11.04.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పరివర్తన.

ప్రత్యక్ష మూర్తిగా తయారుచేసేవారు, సర్వగుణ సంపన్న శివబాబా మాట్లాడుతున్నారు.

వర్తమాన సమయాన్ని పరివర్తనా సమయం అని అంటారు. ఈ సమయం అనుసారంగా ఎవరైతే నిమిత్తమై ఉన్నారో, వారిలో కూడా ప్రతి సమయం తప్పక పరివర్తన జరుగుతూ ఉంది. అందువలనే వారి ఆధారంగా సమయం పరివర్తన అవుతుంది. సమయం అనేది పరివర్తనకు ఆధారం. అయితే పరివర్తన చేసేటందుకు నిమిత్తమైన ఆత్మలు కూడా స్వయంలో ప్రతి సమయం, మనసా, వాచా, కర్మణా అన్ని రూపాల్లో పరివర్తన జరుగుతూ ఉందని అనుభవం చేసుకుంటున్నారా? దీనినే వృద్ధికళ యొక్క పరివర్తన అని అంటారు. పరివర్తన అనేది ద్వాపరయుగంలో కూడా జరుగుతుంది. కాని అది పడిపోయే కళ యొక్క పరివర్తన. ఇప్పుడు సంగమయుగంలో వృద్ధికళ యొక్క పరివర్తన. కనుక సమయాన్ని అనుసరించి ఇది ఎలాగైతే వృద్ధికళ యొక్క పరివర్తన జరుగుతుందో అదేవిధంగా నిమిత్త ఆధారమూర్తుల్లో కూడా తప్పకుండా ఇలాగే పరివర్తన ఉంటుంది. పరివర్తన జరుగుతూ ఉందని అనుభవం చేసుకుంటున్నారా? అయితే పరివర్తన ఎంత వేగంతో జరుగుతుంది అనేది ఎప్పుడైనా పరిశీలించుకున్నారా? పరివర్తన అనేది ఒకవారంలో జరుగవచ్చు, ఒకరోజులో జరుగవచ్చు మరియు ఒక గంటలో జరగవచ్చు. ఏది ఏమైనా కానీ మొత్తానికి పరివర్తన జరుగుతుంది కదా! కానీ ఇప్పటి సమయాన్ని అనుసరించి పరివర్తన యొక్క స్థితి ఏవిధంగా ఉండాలి అని అనుభవం చేసుకుంటున్నారు? ఎవరైతే ముఖ్యంగా నిమిత్తమైన మహావీరులున్నారో వారికి ఏ విషయాన్నయినా పరివర్తన చేసుకోవడంలో సమయం పట్టినట్లయితే, అంతిమపరివర్తనలో కూడా తప్పక సమయం పడుతుంది. నిమిత్తమైన మహావీరులు ఎవరైతే ఉన్నారో వారు సమయానికి గడియారం లాంటివారు. గడియారం సమయాన్ని ఎలాగైతే స్పష్టంగా చూపిస్తుందో, అదేవిధంగా నిమిత్తమైన మహావీరులు గడియారం లాంటివారు. అయితే ఈ గడియారంలో సమయం సమీపంగా కనిపిస్తుందా లేక దూరంగా ఉందా? మీరే గడియారము మరియు మీరే సాక్షి అయి సమయం ఎంత అయ్యిందో పరిశీలన చేసేవారు. కనుక పరివర్తన యొక్క ప్రగతి తీవ్రంగా ఉందా? అంతిమ పరివర్తన - దీని ద్వారానే సృష్టి యొక్క అంతిమ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడైతే కొంచెం కొంచెం పరివర్తన అవుతున్నారు. అందువలన సృష్టి యొక్క పరిస్థితుల్లో కూడా కొంచమే పరివర్తన జరుగుతుంది. కానీ అంతిమ సంపూర్ణ పరివర్తనకు గుర్తు ఎమిటి? ఆ గుర్తు ద్వారా తెలియాలి - ఇది పరివర్తన యొక్క సంపూర్ణ స్థితి అని. ఇప్పుడు కూడా పరివర్తన యొక్కస్థితిని సంపూర్ణ పరివర్తన యొక్క గుర్తులను లేదా సంవత్సరాలను లెక్కించుకుంటూ ఉంటే ఇప్పుడు ఇంకా ఎంత సమయం ఉంది? పరివర్తన ఎలా ఉండాలంటే వీరు పూర్తిగా పరివర్తన అయిపోయారని అందరి.నోటినుండి రావాలి. మీ యొక్క పరివర్తనా విషయాన్ని అడుగుతున్నారు పరివర్తన అనేది సదాకాలికంగా స్వతహా రూపంలో కనిపించాలి. అది ఏవిధంగా అవుతుంది? ఇప్పుడు స్వతహారూపంలో లేదు. ఇప్పుడు పురుషార్థంతో కొద్ది సమయానికి పరివర్తన యొక్క మెరుపు కనిపిస్తుంది. కానీ స్వతహా రూపమనేది సదాకాలికంగా ఉంటుంది. కనుక ఇదే సంపూర్ణ పరివర్తనకు గుర్తు. ప్రతి ఒక్కరిలో ఏదోక బలహీనత యొక్క ముఖ్య సంస్కారం ఉంటుంది, అది ఎవరికి వారికి తెలుసు. ఎప్పుడూ కూడా కొన్ని స్థితుల్లో సంపూర్ణంగా పాస్‌ అవ్వలేరు. కొద్దిశాతంలోనే పాస్‌ అవుతారు. దీనికి కారణం ఏమిటి? ప్రతి విషయంలో, ప్రతి ఒక్కరిలో విశేష రూపంతో ఒక ముఖ్య సంస్కారం ఉంటుంది. దానినే మీరు స్వభావము అని అంటుంటారు. ఆ స్వభావంలో మార్పు రావాలి. మొదట్లో వీరిలో ఈ సంస్కారం ఉండేది, ఇప్పుడు లేదు అని అందరికీ మీలో పరివర్తన కనిపించాలి. పరస్పరంలో కూడా ఒకరికొకరు ముఖ్య బలహీన సంస్కారాలు గురించి వర్ణించుకుంటూ ఉంటారు. వీరు పురుషార్థంలో చాలా మంచివారు, కానీ ఈ సంస్కారం వీరికి సమయానుసారం ముందుకు వెళ్ళడంలో విఘ్నం వేస్తుందని అలాంటి ముఖ్య సంస్కారం, ఎప్పటి వరకు పూర్తిగా పరివర్తన అవ్వదో అప్పటి వరకు సంపూర్ణ విశ్వ పరివర్తన జరుగదు. అన్నింటిలో సంపూర్ణ పరివర్తన అది మరో విషయం, అదైతే నెంబర్ వారీగా ఫలితంలో కనిపిస్తుంది, కానీ పరివర్తనకు ముఖ్య ఆధారమూర్తులు ఎవరైతే ఉన్నారో వారిని మహావీర్ లేదా మహారథీ అంటారు. వారిలో ఈ పరివర్తన అవసరం. వీరిలో ఈ సంస్కారం మొదటి నుండి ఉంది అని ఎవరూ వారి గురించి వర్ణించకూడదు. ఇలా ఎవరూ వర్ణించకూడదు, ఎవరికీ కనిపించకూడదు. దీనినే సంపూర్ణ పరివర్తన అని అంటారు. కొంచెమైనా లేదా అంశమాత్రంగానైనా ఉంటే దానిని సంపూర్ణ పరివర్తన అనరు. మహారథీలను సాధారణ పరివర్తన గురించి అడుగుతారా? విశ్వపరివర్తనకు నిమిత్తమైనవారి పరివర్తన యొక్క స్థితి కూడా ఇతరుల కంటే ఉన్నతంగా ఉంటుంది. కనుక దీనిని పరిశీలించుకోండి. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా కనిపించాలి. అదృష్ట సితారలు అని వీరిగురించే మహిమ ఉంది. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమతమ స్థితుల్లో ఉన్నారు. కానీ సంపూర్ణ పరివర్తన ద్వారానే అదృష్ట సితారల యొక్క పేరు ప్రసిద్ధమవుతుంది. వర్తమాన సమయంలో సాకార రూపంలో అందరూ అనుసరించేది మిమ్మల్నే కదా? బుద్ధియోగం ద్వారా శక్తిని పొందడం, బుద్ధియోగం ద్వారా శ్రేష్టకర్మను అనుసరించడం, దీనికొరకైతే తల్లి తండ్రి నిమిత్తమై ఉన్నారు. కానీ సాకార రూపంలో ఇప్పుడు ఎవరిని అనుసరిస్తారు? ఎవరైతే నిమిత్తంగా ఉన్నారో వారిని. కనుక పరివర్తనకు ఒక ఉదాహరణగా తయారవ్వండి. సంవత్సరంలో ఒకటి రెండుసార్లయినా కానీ ఇలాంటి వారి సంఘటన జరగాలి. ఆ సంఘటనలో మీ వృద్ధికళ యొక్క పరివర్తన కనిపించాలి. గడిచిన సంవత్సరంలో స్నేహం, సంప్రదింపులు, సహయోగం వీటన్నింటిలో వృద్ధికళ యొక్క పరివర్తన ఉండాలి. పరివర్తన అయితే ఉంది కానీ ఇప్పుడు సంపూర్ణ పరివర్తన ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఈ సంవత్సరంలో ఈ పరివర్తన విశేష రూపంలో జరగడం అవసరం.

ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ప్రత్యక్షత కోసం అమాయకంగా బాంబ్స్ వేయడం ప్రారంభించారు. ధర్మయుద్ధం అనే వేదికపైకి రావాలి. మీరు ఒక విషయంలో వారిని ఓడించగలరు, అదేమిటంటే ధర్మము మరియు ధారణ. వారికి ప్రత్యక్షంగా లేవు. కానీ పరమాత్మ జ్ఞానానికి ప్రత్యక్ష రుజువుగా మీ జీవితం ఉంది. ఒకవైపు ధర్మయుద్ధం యొక్క వేదిక, మరోవైపు ప్రత్యక్ష ధారణామూర్తి యొక్క వేదిక. ఒకవేళ ఈ రెండింటి కలయిక లేకపోయినట్లయితే మీరు చేసిన ప్రత్యక్ష జీవితం యొక్క ప్రతిజ్ఞ ప్రత్యక్ష రూపంలో చూపించలేరు. ముందుకు వెళ్ళేకొలది విషయం పైన ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. ప్రత్యక్షంలో జ్ఞానం అనగా ధారణామూర్తులుగా, జ్ఞానమూర్తులుగా, గుణమూర్తులుగా ఉండాలి. అనగా మీ మూర్తి ద్వారా కూడా జ్ఞానము మరియు గుణాలు కనిపించాలి. చర్చించడం ద్వారా మీ మూర్తిని రుజువు చేయలేరు. మీ మూర్తి ద్వారా వారికి ఒక్కసెకెనులో శాంతిని అనుభవం చేయించవచ్చు. ఒకవైపు ఉపన్యాసం మరోవైపు ప్రత్యక్షమూర్తి కూడా ఉండాలి. అప్పుడు ధర్మయుద్ధంలో సఫలులు కాగలరు. అందువలన ఎలా అయితే సేవకోసం కార్యక్రమం తయారుచేస్తారో, దాంతోపాటు స్వయంకోసం కూడా స్వ ఉన్నతి కోసం కూడా కార్యక్రమం తయారుచేసుకోండి. ఇది కూడా అవసరం. మీ పురుషార్థం యొక్క ఉన్నతి యొక్క, మీ పురుషార్ధం యొక్క భిన్న భిన్న అనుభవాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఇలాంటి ప్రోగ్రాములు కూడా వెనువెంట చేసుకోవాలి. రెండింటి సమానత వెనువెంట ఉండాలి. మంచిది.