30.05.1973        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంగమయుగం పురుషోత్తమ యుగం.

నిర్బలులకు బలం ఇచ్చేవారు, విశ్వయజమానిగా తయారుచేసేవారు. విశ్వకళ్యాణకారి, విశ్వపరివర్తనచేసే బాబా మాట్లాడుతున్నారు -

అందరూ మిమ్మల్ని మీరు పాండవసేన యొక్క మహావీర్ లేదా మహావీరినిగా భావిస్తున్నారా? మహావీర్ అనగా స్వయాన్ని శక్తిశాలిగా భావిస్తున్నారా? ఎవరైనా నిర్భల ఆత్మ మీ ఎదురుగా వచ్చినట్లయితే వారికి బలమిచ్చేవారిగా తయారయ్యారా లేక ఇప్పటి వరకు స్వయంలోనే బలం నింపుకుంటున్నారా? మీరు దాతలా లేక తీసుకునేవారిగా అయ్యారా? సర్వశక్తుల యొక్క వారసత్వాన్ని ప్రాప్తింపచేసుకున్నారా లేక ఇప్పుడు ప్రాప్తింపచేసుకోవాలా? ఇది ప్రాప్తి చేసుకునే సమయమా లేక ప్రాప్తించే సమయమా. మహాన్ గా తయారయ్యేటందుకు శ్రమించాల్సిన సమయమా లేక, బాబా నుండి తీసుకున్న సేవకు బదులు ఇవ్వాల్సిన సమయమా? ఒకవేళ అంతిమం వరకు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక విధమైన సేవ తీసుకుంటుంటే సేవకు బదులు భవిష్యత్తులో ఇస్తారా? భవిష్యత్తులో ప్రాలాభ్ధాన్ని అనుభవిస్తారా లేక బదులిచ్చే సమయమా? ఈ అన్ని విషయాలను బుద్ధిలో పెట్టుకుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మా యొక్క అంతిమ పాత్ర లేదా భవిష్యత్తు ఏవిధంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇప్పటి నుండే సర్వాత్మలకు బాబా ఖజనా ఇచ్చేటందుకు దాతగా అవుతారో, మీ శక్తుల ద్వారా దప్పికతో లేదా తపిస్తున్న ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో, వరదాత అయి ప్రాప్తించిన వరదానాల ద్వారా వారిని కూడా బాబాకి సమీపంగా తీసుకువస్తారో మరియు బాబా యొక్క సంబంధంలోకి తీసుకువస్తారో, అప్పుడే ఇప్పటి దాత స్థితి యొక్క సంస్కారం భవిష్యత్తులో 21 జన్మల వరకు రాజ్యపదవి అనగా దాత స్థితి యొక్క సంస్కారాన్ని నింపుకోగలరు. ఈ సంగమయుగాన్ని పురుషోత్తమ సంగమయుగం లేదా సర్వశ్రేష్ట యుగమని ఎందుకంటారు. ఎందుకంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు అనగా ధర్మం యొక్క రాజ్యం యొక్క శ్రేష్ట సంస్కారాల యొక్క శ్రేష్ఠ సంబంధాల యొక్క మరియు శ్రేష్ఠ గుణాల యొక్క శ్రేష్ఠత అంతా ఇప్పుడే రికార్డింగ్ వలే నిండుతూ ఉంటుంది. 84 జన్మల వృద్ధికళ మరియు దిగిపోయే కళ, రెండు సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. హద్దులోని రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఎంత ధ్యాస పెడతారు. హద్దులో రికార్డింగ్ చేసుకునేవారు కూడా మూడు విషయాలపై ధ్యాస పెడతారు. అవి ఏమిటి వాయుమండలం, వృత్తి మరియు వాణి, ఈ మూడింటిపై ధ్యాస పెడతారు. వృత్తి చంచలం అవుతుంది. ఏకాగ్రంగా లేకపోతే వాణిలో ఆకర్షణ చేసే రసం ఉండదు. అనగా ఏ రకమైన పాట పాడుతుంటారో ఆ రూపంలో స్థితులై పాడుతుంటారు. ఏదైనా విచారకరమైన గీతం పాడేటప్పుడు ఆ దు:ఖ రూపాన్ని ధారణ చేసి పాట పాడకపోతే వినేవారికి ఆ పాట ద్వారా ఏ రసం రాదు. ఇలా హద్దులోని పాటలు పాడేవారు లేదా రికార్డింగ్ చేసేవారు ఈ అన్ని విషయాలపై ధ్యాస ఇస్తారు. మరైతే మీరు బేహద్ రికార్డింగ్ చేసుకునేవారు. కల్పమంతటికి రికార్డింగ్ చేసుకునేవారు. మరి మీరు ప్రతి సమయం ఈ అన్ని విషయాలపై ధ్యాస పెడుతున్నారా? ప్రతి సెకెండు రికార్డింగ్ జరుగుతుంది అని ధ్యాస పెడుతున్నారా? ఇంత ధ్యాస ఉంటుందా? రికార్డింగ్ చేస్తూ, చేస్తూ.. ఉల్లాసానికి బదులు సోమరితనంలోకి వచ్చేస్తే ఎలాంటి రికార్డింగ్ జరుగుతుంది? రికార్డింగ్ చేసే సమయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటారా. మీరు కూడా రికార్డింగ్ చేసుకునేటప్పుడు నిర్లక్ష్యంలోకి వస్తున్నారా లేక సదా ఉల్లాసంగా ఉంటున్నారా? చేసుకున్న రికార్డింగ్ అంతటినీ రోజంతటి రికార్డింగ్ ను సాక్షి అయి చూసుకుంటున్నారా రికార్డింగ్ ఎలా జరిగిందో. మామూలుగా టేపులో కూడా రికారింగ్ చేసుకున్న తరువాత మరలా చూసుకుంటారు లేదా వింటారు ఎలా రికార్డింగ్ అయింది. సరిగా అయిందా లేదా. అదేవిధంగా మీరు కూడా సాక్షి అయి చూసుకుంటున్నారా? చూసుకుంటే ఏమనిపిస్తుంది. సరిగ్గా నింపుకున్నారో లేదో పరిశీలించుకున్నారా? ఇంతకంటే మంచిగా నింపుకోవాలని మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అనిపిస్తుందా. అసలైతే ఫలితం చూసుకుంటున్నారు కదా! ప్రతిరోజు సాక్షి అయి స్వయాన్ని సదా పరిశీలించుకుంటున్నాం అని భావించేవారు చేయి ఎత్తండి? ఎప్పుడు పరిశీలించుకోవడం మిస్ అవ్వడం లేదు కదా (కొద్దిమందే చేయి ఎత్తారు) ఇప్పటికి పరిశీలకులుగా అవ్వలేదా. పరిశీలకులుగా కాలేని వారు నిర్మాతలుగా ఎలా అవుతారు. మరిచిపోతున్నారా? సమయం అటుఇటు అవ్వడం అనేది జరుగుతుంటుంది. కానీ, మరిచిపోవడం అనేది జరుగకూడదు. అమృతవేళ ఆత్మ యొక్క దినచర్య తయారు చేసుకుంటారు లేదా నిర్ణయించుకుంటారు. మరలా దానిని పరిశీలించుకోవడం మరిచిపోతున్నారా లేక దినచర్య నిర్ణయించుకోవడమే రావడం లేదా? ఆత్మ కొరకు దినచర్య నిర్ణయించుకోవడం రావడం లేదా, ఇదైతే చాలా సాధారణ విషయం. ఈ సాధారణ నియమాన్ని కూడా మరిచిపోతున్నట్లయితే, దీనిని బట్టి ఏమి తెలుస్తుంది? ఆత్మ ఇప్పటి వరకు కూడా నిర్బలంగానే ఉంది. మిమ్మల్ని మీరు ఈశ్వరీయ నియమాలు లేదా ఈశ్వరీయ మర్యాదలకు అనుగుణంగా నడిపించుకోలేకపోతున్నారంటే ఇక మీరు విశ్వాన్ని మర్యాదాపూర్వకంగా, నియమపూర్వక రాజ్యాన్ని ఎలా నడిపించగలరు? సంగమయుగీ రాజ్యపదవికి అధికారిగా కానివారు భవిష్యరాజ్యపదవిని ఎలా పొందగలరు? ఈ సంఘటన యొక్క టీచర్స్ ఎవరు? ఫలితం ఇంత తక్కువగా ఉండడానికి బాధ్యులు ఎవరు? వచ్చినటువంటి టీచర్స్ మీకు మీరు పరిశీలకులేనా? ఎవరూ ధైర్యంతో చేయి ఎత్తడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రపంచ యుద్ధం ప్రకటించబడితే ఏమవుతుంది (ఎవరో చెప్పారు ఆ సమయంలో నిలబడిపోతాం అని) సమయానికి నిలబడితే వారిని ఏమంటారు? ప్రకృతి ఆధారంగా పురుషుడు నడిస్తే ఆ పురుషుడిని ఏమంటారు? సమయం కూడా ప్రకృతియే కదా! పురుషుడు ప్రకృతి ఆధారంగా నడిస్తే వారిని పాస్ విత్ ఆనర్ అని అంటారా? సమయం అనే దెబ్బ పడడం ద్వారా నడుస్తుంటే వారిని ఏమంటారు? ఇలాగే అనుకున్నారా, దెబ్బతగలడం ద్వారా నడిచేవారిగా అవుతామని. వర్తమాన సంఘటన అయితే చాలా బలహీనంగా ఉంది. ఎక్కువమంది బలహీనంగా ఉన్నారు. మంచిది అయినా కానీ జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుండి మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. ఇప్పుడు ఇంకా సమయం ఉంది, కానీ చాలా తక్కువ ఉంది. ఇప్పుడైతే బాప్ దాదా మరియు సహయోగి శ్రేష్ఠాత్మలు పురుషార్టీ ఆత్మలైన మీకు ఒకటికి వేయిరెట్లు సహయోగం ఇచ్చి, తోడు ఇచ్చి, స్నేహం ఇచ్చి మరియు సంబంధం రూపంలో బలం నింపి ముందుకు తీసుకువెళ్తున్నారు. కానీ కొంచెం సమయం తరువాత ఇవన్నీ అనగా ఈ సహాయం లభించడం కూడా ఆగిపోతుంది. అందువలన ఇప్పుడే మీరు ఏది తీసుకోవాలంటే అది తీసుకోవచ్చు. ఆ తరువాత తండ్రి రూపం యొక్క స్నేహం మారిపోయి ఉన్నత న్యాయాధికారి రూపంలోకి బాబా వచ్చేస్తారు. న్యాయాధికారి ముందు ఎవరు ఎంత స్నేహ సంబంధీకులు అయినా నియమం అంటే నియమమే. ఇప్పుడు ప్రేమ యొక్క సమయం తరువాత నియమం యొక్క సమయం ఉంటుంది. ఆ సమయంలో సహాయం లభించదు. ఇప్పుడు ప్రాప్తి యొక్క సమయం కొద్ది సమయం తరువాత ప్రాప్తి సమయం బదులు పశ్చాత్తాప సమయం వస్తుంది. ఆ సమయంలో మేల్కొంటారా? అయినా కానీ బాప్ దాదా పిల్లలందరికీ చెబుతున్నారు, కొద్ది సమయంలో చాలా సమయం యొక్క ప్రాలబ్ధాన్ని తయారుచేసుకోండి. సమయం గురించి ఎదురు చూడడంలో నిర్లక్ష్యంగా అవ్వకండి. మా యొక్క ప్రతి కర్మ 84 జన్మల యొక్క రికార్డింగ్ నింపుకోవడానికి ఆధారమని సదా గుర్తుపెట్టుకోండి. మీ వృత్తి వాయుమండలం మరియు మీ వాణిని యదార్ధ రూపంలో సెట్ చేసుకోండి. వారు కూడా వాతావరణాన్ని తయారుచేస్తారు. అదేవిధంగా మీరు కూడా మీ వాతావరణాన్ని అంతర్ముఖత యొక్క శక్తితో శ్రేష్టంగా తయారుచేసుకోండి. వృత్తిని శ్రేష్టంగా మరియు వాణిని కూడా రాజయుక్తంగా, యుక్తియుక్తంగా తయారుచేసుకోండి. అప్పుడే ఈ ఫలితం మారుతుంది. మారుతుంది కదా? అంగీకారమేనా. మేము పంచతత్వాలను కూడా మారుస్తాం అని శపథాలైతే చాలా పెద్ద పెద్దవి చేస్తున్నారు. కానీ పరిశీలకులుగా అవ్వకుండా నిర్మాతలుగా ఎలా అవుతారు? ఇప్పటి నుండి ఫిర్యాదులన్నీ సమాప్తం అయిపోవాలి. ఇప్పటి నుండి బలహీనతలన్నీ వదిలిపోతాయి, అంతిమం వరకు ఇవి ఉండవు అని భావించేవారు చేయి ఎత్తండి. వీరి యొక్క బాధ్యత ఎవరిపై ఉంది(కొంతమంది అన్నారు. దీదీ పైన, కొంతమంది అన్నారు బాప్ దాదా పైన) బాప్ దాదా చేస్తే బాప్ దాదా పొందుతారు. చేసే సమయంలో బాప్ దాదా కానీ పొందే సమయంలో.. భవిష్య పదవిని పొందడానికి త్యాగం చేయండి, అప్పుడు చేయడానికి కూడా త్యాగం చేయాలి. కానీ అది చేయలేరు. ఎందుకంటే ముక్తిధామంలోనే ఉండిపోలేరు. కనుక ప్రతి ఒక్కరు మీ బాధ్యతను మీరు తీసుకోవాలి. దీదీ, దాదీ లేదా టీచర్లది బాధ్యత అని అనుకుంటే మీరు భవిష్యత్తులో వారికి ప్రజలుగా అవుతారు. కానీ రాజులుగా కాదు. ఇది కూడా ఆధీనంగా ఉండే సంస్కారం. ఆధీనంగా ఉండేవారు ఎప్పటికీ అధికారిగా కాలేరు. విశ్వరాజ్యభాగ్యాన్ని పొందలేరు. అందువలన స్వయం యొక్క బాధ్యత మరియు మొత్తం విశ్వం యొక్క బాధ్యత తీసుకునేవారే విశ్వమహారాజుగా కాగలరు. విశ్వ కళ్యాణకారీ తండ్రి యొక్క సంతానమై ఉండి స్వకళ్యాణం చేసుకోలేకపోతున్నారు, ఇది బాగుంటుందా? కలియుగం యొక్క కర్మభోగానికి గుర్తుగా ఒకటి చెబుతారు. ఎవరైనా లక్షాధికారిగా ఉండి ఒక్కరూపాయి కూడా స్వయం సుఖానికి ఉపయోగించుకోకపోతే ఏమంటారు? అలాగే సర్వశక్తుల ఖజానాకు యజమానిగా ఉండి, స్వయం కోసం చిన్న శక్తిని కూడా ఉపయోగించుకోలేకపోతే వారిని ఏమంటారు? అయినా ఇది సంగమయుగీ బ్రాహ్మణుల గుర్తు. ఇప్పుడు మీరు సంగమయుగీలేనా లేక ఒకపాదం కలియుగంలో పెట్టారా? సంగమయుగంలో స్థిరంగా ఉండలేమేమో అక్కడికి వెళ్లిపోదాం అని అనుకుంటున్నారా? సంగమయుగానికి ఇది గుర్తు కాదు. అందువలన ఇప్పటి నుండి తీవ్ర పురుషార్థీ అయి దృఢ సంకల్పం తీసుకోండి. చేయాల్సిందే మరియు తయారవ్వాల్సిందే. చూస్తాము, ప్లాన్ తయారుచేస్తాము. దీనిని కూడా తీవ్ర పురుషార్థం అని అనరు. ఏం ప్లాన్ తయారుచేస్తారు, తయారై లేరా? త్రికాలదర్శులకు ప్లాన్ తయారుచేసుకోవడంలో సమయం పట్టదు. ఎందుకంటే వారికి మూడుకాలాలు స్పష్టంగా ఉంటాయి. అన్ని పనులు సెకెనులో చేసేస్తారు. ఇలాంటి తీవ్రగతిని తయారుచేసుకోండి. తీవ్రవేగంతో వెళ్లేవారే సద్గతిని పొందగలరు.

మంచిది. ఈ విధమైన అశావంతులకు, బాప్ దాదా యొక్క శ్రేష్ఠ సంకల్పాలను సాకారం చేసేవారికి, ప్రతి సంకల్పం కర్మ మరియు మాటను పరిశీలించుకునేవారికి, ప్రతి సెకెను ప్రతి సంకల్పంలో స్వకళ్యాణం మరియు విశ్వకళ్యాణం చేసేవారికి, విశ్వకళ్యాణకారీ, విశ్వ పరివర్తక ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.