయడానికి నిమిత్తమవుతుంది. మీకు మీరే పరిశీలకులై మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ముఖ్యంగా ఈ విషయంలో మిమ్మల్ని మీరు పరిపక్వంగా తయారుచేసుకుంటే అనేకరకాలైన లోపాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. ఇది సహజ పురుషార్ధమే కదా? మీరు బాబాతో ప్రేమలో లవలీనంగా ఉన్నట్లయితే ఇతరులను కూడా సహజంగానే మీ సమానంగా లేదా బాబా సమానంగా తయారుచేయగలరు. కనుక ఈ సంవత్సరం బాబా సమానంగా తయారవ్వాలి అనే లక్ష్యం పెట్టుకుని నడవండి. అప్పుడు బాప్ దాదా కూడా ఆ పిల్లలకు తతత్వం అనే వరదానం ఇచ్చేటందుకు డ్రామానుసారం నిమిత్తమై ఉన్నారు. ఈ సంవత్సరం యొక్క విశేషత ఏమిటంటే బాబా సమానంగా తయారై, సమయాన్ని సమీపంగా తీసుకు వచ్చేస్తుంది. సమయం యొక్క విశేషతను స్వయంలో తీసుకురండి.

ఈవిధంగా సదా లవ్లీ మరియు లవలీనంగా ఉండేవారికి, బాబాసమానంగా నిర్మాణంగా మరియు నిర్మాణం చేసే కర్తవ్యంలో సదా తత్పరులై ఉండేవారికి, సమయం యొక్క విశేషతను స్వయంలోకి తీసుకువచ్చేవారికి, శ్రేష్ట స్వమానంలో సదా స్థితులై ఉండేవారికి, శ్రేష్ట మరియు సమాన ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.