24.04.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అలౌకిక జాతకం.

జ్ఞాన సాగరుడు, సర్వ మహాన్ శ్రేష్ఠ మత దాత, కర్మల రేఖల యొక్క జ్ఞాత, సర్వాత్మల పిత శివబాబా మాట్లాడుతున్నారు -

సర్వశక్తివాన్ స్వరూపంలో స్థితి అయ్యి ఉన్నారా? ఒక్క సెకెనులో మీ సంపూర్ణ స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా? ఒక్క సెకెనులో ఏ స్థితిలో మిమ్మల్ని మీరు స్థితులు చేసుకోవాలనుకుంటే, ఆ స్థితిలో స్థితులు కాగలుగుతున్నారా? ఎంత సమయం మరియు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో స్థితులయ్యే అభ్యాసులేనా లేక ఇప్పటి వరకు కూడా ప్రకృతి ద్వారా వచ్చే పరిస్థితులు స్థితిని తమవైపుకు ఎంతో కొంత ఆకర్షితం చేసుకునే విధంగా ఉన్నాయా? అన్నింటికంటే ఎక్కువగా మీ దేహం యొక్క కర్మలఖాతా మిగిలిపోయిన కర్మభోగం రూపంలో వచ్చే పరిస్థితులు తమవైపుకు ఆకర్షితం చేస్తున్నాయా? ఈ ఆకర్షణ కూడా సమాప్తం అయిపోవాలి. ఇలాంటివారినే సంపూర్ణ నష్టోమోహ అని అంటారు. ఏ వస్తువుతో మోహం అనగా సంలగ్నత ఉంటుందో అది మిమ్మల్ని తరచుగా తనవైపునకు ఆకర్షితం చేస్తుంది. దేహ ప్రపంచం యొక్క లేదా దేహం యొక్క ఏ పరిస్థితి మీ స్థితిని కదిలించకూడదు. ఈ స్థితి గురించే గాయనం ఉంది. కల్పపూర్వపు సంపూర్ణ స్థితికి గాయనమే అంగదుడు. బుద్ధి అనే పాదాన్ని ప్రకృతి యొక్క పరిస్థితులను కదిలించలేకపోయాయి. ఈ విధంగా తయారయ్యారా? లక్ష్యం అయితే ఇదే కదా? ఇప్పుడు లక్ష్యం మరియు లక్షణాల్లో తేడా ఉంది. కల్పపూర్వపు మహిమ మరియు వర్తమాన ప్రత్యక్ష జీవితంలో తేడా ఉంది. ఈ తేడాను తొలగించుకునేటందుకు తీవ్ర పురుషార్థం యొక్క యుక్తులు ఏమిటి? యుక్తులు ఏమిటో తెలుసు కూడా. అయినా కానీ తేడా ఎందుకు ఉంది? నేత్రాలు లేవా? నేత్రం కూడా ఉంది, కానీ ఆ నేత్రాన్ని సరైన సమయానికి ఉపయోగించే యోగ్యత లేదా? ఎంత యోగ్యతయో అంత మహానత కనిపిస్తుంది? మహానత లేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? ముఖ్యమైన నమ్మకం దాని గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఆ నమ్మకం యొక్క మహీనత లేదు, మహీనత రావడం ద్వారా మహావీరత వస్తుంది. మహావీరత అనగా మహానత. కనుక ఏ విషయం లోపంగా ఉంది? మహీనత. మహీన వస్తువు దేంట్లో అయినా ఇమడగలదు. మహీనత లేకుండా ఏ వస్తువు ఎక్కడ ఇమడ్చాలన్నా ఇమడదు. వస్తువు ఎంత మహీనంగా ఉంటుందో అంత గౌరవప్రదంగా, శక్తివంతంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు అడగండి - మొదటి నమ్మకం లేదా అన్ని నమ్మకాలకన్నా శ్రేష్ట నమ్మకం ఏది? శ్రీమతమే మీ నమ్మకం. అయితే శ్రీమతంలో మొదటి శ్రీమతం ఏమిటి? (దేహసహితంగా అన్నింటినీ మరిచిపోవాలి) వదలండి లేదా మరిచిపోండి. మరచిపోవడం కూడా వదలడమే. దగ్గరగా ఉన్నా కానీ ఒకవేళ మరిచిపోతే వదిలేసినట్టే కదా! కనుక మరిచిపోవడం కూడా వదలడమే. చూడండి, సన్యాసులకు మీరు శపథం చేస్తారు, వారిలా మీరు వదల్లేదు. వారు ఇల్లువాకిలి వదిలేసామంటారు, కానీ మీరు వదల్లేదు ఎందుకంటే మీరు మరిచిపోయారు. అదేవిధంగా పరిస్థితులు అనుసారంగా బాహ్యరూపానికి ఎవరైనా ఏదైనా వదిలారు లేదా దూరమయ్యారు, కానీ మనసుతో దానిని మరిచిపోలేకపోతే దానిని వదలడం అంటారా? ఇక్కడ వదలటం అంటే అర్ధమేమిటి? మనసుతో మరిచిపోవడం. మీరు మనసుతో మరిచిపోయారు కదా! మరి మీరు వదిలారా లేక ఇప్పుడు ఇంకా వదలాలా? ఇప్పటి వరకు కూడా వదలాలనే అంటున్నారా? అలా అంటే చాలాకాలంగా వదిలేసిన వారి జాబితా నుండి తొలగి ఇప్పటి నుండి వదలాల్సిన వారిని జాబితాలోకి వచ్చేస్తారు. ఎవరు ఎప్పుడు మనసుతో త్యాగం చేసారో అంటే దేహ బంధనాన్ని కానీ లేదా దేహ సంబంధాలను కానీ ఒక్కసెకెండులో ఏదైతే త్యాగం చేశారో, తిధి మరియు తారీఖులు వేళ అన్నీ డ్రామాలో లేదా బాప్ దాదా దగ్గర నిర్ణయించబడి ఉన్నాయి. ఈ రోజుల్లో జ్యోతిష్యులు అనగా అనగా జ్యోతిష్యం తెలిసిన వారు జన్మించిన తిధి మరియు వేళ ఆధారంగా తమకున్న జ్ఞానంతో భవిష్య జాతకాన్ని తయారుచేస్తారు. ఆ జాతకానికి ఆధారం తిథి మరియు వేళ. అదేవిధంగా ఇక్కడ కూడా మరజీవ జన్మ యొక్క తిథి వేళ మరియు స్థితి. వారు పరిస్థితిని చూస్తారు. ఎలాంటి పరిస్థితిలో జన్మించారని. కానీ ఇక్కడ ఆ వేళలో ఉన్న స్థితిని చూస్తారు. జన్మ తీసుకుంటూనే ఏ స్థితిలో ఉన్నారు. దాని ఆధారంగానే ఇక్కడ కూడా ప్రతి ఒక్కరి భవిష్య పాలబ్దానికి ఆధారం. అదేవిధంగా మీరు కూడా ఈ మూడు విషయాలు అనగా తిథి, వేళ మరియు స్థితిని తెలుసుకుని మీ సంగమయుగం యొక్క ప్రాలబ్దం లేదా సంగమయుగం యొక్క భవిష్య స్థితి మరియు భవిష్యము జన్మ యొక్క ప్రాలబ్ధం మీకు మీరే తెలుసుకోవచ్చు. ఒక్కొక్క విషయం యొక్క ప్రాప్తి ప్రత్యక్ష జీవితంతో సంబంధం ఉంది. ఇది మీ అదృష్టాన్ని తెలుసుకునే నేత్రం. దీనిద్వారా ప్రతి ఒక్కరూ తమ యొక్క అంతిమ స్థితి యొక్క నెంబరును తెలుసుకోవచ్చు. ఎలాగైతే జ్యోతిష్యులు చేతిలోని రేఖల ద్వారా జాతకాన్ని తెలుసుకుంటారో అలాగే మీరు మాస్టర్ త్రికాలదర్శి, త్రినేత్రి, జ్ఞాన స్వరూపులు. అనగా మాస్టర్ జ్ఞాన సాగరులు అయిన కారణంగా మీ మరజీవ జీవితం యొక్క ప్రత్యక్ష కర్మ అనే రేఖల ద్వారా సంకల్పాలనే సూక్ష్మ రేఖల ద్వారా మీ సంకల్పాలను చిత్రంలోకి తీసుకువస్తే అది ఏ రూపంలో కనిపిస్తుంది? మీ సంకల్ప రేఖల ఆధారంగా లేదా మీ కర్మల రేఖల ఆధారంగా మీ జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు. సంకల్ప రూపీ రేఖలు నిదానంగా అనగా స్పష్టంగా ఉన్నాయా? కర్మ అనే రేఖలు శ్రేష్టంగా అనగా స్పష్టంగా ఉన్నాయా? ఒకటి పరిశీలించుకోవచ్చు. చాలాకాలం నుండి స్థితిలో లేదా సంప్రదింపుల్లో శ్రీమతానుసారంగా గడిపారా? ఇదే కాలము అనగా సమయాన్ని చూడడం. సమయం అనగా వేళ యొక్క ప్రభావం కూడా జాతకంపై చాలా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సమయం అనగా చాలా సమయం యొక్క లెక్కతో సంబంధం ఉంది. చాలాకాలం అనగా స్థూల తారీఖు సంవత్సరాల లెక్క కాదు. ఎప్పుడైతే జన్మ తీసుకున్నారో అప్పటి నుండి చాలా సమయం సంలగ్నత ఉండాలి. అన్ని సబ్జెక్టుల్లో యదార్థ రూపంతో చాలాకాలంగా ఎంతవరకు ఉంటున్నారు, దాని యొక్క లెక్కే మీకు జమ అవుతుంది. కొందరు 35 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉంటున్నారు, కానీ తమ పురుషార్థం యొక్క సఫలతలో చాలా సమయం గడపలేదు. వారిది చాలాకాలంగా లెక్కించబడదు. ఇంకొకరు 35 సంవత్సరాలకు బదులు 15 సంవత్సరాల నుండి వస్తున్నారు. కానీ ఆ పదిహేనేళ్లలో చాలా సమయం పురుషార్ధంలో సఫలం చేసుకున్నారు. వారి లెక్క ఎక్కువగా ఉంటుంది. చాలాకాలం సఫలం చేసుకోవాలి అనే ఆధారంతో సమయం లెక్కించబడుతుంది. కనుక వేళయే ఆధారం అయింది కదా? చాలాకాలం సంలగ్నతలో నిమగ్నమయ్యేవారికి ప్రాలబ్ధం కూడా చాలాకాలానికి ప్రాప్తిస్తుంది. కొద్దికాలమే సఫలం చేసుకునేవారికి కొద్దికాలమే అనగా 21 జన్మల్లో కొన్ని జన్మల ప్రాలబ్ధమే లభిస్తుంది. మిగిలినదంతా సాధారణ ప్రాలబ్ధం. అందువలనే జ్యోతిష్యులు వేళకు చాలా గొప్పతనం ఇస్తారు. అదేవిధంగా చాలాకాలం నుండి నిర్విఘ్నంగా అనగా కర్మల రేఖ స్పష్టంగా ఉండాలి. దాని ఆధారంగా కూడా జాతకం తయారవుతుంది. చేతి గీతల్లో కూడా మధ్యలో గీత ఖండితం అయిపోయిందనుకుంటే శ్రేష్ఠ భాగ్యంగా లెక్కించబడదు. లేదా దీర్ఘాయుష్షుగా అంగీకరించబడదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకవేళ మధ్యమధ్యలో విఘ్నాల కారణంగా బాబాతో జోడించబడిన బుద్ధి లైన్ కట్ అయిపోతే లేదా క్లియర్ గా లేకపోతే ఉన్నత ప్రాలబ్దం పొందలేరు. ఈ విధంగా ఇప్పుడు మీకు మీరే మీ జాతకం ఏమిటో తెలుసుకోవచ్చు. ఏ పదవి యొక్క ప్రాప్తి మీకు నిర్ణయించబడిందో తెలుసుకోవచ్చు. జాతకంలో దశలు కూడా చూస్తారు. బృహస్పతి దశ అని ఉంటుంది. ఇలా చాలాకాలం బృహస్పతి దశ ఉందా లేక తరచూ దశ మారుతుందా? ఒక్కొక్కసారి బృహస్పతి దశ, ఒక్కొక్కసారి రాహు దశ ఇలా ఉందా? తరచుగా మారుతుంటే అనగా నిర్విఘ్నంగా లేకపోతే ప్రాలబ్దం కూడా చాలా సమయం నిర్విఘ్న రాజ్యంలో పొందలేరు. కనుక ఈ దశలను కూడా పరిశీలించుకోండి. ఆది నుండి ఇప్పటి వరకు నా దశ ఏ విధంగా ఉంది? అలాగే జాతకం రాశి కూడా చూస్తారు. ఇక్కడ ఏ రాశి? ఇక్కడ మూడు రాశులున్నాయి. ఒకటి - మహారథీ రాశి, రెండు - గుర్రపు సవారీ, మూడు - కాల్బలం. ఈ మూడింటిలో మీ రాశి ఏదో చూసుకోండి. మొదటి నుండి అనగా జన్మ తీసుకున్న దగ్గర నుండి మీ పురుషార్థం యొక్క రాశి మహారథీగా ఉందా, గుర్రపు సవారీగా ఉందా లేక కాలిబలంగా ఉందా! ఈ రాశి ఫలితంతో జాతకం తెలిసిపోతుంది. మాస్టర్ త్రికాలదర్శి జ్ఞానస్వరూపులై మీ జాతకాన్నిమీరే పరిశీలించుకోండి మరియు మీ భవిష్యత్తుని చూడండి. రాశిని లేదా దశని లేదా రేఖల్నిమార్చుకోవచ్చు కూడా. పరిశీలించుకున్న తరువాత మార్చుకునే సాధనాన్ని అవలంబించాలి. స్థూల జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఏదోక సాధనాన్ని చెబుతారు. అలాగే ఇక్కడ సాధనం ఏమిటో మీకు తెలుసు. ఆ సాధనాల ద్వారా సంపూర్ణ ప్రాప్తింపచేసుకోండి. అర్ధమైందా!

ఈవిధంగా జ్ఞాన స్వరూపులు బుద్ధి ద్వారా సిద్ధిని ప్రాప్తింపచేసుకునేవారు, తమ జీవితంతో సంపూర్ణతను ప్రత్యక్షంగా చూపించేవారు, స్వస్థితి ఆధారంగా పరిస్థితిని దాటేవారు, మహావీరులకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.