21.04.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


ఎలాంటి పేరుయో అలాంటి పని.

పూజ్యనీయులుగా తయారుచేసే పరమపూజ్యపిత రాజయుక్తులుగా తయారుచేసే రక్షకుడు, వరదాని మహాదాని మదువననివాసీ అక్కయ్యలను చూస్తూ శివబాబా మాట్లాడుతున్నారు.

ఈ గ్రూపుకు ఏ పేరు పెట్టాలి? మధువననివాసీలను ఎలా పిలవాలి? ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో వారందరూ స్వయాన్ని పదమాపదమ్ భాగ్యశాలిగా భావించి నడుస్తున్నారా? మధువన నివాసీల కారణంగానే మధువనానికి మహిమ ఉంది. మధువన వాతావరణాన్ని తయారుచేసే వారెవరు? మధువనం యొక్క మహిమ ఏదైతే పాడుతూ ఉంటారో, అదే మహిమ మీ ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవం చేసుకుంటున్నారా? మధువనాన్ని గొప్ప భూమి అని అంటారు. అలాంటి గొప్ప భూమిలో నివసించేవారు కూడా తప్పకుండా గొప్ప ఆత్మలై ఉంటారు. కనుక మేము మహానాత్మలం ఈ ఆత్మిక నషాలో ఉంటున్నారా? గొప్ప ఆత్మ యొక్క ప్రతి పని మరియు ప్రతి సంకల్పం గొప్పగా ఉంటుంది. ఇలాంటి మహానాత్మలేనా? వారి యొక్క ఒక్క సంకల్పం కూడా సాధారణంగా లేదా వ్యర్ధంగా ఉండదు మరియు వారి యొక్క ఒక్క కర్మ కూడా సాధారణంగా లేదా అర్ధం లేకుండా ఉండదు. ఎందుకంటే వారి యొక్క ప్రతి అడుగు ప్రతి చూపు అర్ధసహితంగా ఉంటుంది. ఈ విధమైన అర్ధస్వరూప మహానాత్మలేనా? అలాంటివారిని మహాన్ అనగా మధువననివాసిలు అని అంటారు. మీ పేరు మధువన నివాసి అంటే తప్పకుండా అర్ధసహిత పేరు అయి ఉంటుంది కదా? ఈ విధంగా రోజూ మీ లెక్కాచారాన్ని పరిశీలించుకుంటున్నారు కదా? ఈ కర్మేంద్రియాల ద్వారా ఏదైతే కర్మ జరుగుతుందో అది అర్ధసహితంగా అవుతుంది కదా! గడుస్తున్న సమయం అంతా సఫలం అవుతుంది కదా! అనగా మహాన్ కార్యంలో ఉపయోగించారా? మీ లెక్కాచారాన్ని ఈ విధంగా చూసుకుంటున్నారా లేక స్థూలంగా పైపైకి చూసుకుంటున్నారా? ఈ రకంగా మేము పరిశీలన చేసుకుంటున్నాము అనేవారు చేయి ఎత్తండి. మహానాత్మల ప్రతి కర్మ చరిత్ర రూపంలో మహిమ చేయబడుతుంది. మహానాత్మల హర్షితముఖం, ఆకర్షణీయమూర్తి మరియు అవ్యక్తమూర్తి విగ్రహ రూపంలో స్మృతిచిహ్నంగా ఉంటుంది. ఇప్పుడు స్వయాన్ని చూసుకోండి, రోజంతటిలో మా ముఖం లేదా ముఖకవళికలు ఆ విధంగా ఉంటున్నాయా? మీ ముఖం మూర్తి అయ్యి పూజింపబడాలి. మన కర్మ చరిత్ర రూపంలో మహిమ చేయబడాలి, ఆవిధంగా ఉన్నారా? ఇక్కడికి నేర్చుకోవడానికి లేదా చదువుకోడానికి వచ్చారు. అయితే మీ అంతిమ లక్ష్యం ఏమిటి? లేదా సంగమయుగం యొక్క లక్ష్యం ఏమిటి? ఇదే కదా? సంగమయుగం యొక్క కర్మయే చరిత్ర రూపంలో మహిమ చేయబడుతుంది. సంగమయుగం యొక్క ప్రత్యక్ష జీవితమే దేవతారూపంలో పూజింపబడుతుంది. అది ఎప్పుడు జరిగింది? ఇప్పటి మహిమయే కనుక ఇప్పుడే జరుగుతుంది కదా? సత్యయుగంలో ఆవిధంగా తయారవుతారా? అక్కడ హర్షితముఖం ఉన్నా కానీ మీరు హర్షితముఖంతో ఉన్నారు అని ఎవరైనా అంటారా? ఇప్పుడైతే అంటారు ఎవరైతే సదా హర్షితంగా ఉండరో వారు వర్ణన చేస్తారు, వీరు హర్షితముఖీ అని. ఇలాంటి మూర్తి లేదా ఇలాంటి కర్మ ప్రత్యక్షంలో ఉందా? ఇది వింటున్నప్పుడు మీరు నవ్వుకుంటున్నారు లేదా అనుభవం చేసుకుంటున్నారు. ఆ నవ్వు ఎంత సమయం ఉంటుంది? అనుభవం చేసుకుంటున్నారు, కనుకే నవ్వుకుంటున్నారు కదా! అదేవిధంగా ప్రతిరోజూ మీయొక్క ప్రతి కర్మను అనుభవం చేసుకోవడం ద్వారా లేదా పరిశీలన చేసుకోవడం ద్వారా ఎవరడిగినా కానీ వెంటనే జవాబివ్వగలరు. ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు చేయి ఎత్తాలా వద్దా అని. నిశ్చయంతో చేయి ఎందుకు ఎత్తలేకపోతున్నారు?ఎందుకు సంకోచిస్తున్నారు? కారణం ఏమిటి? ఈ విధంగా మీ సంపూర్ణ స్థితిని స్వరూపంలోకి తీసుకురండి. కేవలం మాటల్లోకి కాదు, స్వరూపంలోకి. ఎవరు మీ ఎదురుగా వచ్చినా కానీ మీ జడచిత్రాల ఎదురుగా వెళ్ళినప్పుడు మిమ్మల్ని గొప్పగా భావిస్తారు. తమని తాము పాపులుగాను లేదా నీచులుగా భావిస్తారు. అంటే ఒక్కసెకెనులో తమని తాము సాక్షాత్కారం చేసుకుంటారు, ఆ విగ్రహం అయితే చెప్పదు నీవు నీచుడవు అని. కానీ తమకు తామే సాక్షాత్కారం చేసుకుంటారు. అదేవిధంగా మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వీళ్ళేమిటి, నేనేమిటి అని అనుభవం చేసుకోవాలి. ఇలాంటి స్థితి మీకు రావాలి కదా? అది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం యొక్క కోర్సు సమాప్తి అయింది. రివైజ్ కోర్సు నడుస్తుంది. కేవలం థియరీలో మాత్రమే రివైజ్ అవుతుందా లేక ప్రాక్టికల్ లో కూడా రివైజ్ అవుతుందా? ప్రత్యక్షంగా కోర్సు పూర్తవ్వాలి కదా? లేక రివైజ్ కోర్సు పూర్తయిన తరువాత ప్రత్యక్షంగా చూపిస్తారా? ఏమంటారు? దీనికోసం సమయం గురించి ఎదురుచూస్తున్నారా? సమయం వస్తే సరైపోతాయి అని అనుకుంటున్నారా? ఈ క్లాసు ఎప్పుడైనా చేసారా? మీ పురుషార్థాన్నితీవ్రం చేసేటందుకు మీ శక్తిని అనుసరించి అప్పుడప్పుడు ప్లాన్లు తయారుచేసుకుంటారు లేదా తయారైన ప్లాన్ ప్రకారం నడుచుకుంటారు. బాప్ దాదా ఇదే చూస్తున్నారు, ఎవరైతే మధువననివాసీలుంటారో వారు అందరి ఎదురుగా ఉదాహరణలాంటి వారు. మొదట ఉదాహరణనే తయారుచేస్తారు. మధువననివాసీలు ఉదాహరణ. లేక ఉదాహరణ ఇప్పుడు తయారుచేస్తున్నారా? ఉదాహరణ తయారైన తరువాత దానిని చూపించి చెబుతారు. ఈవిధంగా తయారవుతుందని, అది చూసిన తరువాత ఇతరులు వ్యాపారం చేస్తారు. మొదట వస్తువుని ఉదాహరణగా తయారుచేస్తారు. అలాగే మీరు ఉదాహరణగా తయారైతే బాప్ దాదా మీవైపు చూపిస్తూ, ఈ విధంగా తయారవుతారు అని చెప్పారు. ఇలా ఉదాహరణగా తయారయ్యేటందుకు కష్టమైన పురుషార్ధం ఏమి లేదు. చాలా సహజమైన పురుషార్థం. ఆ సహజమైన పురుషార్థం ఏమిటంటే ఒక్కమాటలో చెప్పాలంటే బాబా యొక్క రూపాన్ని ఎదురుగా పెట్టుకోండి. ఒక్కమాటలో పురుషార్థం ఇది చాలా సహజం కదా? సదా బాబా యొక్క గుర్తును ఎదురుగా పెట్టుకుంటే పురుషార్ధం సహజమైపోతుంది. పురుషార్థం సహజం అయిపోతే మీరు ఉదాహరణగా అయిపోతారు. మధువన నివాసీలకు ఎన్నిఇంజన్లు ఉన్నాయి (నాలుగు అని ఎవరో చెప్పారు) మరైతే మీరు సెకెనులో చేరుకోవాలి కదా! అందరికంటే సహజ పురుషార్థం యొక్క లాభం లేదా స్వర్ణిమ అవకాశం మధువన నివాసీలకు లభించి ఉంది. ఇది కూడా ఒప్పుకుంటారు, ఒప్పుకోవడంలో తెలుసుకోవడంలో తెలివైన వారు, మరియు చెప్పడంలో కూడా తెలివైనవారే. ఒప్పుకున్న విధంగా తయారవడంలో ఆలస్యం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఎంతెంత మహిమాయోగ్యులుగా అవుతారో అక్కడ అంతంత పూజ్యనీయులుగా తయారవుతారు. ఇక్కడ మీ కర్మలు చూసి శ్రేష్టంగా భావించకపోతే పూజించేవారు కూడా మిమ్మల్ని శ్రేష్టంగా భావించి పూజారిగా ఏ విధంగా అవుతారు? ఎంతెంత ఇక్కడ గౌరవనీయులో అంతంత పూజ్యనీయులు అనే లెక్క ఉంది. ఎవరైతే పూజ్యనీయులుగా తయారవుతారో వారిని చూసి అందరూ హర్షిస్తారు. మరిప్పుడు ఆవిధంగా తయారవ్వాలా లేక కేవలం చూసి సంతోషించాలా? ఎంతెంత గాయనాయుక్తులుగా అవుతారో అంతంత రాజయుకులుగా అవ్వండి. పాటలు పాడడంలో చాలా తెలివైనవారు. పాటలు వినడానికి కూడా ఎంత మంది కోరికతో ఉంటారు? దీంట్లో అయితే పాస్ అయిపోయారు కదా! ఎంతెంత గాయనాయుక్తులో అంతంత రాజయుక్తులుగా కూడా అవ్వండి. రాజయుక్తులు అనగా వారి యొక్క ప్రతి అడుగులో ఏదైతే చేస్తారో అందులో రహస్యం నిండి ఉంటుంది. ఈ విధంగా రాజయుక్తంగా మరియు గాయనాయుక్తంగా తయారవ్వాలి. రెండింటి సమానత సరిగా ఉంచుకోవాలి. మధువననివాసీలు చాలా అదృష్ట సితారలు. ఎంత అందృష్టవంతులో అంతగా అందరికీ ప్రియంగా కూడా తయారవ్వండి. కేవలం మీ అదృష్టంలోనే సంతోషపడిపోకండి. మీ అదృష్టం యొక్క పరిశీలన మీరు ప్రియంగా అవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరైతే అదృష్టవంతులుంటారో వారందరికీ ప్రియంగా తప్పకుండా ఉంటారు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అందరికీ స్నేహాన్ని ఇచ్చి, అందరితో స్నేహం చేసే కార్యాన్ని చేయండి. జ్ఞానం ఇవ్వడం, జ్ఞానం తీసుకోవడం ఈ స్థితిని దాటేసారు. ఇప్పుడు స్నేహాన్ని ఇవ్వండి మరియు తీసుకోండి. ఎవరు ఎదురుగా వచ్చినా, సంబంధంలోకి వచ్చినా వారికి స్నేహాన్ని ఇవ్వండి మరియు తీసుకోండి. అలాంటివారినే సర్వుల స్నేహీ మరియు ప్రియమైనవారు అని అంటారు. జ్ఞానదానం బ్రాహ్మణులకు చేయాల్సిన అవసరం లేదు. అది అజ్ఞానులకు చేయాలి. బ్రాహ్మణ పరివారంలో ఈ దానం యొక్క మహాదానిగా అవ్వండి. మహిమ ఉంది కదా! దానం ఇస్తే గ్రహణం వదిలిపోతుందని. అదేవిధంగా ఏదైతే బలహీనతలు ఉండిపోయాయో ఆ అన్ని రకాల గ్రహణాలు ఈ వరదానంతో వదిలిపోతాయి. ఇప్పుడు చూస్తాను ఎవరెవరు మహాదానిగా అవుతారో? స్నేహం అనేది కేవలం మాటలకు సంబంధించినది కాదు. సంకల్పంలో కూడా ఎవరిపట్ల స్నేహానికి బదులు మరేది ఉత్పన్నం కాకూడదు. ఎప్పుడైతే అందరిపట్ల స్నేహం ఉంటుందో ఆ స్నేహానికి బదులుగా సహయోగం లభిస్తుంది. సహయోగానికి ఫలితం సఫలత. ఎక్కడ సర్వుల సహయోగం ఉంటుందో అక్కడ సఫలత సహజంగానే వస్తుంది. అప్పుడు అందరూ సఫలతామూర్తులు అయిపోతారు. ఇప్పుడు దీని యొక్క ఫలితం చూస్తాను. మంచిది.