19.04.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ప్రత్యక్షత కొరకు పురుషార్థం.

నికృష్టుల నుండి శ్రేష్ఠంగా లేదా భాగ్యహీనుల నుండి భాగ్యవంతులుగా తయారుచేసే శివబాబా మాట్లాడుతున్నారు.

మిమ్మల్ని మీరు బాప్ దాదాకి సమీపంగా ఉండే పదమాపద భాగ్యశాలీగా, శ్రేష్ఠ ఆత్మలుగా భావిస్తున్నారా? ఎవరు ఎవరికి సమీపంగా ఉంటారో వారిలో సమీపంగా ఉన్నవారి యొక్క గుణాలు స్వతహాగా మరియు సహజంగానే వచ్చేస్తాయి. అందువలనే సాంగత్యం యొక్క రంగు తప్పకుండా అంటుతుందని అంటారు. ఆత్మలైన మీరు సదా బాప్ దాదాకి సమీపంగా అనగా శ్రేష్ట సాంగత్యంలో ఉంటున్నారు. కనుక మీ గుణాలు, సంస్కారాలు తప్పకుండా బాప్ దాదా సమానంగానే ఉండి ఉండాలి. నిరంతరం శ్రేష్ట సాంగత్యంలో ఉండే పిల్లలైన మీలో సదా ఆ ఆత్మిక రంగు అంటి ఉన్నట్టు అనుభవం చేసుకుంటున్నారా? పిల్లలైన మీరు స్వయాన్ని ప్రతి సమయం ఆత్మిక రంగులో రంగరించబడిన ఆత్మలుగా భావిస్తున్నారా? స్థూల రంగు ఎలాగైతే స్పష్టంగా కనిపిస్తుందో, అదేవిధంగా చెడుసాంగత్యంలో ఉండే ఆత్మల యొక్క మాయారంగు కూడా దాగి ఉండదు. చెప్పండి కనిపిస్తుంది కదా? తలలు ఊపుతూ అందరూ అవును అని జవాబిచ్చారు. అదేవిధంగా శ్రేష్ట సాంగత్యంలో ఉండేవారి ఆత్మికరంగు కూడా అందరికీ కనిపించాలి. వారిని ఎవరు చూపినప్పటికీ వీరు ఆత్మిక రంగులో రంగరించబడి ఉన్నారని అర్థమవ్వాలి. ఈ విధంగా మీ ద్వారా అందరికీ అర్ధమవుతుందా లేక ఇప్పటికీ గుప్తంగా ఉన్నారా? ఈ ఆత్మికరంగు గుప్తంగానే ఉండిపోవాలా? ఎప్పుడు ప్రత్యక్షం అవ్వాలి? అంతిమంలో ప్రత్యక్షం అవుతారా? ఆ తారీఖు ఏమిటి? అంతిమ తారీఖు అనేది అందరి ప్రత్యక్షతపై ఆధారపడి ఉంది. డ్రామా ప్లాను అనుసారంగా శ్రేష్ట ఆత్మలైన మీకు పశ్చాత్తాపంతో కూడా సంబంధం ఉంది. ఎప్పటి వరకు పశ్చాత్తాప పడరో అప్పటి వరకు ముక్తిధామానికి వెళ్లే వారసత్వం పొందలేరు. అందువలన ఎవరైతే నిమిత్తమై ఉన్నారో వారినే అడగాలి కదా? నిమిత్తులు ఎవరు? మీరందరూ కదా? ఇప్పుడు మీ ఎదురుగానే మీ సంపూర్ణ స్థితి ప్రత్యక్షం కాకపోతే ఇతరుల ముందు ఏవిధంగా ప్రత్యక్షం అవుతుంది? మీ సంపూర్ణ స్థితి మీకు శ్రేష్టంగా కనిపిస్తుందా? అలాంటివారు చేయి ఎత్తండి? వాస్తవానికి సంపూర్ణ స్థితి అంటే ఏమిటో జ్ఞానం అయితే అందరికీ ఉంది. కానీ స్వయాన్ని ఏవిధంగా భావిస్తున్నారు? సమీపంగా ఉంటారు, కనుక సమానంగా అవుతారు కదా! మరి మీ సంపూర్ణ స్థితి కనిపిస్తుందా? నేనెవరు అనే చిక్కు ప్రశ్నకు సమాధానం దొరకలేదా? కల్పపూర్వం నేనెవరు, మీ సంపూర్ణ స్థితిని మీరు మరిచిపోయారా? ఇతరులకైతే ఐదువేల సంవత్సరాలు అనే విషయాన్ని మొదట స్మృతి ఇప్పిస్తారు. మొట్టమొదటి సారిగా ఎవరైనా వస్తే ఇంతకుముందు మీరెప్పుడైనా కలిసారా అని అడుగుతారు కదా! మీరు అంటే ఇతరులకు కల్పపూర్వ విషయాన్ని జ్ఞాపకం చేయిస్తున్నారు. అలా జ్ఞాపకం చేయించే మీకు మీ యొక్క కల్ప పూర్వపు స్థితి గుర్తుండే ఉంటుంది కదా! దర్పణం స్పష్టంగా లేదా? ఎప్పుడైతే దర్పణం స్పష్టంగా మరియు శక్తివంతంగా ఉంటుందో అప్పుడు ఎవరు ఎలాంటివారో అలాగే కనిపిస్తారు. విశేష ఆత్మలు మరియు సర్వ శ్రేష్ఠాత్మలైన మీరు మీ శ్రేష్ట స్థితిని చూసుకోలేరా? వినాశనం జరగడంలో ఎంత వరకు ఆలస్యం జరుగుతుందంటే, ఎప్పటి వరకైతే నిమిత్త ఆత్మలైన మీరు మీ యొక్క సంపూర్ణ స్థితిని స్పష్టంగా సాక్షాత్కారం చేసుకోవాలో అంతవరకే వినాశనం ఆగి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి వినాశనానికి ఎంత సమయం ఉంది? త్వరలో జరుగుతుందా ఆలస్యముందా? ఈ రోజు సద్గురువారం కదా? కనుక ఈ రోజు వతనంలో ఆత్మిక సంభాషణ జరుగుతుంది. ఏ ఆత్మిక సంభాషణ? వర్తమాన స్థితి ఎంతవరకు నెంబర్ వారీగా పురుషార్థానికి నడుస్తుందని దీంట్లో ఏమి ఫలితం వచ్చింది? మొదటి ప్రశ్న యొక్క ఫలితంలో 50 శాతం కంటే ఎక్కువ మంది లేరు. ఆ మొదటి ప్రశ్న ఏమిటి? ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏదైతే చెప్పారో, ఈ సంవత్సరం విశేష రూపంలో స్మృతియాత్రలో ఉండాలి లేదా అవ్యక్త స్తితిలో స్థితులై వరదానాన్ని పొందాలి అని ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో, ఆ డైరెక్షన్ అనుసారంగా ఈ సంవత్సరం మొదట్లో ఏదైతే ధ్యాస మరియు స్థితి ఉందో అది ఇప్పుడు ఉందా? అవ్యక్త వాతావరణాన్ని, అవ్యక్త అనుభవాన్ని మొదట్లో చేసుకున్నారు, ఆత్మిక స్థితి ఇప్పుడు కూడా ఉందా? స్థితిలో లేదా అనుభవంలో ఇప్పుడు తేడా ఉందా? అన్నిసేవాకేంద్రాల యొక్క ఆకర్షణీయమైన వాతావరణం మిమ్మల్ని అందరినీ కూడా ఎలా ఆకర్షితం చేసిందో అలాంటి వాతావరణాన్ని సేవచేస్తూ కూడా తయారుచేయలేరా? ఈ ప్రశ్నకు ఫలితం చెప్పాను. దీంట్లో 50 శాతం ఫలితం కూడా లేదు. ఇక రెండో ప్రశ్నలో ఫలితం 60 శాతం ఉంది. ఆ ప్రశ్న ఏమిటి? సేవ యొక్క ఫలితం లేదా ఉత్సాహ ఉల్లాసాల్లో ఫలితం చాలా బాగుంది. కానీ సమానత ఎంత వరకు ఉంది? సమానతను సరిచేసుకుంటే చాలా త్వరగా మాస్టర్ సఫలతామూర్తులై మీ ప్రజలకు మరియు భక్తులకు దయ చూపించి ఈ దు:ఖ ప్రపంచం నుండి దాటించగలరు. ఇప్పుడు భక్తుల యొక్క పిలుపు స్పష్టంగా మరియు సమీపంగా వినిపించడం లేదు. ఎందుకంటే మీ స్థితియే మీకు స్పష్టంగా లేదు. ఇది రెండవ ప్రశ్న యొక్క ఫలితం. ఇక మూడవ ప్రశ్న సంబంధ సంప్రదింపుల్లో మీతో మీరు లేక ఇతరాత్మలతో ఎంతవరకు సంతుష్టంగా ఉన్నారు? సేవలో అయినా లేదా ప్రవృత్తిలో అయినా సేవాకేంద్రం కూడా ప్రవృత్తి యే కదా? ఇలా ప్రవృత్తిలో లేదా సేవలో సంతుష్టత ఎంతవరకు వచ్చింది? దీంట్లో చాలా తక్కువ మంది పాసయ్యారు. ఎక్కువ మంది సగం సగం ఉన్నారు. ఇప్పుడే ఉంటున్నారు, ఇప్పుడే ఉండడం లేదు. ఈ రోజు ఉంటుంది, రేపు ఉండడం లేదు. దీనినే 50-50 (సగం సగం) అంటారు. ఈ మూడు ప్రశ్నల ఆధారంగా జరుగుతున్నఈ సంవత్సరం యొక్క ఫలితం స్పష్టమైంది కదా? ఈ సంవత్సరంలో విశేష వరదానం తీసుకోగలరు అని చెప్పాను కదా! కానీ ఒక్క నెల మాత్రమే వరదాని మాసంగా భావించి ధ్యాస పెట్టారు. నెమ్మది నెమ్మదిగా సమయానుసారం ఇప్పుడు వరదాని సంవత్సరమని మరిచిపోతూ వచ్చారు. అందువలన ఈ వరదాని సంవత్సరంలో వరదానం తీసుకోవాలని ఎంతగా స్మృతిలో ఉంటారో, అంత సహజంగా వరదానాన్ని కూడా పొందగలరు. ఒకవేళ మరిచిపోయినట్లయితే విస్మృతిలోకి వచ్చినట్లయితే చాలా విఘ్నాలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అందువలన నలువైపులా ఉన్న బ్రాహ్మణ పరివారం యొక్క ఆత్మలందరూ అన్ని రకాల విఘ్నాలను తొలగించుకునేటందుకు ఎలాగైతే మొదటి నెలలో స్మృతి యొక్క లేదా సంలగ్నత యొక్క అగ్నిని ప్రజ్వలింప చేసుకున్నారో, అలాగే ఇప్పుడు కూడా అలాంటి అవ్యక్త వాతావరణాన్ని తయారుచేయండి. ఒకవైపు వరదానం,రెండవ వైపు విఘ్నం. రెండింటికీ ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. కేవలం మీకోసం మీరు విఘ్న వినాశకులుగా అవ్వడం కాదు. మీ బ్రాహ్మణ కులం యొక్క సర్వాత్మల యొక్క విఘ్నాలను వినాశనం చేసేటందుకు సహయోగులుగా అవ్వండి. ఈ వేగాన్ని ఇప్పుడు పెంచండి. నడుస్తూ.. నడుస్తూ.. మధ్యమధ్యలో వేగాన్ని తగ్గించేస్తున్నారు. అందువలన ప్రత్యక్షత జరగడంలో కూడా డ్రామాలో ఇంత ఆలస్యం జరుగుతూ ఉంది. మీరు ఇలా చేసినప్పుడే స్వయాన్ని కూడా ప్రత్యక్షం చేసుకోగలరు. స్యయంలో సర్వశక్తివంతుని యొక్క ప్రత్యక్ష రూపాన్ని అనుభవం చేసుకోండి. ఒకటి రెండు శక్తులను కాదు. సర్వశక్తివంతుని యొక్క సర్వశక్తులను అనుభవం చేసుకోండి. మీరు మాస్టర్ సర్వశక్తివంతులు, రెండు లేదా నాలుగు శక్తులు కలిగిన వారి యొక్క సంతానం కాదు మీరు, సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేయండి. మంచిది.

మాస్టర్ దయాసాగరులకు, మాస్టర్ జ్ఞానసాగరులకు, మాస్టర్ సఫలతామూర్తులకు, సదా సర్వశ్రేష్ఠ ఆత్మిక సాంగత్యం యొక్క రంగులో ఉండే విశేష ఆత్మలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.